![Russia Ready To Evacuate Indian students Other Foreign Nationals - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/5/Russia.jpg.webp?itok=KKEVTb1T)
Russia Says In UN Security Council meeting: ఉక్రెయిన్ పై రష్యా పది రోజులుగా దాడి కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలు వైమానిక క్షిపణులు, బాంబుల దాడులతో అత్యంత దయనీయంగా మారాయి. ఈ మేరకు రష్యా ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విదేశీయులను, భారతీయులను తరలించే నిమిత్తం యుద్ధానికి బ్రేక్ వేసింది కూడా. అంతేగాక ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీయులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేసింది.
పైగా వారిని తరలించడానికి తూర్పు ఉక్రెయిన్ నగరాలైన ఖార్కివ్, సుమీకి వెళ్లడానికి రష్యా బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని కూడ స్పష్టం చేసింది. ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేయడంతో అంతర్జాతీయ భద్రతా మండలి అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి 15 దేశాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
ఆ సమావేశంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని రష్యా రాయబారి రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను బలవంతంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు.
ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితి రాయబారి సెర్గి కిస్లిత్సా రష్యా రాయబారి నెబెంజియాతో మాట్లాడుతూ.."దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్న ప్రాంతాలను విడిచిపెట్టడానికి సురక్షితమైన కారిడార్‌ను నిర్ధారించేలా సాయుధ దళాలకు (రష్యా) విజ్ఞప్తి చేయండి. అని కోరారు. అంతేకాదు మీరు నిజంగా ఉక్రెయిన్ రాజధానితో సంబంధంలో ఉంటే అక్కడ ఏమి జరుగుతుందో మీకు బాగా తెలుసు" అని వ్యగ్యంగా అన్నారు.
(చదవండి: జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన.. బాంబులు వేసేందుకే ఇలా చేశారా..)
Comments
Please login to add a commentAdd a comment