
చిత్రకూట్: తాము అధికారంలోకి వస్తే వస్తు సేవల పన్ను(జీఎస్టీ)భారం తగ్గిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ హామీ ఇచ్చారు. కాపలాదారే చోరీకి పాల్పడ్డాడంటూ రాఫెల్ ఒప్పందంపై ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో రాహుల్ రెండు రోజుల పర్యటన గురువారం మొదలైంది. కమ్తానాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నాక ర్యాలీలో మాట్లాడారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా వ్యాపార రంగాన్నీ, ఉద్యోగితనూ మోదీ ప్రభుత్వం దెబ్బతీసింది.
మేం అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్(జీఎస్టీ)ని వాస్తవ పన్నుగా మార్చుతాం. పన్ను రేట్లను తక్కువ స్థాయికి తెస్తాం. ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం’ అని తెలిపారు. ‘భారత్ కాపలాదారు దొంగతనానికి పాల్పడ్డారు’ అంటూ రాఫెల్ డీల్‌పై ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘కాపలాదారుగా ఉంటానని చెప్పిన ఈ వ్యక్తి(మోదీ) పేద ప్రజలకు, యువతకు చెందాల్సిన రూ.30వేల కోట్ల ప్రజాధనాన్ని తన మిత్రుడు, పారిశ్రామిక వేత్త అయిన అనిల్ అంబానీ జేబులో పెట్టారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రైతు రుణాలను రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment