పాకిస్తాన్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. జనం నానా అవస్థలు పడుతున్నారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగర పరిధిలోని కోట్-ముర్తాజా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
పాక్‌లోని బలూచిస్తాన్, దక్షిణ పంజాబ్‌లోని పలు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ట్యాంక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ట్యాంక్-సౌత్ వజీరిస్తాన్ రహదారిని మూసివేయడంతో పాటు వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఆగస్టు 4 నుంచి 7 వరకు కరాచీలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబూల్ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని పేర్కొంది. కోహ్-ఎ-సులైమాన్‌లోని రోజాన్‌లోని 100కు పైగా ఇళ్లలోకి వరదనీరు చేరింది. 200 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాజన్‌పూర్ డిప్యూటీ కమిషనర్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment