
మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏల నియామకంపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 30,31 సెలవు రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 31న కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయనున్నాయి.
మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏల నియామకంపై జీవో విడుదల
మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏల నియామకంపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విధి విధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. డిగ్రీ అర్హత ఉన్న మాజీ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు గ్రామ పాలన అధికారులుగా అవకాశం కల్పించింది.