ప్రధాని రాజీనామా కోరిన నేపాలీ కాంగ్రెస్‌ | Nepali Congress Urges PM Prachanda To Resign And Pave Way For New Government, See Details Inside | Sakshi
Sakshi News home page

ప్రధాని రాజీనామా కోరిన నేపాలీ కాంగ్రెస్‌

Published Thu, Jul 4 2024 7:56 AM | Last Updated on Thu, Jul 4 2024 9:45 AM

Nepali Congress Urges PM Prachanda to Resign

పొరుగుదేశం నేపాల్‌లో సంభవించిన రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. తాజాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ నేపాలీ కాంగ్రెస్  దేశ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండను కోరింది. హిమాలయ దేశంలో గెరిల్లా మాజీ నేత నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

తాజాగా నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసంలో జరిగిన నేపాలీ కాంగ్రెస్ సెంట్రల్ వర్క్ పెర్ఫార్మెన్స్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ నేపధ్యంలో షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్‌-యూఎంఎల్‌) అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీతో సమావేశమై ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని పాలక కూటమి స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందాన్ని ఖరారు చేశారు.

ఈ సమావేశం అనంతరం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ శరణ్ మహత్ విలేకరులతో మాట్లాడుతూ నేపాల్‌లో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్, యూఎంఎల్‌లు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమై, అందుకు మార్గం సుగమం చేసేందుకు ప్రధాని రాజీనామా  చేయాలని కోరాయని తెలిపారు.  దేశంలోని ఇతర పార్టీలు కూడా కొత్త నేపాలీ కాంగ్రెస్-యుఎంఎల్ కూటమికి మద్దతు ఇస్తున్నాయన్నారు.  అయితే ప్రధాని ప్రచండ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, సభలో మెజారిటీ కోల్పోయిన ప్రధానమంత్రి రాజీనామాకు సిద్ధమైతే అతను పాలక కూటమికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే ఇందుకు సభలో ఓటింగ్‌ జరగాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement