నేపాల్ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెగతెంపులు చేసుకున్నారు. ఇరు పార్టీల్లో నెలకొన్న విభేదాల కారణంగా నేపాలీ కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి ప్రచండ స్వస్తి పలికారు.
మాజీ ప్రధాని కెపీ ఓలీ పార్టీతో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని ప్రచండ నిర్ణయించారు. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) నాయకుడు ఒకరు మాట్లాడుతూ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్), షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మధ్య పొత్తు ముగిసిందని, ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెప్పారు.
సీసీఎన్ (మావోయిస్ట్ సెంటర్) కార్యదర్శి గణేష్ షా మాట్లాడుతూ నేపాలీ కాంగ్రెస్ ప్రధానమంత్రికి సహకరించలేదు. అందుకే తాము కొత్త కూటమి కోసం చూడవలసి వచ్చిందన్నారు. కాగా నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో 2022, డిసెంబర్ 25న ప్రచండ నేపాల్ ప్రధాని అయ్యారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌తో పొత్తును తెంచుకున్న తర్వాత, ప్రచండ.. ఓలీ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment