Afghanistan: మమ్మల్ని రక్షించండి - తెలంగాణ వలస కార్మికుల వేడుకోలు | Afghanistan Crisis Migrant Labourers Urged Indian Government to Save Them | Sakshi
Sakshi News home page

Afghanistan: మమ్మల్ని రక్షించండి - తెలంగాణ వలస కార్మికుల వేడుకోలు

Published Wed, Aug 18 2021 11:23 AM | Last Updated on Wed, Aug 18 2021 12:34 PM

Afghanistan Crisis Migrant Labourers Urged Indian Government to Save Them - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత దయనీయ పరిస్థితు లకు వీరిద్దరి గాథలు అద్దం పడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని అఫ్గాన్‌కు వెళ్లిన తెలంగాణ వాసుల దయనీయ స్థితి. కొందరు అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోగా మరికొందరు అక్కడే చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపు తున్నారు. అఫ్గాన్‌లోని మన విదే శాంగ కార్యాలయాన్ని ఉద్యోగులు ఖాళీ చేసినా అక్కడ చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎంత? వారి స్థితి గతులేంటో ఇప్పటికీ తెలియట్లేదు. అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సైన్యం, నాటో సేనలు ఖాళీ చేస్తుండటం.. అంతలోనే తాలిబన్లు అఫ్గాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో వలస కార్మికుల్లో ఉపాధి కల చెదిరిపోయింది. ఫలితంగా తమ వీసాలకు గడువు ఉన్నా అఫ్గాన్‌ను వీడాల్సి వస్తుందని వలస కార్మికులు వాపోతున్నారు.

అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడానికి గడువు సమీపించింది. కాగా అమెరికన్‌ సైన్యంకు సేవలు అందించే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గుర్తించిన కొందరు తెలంగాణ యువకులు అఫ్గాన్‌లోనే ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కున్నారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో సైన్యం ఉపసంహరణ జరిగినా రాయబార కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తే తమ ఉద్యోగానికి ఢోకా ఉండదని వలస కార్మికులు భావించారు. ఈ క్రమంలో ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 

అంతలోనే అంతా అయిపోయింది..
కానీ అంతలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ మొత్తాన్ని వశం చేసుకోవడంతో అమెరికా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఈ క్రమంలో రాయబార కార్యాలయాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి అనుబంధంగా పని చేసే కార్మికులను నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి సెలవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలవులపై ఇంటికి రాగా అఫ్గాన్‌లో మారిన పరిస్థితులతో మళ్లీ అక్కడకు వెళ్లలేకపోతున్నారు. 

కాబుల్‌లో చిక్కుకుపోయాను
నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికన్‌ మిలటరీ క్యాంపులో సహాయ కుడిగా పనిచేస్తాను. కాబూల్‌ పట్టణం కసబ్‌ అనే ప్రాంతంలో చిక్కుకున్నాను. రెండు మూడు రోజుల కింద తాలిబన్లు కాల్పుల మోత మోగిం చారు. బిక్కుబిక్కుమంటూ క్యాంపు గదిలోనే దాక్కున్నాం. సెల్‌ఫోన్‌లు వినియోగించ డానికి అనుమతి లేదు. రహస్యంగానే వాడుతున్నాం. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. నాతో పాటు చాలామంది ఇక్కడ చిక్కుకున్నారు.
-  బొమ్మన రాజన్న( మంచి ర్యాల)


ఎటుపోవాలో తెలియడం లేదు
నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాను. నాకు ఇక్కడ పని చేయడానికి వీసా గడువు ఇంకా ఉంది. కానీ తాలిబన్ల కారణంగా అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ చేశారు. నాతో పాటు ఇక్కడ ఉపాధి పొందుతున్న విదేశీయులను రెండు రోజుల కింద ఖతర్‌కు తరలించారు. మమ్మల్ని ఇక్కడే ఉంచుతారో లేక ఇంటికి పంపుతారో తెలియట్లేదు. 
-  బొమ్మెన మహేందర్‌ (మోర్తాడ్‌, నిజామాబాద్‌ జిల్లా)



అమెరికా బాధ్యత తీసుకోవాలి- స్వదేశ్‌ పరికిపండ్ల (ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు)
అఫ్గాన్‌లో 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం, నాటో దళాలకు సేవలు అందించిన తెలంగాణ వలస కార్మికులను అమెరికా ప్రభుత్వం చేరదీయాలనే డిమాండ్‌ వస్తోంది. అఫ్గాన్‌ పౌరులతోపాటు తెలంగాణ వలస కార్మికులకు కూడా అమెరికా తమ దేశ వీసాలను జారీ చేసి ఉపాధి కల్పించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement