సైనిక బలగాల్లో చైనా కీలక నిర్ణయం
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద సైనికి బలగాలను కలిగిన చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని దళాల్లో కలిపి ఉన్న దాదాపు 23 లక్షల సైనికులను పదిలక్షలకు విడతల వారీగా తగ్గించాలని భావిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ కోతలను తలపెట్టినట్లు చైనా మిలటరీ దిన పత్రిక పీఎల్ఏ డైలీ పేర్కొంది. ఇప్పటి వరకు కొససాగిన సంప్రదాయ విధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో సైనికులను నియమించుకున్న చైనా.. భూతల పోరాటం, దేశ సరిహద్దుల రక్షణకు వీరిని వినియోగించుకుంది. తాజాగా ప్రణాళికలో ఈ రెండింటి ప్రాధాన్యత తగ్గింది. ఇతర ప్రంతాల్లో మోహరింపు, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచుకునే యోచనలో ఉంది.
దీనికి తగ్గట్టుగా ఆధునిక పరిజ్ఞానం, యుద్ధతంత్రాల అమలు, భద్రతా అవసరాలు, కీలక లక్ష్యాల సాధన లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పీఎల్ఏ నేవీ, పీఎల్ఏ స్టాటిజిక్ సపోర్ట్ ఫోర్స్, పీఎల్ఏ రాకెట్ ఫోర్స్‌ను మరింతగా పెంచుకోనుంది. 2013లో ప్రకటించిన లెక్కల ప్రకారం పదాతి దళాల సంఖ్య 8.50 లక్షలు కాగా 2015లో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సంఖ్యను మూడు లక్షలకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న బలగాల గణాంకాలను మాత్రం ఆ పత్రిక వెల్లడంచలేదు.