సాక్షి, విశాఖపట్నం: ‘మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌గజపతిరాజు’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని.. ఆయన జైలుకు వెళ్లడం తప్పదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘భూకబ్జా వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా స్టే తెచ్చుకోగలిగారు. చేసిన తప్పులకు శిక్ష నుంచి మాత్రం తప్పుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని వదిలిపెట్టేది లేదని’’ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆనందయ్య మందు పంపిణీ
కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఫ్రంట్ లైన్ వర్కర్లకు ‘ఆనందయ్య మందు’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందయ్య మందు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందని చెప్పారు. తొలి దశలో 22వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించామని పేర్కొన్నారు. దేశంలోనే లేని విధంగా ఏపీలో కోవిడ్ కట్టడికి సీఎం చర్యలు చేపట్టారని విజయసాయిరెడ్డి అన్నారు.
చదవండి: లోకేష్ వ్యవహార శైలిపై చంద్రబాబు సిగ్గుపడాలి
ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment