Bellana Chandrasekhar
-
గోల్మాల్ ‘బాబు’.. ఈసీని నమ్మేదేలా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహస్యం పాలు అయినట్టేనా?. ఎన్నికల్లో రెఫరీగా ఉండి నిక్కచ్చిగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల ముఖ్య అధికారి ఒక రాజకీయ పార్టీతో కుమ్మకై తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు అన్న విషయం రాను రాను బలపడుతోందా?. తెలుగు దేశం, జనసేన, బీజేపీ.. కూటమికి శాసనసభ, లోకసభ ఎన్నికల్లో అసాధరణమైన సంఖ్యలో సీట్లు, ఓట్లు వచ్చిన తీరు చూసి అంతా బిత్తరపోయారు.మొదట ఏమోలే! టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లు ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు పనిచేశాయని భావించారు. కానీ, ఆ తర్వాత వెల్లడైన అనేక విషయాలు దిగ్భాంత్రి కలిగించాయి. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగినట్లు చూపడం, వైఎస్సార్సీపీ బలమైన చోట్ల అసలు ఓట్లు రాకపోవడం, పలువురు తాము వైఎస్సార్సీపీ ఓట్లు వేశామని, అయినా తమ బూత్‌లో ఇంత తక్కువ ఓట్లు ఎలా నమోదు అవుతాయని సందేహాలు వ్యక్తం చేయడం వంటివి జరిగాయి. పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓటింగ్ శాతం ఏకంగా 12.5 శాతం పెరగడాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘాలు తప్పుబట్టాయి.ఇద్దరు ముగ్గురు వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఈ ఓట్లు, మెజార్టీలు, ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ పోలింగ్ నాటి కంటే కౌంటింగ్ నాటికి పెరిగిన తీరుపై అనుమానాలు వచ్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా నిబంధనల ప్రకారం నిర్ధిష్ట ఫీజును కూడా చెల్లించి రీ-వెరిఫికేషన్ కోరారు. అంటే దాని ప్రకారం ఈవీఎంలో ఆయా రాజకీయ పక్షాలకు నమోదైన ఓట్లు, వీవీప్యాట్ స్లిప్‌లలో రికార్డు అయిన ఓట్లకు సరిపోల్చడం అన్నమాట. ఈ రెండు మ్యాచ్ అయితే ఈవీఎంలపై ఎవరికీ అనుమానం రాదు. ఎన్నికల సంఘం తరపున పనిచేసిన జిల్లా అధికారులు కొందరు దీనిపై ప్రవర్తించిన తీరు, ఎన్నికల ముఖ్య అధికారి మీనా అప్పట్లో హడావుడిగా ఇచ్చిన అదేశాలు, ఈవీఎంలో డేటాను తొలగించారు అన్న సమాచారం, వీవీప్యాట్ స్లిప్‌లను బర్న్ చేశారు అన్న విషయం నిర్ధారణ అవ్వడంతో ఏపీలో కూటమి గెలుపులో ఈవీఎంల హ్యాకింగ్, టాంపరింగ్ వంటి అక్రమాలు జరిగి ఉండవచ్చన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.ఈ విమర్శలపై ఎన్నికల సంఘం నిజాయితీగా స్పందించడం లేదని స్పష్టం అవుతోంది. ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్ధి బొత్స అప్పల నర్సయ్యలు కౌంటింగ్ జరిగిన కొద్ది రోజులకే రీ-వెరిఫికేషన్ కోరారు. దాన్ని గమనించారో మరి ఏదో కారణంతోనో, నలబైదు రోజుల పాటు ఉంచాల్సిన వీవీప్యాట్ స్లిప్‌లను బర్న్ చేయాలంటూ ఎన్నికల ఉన్నతాధికారి సర్క్యూలర్ జారీ చేసారు. ఇంకా ఎవరైనా ఆ స్లిప్‌లను బర్న్ చేయాకపోతే వెంటనే చేయాలని అదేశించారు. తొలుత ఆ సంగతి తెలియలేదు కానీ, ఒంగోలు, విజయనగరంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు పట్టుబట్టడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి.మొదట ఫిర్యాదులు విత్‌డ్రా చేసుకోవాలని కోరుతూ వీరిపై ఒత్తిడి తేవడమే అనుమానాలకు తావు ఇచ్చింది. వారు తలోగ్గకపోవడంతో రీ-వెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్‌ను తెరపైకి తెచ్చారు. దీనిపై బాలినేని అభ్యంతరం చెప్పి హైకోర్టుకు వెలితే దీనిపై అక్కడ ఇప్పటికి తీర్పు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఈ వ్యవహరంలో న్యాయవ్యవస్థ సైతం దురదృష్టవశాత్తు తాత్సార్యం చేస్తోంది. బాలినేని దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లడానికి సిద్దపడ్డారు. కానీ, హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు. దీనితో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక విజయనగరం జిల్లాలో ఈవీఎం బాక్స్ తాళం కోసం గంటల తరబడి వెతుకులాట అశ్చర్యం కలిగిస్తోంది.ఆ తర్వాత ఇక్కడ సైతం ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్‌ల వెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్ డ్రామాను అధికారులు ఎంచుకోవడం, అది ఎన్నికల సంఘం అదేశాల మేరేకే అని చెప్పడం కచ్చితంగా ఈ ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందన్న భావనకు అస్కారం ఇచ్చింది. పైగా ఈవీఎంలో డేటా తీసివేశామని, స్లిప్‌లను బర్న్ చేశామని, ఈసీ సూచన మేరకు చేశామని అధికారులు చెప్పడంతో ఏపీ ప్రజలు ఎన్నికల్లో దారుణమైన మోసం జరిగిందన్న అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే ఇది ఈవీఎంల ప్రభుత్వం అన్న వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. 2009లో ఈవీఎంలను వ్యతిరేకించి హ్యాక్ అవుతాయని ప్రచారం చేసిన చంద్రబాబు 2019లో ఓటమి తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. అలాగే మరి కొందరు కూడా సుప్రీం కోర్టును అశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు వీవీప్యాట్ల వ్యవస్థను తెచ్చింది.2024 ఎన్నికల తర్వాత ఇంత గందగోళం జరుగుతున్నా, టాంపరింగ్ అరోపణలు వస్తున్నా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు ఎవరు నోరు మెదపడం లేదు. ఇది కూడా జనంలో అనుమానం రేకెత్తించింది. విజయనగరంలో పోలింగ్‌నాడు ఈవీఎం బ్యాటరీలో 50 శాతం చార్జింగ్ ఉన్నట్టు సీసీ కేమేరాల్లో రికార్డు అయితే 21 రోజుల తర్వాత జరిగిన కౌంటింగ్‌లో బ్యాటరీ శాతం 99 శాతం చూపించడం చిత్రంగా ఉంది. దీనిపై పరిశీలన కోరితే బెల్ ఇంజనీరు ఏమో ఎన్నికల సంఘం ఇచ్చిన స్టాండర్డ్ అపరేటింగ్ ప్రోసిజర్స్లో బ్యాటరీ ప్రస్తావన లేదని తప్పించుకుంటున్నారు. ఈవీఎం డేటాను వీవీప్యాట్ స్లిప్ లతో లెక్కవేసి మ్యాచ్ చేసి చూపాలని అడిగితే ఆ డేటా కాని, స్లిప్‌లు కాని లేవని చేతులెత్తేశారు. ఇవి అన్ని చూస్తే ఏమనిపిస్తుంది. కచ్చితంగా ఎన్నికల సంఘం అనండి, ఎన్నికల నిర్వహణలో ముఖ్య అధికారులు అనండి, కూటమి నేతలతో కుమ్మక్కు అయ్యారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది.సింపుల్‌గా ఈవీఎంలో ఉన్న డేటాను, వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కవేస్తే సరిపోయే కేసును ఎన్నికల సంఘం ఇంత జఠిలంగా మార్చి అసలే మొత్తం డేటా, స్లిప్‌లు లేకుండా చేయడం దుర్మార్గం. గతంలో బ్యాలెట్ పేపర్స్ వ్యవస్థ ఉండేది. దాని వల్ల పోలింగ్‌లో గాని, కౌంటింగ్‌లో గాని జాప్యం జరుగుతుందని, కొందరు రిగ్గింగ్‌లకు పాల్పడుతున్నారని కౌంటింగ్‌లో అక్రమాలు చేస్తున్నారని భావించి ఈవీఎంల వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొదటి రోజుల్లో ఈవీఎంలపై పెద్దగా అనుమానాలు రాలేదు. కానీ, ఆ తర్వాత కాలంలో సాంకేతిక పరిజ్ఢానం పెరగడం, హ్యాకింగ్ వ్యవస్థ రావడం, సైబర్ నేరగాళ్ల గురించి వినడం, ట్యాంపరింగ్‌కు అవకాశం వంటివాటి నేపధ్యంలో సందేహాలు వచ్చినా, ఎన్నికల సంఘం ఇలా ఎందుకు చేస్తుందిలే అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల అధికారులు న్యాయబద్దంగా లేకుండా ఏపీలో టీడీపీ కూటమికి కొమ్ము కాయడం, చివరకు ఈవీఎంలో డేటా లేకుండా చేసినట్లు బయటపడడంతో ఇప్పుడు ప్రజల్లో సందేహాలు కాకుండా అక్రమాలపై ఒక నిర్ధారణ ఏర్పడింది.లక్షల కిలోమీటర్ల దూరంలోని అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్‌ను టెక్నాలజీ ద్వారా భూమి మీద నుంచి మ్యానేజ్ చేస్తున్నప్పుడు.. నేల మీదే ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేయడం పెద్ద కష్టమా అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యనించారు. టీడీపీ జనసేనలు బీజేపీతో పోత్తు పెట్టుకోవడం, కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రావడం లేదన్న సర్వేలు వెలువడడంతో ఉన్నత స్థాయిలోనే ఈ అక్రమాలకు బీజం పడిందన్న సందేహలు వ్యక్తం అవతున్నాయి. ఇండియా కూటమి పక్షాలు, ఈవీఎంల అక్రమాలకు సంబంధించి బీజేపీపై ఆరోపణలు చేశాయి. దానికి తగ్గట్టుగా ఆంధ్ర, ఒడిశాలలో అశ్చర్యకరమైన రీతిలో ఫలితాలు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఈ ఇద్దరు ముగ్గురు అయినా ఈపాటి ప్రయత్నం చేయకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదామో! మళ్లీ బాలెట్ పత్రాల పద్దతే బెటర్ అన్న భావన ఏర్పడుతోంది.గతంలో సీసీటీవీలు వంటివి లేకపోవడం వల్ల రిగ్గింగులకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా పర్యవేక్షించే సిస్టమ్స్ రావడంతో ఈ రిగ్గింగులను అరికట్టవచ్చు. బ్యాలెట్ పత్రాల సమయంలో జరిగిన అక్రమాల కన్నా, ఈవీఎంల ద్వారా జరిగే మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయన్న అబిప్రాయం ఏర్పడుతోంది. అమెరికా వంటి పెద్ద దేశాలలో సైతం బాలెట్ పత్రాలనే వాడుతున్నారు. భారతదేశంలో ఈవీఎంల వ్యవస్థ ద్వారా ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడింది.ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈవీఎంల టాంపరింగ్ చేయవచ్చని వ్యాఖ్యానించినప్పుడు, ఇండియాలో అది జరదని ఈసీ జవాబు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత పరిణామాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈసీ పారదర్శకంగా లేదనిపిస్తుంది. పన్నెండు శాతం ఓట్లు పెరగడం నుంచి డేటా తీసివేయడం, వీవీప్యాట్ స్లిప్‌ల బర్న్ వరకు వచ్చిన అభియోగాలపై ఎన్నికల కమిషన్ నోరు విప్పకపోవడం మరింతగా సంశయాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినవారే భక్షిస్తున్నారా అన్న ప్రశ్న ఆవేదన కలిగిస్తుంది. ఎప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై స్పందిస్తుందా? ఏమో చెప్పలేం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మా సందేహాలు ఈసీ నివృత్తి చేయలేదు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయనగరం: మా సందేహాలను ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాక్ పోలింగ్ రీ-వెరిఫికేషన్ అనేది మా ఫిర్యాదు అంశం కాదు. పోలింగ్ నాటి బాటరీని వెరిఫికేషన్ చేయమని కోరాం. దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ఈసీ ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు.ఫిర్యాదు చేసిన ఈవీఎంలో డేటాను తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారు. విచారణలో వుండగా ఈవీఎం డేటాను డిలీట్ చేయడం నేరం. కోర్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఈసీ తీరుపై మేం కోర్టుకు న్యాయం కోసం వెళ్తాం. దేశమంతా ఈవీఎంలు టెంపర్ జరిగాయని అనుమానిస్తుంది. ఈ అనుమానాలను బీజేపీ ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య డిమాండ్ చేశారు.కాగా, విజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.. ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్.. ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామనన్నారు. తమ దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదని.. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య ప్రశ్నించారు. ఈసీ, జిల్లా అధికారుల తీరుపై అనుమానాలు మరింత బలపడాయి. ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను జిల్లా యంత్రాంగం తప్పు దారి పట్టిస్తోంది. కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్లిపోయారు. -
నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
-
విజయనగరం: నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
Updatesవిజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందిఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్మా దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదు. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య.ఈసీ,జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు.ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను తప్పు దారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం.కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్మాక్ పోలింగ్‌కు అంగీకరించని వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుజిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చిన ఆర్డీవో సూర్యకళవెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రారంభం అయింది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ హాజరయ్యారు.నెల్లిమర్ల నియోజకవర్గం కొండ గుంపాం, బొబ్బిలి నియోజక వర్గం కోమటపల్లి ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బాటరీ స్టేటస్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ వెరిఫికేషన్‌ను చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.ఈవీఎం బ్యాటరీల్లో గోల్ మాల్ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతినగరం బూత్ నంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50 శాతం.. కౌంటింగ్ నాడు 99 శాతం ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తరువాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99 శాతం చార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు.దత్తిరాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80 శాతానికి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరచిన తాళాలను అధికారులు పోగొట్టారు. మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజీని అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చదవండి: ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ? -
పవన్ పై విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ ఫైర్
-
కేఏ పాల్కి పవన్ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదు: ఎంపీ చంద్రశేఖర్
సాక్షి, విజయనగరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరు యువతను పెడదోవ పట్టించేటట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. 651 లే ఔట్లలో నిర్మించిన 79వేల ఇళ్లను పరిశీలించారు. ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. రాజకీయాల్లో కేఏ పాల్కి పవన్ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదని మండిపడ్డారు. ఇవాళ పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి నా మీద కేసులు ఉన్నాయి. మీ మీద కేసులు వచ్చినా పోరాడండి అంటూ యువతను రెచ్చగొడుతున్నారు. ఆయనను సినిమా నటుడిగా ప్రజలు గౌరవిస్తారు కానీ, ఓట్లు వేయరు అనే సంగతి గుర్తించాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించామన్నారు. పైసా అవినీతి లేకుండా టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. చదవండి: (విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్‌ఫ్లాప్) -
విజయనగరం ఎంపీ చంద్రశేఖర్‌కు లోక్‌సభ స్పీకర్ ప్రశంసలు
సాక్షి, చీపురుపల్లి: కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండగా ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితుల నేపథ్యంలో విజయనగరం పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అందించిన సేవలు చాలా గొప్పవని లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాష్‌బిర్లా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాష్‌బిర్లా నుంచి వచ్చిన లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. కరోనా వైరస్ మొదటి, రెండవ, మూడవ సమయంలో నిత్యం ఆస్పత్రులను సందర్శించి, ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పిస్తూ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విలువైన సేవలు అందించినట్లు లోక్‌సభ స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఎంపీ నిధులు రూ.30 లక్షలు వెచ్చించి జిల్లా కేంద్రాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో ఎంతోమందికి మేలు జరిగిందన్నారు. ప్రజలకు అండగా నిలవడం మా బాధ్యత ఇదే విషయమై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతున్న సమయంలో వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్నామని తెలిపారు. చదవండి: ఏపీ: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి -
నగరానికి ‘సిరి’మాను
సాక్షి, డెంకాడ: మేళతాళాలు.. పైడితల్లి నామస్మరణ.. దీక్షధారుల జయజయధ్వానాలు.. పసుపు నీళ్లతో మహిళా భక్తుల చల్లదనాల నడుమ నగరానికి ‘సిరి’మాను తరలింపు ప్రక్రియ శనివారం వైభవంగా సాగింది. డెంకాడ మండలంలోని డెంకాడ పంచాయతీ చందకపేట గ్రామంలోని చందకవారి కల్లాలు వద్ద సాక్షాత్కరించిన సిరిమాను చెట్టుకు ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు గొడ్డలితో తొలివేటు వేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైఎస్సార్సీపీ నాయకులు అవనాపు విజయ్, విక్రమ్, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, పైడితల్లి దేవస్థానం ఈఓ కిషోర్‌కుమార్, వైస్ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు, డెంకాడ సొసైటీ అధ్యక్షుడు రొంగలి కనక సింహాచలం, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సిరిమాను చెట్టుకు చెట్టుదాతలు చందక వారి కుటుంబ సభ్యులు పసుపుకుంకాలు సమర్పించారు. అనంతరం చెట్టు కొట్టే పనులు మొదలుపెట్టారు. నగరంలో సిరిమాను చెట్టు తరలింపు సందడి అమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి.. పైడితల్లి అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపైనా ఉండాలని, కోవిడ్ నుంచి రక్షించాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆకాంక్షించారు. డెంకాడ మండలంలో సిరిమాను చెట్టును తల్లి కోరడం భాగ్యంగా భావిస్తున్నామని చెప్పారు. సంప్రదాయాలను పాటిస్తూ పైడితల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. విజయనగరం కార్పొరేషన్ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రజలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని తల్లిని ప్రార్థించానన్నారు. -
పోలవరం నిధులొచ్చే వరకూ పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి పోలవరం నిధులొచ్చే వరకూ పార్లమెంట్లో పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టంచేశారు. ఏడేళ్లుగా పోలవరం నిరాదరణకు గురైందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత, పోచ బ్రహ్మానందరెడ్డి, గురుమూర్తి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. బెల్లాన మాట్లాడుతూ.. ప్రధాని, జలశక్తి మంత్రులకు సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నిసార్లు నిధుల కోసం విన్నవించినా కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల నుంచి వేల కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అలాగే, సవరించిన అంచనా మేరకు పునరావాసం, పరిహారం నిమిత్తం రూ.33వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం ఖర్చుచేసిన రూ.2వేల కోట్లకు పైగా కూడా విడుదల చేయలేదన్నారు. గతంలో చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొంటూ రైతుల ప్రయోజనాలు విస్మరించారని ఆరోపించారు. టీడీపీ ముగ్గురు ఎంపీలు వైఎస్సార్సీపీని విమర్శించడం తప్ప ఏ రోజూ కూడా బీజేపీని ప్రశ్నించడం లేదన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పోలవరం నిధుల కోసం సభలో ఆందోళన చేస్తామన్నారు. కేంద్రం సకాలంలో విడుదల చేస్తే ప్రాజెక్టు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పూర్తవుతుందని బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. సవరించిన అంచనాలపై తాత్సారం ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. ఏపీ విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తగిన శ్రద్ధ లేకపోవడంవల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయన్నారు. సాంకేతిక కమిటీ ఆమోదించినా సవరించిన అంచనాలపై కేంద్రం ముందుకెళ్లడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలన్నారు. కార్యాలయం తరలించడానికే ఇంతకాలం పడుతోందంటే ప్రాజెక్టుపై కేంద్రానికున్న చిత్తశుద్ధి అర్ధంచేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుకు తగిన నిధులు వెంటనే కేటాయించాలని ఆమె డిమాండు చేశారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. నిధులిచ్చే వరకూ తమ పార్టీ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. నిధులు, విభజన హామీలపై సభలో రోజూ పోరాడతామని ఆయన తెలిపారు. -
‘మాన్సాస్’ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా!
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్‌గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్‌గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్‌కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు. -
‘మాన్సాస్’ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా!
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్‌గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్‌గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్‌కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు. -
ఆ భూములు ఏమయ్యాయి?: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
సాక్షి, విజయనగరం: గజపతుల భూములు కాపాడుకోవడానికే మాన్సాన్ ట్రస్ట్ అంటూ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్ట్‌కు 14 వేల ఎకరాలుంటే.. 8,200 ఎకరాలే చూపిస్తున్నారని.. మిగిలిన ఆ భూములు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మెడికల్ కాలేజ్‌కు వంద ఎకరాలు ఇస్తామని చెప్పారని.. ఆ భూములను రూ.100 కోట్లకు అమ్ముకున్నారని ఎంపీ బెల్లాన దుయ్యబట్టారు. ‘‘విజయనగరం రాజులు సంపాదించిన ఆస్తులు మొత్తం ఆ కాలంలో ప్రజలు కట్టిన కప్పం నుంచి సంపాదించినవే. రాజుల కష్టార్జితం కాదు. ఎన్నో దేవాలయాలకు ధర్మకర్తగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి ఒక్క దేవాలయాన్నయినా అభివృద్ధి చేసారా’’ అని బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు -
ప్రకృతి సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ..
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూమిని పరిరక్షించుకోవడం మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శ్రీదేవి దంపతులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని నాగంపేట సమీపంలోని తమ పొలంలో గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు. చెరువు నీటిని వినియోగించి ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపిసిఎన్‌ఎఫ్) విభాగం అధికారులు, సిబ్బంది సూచనల ప్రకారం 12 ఎకరాల్లో వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. జాతీయ వ్యవసాయ కమిటీలో సభ్యులైన ఎంపీ చంద్రశేఖర్ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తున్నారు. భూసార వృద్ధికి నవధాన్యాలను సాగు చేసి కలియదున్నుతున్నారు. ఘనజీవామృతం వేసి లైన్ సోయింగ్ చేస్తున్నారు. ద్రవ జీవామృతం ప్రతి 15 రోజులకు ఇస్తున్నారు. ఆవు పేడ, మూత్రం ఇంగువతో తయారైన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వీటితోపాటు మీనామృతం, కోడుగుడ్ల ద్రావణం, పుల్లటి మజ్జిగ, సప్తధాన్యాంకుర కషాయం, బ్రహ్మాస్త్రం.. అవసరం మేరకు పిచికారీ చేయటం వంటి నియమాలు పాటిస్తూ సాగు చేస్తున్నారు. చంద్రశేఖర్ సతీమణి శ్రీదేవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి రైతు తోనూ ప్రకృతి వ్యవసాయం చేయించాలని ఎంపీ చంద్రశేఖర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడెకరాల్లో బ్లాక్ రైస్, రెడ్ రైస్‌తో పాటు ఐదెకరాల్లో సజ్జలు, కొర్రలు, రాగులను సాగు చేయిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు తాను పండించిన విత్తనాలను అందించనున్నారు. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం, ఇన్పుట్స్: మరిపి సతీష్‌కుమార్, చీపురుపల్లి టీవీలో సీఎం మాటలు విని.. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం మాది. మాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుండగా ఓ రోజు టీవీలో చూసి, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఏపీసిఎన్ఎఫ్ అధికారుల సహకారంతో 12 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి పండించాం. 18 రకాల నవధాన్యాలను కలిపి దుక్కి దున్ని పొలంలో చల్లాం. 45 రోజులు పెరిగిన తరువాత భూమిలో కలియదున్నించాం. ఎకరాకు ఒక డ్రమ్ము ఏర్పాటు చేసి 200 లీటర్ల జీవామృతం పొలంలో చల్లిస్తున్నాం. అలాగే ఎకరాకు 12 కోడిగుడ్లు, నాలుగు రకాల నూనెలతో తయారు చేసి పిచికారీ చేయించాం. 11 రకాల ధాన్యం మూడు రోజులు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత ద్రావణాన్ని మరోసారి స్ప్రే చేయించాం. వరి పంటకు ఎలాంటి తెగుళ్లు రాలేదు. ఈ ఏడాది చిరుధాన్యాలను విత్తనాల కోసం పండిస్తున్నాం. – బెల్లాన శ్రీదేవి, ఎంపీ చంద్రశేఖర్ సతీమణి -
టీడీపీది దొంగ-దొంగ అన్నట్లుంది
సాక్షి, ఢిల్లీ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ ఓర్చుకోలేక పోతుందని వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పై కూడా టీడీపీ కోర్టు కెళ్లి స్టే తీసుకొచ్చిందని, ఇల్లు లేని వారికి తీవ్ర అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. అమరావతిలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని సిట్ తేల్చిందని, సుప్రీం కోర్టు జడ్జిల కూతుళ్ళ పైనా అభియోగాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకే అందుకే కోర్టు ద్వారా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారని తెలిపారు. కావాలనే దేవాలయాలపై ప్రతిపక్ష నాయకులు దాడులు చేస్తున్నారు.. అయితే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరుస్తున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. (విగ్రహాల ప్రతిష్ఠ కేసు: ముగ్గురి అరెస్ట్) -
‘కాపు’ కాసిన దేవుడు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చెప్పాడంటే..చేస్తాడంతే.. గత ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కాపునేస్తం పథకం అమలు ద్వారా నెరవేర్చారు. కాపునేస్తం పథకాన్ని రాజధానిలోని తన క్యాంపు కార్యాలయంనుంచి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తదితరులు జిల్లాలోని కాపు నేస్తం లబ్ధిదారులు 3,720 మందికి రూ.5.58 కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులందరికీ వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందజేస్తున్న ఘనత తన ప్రభుత్వానిదేనని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. కాపునేస్తం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడు తూ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులను అభినందించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ పథకం కింద జిల్లాలో అత్యధికంగా 1186 మంది లబ్ధిదారులు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందినవారే ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాను తాను కలిశానని భోగాపురంలో రూ.1.50 కోట్లతో కాపు సామాజిక భవనం నిర్మించేందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే నెరవెర్చారని పేర్కొ న్నారు. కరోనా నేపథ్యంలో చేనేత కారి్మకులు, ఆటో డ్రైవర్లకు నాలుగు నెలల ముందే సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదని, చిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ దానిని ఆచరించి చూపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగరాణి, బీసీ సంక్షేమాధికారి డి.కీర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబి్ధదారులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విపత్కర తరుణంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాపునేస్తం పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఊహించలేదు.. కాపు(తెలగ) కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వెనుకబడిన తెలగ కులస్థులకు ఆరి్ధక సహాయం చేయడం గొప్ప ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం మమ్ము గుర్తించలేదు. గ్రామవలంటీర్లు ఇంటివద్దకే వచ్చి పేర్లు నమోదుచేసి ఈ పథకం వర్తించేలా చేశారు. – చెలమల తవిటమ్మ, రావుపల్లి, గరుగుబిల్లి మండలం కాపు నేస్తం ఒక వరం కాపు నేస్తం మాకు వరం. ఇంతవరకు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. జగనన్న ఇచ్చిన ఈ భరోసాతో మాకు కొంత ఊరట కలిగింది. చిరువ్యాపారం చేసుకున్న వారికి ఇటువంటి ఆర్థిక సాయం ఎంతో ఉపకరిస్తుంది. ఎటువంటి రాజకీయాలు లేకుండా అర్హులందరికీ పథకం వర్తింపచేయడం గొప్ప విశేషం. – జి.మణి, బలిజిపేట -
‘పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరింది’
సాక్షి, తాడేపల్లి : పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ నేడు సఫలీకృతమైందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన 20 మత్స్యకారులు సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 22 మంది మత్స్యకారులు దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ కోస్ట్గార్డ్స్కి చిక్కారని గుర్తు చేశారు. 22 మందిలో 20 మందిని తీసుకోచ్చామని... మిగిలిన ఇద్దరు కూడా త్వరలోవస్తారని తెలిపారు. మత్స్యకారులు వాఘా బోర్డర్ వద్దకు రాగానే ఆనందం వెల్లివిరిసిందని చెప్పారు. నేడు వారందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసి కృతజ్ఞతలు చెప్పారని తెలిపారు. ‘ఎందుకు గుజరాత్‌కు వెళ్లాల్సివచ్చిందో సీఎం మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. ఫిషింగ్ హార్బర్, జెట్టీలు లేకపోవడంతోనే గుజరాత్ వెళ్లామని వారు చెప్పడంతో.. జెట్టీల నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాలు బాగా లేకపోయినా సీఎం చొరవ చూపారు. ఇది జీవితంలో తాము మర్చిపోలేని సంఘటన అని మత్స్యకారులు సీఎం జగన్‌తో చెప్పారు. రాష్ట్రంలోని మేజర్, మైనర్ జెట్టీలను అందుబాటులోకి తెస్తాం’అని మంత్రి మోపిదేవి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మత్స్యకారులు విడుదలయ్యారని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రతియేటా 50 వేల మంది శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి ఫిషింగ్ చేస్తుంటారని ఆయన తెలిపారు. వారికి ఇక్కడే ఉపాధి చూపేందుకు జెట్టీల నిర్మాణానికి కృషి చేస్తామని సీఎం హామినిచ్చారని గుర్తు చేశారు. మత్స్యకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ. 5 లక్షల సాయం అందించారని ఎంపీ తెలిపారు. -
విడుదలైన జాలర్లకు సాయం
గన్నవరం: పధ్నాలుగు నెలలు పాకిస్తాన్ చెరలో ఉండి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర జాలర్లలో మానసికంగా ఆత్మస్థైర్యం నింపేందుకు, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సీఎం వైఎస్ జగన్ సుముఖంగా ఉన్నారని.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వెల్లడించారు. సీఎం కృషి ఫలితంగానే 20 మంది పేద మత్స్యకారులకు విముక్తి లభించి స్వస్థలాలకు చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. పాకిస్తాన్ నుంచి విడుదలైన వీరిని భారత్–పాక్ సరిహద్దు ప్రాంతమైన వాఘా వద్ద నుంచి వెంటపెట్టుకుని హైదరాబాద్ వచ్చిన మంత్రి.. అక్కడి నుంచి అధికారుల బృందంతో కలిసి మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 నెలలుగా జైలుశిక్ష అనుభవిస్తున్న 22 మంది మత్స్యకారుల్లో 20 మందిని ఆ దేశ సైన్యం భారత భద్రతా దళాలకు అప్పగించిందని చెప్పారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో మత్స్యకారులతో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరి పత్రాల పరిశీలనలో జాప్యం కారణంగా వారు విడుదల కాలేదని ఆయన తెలిపారు. వీరు కూడా పది రోజుల్లో విడుదలవుతారని చెప్పారు. విడుదలైనవారంతా ముందు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు తెలిపారు. కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ దగ్గరుండి మత్స్యకారులను విమానం ఎక్కించారు. -
చారిత్రాత్మక తప్పిదాన్ని సరి చేస్తే విమర్శలా..!
సాక్షి, విజయనగరం : స్వాంతత్య్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన చారిత్రాత్మక తప్పిదాన్ని సవరించి దేశాభివృద్ధి ఆటంకాలను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ఆరోపించారు. కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై బీజేపీ దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘జనజాగరణ’ సభల నిర్వహణలో భాగంగా పట్టణంలోని స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీరుపై 72 సంవత్సరాల క్రితం విధించిన చారిత్రాత్మక తప్పిదం 370, 35ఏ చట్టమని దాన్ని రద్దు చేస్తే అక్కడ ప్రాంతం పూర్తిగా దేశం పరిధిలోకి వస్తుందని గుర్తించి ప్రధాని మోదీ రద్దు చేసారని వివరించారు. ఈ చట్టం రద్దుతో సంపూర్ణ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లయిందని, అయితే దాన్ని విపక్షాలు జీర్ణించుకోవడం లేదని ఆరోపించారు. ఎంపీ బెల్లాన వినతి విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో ఆదుకోవాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోరారు. సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి సహాయన్ని కోరారు. ప్రత్యేక హోదా హక్కును అమలు చేయాలని కోరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ముగ్గురు ప్రముఖుల ఇళ్లకు కేంద్రమంత్రి వెళ్లి దేశ పరిస్థితులపై చర్చించారు. చెవికి సంబంధించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మిషన్లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి సూకల మధుకర్జీ, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ప్రధాన కార్యదర్శి సత్తి అచ్చిరెడ్డి, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
టీడీపీ ఐదేళ్లపాలనలో అంతా అవినీతి
-
నిరుద్యోగ యువతకు శఠగోపం
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ/రూరల్: జాబు కావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో ప్రచారం చేసుకుని అధికారం వచ్చాక.. తన కొడుక్కి మంత్రి ఉద్యోగం ఇప్పించుకుని నిరుద్యోగ యువతను నడిరోడ్డున పడేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తారో? సంక్షేమ రాజ్యం అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. వార్డు ఇన్చార్జి ఎస్.బంగారునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 18వ వార్డు లంకవీధి, 19వ వార్డు జొన్నగుడ్డి ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా జొన్నగుడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులు అయిదేళ్ల పాటు దోచుకున్న డబ్బుతో ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నిస్తారని, వాటికి లొంగకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సంక్షేమ పాలనను గెలిపించుకోవాలని కోరారు. బాబును నమ్మి మోసపోవద్దు బాబు మోసపూరిత హామీ రుణమాఫీ పథకం వట్టి మాయేనని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు ఘనుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. మండల పరిధిలోని కోరుకొండపాలెం గ్రామంలో తన తండ్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు మద్దతుగా శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ 2014లో డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తానని హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు వాటిని విస్మరించి మహిళలు, రైతులను మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నాలుగున్నరేళ్లు హామిని గాలికొదిలేశారన్నారు. జగన్మోహన్రెడ్డి వృద్ధులకు పింఛను రూ.2 వేలు చేస్తానంటే.. కాపీ కొట్టి రెండు నెలలుగా అందిస్తున్నాడన్నారు. మహిళలకు ఇస్తున్న పసుపు–కుంకుమ పచ్చి దగా అని మండిపడ్డారు. అయిదేళ్లుగా వడ్డీలేని రుణం ఇవ్వకుండా, వారు కట్టిన వడ్డీ డబ్బులే పసుపు– కుంకుమ కింద అందిస్తున్నాడన్నారు. చంద్రబాబు 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మరోసారి మోసపూరిత హామీలతో గద్దెనెక్కాలని చూస్తున్నా మహిళలు ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. 2004లో నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎంతో అభివద్ధి చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి, రాజన్న రాజ్యం వచ్చేందుకు మహిళలంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మహిళా నేతలు పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించండి విజయనగరం నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండే కోలగట్ల వీరభద్రస్వామికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన భార్య, మున్సిపల్ కౌన్సిలర్ కోలగట్ల వెంకటరమణి అభ్యర్థించారు. కోలగట్లకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం 2వ వార్డులోని కొత్తపేట ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2004 సంవత్సరంలో ఎమ్మెల్యే ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలన్నారు. అయిదేళ్ల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ఓటమి భయం
విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం పట్టణంలోని ఆరవ వార్డులో సీనియర్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. కొత్తపేట శుద్ధ వీధి ప్రాంతానికి వారు చేరుకోగానే ప్రజలు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా జై జగన్, జై బెల్లాన, జై కోలగట్ల నినాదాలతో వీధులన్నీ హోరెత్తాయి. ఆరో వార్డు పరిధిలో సుద్ద వీధి, పులిగడ్డ వారి వీధి, పద్మశాలి వీధి, కొత్తపేట, కుమ్మరి వీధి, కూరెళ్ళ వారి వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని, ఐదేళ్ల పాలనపై విసిగి వేసారి పోయారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ తమ ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఓటు వేసే ప్రజలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీ తనంగా ఉండాలన్నారు. తెలుగుదేశం పాలనలో లంచగొండితనం పేరుకుపోయిన ప్రస్తుత తరుణంలో రాజన్న రాజ్యం జగన్మోహన్రెడ్డి రూపంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రచార కార్యక్రమంలో బెల్లాన, కోలగట్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
క్రమశిక్షణతోనే విజయం తథ్యం
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: క్రమశిక్షణతో పనిచేస్తే వైఎస్సార్సీపీ విజయం తథ్యమనీ, దానికి బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు కీలకభూమిక పోషించాలని ఆ పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని సుజాత కన్వెన్షన్ హాల్లో మంగళవారం రాత్రి నిర్వహించిన పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించటంలో మీరంతా క్రియా శీలక పాత్ర పోషించాలన్నారు. ప్రస్తు తం ఎన్నికల విధానాలు పూర్తిగా మారిపోయాయని, ప్రతీ ఓటురును ప్రభావితం చేయాల్సిన అవసరం ఉం దన్నారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా ఓటర్లు ఎక్కడున్నదీ గుర్తించి ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకమని, జిల్లా కేంద్రంపై అందరి దృష్టి ఉంటుందన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించడం ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలగాలని పిలుపునిచ్చారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధిస్తామన్నారు. విజయనగరం పట్టణంలో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామన్నారు. భోగాపురంలో నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేసి జిల్లా వాసులకు ఉపాధి, ఉద్యోగావకావకాశాలు పెంపొందిస్తామన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లానను గెలిపించుకుని జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దామన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కరించటంతో పాటు సంక్షేమ పాలన అంటే ఏమిటో చూపిస్తామని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో పాటు పలువురు జిల్లా, మండల, పట్టణ నాయకులు, బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. -
ఇంకా వెనుకబడే ఉన్నాం...
♦ జిల్లాలో గిరిజన యూనివర్శిటీ, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి ♦తోటపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల సమస్య తీర్చాలి ♦వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో బెల్లాన చంద్రశేఖర్ విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఇంకా మా జిల్లా వెనుకబడే ఉంది. 1979లో జిల్లా ఏర్పాటు అయినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సమస్యలన్నీ తీర్చాలి’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న పార్టీ జాతీయ ప్లీనరీ వేదికపై జిల్లాకు సంబంధించి పలు అంశాలను శనివారం ఆయన ప్రస్తావించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలకు సంబంధించి ఆరు అంశాలపై తీర్మానం చేశారు. జిల్లా ప్లీనరీలో చేసి న తీర్మానాలను జాతీయ ప్లీనరీలో ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి తొలుత ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వర్శిటీకి తొలి ప్రాధాన్యం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని బెల్లాన కోరారు. జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంత వరకూ లేదనీ... 2004–2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వర్షాధారం మీద, చెరువుల మీద ఆధారపడ్డ రైతాంగానికి తోటపల్లి కాలువ, రామతీర్థసాగర్లకు నిధులు కేటాయించారని తోటపల్లి పనులు 90శాతం పూర్తి చేశారని కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లయినా మిగతా 10 శాతం పనులూ పూర్తికాలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చేయాలని కోరారు. జిల్లాలో 8 మండలాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని, వారికి వైద్యం అందుబాటులో లేదన్నారు. వీరికి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వచ్చేలా వైద్య కళాశాలను జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. హోదాతోనే భవిత ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందనీ... ప్రత్యేక హోదా వల్ల విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని, మూతపడిన పరిశ్రమలు తెరిపించే అవకాశం ఉంటుందని ప్లీనరీ దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు పరుస్తామనే హామీని అమలులోకి తీసుకు రావాలని కోరారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జిల్లాకు రావాల్సిన నిధులు తీసుకురావాలని తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పీడికరాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, సీనియర్ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్లీనరీలో పాల్గొన్నారు. -
విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా బెల్లాన
-
విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షునిగా బెల్లాన
కోలగట్లకు పీఏసీలో స్థానం సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కోలగట్ల వీరభద్రస్వామికి పార్టీ అత్యున్నత నిర్ణాయకమండలి అయిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. కోలగట్ల వ్యక్తిగత కారణాలతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను జగన్ ఆమోదించారని, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బెల్లానను ఆ స్థానంలో నియమించారని తెలిపారు.