ఆ భూములు ఏమయ్యాయి?: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ | MP Bellana Chandrasekhar Comments On Ashok Gajapathi Raju | Sakshi
Sakshi News home page

ఆ భూములు ఏమయ్యాయి?: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

Published Tue, Jun 29 2021 5:33 PM | Last Updated on Tue, Jun 29 2021 5:36 PM

MP Bellana Chandrasekhar Comments On Ashok Gajapathi Raju - Sakshi

సాక్షి, విజయనగరం: గజపతుల భూములు కాపాడుకోవడానికే మాన్సాన్‌ ట్రస్ట్‌ అంటూ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్‌ ట్రస్ట్‌కు 14 వేల ఎకరాలుంటే.. 8,200 ఎకరాలే చూపిస్తున్నారని.. మిగిలిన ఆ భూములు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మెడికల్‌ కాలేజ్‌కు వంద ఎకరాలు ఇస్తామని చెప్పారని.. ఆ భూములను రూ.100 కోట్లకు అమ్ముకున్నారని ఎంపీ బెల్లాన దుయ్యబట్టారు.

‘‘విజయనగరం రాజులు సంపాదించిన ఆస్తులు మొత్తం ఆ కాలంలో ప్రజలు కట్టిన కప్పం నుంచి సంపాదించినవే. రాజుల కష్టార్జితం కాదు. ఎన్నో దేవాలయాలకు ధర్మకర్తగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి ఒక్క దేవాలయాన్నయినా అభివృద్ధి చేసారా’’ అని బెల్లాన చంద్రశేఖర్‌ ప్రశ్నించారు.

చదవండి: చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని
దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement