ముగిసిన జిల్లాస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు | end district wait lifting sports | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లాస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

Published Wed, Sep 14 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ

పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ

ఖమ్మం స్పోర్ట్స్‌ : జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఐఎంఏ హాల్‌ నిర్వహించిన జిల్లాస్థాయి ద్వితీయ సబ్‌జూనియర్, జూనియర్, పురుషులు, మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ముగిసిశాయి. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పోటీలను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 65 మంది క్రీడాకారులు ఆయా కేటగిరీల్లో పాల్గొన్నారు. ఒక్క రోజుకు పరిమితంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ క్రీడలను కెరీర్‌గా మార్చుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఆయా కేటగిరిల్లో విజేతలుగా నిలిచినవారికి ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పీటీఆర్‌ కృష్ణారావు, అధ్యక్షుడు జి.నరేంద్ర, కార్యదర్శి సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement