లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) జీఎస్టీ నుంచి రూ.806 కోట్లకు సంబంధించిన డిమాండ్ ఆర్డర్ కమ్ పెనాల్టీ నోటీసును అందుకున్నట్లు సంస్థ రిగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో రూ.365 కోట్లు జీఎస్‌టీ చెల్లింపులుకాగా, రూ.405 కోట్లు జరిమానా, రూ.36 కోట్లు వడ్డీతో కలిపి మొత్తం రూ.806 కోట్లకు పైగా చెల్లించాలని తెలిపింది.
ఇందుకు సంబంధించి జనవరి 1న నోటీసు అందినట్లు సంస్థ చెప్పింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నోటీసులు అందినట్లు సమాచారం. నిర్దేశించిన గడువులోగా ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఎల్‌ఐసీ పేర్కొంది. ప్రస్తుతం వచ్చిన నోటీసులతో ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ అధికారులు తెలిపారు.
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఇన్సూరెన్స్ నుంచి పొందిన ఐటీసీ రివర్సల్, జీఎస్టీఆర్‌కు చెల్లించిన ఆలస్య రుసుంపై వడ్డీ, అడ్వాన్స్‌పై వడ్డీ కలిపి సంస్థకు రూ.806 కోట్లకు నోటీసులు పంపించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment