Mansas trust lands
-
మాన్సాస్ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
-
మాన్సాస్ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
విశాఖపట్నం: సింహాచలం దేవస్థాన ఆస్తులను కాపాడుతామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధించి రూ. 8 వేల కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. ఇంతటి అవినీతికి పాల్పడిని అశోక్ గజపతిరాజు ధర్మకర్త? అధర్మకర్తా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, సుమారు 846 ఎకరాల దేవస్థాన భూమిని అన్యాక్రాంతం చేశారని విమర్షించారు. త్వరలోనే భూ సమస్యను పరిష్కారిస్తామని ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ గౌతమ్ సవాంగ్ -
వ్యవస్థను భ్రష్టుపట్టించి ఆర్తనాదాలు చేస్తే ఎలా?: విజయసాయి రెడ్డి
సాక్షి, అమరావతి: మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయిందని ఆయన మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోంది. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది. దేవాదాయశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. వ్యవస్థను భ్రష్టుపట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా?’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోంది. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది. దేవాదాయశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. వ్యవస్థను భ్రష్టుపట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా? — Vijayasai Reddy V (@VSReddy_MP) August 24, 2021 చదవండి: ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే.. -
‘మాన్సాస్’ నుంచి నన్ను తప్పించండి
విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్‌పై సర్వాధికారాల కోసం కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరాటపడుతున్నారా? ఈ విషయంలో అధికారులపై తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారా?.. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిబద్ధతతో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన మాన్సాస్ ట్రస్ట్ ఈవో డి. వెంకటేశ్వరరావుకు కనీస సహకారం అందించకపోగా.. తాము చెప్పినట్లే నడుచుకోవాలంటూ ట్రస్ట్ చైర్మన్ వర్గాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇది తట్టుకోలేని ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు గత నెల 31న రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న తనను వ్యక్తిగత సమస్యల కారణంగా తిరిగి రెవెన్యూ విభాగానికి పంపించాలంటూ లేఖలో కోరారు. అప్పటి నుంచి ఈవో టార్గెట్? గత తొమ్మిది నెలలుగా ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ట్రస్ట్ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యానికి ఈవోయే కారణమంటూ అశోక్‌గజపతిరాజు వర్గీయులు ఉద్యోగులందరినీ రెచ్చగొట్టారు. ఆయనపై భౌతికదాడి చేయించేందుకు సైతం సిద్ధమైనట్లు కూడా ఆరోపణలున్నాయి. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ అధికారులు అడిగిన రికార్డులు అందిస్తాం ∙సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆస్తుల జాబితా నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో 862.22 ఎకరాలు తప్పించడంపై విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోందని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. వారు అడిగిన రికార్డులను దేవస్థానం తరఫున అందజేస్తామని చెప్పారు. సింహాచలం దేవస్థానం కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రికార్డుల నుంచి భూములు ఎలా తొలగింపునకు గురయ్యాయని అధికారులు అడిగారన్నారు. అలాగే ఆ భూములు ఏ పట్టా ప్రకారం దేవస్థానానికి దఖలు పడ్డాయన్న విషయంపై లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని అధికారులు కోరారని తెలిపారు. అప్పటి ఈవో హయాంలో జరిగిన ఫిక్స్డ్ డిపాజిట్లు, కోర్టు కేసులు, తదితర వివరాలను కూడా విజిలెన్స్ అధికారులు అడిగారని చెప్పారు. ఇప్పటికే భూములకు సంబంధించిన రిపోర్టు సిద్ధంగా ఉందన్నారు. ఎఫ్డీలు, కోర్టు కేసుల నివేదికను తయారు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం రిపోర్టు అందజేస్తామన్నారు. -
సింహాచలం భూములపై విజిలెన్స్ విచారణ
సింహాచలం (పెందుర్తి): సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రానికి చెందిన భూములను టీడీపీ హయాంలో రికార్డుల నుంచి తొలగించిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ఆలయ ఈవో కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి ఆధ్వర్యంలో డీఎస్పీ అన్నెపు నరసింహమూర్తి, సీఐ తిరుపతిరావు భూముల రికార్డులను పరిశీలించారు. ఈ అడ్డగోలు వ్యవహారంపై దేవదాయ శాఖ నియమించిన కమిటీ దర్యాప్తు నిర్వహించి, రికార్డులను పరిశీలించిన విషయం విదితమే. అప్పట్లో ఆస్తుల రికార్డుల నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్ని భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో సింహాచలం దేవస్థానం పేరిట ఉన్నట్టు గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో భూముల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించగా.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగారు. మాన్సాస్ భూములపైనా ఈ విభాగం విచారణ చేయనుంది. మూడు నెలల్లోగా నివేదిక సింహాచలం దేవస్థానం, మాన్సాస్ భూముల అవకతవకలపై పూర్తి విచారణ జరిపి మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. ప్రాథమికంగా వివిధ రికార్డులను పరిశీలించామని, కొన్ని రికార్డులను విజిలెన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి పరిశీలిస్తామని చెప్పారు. అవకతవకలు జరిగిన భూములను స్వయంగా పరిశీలిస్తామన్నారు. -
బయటకొస్తున్న మాన్సాస్ ట్రస్ట్ అక్రమాలు
-
‘ఆ అక్రమాల్లో చంద్రబాబు పాత్ర?’
సాక్షి, విజయవాడ: సింహాచలం, మాన్సాస్ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడి భూములు కాజేసిన వారిని శిక్షించడానికే విజిలెన్స్ విచారణ చేపట్టామన్నారు. అక్రమాల్లో చంద్రబాబు పాత్ర కూడా ఉందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. ‘‘అశోక్‌గజపతి ఛైర్మన్‌గా వందల కోట్ల భూములకు ఎన్ఓసీలు ఇచ్చారు. 313 ఎకరాలకు అడగకుండానే ఎన్ఓసీలు ఇచ్చారు. ఎండోమెంట్ కమిషనర్ ఇవ్వాల్సిన ఎన్ఓసీలు సింహాచలం ఈవో ఇచ్చారు. పదేళ్లుగా మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదు. దేవుడి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారని’ మంత్రి మండిపడ్డారు. సింహాచలం దేవస్థానం ఆస్తులు కాపాడాలన్నదే తమ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. -
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూములపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నోడల్ ఆఫీసర్‌గా దేవాదాయశాఖ కమిషనర్‌ను నియమించింది. ఇక సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో.. భారీగా భూములు తొలగించినట్లు గుర్తించారు. మాజీ ఈవో రామచంద్రమోహన్ హయాంలో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక అందించింది. -
ఏపీ హైకోర్టులో ఊర్మిళ గజపతిరాజు పిటిషన్
-
‘అశోక గజపతిరాజును చైర్మన్‌గా తొలగించాలి’
సాక్షి, అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా తనను నియమించేలా ఆదేశాలివ్వాలంటూ ఊర్మిళ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఊర్మిళ తరఫున లాయర్ మాట్లాడుతూ.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచాయతిను.. రెండో భార్య కుమార్తె ఊర్మిలనును ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని కోర్టుకు తెలిపాడు. కనుక అశోక గజపతి రాజును చైర్మన్‌గా తొలగించి.. ఆ స్థానంలో ఊర్మిళ గజపతి రాజును చైర్మన్‌గా నియమించాలని న్యాయవాది కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
మాన్సాస్‌లో ఆడిట్ మంచిదే
సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (మాన్సాస్) ట్రస్ట్ వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించడంలో ఏమాత్రం తప్పులేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజలతో ముడిపడి ఉన్న ఇలాంటి ట్రస్ట్‌ల వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించడం వల్ల మరింత బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని, మాన్సాస్‌లో ఆడిట్ జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆడిట్ నిర్వహిస్తే అభ్యంతరం ఏమిటని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజును న్యాయస్థానం ప్రశ్నించింది. పారదర్శకత కోసం ఆడిట్ మంచిదేనని, విజయనగరం జిల్లా ఆడిట్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆడిట్‌ను కొనసాగనివ్వాలని ఆదేశించింది. మాన్సాస్ ట్రస్ట్‌కు పాలక మండలిని ఏర్పాటు చేస్తూ గత ఏడాది మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 75 అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. జీవో 75ని రద్దు చేయాలంటూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ మంగళవారం విచారణ జరిపారు. కమిటీల పని కమిటీలదే... ప్రభుత్వ కౌంటర్ లేకుండా జీవో 75 విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవోపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రస్ట్ కార్యకలాపాల విషయాల్లో ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీలను వాటి పని వాటిని చేసుకోనివ్వాలని స్పష్టం చేసింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోరాదని ట్రస్ట్ ఈవోను హైకోర్టు ఆదేశించింది. విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపు విషయంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. ఆయా బ్యాంకుల్లో ట్రస్ట్ ఖాతాలను స్తంభింపచేస్తూ బ్యాంకులకు ఈవో పంపిన ఆదేశాల అమలును నిలుపుదల చేసింది. రోజువారీ నిర్వహణ నిమిత్తం ట్రస్ట్ విద్యా సంస్థల తరఫున వచ్చే చెక్కులను ఆమోదించాలని బ్యాంకులను హైకోర్టు ఆదేశించింది. పాలక మండలి సమావేశం నిర్వహించాల్సిందిగా చైర్మన్‌ను కోరుతూ ఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును కూడా హైకోర్టు నిలిపివేసింది. ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ట్రస్ట్ ఈవో, ఈవో డి.వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23కి వాయిదా వేసింది. 2004లో చివరిసారిగా ఆడిట్.. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయిత నియామకాన్ని, ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యుల నియామక జీవోలను హైకోర్టు రద్దు చేసినందున పాలక మండలి మనుగడలో లేనట్లేనని అశోక్ గజపతిరాజు తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల మేరకే ఈవో నడుచుకుంటున్నారని, ట్రస్ట్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ పాలక మండలి ఆధ్వర్యంలోనే తీసుకోవాల్సి ఉంటుందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు చట్టం అనుమతించదన్నారు. 2004లో చివరిసారిగా ఆడిట్ నిర్వహించారని, అప్పటి నుంచి మళ్లీ ఆడిట్ చేయలేదని అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి, ఈవో తరఫు న్యాయవాది ఎ.మాధవరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. -
మాన్సాస్ జీతాల వివాదం: చోద్యం చూస్తున్న అశోక్ గజపతిరాజు
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధీనంలోనున్న 12 విద్యాసంస్థల సిబ్బంది, ఉద్యోగుల జీతాల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. ట్రస్టు చైర్మన్ హోదాలో దీన్ని పరిష్కరించాల్సిన టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు నిరాటకంగా చేస్తూనే ఉన్నారు. సంచయిత నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆయన సానుకూల తీర్పునే పొందారు. చైర్మన్‌గా పునర్నియామకమై దాదాపు రెండు నెలలైనా ట్రస్టు బోర్డును మాత్రం పట్టించుకోలేదు. కనీసం బోర్డు సమావేశాన్నీ ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం బోర్డు తీర్మానాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఇన్నాళ్లూ విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్న కేవీఎల్ రాజు పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. కరస్పాండెంట్‌తో సంయుక్తంగా చెక్ పవర్ ఉన్న చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) హర్నీద్ర ప్రతాప్ సింగ్‌ను బోర్డు తీర్మానంతో సంబంధం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించేశారు. అశోక్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండురోజులకే ఆ నిర్ణయం జరిగిపోయింది. బ్యాంకింగ్ లావాదేవీల్లో జాయింట్ చెక్ పవర్ ఉన్న అధికారిని తొలగించేస్తే ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. అదీ బోర్డు తీర్మానంతో జరగాలి. బోర్డును సమావేశపరచకుండా ఈ రెండు నెలలూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన అశోక్ గజపతిరాజు... ఉద్యోగుల జీతాలు నిలిచిపోయినందుకు నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదీ పరిస్థితి... ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంఆర్ కళాశాల, ఎంఆర్ మహిళా కళాశాల, ఎంఆర్ ఫార్మసీ, ఎంఆర్ పీజీ, మాన్సాస్ ఇంగ్లిష్ మీడియం తదితర 12 విద్యాసంస్థలు మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 800 మంది ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల ప్రక్రియను మొదటి నుంచి విద్యా సంస్థల కరస్పాండెంట్ చూసుకుంటున్నారు. ఆ ఖర్చుల కోసం బోర్డు తీర్మానంతోనే నిధులు విడుదలవుతాయి. ట్రస్ట్ కార్యకలాపాలన్నీ సవ్యంగా జరిగేలా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కార్యనిర్వాహణాధికారి (ఈవో)ను నియమిస్తోంది. బోర్డు తీర్మానం మేరకు రూ. 3.50 కోట్ల ఫండ్‌ను మొదటి విడతలో, మరో రూ.2.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను రెండవ విడతలో ఈఓ ఏటా విడుదల చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఏవిధంగా వినియోగించారన్నదీ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఈఓకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీల)ను సమర్పిస్తున్నారు. ఇదీ ఏటా జరుగుతున్న ప్రక్రియే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఆడిటింగ్ జరగకపోవడంతో ట్రస్టులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్టులో ప్రక్షాళన ప్రారంభించింది. చట్టం ప్రకారం ట్రస్టులో నియామకాలు చేపట్టింది. విచ్చలవిడిగా నిధుల వ్యయానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బోర్డు తీర్మానం మేరకు సీఎఫ్ఓను నియమించింది. కరస్పాండెంట్, సీఎఫ్ఓల జాయింట్ అకౌంట్ ద్వారా జీతాలు, ఇతర ఖర్చుల వ్యవహారాలు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి నిర్ణయాలతో గత ఏడాదిగా మాన్సాస్ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ జరుగుతోంది. అశోక్ సహా 11 మందిపై కేసు నమోదు మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులు దాడి చేశారంటూ ఈఓ డి.వెంకటేశ్వరరావు విజయనగరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి ప్రేరేపించిన అశోక్, కరస్పాండెంట్‌తో పాటు దాడి చేయడంతో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పది మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు సీఐ జె.మురళీ వెల్లడించారు. అశోక్ పునరాగమనంతో చిక్కుముడి.. మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం 2020 మార్చి 3వ తేదీన జీఓలు 73, 74 జారీ చేసింది. అదే సమయంలో మాన్సాస్ బోర్డు సభ్యులను నియమిస్తూ జీఓ 75ను విడుదల చేసింది. ఈ బోర్డులో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళా గజపతిరాజుతో పాటు ఆర్వీ సునీత ప్రసాద్, అరుణ్ కపూర్, విజయ్ కె.సోంథీ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. జీఓలు 73, 74లను సవాల్ చేశారు. అయితే, ఆయన పిటిషన్లో బోర్డుకు సంబంధించిన జీఓ 75ను ప్రస్తావించలేదు. హైకోర్టు జీఓలు 73, 74లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం అశోక్ చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టారు. అయితే, బోర్డును మాత్రం ఇప్పటివరకూ సమావేశపరచిన దాఖలాల్లేవు. బోర్డు తీర్మానం లేకుండానే సీఎఫ్ఓను అశోక్ ఏకపక్షంగా తొలగించేశారు. పూర్వ పద్ధతిలోనే కరస్పాండెంట్ జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కానీ నిబంధనల ప్రకారం కరస్పాండెంట్‌తో పాటు సీఎఫ్ఓ కూడా సంతకం చేస్తేనే బ్యాంకు నుంచి విత్‌డ్రా కుదరని పరిస్థితి ఏర్పడింది. అది సవ్యంగా జరిగితేనే డబ్బులు ఇస్తామని బ్యాంకులు తేల్చి చెప్పేశాయి. బ్యాంకులతో ఏర్పడిన చిక్కుముడికి తానే కారణమన్న విషయాన్ని అశోక్, కరస్పాండెంట్ కేవీఎల్ రాజు రాజకోట రహస్యం చేసేశారు. జీతాలు నిలిచిపోవడానికి కారణం ఈఓనే అంటూ ఉద్యోగులను ఉసిగొల్పడం గమనార్హం. జీతాల చెల్లింపు మా పరిధి కాదు... నిబంధనల మేరకు ట్రస్ట్‌లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా బోర్డు ఆమోదం తప్పనిసరి. విద్యాసంస్థల జీతాల చెల్లింపు అంతా కరస్పాండెంట్ చూస్తున్నారు. ఈఓగా కేవలం నిధుల కేటాయింపు వరకే చూస్తాం. బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకూ జరగలేదు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బోర్డు సమావేశం గురించి మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కొత్త సీఎఫ్ఓ ఎవరో ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. కరస్పాండెంట్, సీఎఫ్ఓ సంతకాలు చేస్తేనే బ్యాంకుల నుంచి ఉద్యోగులకు జీతాల సొమ్ము విడుదల అవుతుంది. – డి.వెంకటేశ్వరరావు, ఈఓ, మాన్సాస్ ట్రస్టు -
కాలేజీ పేరుతో కాజేశారు
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీ ముసుగులో టీడీపీ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను అమ్మేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కనీసం దరఖాస్తు కూడా చేయకపోగా ఆ పేరుతో విశాఖ నగరానికి సమీపంలో మాన్సాస్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాలను, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమి కారుచౌకగా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేయడం గమనార్హం. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ముఖ్య’నేత ఈ భారీ మాయకు తెరతీస్తే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు తన వంతు సహాయ సహకారాలను అందజేశారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాన్ ట్రస్టులలో చోటు చేసుకున్న అక్రమాలపై దేవదాయ శాఖ ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందచేయడం తెలిసిందే. విజయనగరంలో మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాల్లో జరిగిన అక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. మన భూమి అయితే ఇలాగే అమ్ముతామా..? భూమిని అమ్ముకుంటే ఎవరైనా సరే పూర్తి విస్తీర్ణం మేరకు లెక్కగట్టి డబ్బులు తీసుకుంటారు. ఆ స్థలంలో రోడ్లు వేసేందుకు కొంత భూమి కేటాయించాల్సి వస్తే అంతమేరకు తగ్గించుకుని డబ్బులు తీసుకుంటారా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇళ్ల ప్లాట్ల ధరకు తగట్టుగానే భూమి ధరను నిర్ణయించి విక్రయిస్తారు. కానీ మాన్సాన్ భూములు అమ్మిన తీరు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మకమానవు. మెడికల్ కాలేజీ పేరుతో గత సర్కారు మాన్సాన్ భూములను నాలుగు ప్రాంతాల్లో విక్రయించింది. అందులో ఒకటి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో భూముల అమ్మకం. అక్కడ ట్రస్టు పేరిట ఉన్న భూముల్లో 53.40 ఎకరాల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 43.40 ఎకరాల విక్రయానికి తెరతీశారు. రోడ్లు వేయాలంటూ.. కొత్త వలసలో 43.40 ఎకరాల అమ్మకమన్నారు. అయితే కొనుగోలుదారులు అంతర్గతంగా 80 అడుగుల రోడ్లు ఏర్పాటు చేసుకుంటే 2.98 ఎకరాల భూమి వృధా అవుతుందంటూ దాన్ని విక్రయించే భూమి నుంచి ముందే మినహాయించారు. ఇక ఇళ్ల ప్లాట్లకు అనువుగా లేదంటూ మరో 4.31 ఎకరాలను మినహాయించారు. ఇలా మొత్తం 7.29 ఎకరాలను మినహాయించి మిగిలిన 36.11 ఎకరాలకు మాత్రమే కొనుగోలుదారుడి నుంచి డబ్బులు తీసుకున్నారు. 10.98 ఎకరాలు ఉచితంగా... ఇదొక ఎత్తు కాగా ఈ భూములను అమ్మిన తర్వాత ట్రస్టుకు అక్కడ మరో పది ఎకరాల స్థలం ఉండాలి. అయితే ఇప్పుడు 6.31 ఎకరాలే మిగిలినట్లు అధికారుల కమిటీ నిర్ధారించింది. అంటే అక్కడ మరో 3.69 ఎకరాలు ఈ అమ్మకం లావాదేవీల తర్వాత కనిపించకుండా పోయింది. అంటే మొత్తంగా ట్రస్టుకు చెందిన 10.98 ఎకరాల భూమికి ఎటువంటి ప్రయోజనం పొందకుండా కొన్నవారికి ధారాధత్తం చేశారు. 36.11 ఎకరాల్లో రూ.74 కోట్లు దోపిడీ.. మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మిన కొత్తవలసలో రిజిస్ట్రేషన్ ధర ఎకరం రూ.89 లక్షలు ఉంది. అయితే ఆ భూమిని అమ్మే సమయంలో అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.2.51 కోట్లు ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ మార్కెట్ ధర కంటే సగం ధరకే ఎకరం రూ.1,20,70,000 చొప్పున విక్రయించారు. ఒకవైపు 10.98 ఎకరాల భూమిని కోల్పోతూ మరోవైపు మార్కెట్ కంటే సగం ధర తక్కువకు అమ్మేశారు. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి గత సర్కారు 150.09 ఎకరాల మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మగా అందులో 36.11 ఎకరాల భూముల విక్రయంతో ట్రస్టుకు వచ్చింది రూ.43.58 కోట్లు అయితే నష్టపోయింది రూ.74.22 కోట్లకుపైనే ఉంటుందని దేవదాయ శాఖ అధికారుల కమిటీ నిర్ధారించింది. మొత్తం 150.09 ఎకరాల అమ్మకాల తీరును విశ్లేషిస్తే ఈ దోపీడీ రూ.250 కోట్లకు పైబడి ఉండవచ్చని తాజాగా భావిస్తున్నారు. సింగిల్ బిడ్ టెండర్లతోనే అమ్మకం.. కొత్తవలస భూముల కొనుగోళ్లలో కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రమే పాల్గొంది. భూములు అమ్మే సమయంలో ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించలేదు. బహిరంగ వేలం పాటకు సంబంధించిన నోటీసులను మాన్సాన్ ట్రస్టు కార్యాలయం, విజయనగరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, భూములను అమ్ముతున్న ప్రాంతం, కనీసం నోటీసు బోర్డులో కూడా ఉంచలేదు. తగిన ప్రచారం కల్పించి ఉంటే ఎక్కువ మంది బహిరంగ వేలంలో పాల్గొని ఆ భూములకు మంచి ధర పలికి ఉండేదని అధికారులు నిర్ధారించారు. దేవదాయ శాఖ భూములను విక్రయించాలంటే నిబంధనల ప్రకారం అవన్నీ పాటించాలి. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం కల్పించేందుకు తూతూ మంత్రంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. -
మాన్సాస్ ట్రస్ట్‌లో మరో వివాదం
-
‘మాన్సాస్’ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా!
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్‌గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్‌గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్‌కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు. -
‘మాన్సాస్’ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా!
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్‌గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్‌గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్‌కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు. -
మాన్సాస్ కార్యాలయం ముట్టడి
విజయనగరం టౌన్: మాన్సాస్ (మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్స్) విద్యా సంస్థల ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యంపై నిరసన తెలిపారు. మ.2 నుంచి సా.6.30 గంటల వరకు కోటలోని మాన్సాస్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవో వెంకటేశ్వరరావును నిలదీశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్యాసంస్థల సిబ్బందికి జీతాలిచ్చేది మాన్సాస్ కరస్పాండెంట్, సీఎఫ్‌వో లేనని, తాను కాదని తెలిపారు. జీతాల చెల్లింపులో జాప్యంపై ఇప్పటివరకు కరస్పాండెంట్ నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. జీతాలిచ్చే కరస్పాండెంట్‌తో పాటు జాయింట్ సంతకాన్ని సీఎఫ్‌వో పెడతారని, వారిద్దరూ కలిసి జీతం చెక్‌పై సంతకం చేయాలన్నారు. తాము ఏటా రూ.మూడున్నర కోట్లను సపోర్టింగ్ ఫండ్ కింద తమ శాఖ తరఫున ఇస్తామన్నారు. ఇప్పుడు ఆథరైజ్డ్ సిగ్నేచర్స్ చేసే వారిని మార్చినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారిద్దరూ వచ్చి ఆ చెక్‌లపై సంతకం పెట్టి ఇచ్చేస్తే సమస్య పరిష్కారమైపోతుందన్నారు. మాన్సాస్ కరస్పాండెంట్, సీఎఫ్‌వోల సమక్షంలోనే సమస్యను తేల్చుకుందామంటూ ఉద్యోగులు వెనుదిరిగారు. -
గోల్మాల్ నిజమే!
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూములను జాబితాల నుంచి తప్పించడం.. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన భూముల వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలూ నిజమేనని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, ఉప కమిషనర్ పుష్పావర్ధన్ ఈ వ్యవహారంపై విచారణ పూర్తిచేసి నివేదికను ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావుకు శనివారం సమర్పించారు. ఈ నివేదికను సోమవారం ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి పంచ గ్రామాల్లోని పలు సర్వే నంబర్లతో పాటు 748 ఎకరాల భూములను జాబితాల నుంచి తప్పించినట్లు కమిటీ నిగ్గుతేల్చింది. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ల (ఇద్దరు ఏసీలు) సాయంతో అప్పటి దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించారని.. దీని వెనుక ఆ శాఖకు చెందిన పలువురితోపాటు, కొందరు సింహాచలం దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. భూములను జాబితాల నుంచి తప్పించడంలో అప్పటి ఈఓ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో స్పష్టంచేసింది. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించి.. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్లపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములను దేవస్థానం జాబితాల నుంచి తప్పించిన వ్యవహారంపై విచారణ బృందం పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈవో రామచంద్రమోహన్ హయాంలో సిబ్బంది, సెక్యూరిటీ సంస్థల నియామాకం, లీజుల కాల పరిమితి పెంపు, ఇతర వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని కమిటీ సభ్యులు తమ నివేదికలో సిఫారసు చేసినట్టు సమాచారం. మాన్సాస్ భూముల అమ్మకాలు, మెడికల్ కాలేజీ ఏర్పాటులో చేతివాటం ప్రదర్శించినట్లు కూడా విచారణ బృందం గుర్తించింది. పలు వస్తువుల కొనుగోళ్లలో హెచ్చు ధరలున్నట్లు నివేదికలో పేర్కొంది. రెండు విడతలుగా విక్రయించిన 150 ఎకరాల్లో కొంత భూమిని పక్కదారి పట్టించినట్లు గుర్తించింది. 50 ఎకరాల భూమి విక్రయిస్తే అందులో 36 ఎకరాలకే సొమ్ములు వసూలు చేసి, మిగిలిన 14 ఎకరాలు విడిచి పెట్టినట్లు గుర్తించారు. -
‘మాన్సాస్’లో మరో మాయ
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో ఉంచేందుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తున్న రోజులవి. 2016 ఏప్రిల్ 11వ తేదీ.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి రెవెన్యూ గ్రామ పరిధిలో గల 474.44 ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్టుకు చెందనవిగా పేర్కొంటూ అప్పటి ట్రస్టు ఈవో ఆ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా అసిస్టెంట్ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆ భూములకు ఎటువంటి ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చాలంటూ లేఖ రాశారు. ఇది జరిగిన ఏడాదికే.. 2017 ఏప్రిల్ 19వ తేదీన ధర్మపురి రెవెన్యూ గ్రామంలో మాన్సాస్ ట్రస్టు భూములుగా నిర్ధారించిన 474.44 ఎకరాల భూములలో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌కు అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు. అవి ట్రస్టు భూములని పేర్కొన్నప్పుడు, అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తిరిగి లేఖ రాసినప్పుడు దేవదాయ శాఖ కమిషనర్‌గా ఉన్నది ఒక్కరే. మొత్తంగా ఏదో మాయ చేసినట్టుగా.. ట్రస్టు ఆస్తుల జాబితా నుంచి బాగా ఖరీదైన 145.78 ఎకరాల భూములు ఎగిరిపోయాయి. మాన్సాస్ ట్రస్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 14,418 ఎకరాల భూములుండగా.. 2015–16, 2018–19లలో 150 ఎకరాలను మెడికల్ కళాశాల–ఆస్పత్రి పేరుతో విక్రయించేసిన బాగోతం ఇప్పటికే వెలుగు చూసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కొత్తవలస, చిప్పాడ, బాకురపాలెం, డాబా గార్డెన్స్, సంతపేటలో ఉడా ద్వారా ఆ 150 ఎకరాలను విక్రయించగా రూ.120 కోట్లు వచ్చిందని ట్రస్టు లెక్క చూపించింది. సింహచలం శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టు భూములకు సంబంధించి టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు పాత రికార్డులు పరిశీలన చేయగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చట్టాలను, కోర్టు ఉత్తర్వులను, దేవదాయ శాఖ నిబంధనలను తోసిరాజని అధికారం దన్నుతో ఈ కుంభకోణానికి తెరలేపినట్టు రికార్డుల పరిశీలనలో తేలింది. ఆ కమిటీ తీర్మానం ప్రకారమే.. అశోక్‌గజపతిరాజు చైర్మన్‌గా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్న ముగ్గురు సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డు 2017 ఫిబ్రవరిలో ధర్మపురి రెవెన్యూ పరిధిలో ట్రస్టు పేరిట ఉండే 145.78 ఎకరాలు ట్రస్టువి కావంటూ ట్రస్టు ఈవో అప్పటి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడం, ఆ వెనువెంటనే ఆ భూములకు రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ నిరభ్యంతర సర్టిఫికెట్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ట్రస్టు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాకే.. 2014 జూన్–2019 మే మధ్య రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయంలోనే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఈ భూ మాయ చోటుచేసుకోవడం విశేషం. అంతకుముందు మాన్సాస్ ట్రస్టు చైర్మనుగా ఉన్న ఆనంద గజపతిరాజు 2016 మార్చిలో మరణించారు. దీంతో టీడీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజును ట్రస్టు చైర్మనుగా నియమిస్తూ 2016 ఏప్రిల్ 7న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కుటుంబరావును ట్రస్టు నిర్వహణ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ అదే 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పట్లో ట్రస్టు నిర్వహణకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలే ఉన్నారు. వీరి నియామకం జరిగిన రోజుల్లోనే దేవదాయ శాఖ అధికారులు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ట్రస్టు పేరిట 474.44 ఎకరాలుందని నిర్ధారించారు. ఏడాదికల్లా అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తేల్చడం గమనార్హం. -
సింహాచలం భూముల అక్రమాలపై నేడు నివేదిక
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల అన్యాక్రాంతం, మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి జరిగిన భూముల అక్రమాలపై విచారణ చేపట్టిన దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం నివేదికను సమర్పించనున్నారు. ఈ వ్యవహారంపై దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, ఉప కమిషనర్ పుష్పవర్దన్‌ల కమిటీ విచారణ చేపట్టి సింహాచలం, విజయనగరం ప్రాంతాల్లో పర్యటించింది. పంచగ్రామాలను సందర్శించి.. అక్కడ ప్రజల నుంచి వివరాలు సేకరించింది. విశాఖ దేవదాయ శాఖ ఉపకమిషనర్ కార్యాలయంలో సింహాచలం దేవస్థానం రికార్డులు, ఆస్తుల జాబితా ప్రాపర్టీ రిజిస్టర్లను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక రూపొందించింది. దీన్ని రాష్ట్ర దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావుకు శుక్రవారం సమర్పించనుంది. -
సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో అక్రమాలపై విచారణ పూర్తి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ భూముల్లో అక్రమాపై విచారణ పూర్తయినట్లు విచారణ కమిటీ బుధవారం తెలిపింది. రేపు(గురువారం) దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్న పేర్కొంది. సింహాచలం ఆలయ భూముల జాబితా నుంచి తొలగించిన భూముల జాబితాను నివేదికలో చేర్చినట్లు తెలిపింది. మాన్సాన్స్ ట్రస్ట్‌లో 150 ఎకరాల భూములు అమ్మకాలు, లీజుల వ్యవహారంపై అవకతవకలను నివేదికలో చేర్చినట్లు పేర్కొంది. మాన్సస్, సింహాచలం ఈవోలు, ముందు పని చేసిన అధికారులు నిర్లక్ష్యంపై పలు విషయాలను నివేదికలో చేర్చినట్లు విచారణ కమిటీ వెల్లడించింది. -
మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీళ్లు
సాక్షి, అమరావతి: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత తరఫున హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలయ్యాయి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. మొత్తం ఆరు అప్పీళ్లలో రెండు మాత్రమే మంగళవారం విచారణకు రావటాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సు«ధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మిగిలిన అప్పీళ్లు కూడా విచారణకు వచ్చేందుకు వీలుగా విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లింగ వివక్ష తగదని సుప్రీంకోర్టు తీర్పు... దేవదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ జడ్జి తీర్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. అంతేకాకుండా లింగ వివక్షను ప్రోత్సహించేలా ఉందని నివేదించింది. లింగం ఆధారంగా ఓ వ్యక్తి నియామకాన్ని ఖరారు చేయడం వివక్ష చూపడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ప్రభుత్వం అప్పీల్లో తెలిపింది. కుటుంబంలో పెద్దవారైన పురుషులు మాత్రమే మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఉండాలనడం లింగ వివక్ష కిందకే వస్తుందని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. వ్యవస్థాపక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలను తేల్చాల్సింది దేవదాయశాఖ ట్రిబ్యునల్ మాత్రమేనని స్పష్టం చేసింది. అశోక్ గజపతిరాజు ట్రిబ్యునల్‌కు వెళ్లకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించారని, అందువల్ల సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని అభ్యర్థించింది. టీడీపీ పిటిషన్లు.. మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయితను, మాన్సాస్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్వీ సునీత ప్రసాద్‌లను నియమిస్తూ గతేడాది ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ మూడు జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేత అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ వెంకటరమణ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం, సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని తీర్పు ఇచ్చారు. -
సింహాచలం భూముల అక్రమాలపై విచారణకు కమిటీ
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ)/విజయనగరం టౌన్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయానికి చెందిన సుమారు రూ.12 వేల కోట్లు విలువ చేసే 840 ఎకరాల భూములను ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి తొలగించిన అంశంపై విచారణకు దేవదాయ శాఖ ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013–19 మధ్య ఆలయ భూముల ఆస్తుల రిజిస్టర్లలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపేందుకు దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్–1 చంద్రకుమార్, విశాఖపట్నం డివిజన్ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో మాన్సాస్ ట్రస్టు భూముల్లో జరిగిన అక్రమాలపైన కూడా ఈ ఇద్దరు అధికారులు విచారణ జరిపి ఈ నెల 15లోగా ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. సింహాచలం ఆలయ, మాన్సాస్ ట్రస్టు ఈవోలు విచారణ కమిటీ ముందు రికార్డులను అందుబాటులో ఉంచాలన్నారు. విచారణలో భాగంగా కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించేటప్పుడు ఆయా అధికారులు హాజరు కావాలని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్ సింహాచలం దేవస్థానానికి 2010లో 11,118 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2016 నాటికి ఇందులో 10,278 ఎకరాలే మిగిలాయి. 840 ఎకరాల భూములను ఆలయ రికార్డుల నుంచి తప్పించినట్లు దేవదాయ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణలో భాగంగా జియోఫెన్సింగ్ ప్రక్రియ చేపడుతున్న క్రమంలో ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం జిల్లా అధికారులతో విచారణ జరిపించగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. 2016లో అప్పటి సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన కె.రామచంద్రమోహన్ ఆలయ భూరికార్డులను ట్యాంపరింగ్ చేసి వందల ఎకరాలను రికార్డుల నుంచి తొలగించినట్లు గుర్తించారు. అలాగే ఆయన మాన్సాస్ ట్రస్ట్ ఈవో (ఎఫ్ఏసీ)గా ఉన్న సమయంలో పలు భూ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించి ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తాజాగా ఈ వ్యవహారాలన్నింటిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. మాన్సాస్‌లో ప్రారంభమైన ఆడిటింగ్ మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు, భూవ్యవహారాలపై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. గత 16 ఏళ్లుగా ట్రస్టులో ఆడిటింగ్ జరగకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో ప్రభుత్వం ట్రస్ట్ వ్యవహారాలతోపాటు భూములపై కూడా పూర్తి స్థాయిలో ఆడిటింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు మాన్సాస్ ట్రస్ట్ రికార్డులు, భూముల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. విజయనగరం జిల్లా ఆడిట్ అధికారి డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో అధికారుల బృందం కోటలో ఉన్న ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సోమవారం రికార్డులను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004 నుంచి మాన్సాస్ ట్రస్ట్ ఆడిటింగ్ జరగలేదన్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా ఏటా ఆడిటింగ్ చేసేందుకు నోటీసులిస్తున్నా ట్రస్ట్ పెద్దలు సహకరించలేదని చెప్పారు. ఇప్పటికీ దేవాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఎటువంటి పత్రాలు తమకు అందజేయలేదని స్పష్టం చేశారు. -
మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్