కరాచీ యూనివర్సిటీని ఖాళీ చేయించారు
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ విశ్వవిద్యాలయాన్ని బుధవారం అధికారులు ఖాళీ చేయించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు బాంబులున్నాయన్న సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని విద్యార్థులు, సిబ్బందిని యూనివర్సిటీ నుండి బయటకు పంపారు.
బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీసు సిబ్బంది బాంబులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. బాంబులున్నాయన్న వార్తలతో విద్యార్థులు, సిబ్బంది ప్రాణభయంతో యూనివర్సిటీ బయటకు పరుగులు తీశారని మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. గత నెల పాక్లోని బచాఖాన్ యూనివర్సిటీపై జరిగిన ఉగ్రదాడిలో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.