
అమరావతి: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నోడల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ కమిషనర్‌ను నియమించింది.
ఇక సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో.. భారీగా భూములు తొలగించినట్లు గుర్తించారు. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక అందించింది.