జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని క్యాన్సర్ మందులపై రేట్లను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య బీమాపై రేటు తగ్గింపు అంశం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీతారామన్.. కొన్ని క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే నామ్‌కీన్ స్నాక్స్‌పైన కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రీసెర్చ్ ఫండ్‌పై జీఎస్టీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోగా కారు సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
గత ఆరు నెలల్లో ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 412 శాతం పెరిగి రూ. 6,909 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత ఆరు నెలల్లో క్యాసినోల ద్వారా ఆదాయం 34 శాతం పెరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై కొత్త మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని, ఇది అక్టోబర్ చివరి నాటికి తమ నివేదికను సమర్పిస్తుందని సీతారామన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment