బిహార్‌లోని పట్నాలో హవల్దార్ సునీల్‌కుమార్ నివాసంలో విలపిస్తున్న బంధువులు
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 3,500 కిలోమీటర్ల భారత్–చైనా సరిహద్దు వెంట అదనపు సైనిక బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఎల్‌ఏసీలో సైనిక, వైమానిక దళం హై అలర్ట్ ప్రకటించాయి. చైనా యుద్ధ నౌకలు తిష్టవేసిన హిందూ మహాసముద్రంలో ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని భారత నావికా దళం తమ సిబ్బందికి అదేశాలు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ వద్దకు అదనపు బలగాలు, ఆయుధాలను పంపించినట్లు భారత సైనిక దళం వెల్లడించింది. ఇకనుంచి సన్నద్ధత విభిన్నంగా ఉంటుందని సైనికాధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతంలో భారత్, చైనాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment