జైలులో రామలీల.. ఖైదీల ఆనంద తాండవం | Ram Procession Took Place in Haridwar District Jail | Sakshi
Sakshi News home page

జైలులో రామలీల.. ఖైదీల ఆనంద తాండవం

Published Tue, Oct 8 2024 11:30 AM | Last Updated on Tue, Oct 8 2024 11:48 AM

Ram Procession Took Place in Haridwar District Jail

హరిద్వార్: నవరాత్రి రోజుల్లో ఉత్తరాదిన ‘రామలీల’ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా కారాగారంలోనూ ‘రామలీల’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నాటకంలోని పాత్రలన్నింటినీ ఖైదీలే పోషిస్తున్నారు.  రామ్‌లీల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఖైదీలు  ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేశారు. 

ఈ సందర్భంగా జైలు సీనియర్‌ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య మాట్లాడుతూ  ‘రామలీల’ కోసం జైలులోని ఖైదీలు నెల రోజులపాటు ప్రాక్టీస్‌ చేశారన్నారు. ఈ నేపథ్యంలో  రామబరాత్‌ను నిర్వహించామని, దీనిలో పాల్గొన్న ఖైదీలంతా ఆనందంలో మునిగితేలారని అన్నారు. జైల్లో ఇలాంటి కార్యక్రమాలు ఖైదీలలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయని అన్నారు. రామబరాత్‌ అనంతరం రామ పట్టాభిషేకం కూడా నిర్వహించామన్నారు.

ఇది కూడా చదవండి: బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement