military forces
-
Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
రఫా(గాజా స్ట్రిప్): గాజా దక్షిణాన ఉన్న చిట్టచివరి పెద్ద పట్టణం రఫాలో లక్షలాది మంది జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఫాను ఖాళీచేసి వెళ్లాలని జనాలకు ఇజ్రాయెల్ సైనికబలగాలు మరోసారి ఆదేశించాయి. ఉత్తర దిశ నుంచి మొదలెట్టి దక్షిణం దిశగా భూతల దాడులతో ఆక్రమణలు, దాడులను ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర మిత్రదేశాలు దూకుడు తగ్గించాలని మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపట్లేదు. హమాస్ సాయుధుల ప్రతిదాడులతో శనివారం రఫా శివారుప్రాంతాలు భీకర రణక్షేత్రాలుగా మారిపోయాయి. రఫా తూర్పున మూడింట ఒక వంతు భూభాగంలో జనాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే ఖాళీచేయించింది. రఫా మొత్తాన్ని ఖాళీచేయించే దుస్సాహసానికి దిగితే మానవతా సాయం చాలా కష్టమవుతుందని, అమాయక పౌరుల మరణాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
బలగాలు వెనక్కి.. ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి 30 రోజులకు పైగా దాటింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం టర్కీలో జరిగిన శాంతి చర్చల ద్వారా ఇరుదేశాలు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే ఇప్పటికే పలు మార్లు శాంతి కోసం చర్చలు జరిగినా, సూమారు నెలరోజుల తర్వాత ఇరుదేశాల చర్చల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో పురోగతి.. కీవ్, చెర్నిహివ్ నుంచి తమ బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా ప్రతినిధి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్యారం దొరికే వరకు కాల్పుల విరమణ ఉండబోదని అందుకోసం మరింత చర్చించాలని ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం తాము మరింత దూరం ప్రయాణించాలని ఆయన చెప్పారు. దీంతో రష్యా బలగాల దాడులు ఉక్రెయిన్‌లో కొనసాగుతూ ఉన్నాయి. చర్చలు జరుపుతున్న సమయంలోనూ కొనసాగిన దాడులు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతుండగా పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై రష్యా తమ దాడులను కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం ఓ వైపు చర్చలు జరుగుతున్నప్పటికీ పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్‌లో 9 అంతస్తుల పాలనా భవనంపై రష్యన్ బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డారు. -
నిరంకుశత్వంపై నిరసన జ్వాల
పౌరహక్కులను అణిచేసి, ప్రభువులకు స్తోత్రపాఠాలు చేయాలని నూరిపోసే దేశంలో... పాలకుల విగ్రహాలను ప్రజలు తగలబెట్టడం విస్మయకరమే. కజకస్తాన్‌లో ఈ నూతన సంవత్సరారంభంలో చెలరేగిన నిరసన అతి పెద్ద రాజకీయ సంక్షోభమనేది అందుకే! ఈ చమురు సంపన్న దేశంలో ఎల్పీజీ ఇంధన ధరలు రెట్టింపు కావడంపై జనవరి 2న ప్రజాగ్రహం పెల్లుబికింది. పదేళ్ళ క్రితం ప్రాణాలర్పించిన కామ్రేడ్ల సంస్మరణను అంతకు ముందు డిసెంబర్లో పోలీసులు అడ్డుకున్నారు. వీటన్నిటితో జనంలో మొదలైన అలజడి చినికిచినికి గాలివానై, ఆర్థిక కేంద్రమైన అల్మాటీ సహా ఆ దేశంలోని నగరాలన్నిటికీ విస్తరించింది. పోలీసు కాల్పులకు దారి తీసింది. నిరసనకారులకూ, పోలీసులకూ మధ్య తీవ్ర ఘర్షణల్లో 160 మందికి పైగా మరణిస్తే, ఆరేడు వేల మందిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంక్షోభ వేళ సాయపడాల్సిందిగా రష్యా ప్రాబల్యంలోని ‘సమష్టి భద్రతా ఒప్పంద సంస్థ’ (సీఎస్‌టీఓ)ను కజక్ అధ్యక్షుడు కసిమ్– జొమార్ట్ తొకయేవ్ కోరడం, అదే అదనుగా జనవరి 6న రష్యా 2500 మంది బలగాన్ని పంపడం చర్చనీయాంశమైంది. మధ్య ఆసియా దేశం కజక్‌లో ప్రజాందోళనకు తక్షణ కారణం ఇంధన ధరలైతే కావచ్చు గాక, కానీ అదొక్కటే కారణం కాదు. ఆ దేశ సంపదలో 55 శాతం కేవలం 162 మంది సంపన్నులదేనని తాజా లెక్క. ఆర్థికాభివృద్ధి అద్భుతమైనా, సామాన్యుడి సగటు వేతనం నెలకు 100 డాలర్ల లోపే! ఈ సామాజిక – ఆర్థిక అసమానత, పెచ్చుమీరిన అవినీతిపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆక్రోశం ఇలా బహిర్గతమైంది. పాలనలో మార్పు కోరుతున్నారని స్పష్టమైంది. ప్రజాగ్రహ జ్వాల ప్రభువులు అదుపు చేయలేనిదిగా మారింది. తొకయేవ్ ఇంధన ధరలపై వెనక్కితగ్గారు. మంత్రివర్గాన్ని రద్దు చేశారు. గతంలో దేశాధ్యక్షుడిగా 28 ఏళ్ళ పాటు ఏలిన నూర్సుల్తాన్ నజర్బయేవ్ను దేశ భద్రతా మండలి ఛైర్మన్ హోదా నుంచి తప్పించారు. అయినా నిరసనలు ఆగట్లేదు. సోవియట్ యూనియన్ నుంచి విడివడి, 1991లో స్వతంత్ర రిపబ్లిక్‌గా అవతరించినప్పటి నుంచి మూడు దశాబ్దాల్లో కజకస్తాన్ కనివిని ఎరుగని ఘటనలివి. నిజానికి, మధ్య ఆసియాలోని రిపబ్లిక్స్ అన్నింటిలోకీ కజక్ సంపన్నమైనది, స్థిరమైనది. ప్రపంచ యురేనియమ్ నిల్వల్లో 40 శాతానికి పైగా ఆ దేశంలోనే ఉన్నాయి. సహజవాయు నిల్వల విషయంలో ప్రపంచంలోని 15 అగ్రదేశాల్లో ఇది ఒకటి. స్వతంత్ర దేశమైన నాటి నుంచి కజక్ నిరంకుశ ప్రభువుల గుప్పెట్లో ఉంటూ వచ్చింది. 2019లో నజర్బయేవ్ అధ్యక్షుడిగా వైదొలగినా, తాను ఏరికోరి ఎంచుకున్న తొకయేవ్ను ఆ పీఠంపై కూర్చోబెట్టారు. ప్రభుత్వంపై పట్టు కొనసాగించారు. రాజధాని నూర్సుల్తాన్ ఆయన పేరిట వచ్చిందే! దేశమంతటా ఆయన విగ్రహాలే! తక్కువ వేతనాలు, దీనమైన పని పరిస్థితులతో కొన్నేళ్ళుగా శ్రామికులలో, స్థానిక తెగల్లో అలజడి పెరుగుతూ వచ్చింది. తొకయేవ్తో పరిస్థితులు మారతాయనుకుంటే, నజర్బయేవ్ తెర వెనుక నుంచి ఆడించారు. కరోనాతో ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం పరిస్థితిని దిగజార్చాయి. చివరకు ఆగ్రహంతో జనం విగ్రహాలు తగలబెట్టారు. నిరసనకారులను ‘విదేశీ శిక్షణ పొందిన తీవ్రవాదులు’ అని ఆరోపిస్తూ, సీఎస్‌టీఓ సాయం కోరారు కజక్ అధ్యక్షుడు. నిజానికి, అమెరికా ప్రాబల్యం కనిపించే అంతర్ ప్రభుత్వ సైనిక కూటమి ‘నాటో’ లాగానే రష్యా కనుసన్నల్లోని మరో భద్రతా కూటమి – ‘సీఎస్‌టీఓ’. సోవియట్ పతనం తర్వాత, ‘స్వతంత్ర దేశాల కామన్వెల్త్’ (సీఐఎస్)లోని కొన్ని సభ్యదేశాలు కలసి చేసుకున్న పరస్పర భద్రతా ఒప్పందం అది. వార్సా ఒప్పందానికి బదులుగా ఉద్దేశించిన ఇది 1994లో అమలులోకి వచ్చింది. 2002లో ‘సీఎస్‌టీఓ’ అయింది. ‘అందరి కోసం ఒక్కరు. ఒక్కరి కోసం అందరు’ అనే ఈ కూటమిలో ప్రస్తుతం రష్యా, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఆర్మేనియా, బెలారుస్, కజక్స్తాన్లు ఆరూ సభ్యదేశాలు. కొన్నేళ్ళుగా సీఎస్‌టీఓ పెద్ద క్రియాశీలంగా లేదు. కానీ, ఈసారి కజక్ సైనిక సాయం కోరీ కోరగానే సీఎస్‌టీఓ పక్షాన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొరవ తీసుకోవడం గమనార్హం. రష్యాకు దాని లెక్క దానికి ఉంది. దాదాపు 7500 కి.మీకు పైగా సరిహద్దును పంచుకుంటున్న పొరుగుదేశం కజకస్తాన్‌లో రాజకీయ అస్థిరత్వమంటే రష్యాకు పెద్ద తలనొప్పి. దాని వల్ల అతి జాతీయవాదులు, విప్లవ ఇస్లామిక్ శక్తులు ప్రబలుతారని మాస్కో భయం. దానివల్ల కజక్‌లో దాదాపు 19 శాతం జనాభా ఉన్న రష్యన్ జాతీయులకు భద్రతకు ముప్పు. నిరసనల్ని అణచివేస్తే ఆ తలనొప్పి ఉండదు. పైపెచ్చు, కజక్ పాలకులు తనకు ఋణపడి ఉంటారన్నది రష్యా ఆశ. అలాగే, రష్యా, చైనా, టర్కీల మధ్య దీర్ఘకాలిక సమతూకపు విదేశాంగ విధానాన్ని కజకస్తాన్ మార్చుకొని, తనకు మంచి మిత్రపక్షమవుతుందని ఆలోచన. కర్తవ్యం ముగిసిన వెంటనే కజక్‌లో బలగాలను ఉపసంహరిస్తామని రష్యా అంటోంది. కానీ, ఒకసారి ఇంట్లోకి రష్యన్లను అనుమతిస్తే వారిని సాగనంపడం చాలా కష్టమని సమీప చరిత్ర చెబుతోందని అమెరికా సందేహాల సన్నాయి వినిపిస్తోంది. మరోపక్క కజకస్తాన్కు మరో పెద్ద పొరుగుదేశమైన చైనా పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తోంది. మధ్య ఆసియాలో ప్రాబల్యం కోసం రష్యాతో పోటీపడుతున్న చైనాకు ఎంతైనా ఈ పరిణామాలన్నీ కీలకం మరి! ఈ ఏడాది రిపబ్లిక్ డే అతిథిగా మన దేశానికి రానున్న కజక్ అధినేత ఏం చేస్తారో చూడాలి. బలప్రయోగంతో అంతర్గత సమస్యలు సమసిపోవనీ, ప్రజల్ని భాగస్వాముల్ని చేసే పరిష్కారమే మేలనీ ప్రత్యేకించి చెప్పాలా? -
గల్వాన్‌లో మువ్వన్నెల జెండా
న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి. చైనా బలగాలు చైనా జాతీయ జెండాతో గల్వాన్‌లోయలో ఉన్నట్లు చూపే చిత్రాలను ఆదేశం మూడు రోజుల కిందట విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం చైనా అధీనంలోకి వచ్చిందన్న దుమారం రేగింది. అయితే ఇవన్నీ చైనా వక్రబుద్ధికి చిహ్నాలని, ఆ ప్రాంతంపై చైనా పట్టు లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చైనా విడుదల చేసిన చిత్రాలు గల్వాన్ లోయ అవతలి ప్రాంతంలోనివని, ఫొటోల్లోని ప్రాంతం నిస్సైనిక మండలం దగ్గరలో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆర్మీ గల్వాన్‌లోయలో ఉన్న చిత్రాలు విడుదలయ్యాయి. న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు సైతం తన ట్విట్టర్ అకౌంట్లో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా గల్వాన్‌లోయలో వీర భారతీయ సైనికులు అని ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. భారతీయ వర్గాలు విడుదల చేసిన ఫొటోలను ఈనెల 1న గల్వాన్‌లోయలో తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ఫొటోలో అసాల్ట్ రైఫిళ్లు ధరించిన దాదాపు 30 మంది భారతీయ సైనికులు జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. మరో ఫొటోలో నలుగురు సైనికులు భారతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ఇందులో డోగ్రా రెజిమెంట్ జెండా కూడా కనిపిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా సరిహద్దుల్లో భారతీయ రక్షణ వర్గాలు చైనా సైనికులకు స్వీట్లు పంచి సహృద్భా వం చాటారు. కానీ చైనా మాత్రం కుయుక్తితో నకిలీ ఫొటోలను, అభూత వీడియోను విడుదల చేసింది. -
అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు
We Beat The Americans: Talibans: అమెరికా సైనిక దళాలపై తాలిబాన్లు విజయాన్ని సూచించే అనధికారిక ప్రదర్శనలు అఫ్గనిస్తాన్‌లోని ఘజ్నీ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నాయి. అమెరికన్లు ప్రపంచంలోనే తమని తాము గొప్ప శక్తిగా చెప్పుకుంటున్నప్పటికీ, మేము అమెరికన్లను ఓడించగలమని అఫ్గన్లు, ప్రపంచం, భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా మేము దీన్ని చూపిస్తున్నామని తాలిబన్ ప్రావిన్షియల్ కల్చర్ చీఫ్ ముల్లా హబీబుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపాడు. చారిత్రకంగా అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో సేవలందించిన సైనిక దళాల పేర్లను, వారు ఆక్రమించిన స్థావరాలను కాంక్రీట్ గోడపై క్రమం తప్పకుండా చెక్కడం పరిపాటి. ఐతే అమెరికా సైన్యానికి, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో అవి ధ్వంసమయ్యాయి. అఫ్గన్ నుంచి అమెరికా సైన్యం స్వచ్ఛంద నిష్క్రమణ తర్వాత వారికి సంబంధించిన యుద్ధసామగ్రిని రోడ్లపై ప్రదర్శనకు ఉంచి తాలిబన్లు ప్రగల్భాలు పలకడం గమనార్హం. 19వ శతాబ్దంలో బ్రిటిష్ దళాల ఓటమితో పాటు ప్రస్తుతం మూడు విదేశీ సామ్రాజ్యాలపై అఫ్గనిస్తాన్ విజయం సాధించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ విజయం సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నామని తాలిబన్ పోరాట యోధుడు ఓజైర్ (18) తెలిపాడు. ఇక్కడ జన్మించిన అఫ్గన్లు శక్తివంతమైన అమెరికా దేశాన్ని ఓడించగలరని నిరూపించేందుకే వీటిని ప్రదర్శిస్తున్నామన్నాడు. ముల్లా హబీబుల్లా ముజాహిద్ పేలుడు గోడల ముందు నిలబడి యుద్ధాల్లో మరణించిన 20, అంతకంటే ఎక్కువ మంది ముఖ్యమైన కమాండర్లు, జనరల్స్ పేర్లు వీటిమీద ఉన్నాయని ప్రగల్భాలు పలికాడు. మరోవైపు అఫ్గనిస్తాన్ కొత్త పాలకుల సమక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని, అక్కడి జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆకలి బాధను ఎదుర్కొంటున్నట్లు యూఎస్ అభిప్రాయపడింది. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
నాగాలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నాగాలాండ్‌లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్ఎస్పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్‌లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి. కమిటీ వేసి... అంతలోనే 1958లో ఏఎఫ్ఎస్పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్‌లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్ఎస్సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్‌పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు. -
భారత్–చైనామధ్య 13వ దఫా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 13వ దఫా చర్చలు జరపనున్నాయి. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లలోకి ప్రవేశించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘర్షణాత్మక ప్రాంతాల్లోని కొన్ని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్లో 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయని వెల్లడించాయి. భారత బృందానికి లెహ్‌లోని 14 కారప్స్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహించనున్నారు. డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి, మిగతా ఘర్షణాత్మక ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని చర్చల సందర్భంగా భారత్ ప్రతినిధులు పట్టుబట్టే అవకాశం ఉంది. 12వ విడత చర్చలు జూలై 31వ తేదీన జరిగాయి. ఫలితంగా కీలకమైన గోగ్రా పాయింట్ నుంచి రెండు దేశాల ఆర్మీ ఉపసంహరణ పూర్తయింది. చైనా మోహరింపులు ఆందోళనకరం ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా మిలటరీ మోహరింపులు కొనసాగించడం, మౌలిక వసతులను పెంచుకోవడం ఆందోళన కలిగించే అంశమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. ఇండియాటుడే కాంక్లేవ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. శీతాకాలం ఆసాంతం బలగాల మోహరింపులను చైనా కొనసాగించాలని చూస్తే, పాకిస్తాన్ వైపు ఎల్వోసీ (నియంత్రణ రేఖ) వెంబడి వంటి పరిస్థితికి దారితీయవచ్చని భావిస్తున్నామన్నారు. ఆ దేశ మిలటరీ పీఎల్ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ)కదలికలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. చైనా సైన్యానికి సరితూగే స్థాయిలో భారత్ కూడా బలగాల మోహరింపులను కొనసాగిస్తుందని, ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచమంతటా కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుండటం, దక్షిణ చైనా సముద్రంలో ఒక వైపు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా..మరో వైపు భారత్‌తో ప్రతిష్టంభనను ఎందుకు కొరుకుంటోందనేది అర్థం కాని విషయమన్నారు. ఏదేమైనప్పటికీ తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభనతో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. కశ్మీర్లో పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. అఫ్గాన్ ఉగ్రవాదులు కశీ్మర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చెలాయించిన సమయంలోనూ అక్కడి ఉగ్రమూకలు కశీ్మర్‌లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు, ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు మన బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి, ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు కశీ్మర్లో పౌరులను లక్ష్యంగా చేసుకోవడంతో సంబంధం ఉన్నట్లు భావించడం లేదని తెలిపారు. లోయలో అశాంతిని ప్రేరేపించాలని కుట్రపన్నిన ఉగ్రమూకలు చివరి ప్రయత్నంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నాయన్నారు. స్వేచ్ఛా నౌకాయానమే కీలకం: రాజ్‌నాథ్ భారతదేశ అభివృద్ధి స్వేచ్ఛా నౌకాయానంతోనే ఎక్కువగా ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎంతోకాలం నుంచి సముద్రంతోనే మనకు సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. మన వాణిజ్యం, ఆరి్థక వ్యవస్థ, మన పండుగలు, సంస్కృతి సముద్రంతోనే సాన్నిహిత్యం కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, సముదప్రాంతానికి సంబంధించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం’ అని శనివారం జరిగిన భారత తీర రక్షక దళం(ఐసీజీ) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సముద్రయాన భద్రత లేకుండా, దేశానికి సమగ్ర రక్షణ వ్యవస్థను సాధించడం అసాధ్యమన్నారు. -
మమతకు ఈసీ మరో నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలపై రెచ్చగొట్టేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి గురువారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయ శిక్షాస్మృతిని, ఎన్నికల కోడ్‌ను మమతా బెనర్జీ ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఈసీ ఆ నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 11 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మమతను ఆదేశించింది. ‘ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను తన వ్యాఖ్యల ద్వారా అసత్యపూరితమైన వ్యాఖ్యలతో, రెచ్చగొట్టేలా, విచక్షణ రహితంగా మమత దూషించారనేందుకు, అవమానించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో వారిలో నైతికస్థైర్యం దెబ్బతింటుంది’ అని ఈసీ పేర్కొంది. 1980ల నుంచి ఎన్నికల్లో కేంద్ర బలగాలు విలువైన సేవ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఈసీ నోటీసుపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈసీ నోటీసులను పట్టించుకోబోనన్నారు. సీఆర్పీఎఫ్పై తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. ‘బీజేపీ కోసం పనిచేయడం ఆపి వేయనంత వరకు సీఆర్పీఎఫ్ తప్పులపై మాట్లాడుతూనే ఉంటాను. వారు ఆ పని ఆపేస్తే వారికి సెల్యూట్ చేస్తాను’ అని స్పష్టం చేశారు. ‘మీ షోకాజ్ నోటీసులను నేను పట్టించుకోను. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల రోజున ప్రధాన మంత్రి ప్రచారం చేస్తే మీ దృష్టిలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ఈసీని ప్రశ్నించారు. జమల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం మమత పాల్గొన్నారు. దాదాపు వారం వ్యవధిలో మమతకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ముస్లింలను మతపరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై ఇప్పటికే ఆమెకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీకే ఓటేయాలని ఓటర్లను, ముఖ్యంగా మహిళలను బెదిరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా మమత ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బెంగాల్లో హింసకు అమిత్ షా కుట్ర రాష్ట్రంలో హింసను రాజేసేందుకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడేలా పోలీసులను ప్రోత్సహిస్తున్నారన్నారు. షాను నియంత్రించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి గూండా హోం మంత్రిని నా జీవితంలో చూడలేదు. ఆయన పులి కన్నా ప్రమాదకరం. ఆయనతో మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్తున్నారు. షాను నియంత్రించాలని ప్రధానిని కోరుతున్నా. ఆయన వల్ల బెంగాల్లో అల్లర్లు, హింస చెలరేగే ప్రమాదముంది’ అని మమత ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. బెంగాల్ మరో గుజరాత్‌లా మారకుండా చూడాలని, బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్ధించారు. -
ప్రపంచస్థాయి శక్తిగా పీఎల్ఏ
బీజింగ్: పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అధినేత జిన్‌పింగ్ సంకల్పించారు. యుద్ధాల్లో నెగ్గడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, నిజమైన పోరాట పరిస్థితుల్లో సైన్యానికి శిక్షణ ఇవ్వాలని ఆయన చెప్పారు. జిన్‌పింగ్ తాజాగా సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) సమావేశంలో మాట్లాడారు. 20 లక్షల మంది సైన్యం ఉన్న పీఎల్ఏ ఈ కమిషన్ ఆధ్వర్యంలోనే పని చేస్తుంది. సీఎంసీకి జిన్‌పింగ్ చైర్మన్. చైనా సైన్యాన్ని ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా మార్చాలని, ఇందుకోసం కొత్త తరహా శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ఆధునిక యుద్ధ రీతులకు అనుగుణంగా సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. 6 నెలలుగా భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలన్న అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సైన్యం బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా సైన్యానికి దీటుగా తమ సైన్యాన్ని పెంచుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల తీర్మానించింది. 2027 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. 2020లో సైన్యంపై 179 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు పార్టీ అంగీకరించింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్. 732 బిలియన్ డాలర్లతో అమెరికా తొలిస్థానంలో ఉంది. షాంఘై సహకార సంఘం భేటీకి ప్రధాని లీ కెకియాంగ్ భారత్ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న 19వ షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ఈవో) సభ్య దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ సంఘం భేటీ 30న వర్చువల్‌గా జరగనుంది. కరోనా వైరస్‌పై పోరాటం విషయంలో పరస్పరం సహకరించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎస్సీవోలో రష్యా, భారత్, చైనా, పాకిస్తాన్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు. భారత్‌తో లోతైన చర్చలు: చైనా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై భారత్‌తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు, పరస్పరం సహకరించుకుంటున్నట్లు చైనా గురువారం వెల్లడించింది. ఈ ఏడాది మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైన్యం మధ్య భారీ ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు దేశాలు పదుల సంఖ్యలో సైనికులను కోల్పోయాయి. అప్పటి నుంచి ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. సరిహద్దులో ఇరు దేశాల భారీగా సైన్యాలనుమోహరించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకొని, ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. 8వ దఫా చర్చల తర్వాత సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉందని చైనా జాతీయ భద్రతా శాఖ తెలిపింది. సైన్యం ఉపసంహరణపై ఇండియాతో లోతైన చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. -
ఆగని డ్రాగన్ ఆగడాలు
న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం మళ్లీ బుసలు కొడుతోంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో లిపులేఖ్ పాస్‌లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్‌లో మోహరించినట్టుగా భారత్ మిలటరీ సీనియర్ కమాండర్ చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా లిబరేషన్ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని అధికారి చెప్పారు. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్ నుంచి కొనుగోలు చేయనుంది. ఏమిటీ లిపులేఖ్ పాస్? హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్ పాస్ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్ పాస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది. ఐరాసకు నేపాల్ కొత్త మ్యాప్ భారత్ వ్యతిరేక ధోరణిని నేపాల్ మరింత తీవ్రతరం చేస్తోంది. మన దేశ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలను నేపాల్‌లో అంతర్భాగంగా చూపిస్తూ తయారు చేసిన మ్యాప్‌ను ఐక్యరాజ్య సమితికి. గూగుల్‌కి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతాలను తమ దేశ భాగంలో చూపించడానికి నేపాల్ రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే. నేపాల్ ఈ చర్యల వెనుక చైనా ఒత్తిడి ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. -
ఎల్ఏసీకి అదనపు బలగాలు
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 3,500 కిలోమీటర్ల భారత్–చైనా సరిహద్దు వెంట అదనపు సైనిక బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఎల్ఏసీలో సైనిక, వైమానిక దళం హై అలర్ట్ ప్రకటించాయి. చైనా యుద్ధ నౌకలు తిష్టవేసిన హిందూ మహాసముద్రంలో ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని భారత నావికా దళం తమ సిబ్బందికి అదేశాలు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు అదనపు బలగాలు, ఆయుధాలను పంపించినట్లు భారత సైనిక దళం వెల్లడించింది. ఇకనుంచి సన్నద్ధత విభిన్నంగా ఉంటుందని సైనికాధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతంలో భారత్, చైనాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. -
భారత సైన్యం ‘మోదీ సేన’..!
ఘజియాబాద్/హౌరా: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశ సైనిక బలగాలను ఆయన ప్రధాని మోదీ సైన్యంగా పేర్కొనడంపై విపక్షాలు మండిపడ్డాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఘజియాబాద్‌లో కేంద్ర మంత్రి వీకే సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించారు. ఉగ్రనేత మసూద్ అజార్‌ను జీ(గారు) అంటూ ప్రోత్సహిస్తున్నారు. కానీ, మోదీ సైన్యం (దేశ సైనిక బలగాలు) వారికి బుల్లెట్లు, బాంబులతో బదులిచ్చింది. ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి ముష్కరులతోపాటు పాక్ వెన్ను విరిచింది. కాంగ్రెస్ అసాధ్యమనుకున్నదాన్ని బీజేపీ సాధ్యం చేసి చూపింది. మోదీ ఉంటే అసాధ్యమైంది ప్రతిదీ సాధ్యమే’ అని అన్నారు. భద్రతా బలగాలకు అవమానం: మమతా యోగి తన వ్యాఖ్యలతో భద్రతా బలగాలను అవమానించారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘యూపీ సీఎం వ్యాఖ్యలపై షాక్‌కు గురయ్యా. మన సైన్యాన్ని ఏ ఒక్క వ్యక్తికో సొంత అన్నట్లుగా మాట్లాడటం తీవ్ర అవమానకరం. సైన్యం ఏ ఒక్కరిదో కాదు, ప్రజలందరి సొత్తు. యూపీ సీఎం వ్యాఖ్యలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. ‘యోగి వ్యాఖ్యలు సైన్యాన్ని అవమానించినట్లే. భారత సైన్యం ప్రచార మంత్రి(ప్రధాని) సైన్యం కాదు. యోగి క్షమాపణ చెప్పి తీరాలి’ కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ‘సైనిక బలగాలు ఏ ఒక్కరి ప్రైవేట్ సైన్యం కాదనే ప్రాథమిక అంశాన్ని రాజకీయ నేతలు తెల్సుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకే సైన్యం పనిచేస్తుంది తప్ప, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాదు’ అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి అన్నారు. యోగిపై ఈసీ చర్య తీసుకోవాలి: సీపీఐ భద్రతా బలగాలను మోదీ సైన్యం అంటూ యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారంది. ‘ప్రజల్లో అభద్రతాభావం పెంచి, వారిని ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారు. రైతుల సమస్యలను మర్చిపోయిన బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించింది ఏమీ లేదు. అందుకే రాజకీయ ప్రయోజనం పొందేందుకు సైన్యాన్ని వాడుకోవాలని చూస్తోంది’ అని సీపీఐ నేత డి.రాజా పేర్కొన్నారు. నివేదిక కోరిన ఈసీ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఈసీ ఆదేశించింది. ఈ నివేదికను యూపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి సమర్పించాలని కోరింది. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారం సమయంలో సైన్యం ప్రస్తావన తేవడం, భద్రతా బలగాల ఫొటోలను వాడుకోవడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ మార్చి 17వ తేదీన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు
న్యూఢిల్లీ: సైనిక బలగాలపై దాడులకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగినవే. పుల్వామాలో జరిగిన దాడిలో ఉగ్రవాది 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి జవాన్ల వాహనశ్రేణి వద్ద పేల్చుకోవడం వారి కొత్త వ్యూహాన్ని సూచిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఇలాంటి తరహా పేలుళ్లు చివరిసారిగా 2001లో సంభవించాయి. అప్పుడు అసెంబ్లీ సమీపంలో కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఉగ్రవాదులు 38 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న నౌషెరా సెక్టార్లో జరిగిన ఐఈడీ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. చాన్నాళ్లు తరువాత కశ్మీర్లో ఐఈడీ దాడులు పెరగడంపై ఆర్మీ ఆందోళన చెందుతోంది. గతేడాది జనవరిలో బారాముల్లాలో చోటుచేసుకున్న ఇలాంటి దాడిలో నలుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు భద్రతా బలగాలకు కొత్తేం కాదు. కానీ కశ్మీర్లో తక్కువ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల వ్యూహాలు వేరుగా ఉంటాయి. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారు. ఇటీవల అగ్రస్థాయి ఉగ్రవాదుల్ని వరసగా మట్టుపెట్టడంతో, మిగిలిన టెర్రరిస్టుల్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ పెరిగిందని, ఇందులో భాగంగానే ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వేర్పాటువాదులకు చేరువకావాలనుకుంటున్న పాకిస్తాన్ ప్రయత్నాలను భారత్ అడ్డుకోవడం కూడా ఉగ్రవాదుల వ్యూహాల మార్పునకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్‌ను పాక్‌లో కలపడమే లక్ష్యం భారత్‌లో పలు ఉగ్రదాడులకు జైషే స్కెచ్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పాల్పడిన జైషే మొహమ్మద్‌ను మౌలానా మసూద్ అజహర్(50) 2000, మార్చి నెలలో ప్రారంభించాడు. కశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టి పాకిస్తాన్లో కలపాలన్న ఏకైక లక్ష్యంతో ఈ సంస్థ పనిచేసేది. పాక్ ప్రోద్బలంతో జైషే ఉగ్రవాదులు భారత్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సైనికులపై దాడులకు పాల్పడ్డారు. సొంత దేశంలోని ముస్లిమేతరులను ఈ ఉగ్రసంస్థ విడిచిపెట్టలేదు. 2001, అక్టోబర్ 1న కశ్మీర్ అసెంబ్లీపై దాడికి పాల్పడి 38 మందిని బలికొనడంతో జైషే మొహమ్మద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని తామే చేశామని తొలుత గర్వంగా ప్రకటించుకున్న జైషే సంస్థ.. ఆ తర్వాత తమకు సంబంధం లేదని బుకాయించింది. అదే ఏడాది భారత పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి దాడిచేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ జైషే మొహమ్మద్‌ను 2002లో నిషేధించింది. అయినప్పటికీ ఇతర సంస్థల ముసుగులో జైషే మొహమ్మద్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ జైషే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మసూద్ అజహర్ మేనల్లుడు, స్నైపర్ ఉస్మాన్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి మసూద్ తెగబడ్డాడని నిపుణులు భావిస్తున్నారు. -
ఆజాద్ నారీ ఫౌజ్
స్త్రీలు యుద్ధంలోకి ఎందుకు? స్త్రీల చేతికి తుపాకులెందుకు? ఏమిటీ ప్రశ్న! స్త్రీల సామర్థ్యంపై సందేహమా? స్త్రీల భద్రతపై సంశయమా? ఇంత భారీ డిఫెన్స్ ఫోర్స్‌ని పెట్టుకుని కూడా ‘ఫ్రంట్‌లైన్ వార్’లోకి స్త్రీలను వెళ్లనివ్వడం లేదు మన రక్షణ దళాధిపతులు! మరి.. ఏ బలాలు, దళాలు లేని కాలంలో.. స్వాతంత్య్ర సంగ్రామానికి మహిళల్ని ఏ ధైర్యంతో ఆహ్వానించారు సుభాస్‌చంద్రబోస్?! ధైర్యంతో కాదు. నమ్మకంతో.. మహిళా శక్తిపై నమ్మకంతో! నేడు చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. డెబ్బై ఆరేళ్ల క్రితమే ఆయన స్థాపించిన ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ ఆవిర్భావ సందర్భంపై సంక్షిప్త మననం. 1943 జూలై 9, సింగపూర్.. బోస్ మాట్లాడుతున్నాడు.. సుభాస్ చంద్రబోస్! ఎదురుగా భారతీయులు.. అరవై వేల మంది! ఇల్లొదిలి, దేశం వదలి తనెందుకు వచ్చిందీ చెప్పాడు. అయితే అది కాదు అతడు చెప్పబోతున్నదని అక్కడి వారికి అర్థమైపోయింది. ఇంకేదో చెప్పబోతున్నాడు. ఏంటది?‘‘ఆడవాళ్లు కూడా తుపాకులు అందుకోవాలి’’ అన్నాడు బోస్. ఒక్కసారిగా నిశ్శబ్దం! ‘‘వాళ్లొచ్చి ఏం చేస్తారు బోస్.. భారం అవుతారు ఆజాద్ హింద్ ఫౌజ్‌కి’’.. ఎవరో అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – ఐఎన్ఎ) .. బోస్ నిర్మించిన సైనిక దళం. గొరిల్లా, ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్.. వెరీ డేంజరస్. ఐఎన్ఎ అలికిడి అయితే చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ఏడాదైంది బోస్ ఐఎన్ఎ ని తయారుచేసి. అందులోకే ఇప్పుడు మహిళల్ని రమ్మంటున్నాడు. ‘‘ఒంట్లో సత్తువ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇంట్లో దూరిన శత్రువుని తరిమికొట్టడానికి సైన్యంలోకి రావాలి’’ అన్నాడు బోస్. ‘‘ఏం చేస్తారు బోస్.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మళ్లీ అదే ప్రశ్న. బోస్ గర్జించాడు. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఖడ్గాన్ని తిప్పిందో అలాగే ఖడ్గాన్ని తిప్పుతారు. తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. నేనునమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్‌కు అందుతుంది’’బోస్ ప్రసంగం ముగించాడు. ముగిస్తూ, చెయ్యి ముందుకు చాపి.. ప్రమాణం చేస్తున్నట్లుగా అన్నాడు. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. ఎవరూ చేతుల్లేపలేదు!‘‘ఇక స్వాతంత్య్రం వచ్చినట్లే’’.. ఎవరో అన్నారు. ‘అవునవును’.. ఇంకో గొంతు. మరికొన్ని వంత గొంతుకలు. మూడ్రోజులు గడిచాయి. చప్పుడు లేదు.నాలుగో రోజు సింగపూర్‌లోనే.. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ (ఐఐఎల్) మీటింగ్ జరుగుతోంది. ఐఐఎల్ మహిళా విభాగం మీటింగ్ అది. అక్కడికి వెళ్లాడు బోస్. ఇండియా బయట ఉండి, ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్న భారతీయులంతా కలిసి పెట్టుకున్న రాజకీయపార్టీ ఐఐఎల్.‘‘నా పేరు బోస్. మీలాగే భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక సైనికుడిని’’ అన్నాడు బోస్. మీటింగ్‌లోని మహిళలు కొందరు సంభ్రమంగా చూశారు. ‘మీలాగే’ అన్న మాట.. వారిలో ఉత్తేజాన్ని నింపింది. ‘‘మీతో కలిసి బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు బోస్. బోస్‌తో కలిసి పోరాడాలని అనుకుంటారు ఎవరైనా. కానీ బోసే అంటున్నాడు ‘నేను మీతో కలిసి పోరాడతాను’ అని! ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూశారు మహిళలు. సమావేశంలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఉన్నారు. సింగపూర్‌లో ఐఐఎల్ మహిళా విభాగంలో ఆమెది కీ రోల్. ఆ సమావేశంలోనే.. బోస్కి మహిళలతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాలన్న నిర్ణయం జరిగింది. సైనిక వందనం!మహిళలైతే ఉన్నారు. మహిళా సైనికులు ఎక్కడ దొరుకుతారు.. ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కి. కష్టపడి ఓ ఇరవై మంది సాధారణ మహిళల్ని ఒప్పించగలిగారు. బోస్ ఐఎన్ఎ దళం నుంచి లీ–ఎన్ఫీల్డ్ 303 రైఫిల్స్ తెప్పించారు. వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా వందన సమర్పణ చేయాలో ఆ ఇరవై మందికి అప్పటికప్పుడు నేర్పించారు. యూనిఫారాల్లేవు. చీరల వస్త్రధారణలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వందన సమర్పణ ముగిసింది. బోస్ ప్రసంగం మొదలైంది. ‘‘స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా మగాళ్లకు దీటుగా మీరూ ముందుకు నడుస్తున్నారు. నాకనిపిస్తున్నది ఏమిటంటే.. ముందుకు నడవడమే కాదు, ముందుకు నడిపించగలరు కూడా మీరు’’.ఆ ఒక్కమాట చాలదా.. తుపాకీని భుజానికెత్తుకోడానికి. ఎత్తుకున్నారు. కానీ, అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆడవాళ్లెందుకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోకి అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. బోస్కి సైనిక వందనం చేసిన మహిళల్లో డాక్టర్ నసీరా కయానీ అనే డాక్టర్ కూడా ఉన్నారు. రైఫిల్‌ని ఎత్తిపట్టుకున్న ఆ గ్రూపులో ఉన్న నసీరాను చూసి ఆజాద్ హింద్ ఫౌజ్ కు జనరల్‌గా ఉన్న మొహమ్మద్ జమాన్ కయానీ ఖిన్నుడయ్యాడు. తన భార్యేమిటీ, అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షం అయిందేమిటీ? అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లాక నసీరాను కోప్పడ్డాడు. ‘‘డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కాలేజ్‌లో నా క్లాస్మేట్. తను రమ్మంటే వెళ్లాను’ అని భర్తకు చెప్పారు నసీరా. ఆర్‌జెఆర్ (రాణి ఝాన్సీ రెజిమెంట్) లో చేరదామని వెళ్లి కూడా, భర్త వద్దనడంతో ఆమె ఆగిపోయారు. పైస్థాయిలోనే ఇలా ఉంటే, కింది స్థాయిలో ఇంట్లో మగాళ్లు మహిళల్ని సైన్యంలోకి వెళ్లనిస్తారా? అయినా ఆర్‌జెఆర్ నిలబడింది. నిలదొక్కుకుంది. కలబడింది. బలపడింది. కదిలివచ్చిన కొద్దిపాటి మహిళలతోనే నేతాజీ మహిళా సైన్యం 1943 అక్టోబర్ నుంచి 1945 మే వరకు ఉరుములా, మెరుపులా వెయ్యి మంది సైనికులతో ఉనికిలో ఉంది. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ (లక్ష్మీ స్వామినాథనే లక్ష్మీ సెహెగల్) ఈ దళాన్ని నడిపించారు. 1945 అక్టోబర్‌లో యుద్ధం పూర్తయింది. అంతకు రెండు నెలల ముందే ఆగస్టులో సుభాస్ చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యశక్తి మహిళలోని పోరాట పటిమకు శక్తినిస్తూ ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. ఆ పటిమను నిరూపించుకోవలసిన అవకాశాన్ని యువతులకు ఇవ్వవలసింది మాత్రం ఇప్పటి మన రక్షణ దళాల అధిపతులే. -
కశ్మీర్‌పై ఆ పనికి దిగితే..!?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ప్యూ.. సంచలన విషయాన్ని బయటపెట్టింది. జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ (ఏపీఎస్‌పీఏ)ను ఉపసంహరించాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే జమ్మూ కశ్మీర్లో మరింతగా సైనికులను రంగంలోకి దించాలని 60 శాతం మంది కోరుకుంటున్నట్లు ప్యూ సర్వే సంస్థ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు సమస్య, ఆక్రమిత కశ్మీర్ విషయంలో మెజారిటీ భారతీయులు సైనిక చర్య చేపట్టాలని కోరుకుంటున్నట్లు సర్వే ప్రకటించింది. ఇప్పడున్న సైన్యం కన్నా మరింత అధికంగా సైన్యాన్ని లోయలోకి దించాలని 63 శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వే పేర్కొంది. పాక్‌పై ఆగ్రహం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాకిస్తాన్‌పై దేశ ప్రజల్లో తీవ్రవ్యతిరేక భావనలు మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఆరుమంది పాకిస్తాన్‌పై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారని సర్వే పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే పాకిస్తాన్‌ను ద్వేషించేవారు 55 శాతం మేర పెరిగారు. కశ్మీర్ విషయంలో పార్టీలకతీతంగా మెజారిటీ ప్రజలు పాకిస్తాన్‌ను ద్వేషిస్తున్నట్లు సర్వే తెలిపింది. అమెరికాకు చెందిన ప్యూ సర్వే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్యలో దేశంలోని పలు ప్రాంతాల్లో 2,464 మందిని సర్వే చేసింది. -
సైనిక బలగాల్లో చైనా కీలక నిర్ణయం
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద సైనికి బలగాలను కలిగిన చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని దళాల్లో కలిపి ఉన్న దాదాపు 23 లక్షల సైనికులను పదిలక్షలకు విడతల వారీగా తగ్గించాలని భావిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ కోతలను తలపెట్టినట్లు చైనా మిలటరీ దిన పత్రిక పీఎల్ఏ డైలీ పేర్కొంది. ఇప్పటి వరకు కొససాగిన సంప్రదాయ విధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో సైనికులను నియమించుకున్న చైనా.. భూతల పోరాటం, దేశ సరిహద్దుల రక్షణకు వీరిని వినియోగించుకుంది. తాజాగా ప్రణాళికలో ఈ రెండింటి ప్రాధాన్యత తగ్గింది. ఇతర ప్రంతాల్లో మోహరింపు, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచుకునే యోచనలో ఉంది. దీనికి తగ్గట్టుగా ఆధునిక పరిజ్ఞానం, యుద్ధతంత్రాల అమలు, భద్రతా అవసరాలు, కీలక లక్ష్యాల సాధన లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పీఎల్ఏ నేవీ, పీఎల్ఏ స్టాటిజిక్ సపోర్ట్ ఫోర్స్, పీఎల్ఏ రాకెట్ ఫోర్స్‌ను మరింతగా పెంచుకోనుంది. 2013లో ప్రకటించిన లెక్కల ప్రకారం పదాతి దళాల సంఖ్య 8.50 లక్షలు కాగా 2015లో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సంఖ్యను మూడు లక్షలకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న బలగాల గణాంకాలను మాత్రం ఆ పత్రిక వెల్లడంచలేదు. -
ఆకాశ యుద్ధానికి మహిళలు
యుద్ధ విమానాల పైలట్లుగా నియమించేందుకు కేంద్రం ఓకే ♦ నేరుగా యుద్ధక్షేత్రంలో పనిచేసే దళాల్లో తొలిసారిగా చోటు ♦ ఇప్పటికే వైమానిక దళ అకాడమీలో శిక్షణ ప్రారంభం ♦ 2017 జూన్ నాటికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు న్యూఢిల్లీ: వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళలు నియామకం కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లోంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపికచేయనున్నట్లు రక్షణశాఖ శనివారం ప్రకటించింది. తొలి మహిళా పైలట్ల బ్యాచ్ 2016 జూన్ నాటికి వాయుసేనలో నియామకం అవుతుందని, ఒక సంవత్సరంపాటు అడ్వాన్స్డ్ శిక్షణ అనంతరం 2017 జూన్ నాటికి వారు నేరుగా యుద్ధవిమానాలు నడుపుతారని వెల్లడించింది. భారతీయ మహిళల ఆకాంక్షలను, అభివృద్ధి చెందిన దేశాల సైనిక దళాల ధోరణికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వాయుసేనలో హెలికాప్టర్లు, రవాణా విభాగాల్లో ఇప్పటికే నియామకమైన మహిళా ఉద్యోగులు.. వారి సహచర పురుషుల కంటే బాగా పనిచేస్తున్నారని ప్రశంసించింది. తాజాగా యుద్ధ విమానాల పైలట్లుగా అవకాశం కల్పించడం... యుద్ధరంగంలోనూ వారి సామర్థ్యాన్ని చూపేందుకు అవకాశమని రక్షణశాఖ పేర్కొంది. అయితే త్రివిధ దళాల్లో నేరుగా యుద్ధంలో పాల్గొనే విభాగాలు మినహా మిగతా విభాగాల్లో ఇప్పటికే మహిళలు పనిచేస్తున్నారు. సిగ్నల్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్ డిఫెన్స్, ఇంటలిజెన్స్ కార్ప్స్, ఎడ్యుకేషన్ కార్ప్స్, లాజిస్టిక్స్, అబ్జర్వర్. నావల్ కన్స్ట్రక్టర్స్ వంటి పలు విభాగాల్లో మహిళలను నియమిస్తుండగా... తాజాగా యుద్ధ విమానాల పైలట్లుగా అవకాశం కల్పిస్తున్నారు. వాయుసేనలో ప్రస్తుతం 1,500 మహిళలు పనిచేస్తుండగా... అందులో 94 మంది పైలట్లు, 14 మంది నావిగేటర్లు. కానీ వీరు రవాణా, హెలికాప్టర్ విభాగాల్లో ఉన్నారు. -
సైనిక శక్తిలో బాహుబలి ఎవరు?
-
ఆర్మీ మనసుతో ఆటలాడారు
‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ విషయంలో గత ప్రభుత్వాల తీరుపై ప్రధాని మోదీ ధ్వజం ♦ మేం తప్పకుండా ఈ విధానాన్ని అమలు చేస్తాం ♦ 40 ఏళ్లు ఓపిక పట్టారు.. నాకు కొంత సమయం ఇవ్వండి న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ విధానం విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన తీరుపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఈ విధానంపై నాన్చుడు ధోరణితో గత నలభై ఏళ్లుగా సైన్యం మనోభావాలతో ప్రభుత్వాలు ఆడుకున్నాయని విమర్శించారు. మరికొద్ది రోజుల్లో ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్ ’(ఓఆర్ఓపీ) పై అడ్డంకులన్నీ తొలగిపోతాయని, దీనికి తగిన పరిష్కారం కనుగొనాల్సిందిగా అన్ని విభాగాలకు సూచించినట్లు తెలిపారు. తాజాగా నిర్వహించిన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మీరు గత 40 ఏళ్ల నుంచి ఓపిక పట్టారు. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. ఈ సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపుతా’ అని మాజీ సైనిక ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. ఈ విధానం అమలులో ఏళ్లుగా జరుగుతున్న జాప్యంపై మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తుండడం తెలిసిందే. ‘నేను ఒక్కటే చెబుతున్నా. ప్రధానిగా కాదు.. ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెబుతున్నా. మేం అధికారంలోకి రాగానే సైన్యంలో ఒక ర్యాంకు ఒక పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని ఎన్నికల సమయంలో మాటా ఇచ్చా. ఆ బాధ్యత నుంచి ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి వెళ్లను. ఈ విధానం అమలు నేను ఇంతకుముందు అనుకున్నంత తేలికేమీ కాదు. సంక్లిష్టతరమే. అయినా కచ్చితంగా అమలు చేస్తాం. ఇప్పటికే వివిధ విభాగాలు దీనిపై పనిచేస్తున్నాయి. నాపై విశ్వాసం ఉంచండి. మీకు(సైనిక దళాలు) సాయం చేయడం నా రాజకీయ ఎజెండానో, లేదా ప్రభుత్వ కార్యక్రమమో కాదు. జాతికి చేసే సేవగా భావిస్తా’ అని స్పష్టంచేశారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూసినవారు సైన్యంతో గత 40 ఏళ్లుగా ఆటలాడుకున్నారని, తాను మాత్రం అలా చేయనని చెప్పారు. మరోవైపు తమకు హామీలు అక్కర్లేదని, ఈ విధానం అమలుకు కచ్చితమైన తేదీ చెప్పాలని మాజీ సైనిక సిబ్బంది కోరుతున్నారు. విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ జూన్ 14న నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాది పాలనకు డిస్టింక్షన్ తన ఏడాది పాలనకు డిస్టింక్షన్ వచ్చిందని మోదీ అన్నారు. మన్‌కీ బాత్‌లో సుమారు 25 నిమిషాలపాటు ప్రసంగించిన మోదీ.. ఏడాది పాలనపైనా కాసేపు మాట్లాడారు. ‘‘ఏడాది పాలనపై విశ్లేషణలు జరిగాయి. కొందరు విమర్శలు చేశారు. కానీ చాలామంది మాకు డిస్టింక్షనే ఇచ్చారు. పాలనపై ఇలాంటి చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదే. కొందరు ఒక అంశాన్ని సమర్థిస్తారు. మరికొందరు విభేదిస్తారు. లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ఇలాంటి చర్చలు దోహదపడతాయి’’ అని మోదీ అన్నారు. పేదల కోసం ఇటీవల మూడు సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టానని, వీటికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వ స్తోందన్నారు. పథకాలు ప్రారంభించిన 20 రోజులకే అందులో 8.52 కోట్ల మంది చేరారని వివరించారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలబడి, వారినే ఒక సైన్యంలా మలిచి దేశం నుంచి పేదరికం, ఆకలిని తరిమివేస్తామని చెప్పారు. కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన డీడీ కిసాన్ టీవీ రైతులు, జారల్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారత్‌లో పాల దిగుబడి మరింత పెరగాలని, ఇందుకు ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి అని పేర్కొన్నారు. హామీని విస్మరిస్తున్నారు: కాంగ్రెస్ ఒక ర్యాంకు ఒక పెన్షన్ విధానం హామీ నుంచి మోదీ వెనక్కి వెళ్తున్నారని, ఇది ‘సంక్లిష్ట’ సమస్య అని చెబుతూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఒక ర్యాంకు ఒక పెన్షన్ అంటే? సైనిక దళాల్లో ఒకే ర్యాంకులో, సమాన సర్వీసు కాలంపాటు పనిచేసిన సిబ్బందికి ఎప్పుడు రిటైర్ అయ్యారన్న దానితో సంబంధం లేకుండా ఒకే పెన్షన్ ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. ప్రస్తుతం ఎప్పుడు రిటైర్ అవుతున్నారన్న దానిపై ఆధారపడి మాజీ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తున్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) విధానం అమలైతే.. ఉదాహరణకు 1995లో రిటైరయిన సిపాయి, 1996లో రిటైరయిన సిపాయి ఒకే పెన్షన్‌ను పొందుతారు. ఓఆర్‌ఓపీతో 2006కు ముందు రిటైరయిన సైనిక సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం 2006కు ముందు రిటైరయినవారు.. ఆ తర్వాత రిటైర్(ఒకే ర్యాంకు) అయినవారికంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. వీరికి పదేళ్లకోసారి వేతన సంఘం సిఫారసులకు పెంచుతున్న పెన్షన్ మొత్తమూ తక్కువగా వస్తోంది. ఓఆర్ఓపీ అమలైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగులకు ఈ సమస్య తీరుతుంది. ఈ పథకానికి గత యూపీఏ ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఎన్డీఏ తన బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. -
అణచివేత చర్యలు ముమ్మరం
బోడో మిలిటెంట్లపై సైనిక కార్యాచరణ ఉధృతం: ఆర్మీ చీఫ్ అవసరమైతే మరింత సైన్యాన్ని మోహరిస్తామని వెల్లడి తీవ్రవాదుల కోసం ఆర్మీ హెలికాప్టర్లతో విస్తృతంగా గాలింపు న్యూఢిల్లీ/కోల్‌కతా/గువాహటి: అస్సాంలోని ఆదివాసీలపై దారుణ మారణకాండకు పాల్పడిన బోడో తీవ్రవాదులపై అణచివేత చర్యలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు సైన్యం ప్రకటించింది. అవసరమైతే మరిన్ని బలగాలను రంగంలోకి దింపుతామని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని వెల్లడించింది. స్థానిక పోలీసులతో పాటు మిలటరీ, పారా మిలటరీ బలగాలు తీవ్రవాదుల కోసం గాలిస్తున్నాయని.. ఆర్మీ హెలికాప్టర్లను కూడా ఇందుకు వినియోగిస్తున్నామని తెలిపింది. మిలిటెంట్ల దాడులను నిరసిస్తూ ఆదివాసీ సెంగెల్ అభియాన్ ఆధ్వర్యంలో అస్సాంలో పలు రహదారులను ఆదివాసీలు నిర్బంధించారు. దీంతోపాటు వివిధ సంస్థలు ఇచ్చిన బంద్‌పిలుపు కారణంగా శనివారం అస్సాం రాష్ట్రవ్యాప్తంగా జన జీవనం స్తంభించి పోయింది. మరోవైపు.. వచ్చే 31వ తేదీన ఐదు రాష్ట్రాల బంద్‌కు ఆదివాసీ సెంగెల్ అభియాన్ పిలుపునిచ్చింది. ఇక బోడో తీవ్రవాద సంస్థ ‘నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్’పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. అస్సాంలో పరిస్థితికి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. మిలిటెంట్ల దాడులు వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టాలని ఆర్మీ చీఫ్‌కు మంత్రి సూచించారు. అవసరమైతే భూటాన్, మయన్మార్ల సాయం తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ విలేకరులతో మాట్లాడారు. బోడో తీవ్రవాదులపై కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామన్నారు. శనివారం ఆయన అస్సాంలో పర్యటించనున్నారు. 81కి పెరిగిన మృతులు.. బోడో తీవ్రవాదుల మారణకాండలో మృతిచెందిన ఆదివాసీల సంఖ్య శుక్రవారం నాటికి 81కి చేరుకుంది. మరొకరి మృతదేహాన్ని ఘటనా స్థలంలో శుక్రవారం ఉదయం గుర్తించారు. అస్సాంలోని కొక్రాఝర్, చిరాంగ్, సోనిట్‌పూర్, ఉదల్గురి జిల్లాల్లో ఏర్పాటు చేసిన 61 క్యాంపుల్లో దాదాపు 73 వేల మంది ఆశ్రయం పొందుతున్నట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సీఈవో పీకే తివారీ చెప్పారు. మరోవైపు బోడో తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అస్సాంకు చెందిన ఆదివాసీలు శుక్రవారం రహదారులను దిగ్బంధించారు. ఆదివాసీ సెంగెల్ అభియాన్ ఆధ్వర్యంలో మాల్దా-బాలుర్ఘాట్ రహదారిని, గజోల్ బామున్‌గొలా రహదారిని దిగ్బంధించారు. దీంతో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి వెళ్తున్న వందలాది వాహనాలు మాల్దా వద్ద నిలిచిపోయాయి.