key decisions
-
SLBC టన్నెల్ ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
-
మందుబాబులకు షాక్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
-
23 నుంచి శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు ఇవ్వనున్న టీటీడీ
-
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ గుడ్ న్యూస్
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ మంత్రివర్గం
-
వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం
-
కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
-
వలసదారుల ఏరివేతకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం
-
టాటా ట్రస్టుల కీలక నిర్ణయం!
రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్టుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘మింట్’ కథనం ప్రకారం.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లలో నిర్ధిష్ట-కాల పరిమితి నియామకాల వ్యవస్థకు ముగింపు పలికారు. అంటే ట్రస్టీలు శాశ్వత సభ్యులుగా మారుతారు.గురువారం జరిగిన రెండు ట్రస్టుల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా నివేదిక పేర్కొంది. ఈ మార్పు తర్వాత ఇకపై బోర్డు సభ్యులు తామంతట తాము రాజీనామా చేసేంత వరకు కొనసాగుతారు. అదే సమయంలో కొత్త సభ్యుల నియామకానికి ఇకపై బోర్డు ఏకగ్రీవ సమ్మతి కావాల్సి ఉంటుంది. అక్టోబర్ 11న టాటా ట్రస్ట్‌లకు అధిపతిగా నోయెల్ టాటా నియమితులైన తర్వాత ట్రస్టులు నిర్వహించిన రెండో బోర్డు సమావేశం ఇది.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?రెండు ట్రస్టులు సమిష్టిగా టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో సగానికి పైగా వాటాలను కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్ తరఫున అన్ని దాతృత్వ కార్యకలాపాలను ఈ రెండు ట్రస్టుల ద్వారానే నిర్వహిస్తున్నారు. నివేదిక ప్రకారం.. టాటా సన్స్‌లో సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు 27.98 శాతం, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 23.56 శాతం వాటాలు ఉన్నాయి. -
టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు
-
తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. కాసేపట్లో విచారించనున్న సుప్రీంకోర్టు
-
తెలంగాణ కేబినెట్ లో కీలక అంశాలపై నిర్ణయం !
-
సీఎం రేవంత్ సర్కార్ కీలక ప్రకటన
-
జీఎస్టీ తగ్గింపు.. కౌన్సిల్ కీలక నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని క్యాన్సర్ మందులపై రేట్లను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య బీమాపై రేటు తగ్గింపు అంశం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీతారామన్.. కొన్ని క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే నామ్కీన్ స్నాక్స్పైన కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రీసెర్చ్ ఫండ్‌పై జీఎస్టీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోగా కారు సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.గత ఆరు నెలల్లో ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 412 శాతం పెరిగి రూ. 6,909 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత ఆరు నెలల్లో క్యాసినోల ద్వారా ఆదాయం 34 శాతం పెరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై కొత్త మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని, ఇది అక్టోబర్ చివరి నాటికి తమ నివేదికను సమర్పిస్తుందని సీతారామన్ చెప్పారు. -
సిరాజ్, నిఖత్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగాలు..
-
టార్గెట్ ధనుష్..తమిళ ఇండస్ట్రీలో సంచలనం
-
వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు.. వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: వాలంటీర్లపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ.. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించాలని నిర్ణయించింది. 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ డోర్ డెలివరీ చేయనుంది. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నామని.. వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి తెలిపారు.చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ‘‘జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు!జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయంవాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా నిర్ణయాలు— YSR Congress Party (@YSRCParty) June 24, 2024 కాగా, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సేవ కంటే కక్షసాధింపునకే ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీసింది చంద్రబాబు సర్కార్. వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. -
పార్లమెంట్ సెక్యూరిటీపై కేంద్రం కీలక నిర్ణయం
-
గ్లాసు గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈనెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కిడ్నాప్ చేసి.. బెదిరించి -
టీటీడీ కీలక నిర్ణయాలు..
-
కీలక నిర్ణయాలు తీసుకున్న 17వ లోక్ సభ
-
తెలంగాణ ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు ఇవే..
-
ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు
-
మరో రెండు గ్యారంటీలు..తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
-
రాజీనామాకి ముందు..కేశినేని శ్వేత సంచలన నిర్ణయం
-
హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణపై ప్రభుత్వం ఫోకస్
-
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం..ఇంకా ఇతర అప్డేట్స్
-
గుడ్ న్యూస్.. పెన్షన్ 3వేలు..!
-
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, తిరుమల: కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ భూమన మీడియాకు వెల్లడించారు. ►అలిపిరి గోశాల శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభం ►టీటీడీ ఉద్యోగాలకు ఇంటి స్థల కేటాయించే ప్రాంతాలలో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణం ►15 కోట్లుతో అదనపు రోడ్డు నిర్మాణం ►టీటీడీ ఉద్యోగులు అందరికి ఇంటిస్థలాలు ఇస్తాం, మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నాం ►తిరుపతి రాం నగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు 6.15 కోట్లు ►టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, శాశ్వత ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850 ►తిరుమల ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగులను మరో ఏడాది పొడిగింపు, 3.40 లక్షలు కేటాయింపు ►మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయింపు ►రేణిగుంట రోడ్డు నుంచి తిరుచానూరు వరకు 3.11 లక్షలతో అభివృద్ధి ►4.89 లక్షలతో పుదిపట్ల నుంచి వకులమాత ఆలయం అలయం వరకు రూ. 21 కోట్లు ►తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నూతన టిబీవార్డు నిర్మాణానికి ఆమోదం ►స్వీమ్స్ వద్ద రోగులకు విశ్రాంతి భవనానికి 3.35 లక్షలతో కేటాయింపు ►స్వీమ్స్ వైద్య సదుపాయాలు పెంపునకు కార్డియోకు నూతన భవనం ►స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు 197 కోట్లు కేటాయింపు ►తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో 3.50 లక్షలతో నూతన కెమారాలు, బోన్లు కొనుగోలుకు నిర్ణయం ►కరీంనగర్లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం ►సాంప్రదాయ కళల అభివృద్ధికి టీటీడీ ప్రాథమిక శిక్షణ.. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వనున్న టీటీడీ -
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం
-
సంపూర్ణ సాధికారత
"అణగారిన వర్గాల అభ్యున్నతికి కుల గణన మరింత దోహదం చేస్తుంది. ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందిస్తుంది. ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలు అందకుండా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుంటుంది." -సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణనకు శ్రీకారం చుడుతోంది. సమాజంలో అణగారిన వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందేందుకు వీలుగా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపు శతాబ్దం తర్వాత రాష్ట్రంలో కుల గణన ద్వారా మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితోపాటు తారతమ్యాలు, అసమానతలను రూపు మాపేలా ప్రణాళిక రూపొందించింది. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి కీలక సమావేశంలో ఈమేరకు కుల గణన నిర్ణయానికి ఆమోదం లభించింది. సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కుల గణన ప్రక్రియ చేపడతామని తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా సామాజిక వర్గాల నాయకులతో సమావేశాలు, ఐదు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. కుల గణన చేపట్టాలని కోరుతూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీల ఆత్మ బంధువుగా సీఎం జగన్ చేపడుతున్న కుల గణనను ‘సామాజిక సాధికార సురక్ష’గా అభివర్ణించారు. సంక్షేమ ఒరవడిలో భాగంగా నవంబరు 7వతేదీన వైఎస్సార్ రైతు భరోసా సాయం పంపిణీతో పాటు 15వతేదీన భూమిలేని నిరు పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, 22–ఏ జాబితా నుంచి ఈనామ్ భూముల మినహాయింపు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారికి రుణాలను మాఫీ చేయడంతో పాటు వాటిపై పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల కోసం భూములు, లంక భూములకు పట్టాల పంపిణీ చేపడతామన్నారు. 28వ తేదీన జగనన్న విద్యా దీవెన, 30న పేదింటి ఆడబిడ్డలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అందజేస్తామన్నారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ, విజ్ఞప్తిని గౌరవిస్తూ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు సీఎం జగన్ సారథ్యంలోని మంత్రి మండలి అంగీకారం తెలిపిందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి మండలి నిర్ణయాలపై మంత్రి ఏమన్నారంటే.. ఆస్పత్రికి వెళ్లేందుకు రూ.500 ప్రయాణ ఖర్చులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి పేదల ఆరోగ్యంపై ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు 11,710 క్యాంపులను నిర్వహించింది. సుమారు 60 లక్షల మంది శిబిరాల వద్ద వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంటి వద్దే 6.40 కోట్ల ర్యాపిడ్ టెస్టులు చేశారు. 8,72,212 మందికి కంటి పరీక్షలు చేయగా 5,22,547 మందికి కంటి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు సిఫారసు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షల్లో అనారోగ్య సమస్యలను గుర్తిస్తే చికిత్స విషయంలో సమగ్రంగా ఫాలో అప్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గతంలో ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయించుకున్న వ్యక్తులు, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్దేశించారు. మెరుగైన వైద్యం కోసం రిఫరెల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా/ఆస్పత్రికి పంపించాలన్నారు. వారికి ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలని ఆదేశించారు. చికిత్స సమయంలో, అనంతరం కూడా సకాలంలో మందులు అందించడంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా రెండు రవాణా శాఖ యూనిట్లు తూర్పు గోదావరి జిల్లా నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణా శాఖకు యూనిట్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణా శాఖకు కొత్తగా యూనిట్ ఆఫీసు నెలకొల్పి ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ ఇంజనీరు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ముగ్గురు హోంగార్డులను నియమించనున్నాం. స్కూళ్లలో టెక్నాలజీ వినియోగం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన విద్య అందించే చర్యల్లో భాగంగా 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ నియామకానికి మంత్రి మండలి ఆమోదించింది. ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధన కోసం సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలను మ్యాపింగ్ చేసింది. ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ట్యాబ్‌లు, డిజిటల్ పరికరాలు, యాప్‌లు, ఐఎఫ్‌పీ ప్యానళ్ల వినియోగంపై శిక్షణ ఇస్తారు. వీటిల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిదిద్దుతారు. భూ కేటాయింపులపై కొత్త పాలసీ భారీ ప్రాజెక్టుల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ కాంప్లెక్స్, డీజిల్ బస్ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్ అసెంబుల్డ్ చేసే పెప్పర్ మోషన్ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించింది. ఈ సంస్థ రూ.4,640 కోట్ల పెట్టుబడితో 8,080 మందికి ఉపాధి కల్పించనుంది. పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ ‘న్యూ ల్యాండ్ అలాట్మెంట్’కి ఆమోదం లభించింది. ఇకపై లీజు విధానం స్థానంలో సేల్ డీడ్ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. పరిశ్రమల కోసం మాత్రమే ఆ భూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యుత్ రంగంలో.. ►అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీకి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం గతంలో ఏపీఐఐసీ 1,200 ఎకరాలు కేటాయించింది. ఇందులో ఎన్టీపీసీ రూ.95 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయడంతో పాటు దీన్ని సబ్ లీజ్‌కు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. ►ఏపీ ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్ డ్యూటీలలో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. తద్వారా సుమారు రూ.766 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించనుంది. ఈ పరిశ్రమలపై 50 వేల మంది ఆధారపడటంతో ఈమేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ► 902 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నంద్యాల, వైఎస్సార్ జిల్లాలలో 5,400 ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయింపు. ఈ కంపెనీ ఎకరానికి ఏడాదికి రూ.31 వేలు చెల్లించనుంది. ►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అనుమతి. మంత్రి మండలి ఆమోదించిన మరిన్ని అంశాలు ► పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీలకు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ గత నెల 30వతేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ప్రతిపాదనలకు, రెండు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్ఐపీబీ నిర్ణయానికి ఆమోదం లభించింది. ►రహదారుల, భవనాల శాఖలో వసతి గృహాల మెరుగైన నిర్వహణకు అవుట్ సోర్సింగ్ విధానంలో 467 పోస్టుల భర్తీ. ►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాఖ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు. ►50 ఎకరాల లోపు ఏపీఐఐసీ ద్వారా 285 భూ కేటాయింపులకు ఆమోదం. ► తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్కేఆర్ గ్రూపు హోటల్ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాలు, వైఎస్సార్ జిల్లా గండికోటలో, విశాఖపట్నంలో మే ఫెయిర్ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూ కేటాయింపులు. ► విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని గ్రూప్–1 అధికారిగా నియామకానికి ఆమోదం. ► కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 4.12 ఎకరాల భూమి కేటాయింపు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమి కేటాయింపు. ► శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు. ► నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమి రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయింపు. ► రాష్ట్రంలో 100 ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ. ఇందులో 45 పోస్టులు అప్‌గ్రేడేషన్, 55 సూపర్ న్యూమరీ పోస్టులు. ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో 22 పోస్టుల భర్తీకి ఆమోదం. ► కర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమి కేటాయింపు. ఇప్పటికే వీటి కోసం 50 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం. ► దేవదాయ శాఖలో సిబ్బంది బలోపేతానికి దేవదాయశాఖ కమిషనర్ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ► దేవాలయాలు ఆర్జించే ఆదాయాల ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయ పరిమితుల పెంపు. గతంలో డిప్యూటీ కమిషనర్ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 కోట్ల నుంచి రూ.12 కోట్లకు, జాయింట్ కమిషనర్ పరిధిలో గతంలో రూ.కోటి పైన ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంచారు. ► విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, యూజర్ చార్జీల నుంచి మినహాయింపు. ► పోలవరం ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించిన ఇళ్ల పట్టాలకు, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించి ఉచితంగా రిజిస్ట్రేషన్. ► విశాఖ జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపద కళాకారుడు, దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి వంగపండు విజయలక్ష్మికి 1,000 గజాల ఇంటి స్థలం కేటాయింపు. ఇదీ చదవండి: బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం -
కేబినేట్ మీటింగ్ లో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు
-
ఏపీ కేబినెట్ తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే
-
జాతీయపార్టీ అని చెప్పుకొని తెలంగాణలో చేతులెత్తేసిన టిడిపి
-
కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సహా స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు హాజరయ్యారు. జీ20 సదస్సు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆమోదించిన నిర్ణయాలు: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధికి రూ.3,760 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్‌కు ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం. * మొత్తం ఖర్చు తామే భరిస్తామని తెలిపిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. * 2030-31 వరకు 5 దశల్లో నిధులు విడుదల చేస్తామన్న అనురాగ్ ఠాకూర్. * దేశంలో 4 వేల మెగావాట్ల నిల్వకు ఈ సిస్టమ్ ఉపకరిస్తుందన్న కేంద్రం. * యబిలిటీ గ్యాప్ ఫండింగ్ వల్ల రూ.9,500 కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కేంద్ర మంత్రి. * ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ స్కీమ్ (IDS) 2017 కింద హిమాచల్, ఉత్తరాఖండ్ లో పరిశ్రమల అభివృద్ధికి అదనపు నిధులు ఇవ్వనున్న కేంద్రం. * రూ.1,164 కోట్లు కేటాయింపు నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై వాళ్లకు వీఐపీ దర్శనం..
-
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్ట్ లు
-
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే..!
-
విద్యాశాఖలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
ఇటువంటి సాహసం సీఎం వైఎస్ జగన్ మాత్రమే చేయగలరు
-
పోలవరం సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
హుస్సేన్ సాగర్‌లోకి ఇక గోదావరి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయంలో గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ సారాంశాన్ని మంత్రులు తలసాని, గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాకు వివరించారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ప్రధానంగా ఇచ్చిన హామీకి కట్టుబడి 111 జీవో రద్దుతో పాటు కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. 👉 సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహణ. రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. 21 రోజుల పాటు విజయోత్సవాలు. రోజుకో రంగంలో ఉత్సవాలు. 👉 కుల వృత్తులను ఆర్దికంగా ఆదుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక్కో కులానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం. మంత్రి గంగుల నేతృత్వంలో ఈ కమిటీ. 👉 111 జీవో ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం. 84 గ్రామాలకు మేలు చేసే నిర్ణయం ఇది. HMDA భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయి. 👉 గోదావరి, కృష్ణ, మంజీర నది నుంచి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కు వస్తుంది. కాబట్టి ఉస్మాన్, గండి పేట్ చెరువులకు రింగ్ మెయిన్ చేయాలని కేబినెట్ నిర్ణయం 👉 హుసేన్ సాగర్‌ను గోదావరి నదితో అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయం. 👉 కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్, గండిపేట అనుసంధానానికి కేబినెట్ ఆమోదం. 👉 హైదరాబాద్ జోన్ లో 6 జోన్లకు డీఎం అండ్ హెచ్‌వోలు, రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది డీఎం అండ్ హెచ్వోలను నియమించాలి. 👉 అర్బన్ హెల్త్ సెంటర్ లో పర్మినెంట్ ఉద్యోగుల నియామకం 👉 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని నిర్ణయం 👉 రైతుల సంక్షేమం కోసం మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ 👉 నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపుతాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతం. రాష్ట్ర పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తారు. పీడీ యాక్ట్ పెట్టి అరెస్టులు ఉంటాయి. 👉 అలాగే.. మక్కలు, జొన్నలు కొనడానికి వ్యవసాయ, సివిల్ సప్లై శాఖకు కేబినెట్ అనుమతి 👉 వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టంతో.. పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక. ఈ ప్రణాళిక విధివిధానాలపై సబ్ కేబినెట్ దీనికి నివేదిక ఇస్తుంది. 👉 వీఆర్ఎ లకు శుభవార్త. వాళ్లను పర్మినెంట్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు 👉 TSPSC లో 10 పోస్టుల మంజూరు. 👉 వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి 10 గుంటల భూమి 👉 ఖమ్మం లో జర్నలిస్టుల సంక్షేమానికి భవనం. జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు 👉 జైన్ కమ్యూనిటీని మైనార్టీ కమిషన్ లో చేరుస్తూ నిర్ణయం. కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం. 👉 అచ్చం పేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయంరెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయం -
విద్యుత్ పాదుపు..ప్రగతికి మలుపు
-
వార్షిక బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ.. ఎంతంటే?
సాక్షి, తిరుమల: 2023-24 సంవత్సరానికి 4411 కోట్ల రూపాయలు అంచనాతో టీటీడీ పాలక మండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 15వ తేదీన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 2023-24 సంవత్సరానికి రూ.4411 కోట్ల అంచనాతో బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభించి, భక్తులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి భక్తులు సౌకర్యార్థం రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం, ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు కేటాయింపు గానూ పాలక మండలి ఆమోదం తెలిపిందని, అంతే కాకుండా తిరుపతిలోని యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇక ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నామని, కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తులు రద్దీ దృష్ట్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారీ చేసే వారు నియంత్రణ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. విఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు విధానాన్ని అలాగే కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తాంమని, త్వరలోనే బాలాజి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి వెల్లడించారు. చదవండి: తొమ్మిది మిషన్స్‌తో ఏపీ కొత్త పారిశ్రామిక పాలసీ.. వివరాలు ఇవిగో.. -
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
కేసీఆర్ కేబినెట్ నిర్ణయాలు
-
కోనసీమ అల్లర్ల కేసులో కీలక నిర్ణయం
-
సిజేరియన్ ప్రసవాలపై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు
-
PACS: సహకార వ్యవస్థ బలోపేతం కోసం..
సాక్షి, ఢిల్లీ: కేంద్రం మంత్రివర్గం ఇవాళ(బుధవారం) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రధాన నిర్ణయానికి కేబినెట్ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ మీడియాకు వివరించారు. ప్రతీ పంచాయతీలో వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మొగ్గుచూపింది. దీని ప్రకారం.. ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక పీఏసీఎస్(Primary Agricultural Credit Society) ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో మొత్తంగా రెండు లక్షల పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
-
తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
టీచర్ల విధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
సంచలన నిర్ణయం తీసుకున్న ఫోర్డ్ కంపెనీ
-
చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పిస్తూ జగన్ నిర్ణయం
-
కారులో 6 ఎయిర్ బ్యాగ్ నిబంధన పై కేంద్రం కీలక నిర్ణయం
-
టాటా గ్రూపు కీలక నిర్ణయం... ఒకే గూటికి ఏడు కంపెనీలు
-
హితకారిని సమాజం కాలేజీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక నిర్ణయం
-
విద్యార్థులకు ట్యాబ్ లు సీఎం జగన్ కీలక నిర్ణయం
-
Good News: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకి త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య తాక్రే నేడు స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. దాదాపు 500 కోట్లు విలువ చేసే స్థలం. త్వరలోనే ముంబాయి లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతాం. ఆలయ నిర్మాణానికి పూర్తి ఆర్థికంగా ఇవ్వడానికి గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు టీటీడీ పాలక మండలి నిర్ణయాలు... ►శ్రీవారి మెట్టు మార్గం మే 5 నుంచి ప్రారంభం ►శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం. పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి 21 కోట్లు కేటాయింపు. మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి. ►విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా కమిటి సూచనలు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి ►రెండు విడతలుగా మరమ్మత్తులు.. 36 కోట్లు ఘాట్ రోడ్డు మరమ్మత్తులు ►తిరుమలలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు ►బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాద కేంద్రం, లడ్డు తయారీకి ఉపయోగించాలని నిర్ణయం ►తిరుమల లోని టీటీడీ ఉద్యోగులు ఉంటే 737 కాటేజీలు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయం ►ధన రూపంలో ఇచ్చే విరాళాలు టీటీడీ అన్ని ప్రివిలేజ్ ఇస్తుంది. ఇకపై వస్తు రూపంలో ఇచ్చే వాటికి కూడా ప్రివిలేజ్ ఇవ్వాలని నిర్ణయం ►టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం ►సీఎం తిరుపతి పర్యటన, చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించనున్న సీఎం ►శ్రీనివాససేతు ప్రారంభం ►బర్డ్ ఆసుపత్రిలో స్మైల్వట్రైన్ కేంద్రం ఏర్పాటు ►తిరుమలలో స్థానికుల సమస్యలు పరిష్కారానికి పాలకమండలి నిర్ణయం -
అవినీతి నిర్మూలన కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం
-
సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను: రోజా
-
మంత్రి వర్గంలో చోటు.. కెరీర్‌పై ఆర్కే రోజా కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు జగనన్న మంత్రిగా చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను. మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్లలో ఇక చెయ్యను' అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రకటించారు. చదవండి: (RK Roja: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఆమెకు సరిలేరు) -
కరోనా టీకాపై కేంద్రం కీలక నిర్ణయం
-
ఏపీ కేబినెట్ చివరి భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. చివరి మంత్రి వర్గసమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ముఖ్యమైనవి.. ►జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్లానింగ్ సెక్రటరీ విజయకుమార్ సహా, అధికారులందరూ సమర్ధవంతంగా నిర్వహించారని ప్రశంసించిన మంత్రిమండలి సభ్యులు. అధికారులను అభినందిస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన కేబినెట్. ►2021–22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైయస్సార్ సున్నావడ్డీ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటుచేస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు చేసిన స్వల్పసవరణలకు కేబినెట్ ఆమోదం. ►కొత్తగా కొత్తపేట, పులివెందుల రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►7 మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలతో కొత్తపేట రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ►8 మండలాలతో పులివెందుల రెవిన్యూ డివిజన్‌కు కేబినెట్ ఆమోదం. ►చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీరపునాయనిపల్లె మండలాలతో పులివెందుల డివిజన్. ►విభజించిన తర్వాతకూడా వైయస్సార్ కడప జిల్లాలో 36 మండలాల నేపథ్యంలో కొత్తగా పులివెందుల డివిజన్. ►12 పోలీసు సబ్డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం. ►జిల్లాల విభజన నేపథ్యంలో ఇప్పుడున్న జిల్లా పరిషత్‌లను మిగిలిన కాలానికి కొనసాగిస్తూ ఆర్డినెన్స్. ►చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ►చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మిల్లెట్మిషన్ (2022–23 నుంచి 2026–27 వరకూ)కు కేబినెట్ ఆమోదం. ►ఐచ్ఛికంగా వచ్చిన ఎయిడెడ్ డిగ్రీకాలేజీల సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టులు. ►దాదాపు 253 పోస్టులు (23 ప్రిన్సిపల్, 31 టీచింగ్, 199 నాన్‌టీచింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం. ►ప్రకాశంజిల్లా దర్శిలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీకాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్‌టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►పీఆర్సీకి సంబంధించి ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోదం. ►సర్వే సెటిల్మెంట్స్ మరియు ల్యాండ్ రికార్డుల డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. ►రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగులు. ►ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్యసేవలు అందించనున్న ఆస్పత్రులకు భూముల కేటాయింపు. ►దీంట్లో భాగంగా, కాకినాడ అర్బన్ మండలం సూర్యారావుపేటలో మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం. ►కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో అత్యాధునిక ఆస్పత్రికోసం 5 ఎకరాల భూమి కేటాయింపు. ►విజయనగరం మండలం సంతపేటలో 4.5 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద అత్యాధునిక ఆస్పత్రికి ఏపీఐఐసీ ద్వారా కేటాయింపు. ►అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ గ్రామంలో 4 ఎకరాల భూమి హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే ఆస్పత్రికి కేటాయింపు. ►శ్రీకాకుళం మండలం పాత్రుని వలసలో 4.32 ఎకరాల భూమిని హెల్త్ హబ్ కింద ఏర్పాటయ్యే అత్యాధునిక ఆస్పత్రికి కేటాయింపు. ►ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కు హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్ కోసం రాజమండ్రి అర్భన్ లో 6 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ►కర్నూలు జిల్లా బేతంచర్లలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీకి 100 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►కొయ్యూరు మండలం బలరాం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 15.31 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం, కేబినెట్ ఆమోదం. ►ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటు చేసేందుకు హుకుంపేట మండలం గడుగుపల్లిలో 5.10 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్. ►అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంట, రాగులపాడుల్లో 15 ఎకరాల భూమి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేటాయింపు. ►విండ్ టర్బైన్ జనరేటర్లను ఏర్పాటుచేయనున్న ఐఓసీఎల్. ►కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఆగ్రోకెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ విస్తరణకు 10.06 ఎకరాలు కేటాయింపు. ►కాకినాడ జిల్లా జగ్గంపేటలో బస్‌స్టేషన్ నిర్మాణానికి 1.57 ఎకరాల భూమిని ఏపీఎస్ఆర్టీసికి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ►రంపచోడవరం మండలం పెద గడ్డాడలో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ►నిజాపంపట్నం మండలం దిండిలో పరిసవారిపాలెంలో 280 ఎకరాలను ఏపీ మత్స్యశాఖకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం. ►మడ్క్రాప్ హేచరీస్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్న ఏపీ మత్స్యశాఖ. ►కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు 82.34 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►ముత్తుకూరు మండలం ఈపూరు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి 84.29 ఎకరాలను కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. ►గూడూరులో ప్రభుత్వ ఆస్పత్రిక విస్తరణకోసం 0.89 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ►నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాన్పూరులో 5.05 ఎకరాల భూమిని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూరుకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. ►ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం. -
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై కేబినెట్ సంతాపం తెలిపింది. సీఎం వైఎస్ జగన్, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చదవండి: అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వికృత చేష్టలు.. సీఎం జగన్ సీరియస్ మంత్రి మండలి కీలక నిర్ణయాలు ►స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం. ►రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను సెకెండ్ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం ►కర్నూలుకు చెందిన ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టెన్, 2017 డెఫ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు బిల్లుకు కేబినెట్ ఆమోదం. ►తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు. ►డిప్యూటీ కంట్రోలర్ పోస్టును జాయింట్ కంట్రోలర్(అడ్మిన్) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ►రూ.1234 కోట్ల రూపాయిలతో మూడు ఫిషింగ్ హార్భర్ల నిర్మాణం ►రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8741కోట్ల రుణ సమీకరణ ►ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్ ఆమోదం. ►బెంగుళూరు–కడప, విశాఖపట్నం–కడప నడుమ వారానికి మూడు విమాన సర్వీసులు ♦ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు ♦వీటికి అదనంగా కొత్త సర్వీసులకు ఆమోదం ♦మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభం ♦ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్ ఒప్పందం.. కేబినెట్ ఆమోదం ♦సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్ధతు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం ♦అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు –2 కింద చెరువులకు నీళ్లు ♦దీని కోసం బైపాస్ కాలువ నిర్మాణం.. రూ.214.85 కోట్ల ఖర్చు. ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం ♦పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్– బ్రిడ్జి నిర్మాణం ♦పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం ►పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్– బ్రిడ్జి– లాకుల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం ►కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం ►ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం ►తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్ ఆమోదం ►ఆర్మ్‌డు రిజర్వ్ పోర్స్‌లో 17 ఆఫీసర్ లెవల్ ( 7 ఏఏస్పీ,10 డిఎస్పీ) కొత్త పోస్టులకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్ ఆమోదం ►165 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్ అండ్ మెయింటైనెన్స్ (ఓఅండ్ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం ►ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►మొబైల్ ఆంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ –2లో 165 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం -
ఆ పుష్ఫం ముందు క్రిప్టో కరెన్సీ దిగదుడుపే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు చేశారు. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణకు కీలకమైన రివర్స్ రెపో (బ్యాంకులు తమ వద్ద ఉండే అదనపు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం)ను కూడా యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ కమిటీ విధాన నిర్ణయం తీసుకుంది. 2020 ఆగస్టు నుంచి యథాతథమే..: కరోనా సవాళ్లు ఎదుర్కొనడం, వృద్ధి లక్ష్యంగా 2020 మార్చి తర్వాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు (1.15 శాతం) తగ్గించింది. 2020 ఆగస్టు నాటికి ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది. వడ్డీ రేట్ల పెంపులో సుదీర్ఘ విరామం, నిరంతర సరళతర విధాన వైఖరిని మీడియా సమావేశంలో గవర్నర్ శక్తికాంతదాస్ సమర్థించుకుంటూ, ప్రస్తుత కాలంలో ‘ద్రవ్య– ఆర్థిక విధానాలు ఒకదానికొకటి లేదా ఒకదానితో ఒకటి కలిసి వెళ్లాలి’’ అని వ్యాఖ్యానించారు. రెండు విధానాల్లో ‘అదా–ఇదా’ అనే ప్రశ్నే ప్రస్తుతం తలెత్తబోదని గవర్నర్ అన్నారు. సరళతరానికి ఐదుగురు ఓటు కాగా, పాలసీకి సంబంధించి అనుసరిస్తూ వస్తున్న ‘సరళతర’ వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు. పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వేగవంతమైన వృద్ధి ఇక భారత్ ఎకానమీ వృద్ధి తీరు ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే విభిన్నంగా ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎకానమీ కొనసాగుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.8 శాతానికి తగ్గించడానికి కారణం. 2021–22లో ఎకానమీ వృద్ధి 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సంబంధించి ఈ అంచనా 9 శాతంగా ఉంది. ఈ అంచనాలకన్నా కొంత అధికంగానే ఆర్బీఐ అంచనాలు 9.2 శాతం వద్ద కొనసాగుతుండడం గమనార్హం. మరికొన్ని కీలక నిర్ణయాలు... ► కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్–ట్యాప్ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది. ► దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. రూ. లక్ష వరకు ఈ–రూపీ పరిమితి ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ. 1 లక్షకు పెంచుతూ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు లబ్దిదారుడు బ్యాంక్ అకౌంట్, ఇంటర్నెట్ లేకుండా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా కూడా రూ. 1 లక్ష వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అందించడానికి వీలుగా మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు ఈ–రూపీ వోచర్‌ను లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించవచడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సమర్థ పంపిణీకి ప్రస్తుతం ఈ–రూపీ కీలకంగా ఉంది. కేవైసీ, కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటితో సంబంధం లేకుండా వోచర్‌ను రిడీమ్ చేయడంలో లబ్దిదారులకు సహాయపడే వన్–టైమ్ (ఇప్పటివరకూ... ఇకపై పూర్తిగా రీడీమ్ అయ్యే వరకూ) కాంటాక్ట్‌లెస్, నగదు రహిత వోచర్ ఆధారిత చెల్లింపు విధానమే– ఈ–రూపీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన ఈ–రూపీ నగదు రహిత డిజిటల్ ఓచర్‌ను ‘వ్యక్తిగత వినియోగం, సింగిల్ టైమ్ రెడెమ్షన్ సౌలభ్యంతో’ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లెండింగ్పై మార్గదర్శకాలు డిజిటల్ రుణ విధానాలపై త్వరలో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీచేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ తన సిఫారసులను ఇప్పటికే సమర్పించినట్లు డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం జరిగిందని, దీని అధారంగా మార్గదర్శకాలు రూపొందుతున్నాయని తెలిపారు. రిటైల్ పేమెంట్ వ్యవస్థకు కొత్త నేతృత్వ సంస్థ ఖరారుకు ఇంకా సమయం పడుతుందని సూచించారు. క్రిప్టో... తులిప్ కన్నా దిగదుడుపే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విషయంలో ఆర్బీఐ కమిటీ తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ... తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. డిజిటల్ కరెన్సీపై తొందరలేదు.. ఆర్బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు. లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు... ఆచితూచి, లక్ష్యసాధనకు ఉద్దేశించి పరపతి విధాన నిర్ణయాలను ఆర్బీఐ విధాన పరపతి కమిటీ తీసుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలో ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన, వృద్ధే లక్ష్యంగా సరళతర విధానం కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) ద్రవ్యోల్బణం ఆమోదనీయ బ్యాండ్‌లోనే పైకి వెళ్లొచ్చు. అయితే 2022–23 ద్వితీయ ఆరు నెలల కాలంలో 4.5% శ్రేణికి దిగొస్తుందని కమిటీ విశ్వసిస్తోంది. దీనికితోడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి సవాళ్లు వంటి అంశాల నేపథ్యంలో విస్తృత ప్రాతిపదికన రికవరీ జరగడానికి ఎకానమీకి పాలసీ మద్దతు అవసరమని కమిటీ భావించింది. సరళతర విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం వల్ల రివర్స్ రెపోను కూడా యథాతథంగా కొనసాగించాలని కమిటీ అభిప్రాయపడింది. వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయ ప్రణాళికలు, ఎగుమతులు ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల, డిమాండ్ పటిష్టతకు దారితీస్తాయని, ఈ వాతావరణం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నాం. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ ఎకానమీకి భరోసా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ఎకానమీ వృద్ధికి పాలసీ నిర్ణయాలు భరోసాను ఇస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతానికి పాలసీ తగిన మద్దతునిచ్చింది. ప్రభుత్వ బాండ్లలో తగిన సమతౌల్యతను కొనసాగించడానికి సంకేతాలను ఇచ్చింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అంచనాలకు అనుగుణంగా... పాలసీ నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. వృద్ధిని మరింత పటిష్టం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎకానమీలోని పలు రంగాల బలహీనత నేపథ్యంలో ‘సరళతర’ విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించడం హర్షణీయం. – అతుల్ కుమార్ గోయెల్, ఐబీఏ చైర్మన్ డిమాండ్‌కు దోహదం సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం వ్యవస్థలో డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధి అన్ని రంగాల్లో విస్తృత ప్రాతిపదికన జరగాలని పరిశ్రమ కోరుతోంది. ఈ దిశలోనే ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వంతో సన్నిహిత సహకారంతో వృద్ధి పురోగతికి మరిన్ని చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నాం. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షణీయం సరళ విధానం కొనసాగించాన్న నిర్ణయం హర్షణీయం. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడం రియల్టీకి సానుకూలాంశం. బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉన్న అదనపు లిక్విడిటీ అన్ని రంగాలకూ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఉపాధి కల్పన, ఎకానమీ పురోగతికి దారితీస్తుంది. – హర్షవర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పరస్పర ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉద్యోగులిద్దరూ పరస్పరం అవగాహన వస్తే బదిలీకి అవకాశం ఉంది. ఉద్యోగుల విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భార్యాభర్తల కేసులను తక్షణం పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారు. బదిలీలపై రేపు లేదా ఎల్లుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. చదవండి: ప్రగతి భవన్ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి ఓవర్ యాక్షన్ -
బయటకొస్తున్న మాన్సాస్ ట్రస్ట్ అక్రమాలు