జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా ఎం.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్ తదితరులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చెప్పాడంటే..చేస్తాడంతే.. గత ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కాపునేస్తం పథకం అమలు ద్వారా నెరవేర్చారు. కాపునేస్తం పథకాన్ని రాజధానిలోని తన క్యాంపు కార్యాలయంనుంచి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తదితరులు జిల్లాలోని కాపు నేస్తం లబ్ధిదారులు 3,720 మందికి రూ.5.58 కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిజమైన అర్హులందరికీ వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందజేస్తున్న ఘనత తన ప్రభుత్వానిదేనని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. కాపునేస్తం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడు తూ జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులను అభినందించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ పథకం కింద జిల్లాలో అత్యధికంగా 1186 మంది లబ్ధిదారులు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందినవారే ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాను తాను కలిశానని భోగాపురంలో రూ.1.50 కోట్లతో కాపు సామాజిక భవనం నిర్మించేందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే నెరవెర్చారని పేర్కొ న్నారు. కరోనా నేపథ్యంలో చేనేత కారి్మకులు, ఆటో డ్రైవర్లకు నాలుగు నెలల ముందే సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదని, చిన్న వయస్సులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ దానిని ఆచరించి చూపారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగరాణి, బీసీ సంక్షేమాధికారి డి.కీర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబి్ధదారులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విపత్కర తరుణంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాపునేస్తం పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఊహించలేదు..
కాపు(తెలగ) కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వెనుకబడిన తెలగ కులస్థులకు ఆరి్ధక సహాయం చేయడం గొప్ప ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం మమ్ము గుర్తించలేదు. గ్రామవలంటీర్లు ఇంటివద్దకే వచ్చి పేర్లు నమోదుచేసి ఈ పథకం వర్తించేలా చేశారు.
– చెలమల తవిటమ్మ, రావుపల్లి, గరుగుబిల్లి మండలం
కాపు నేస్తం ఒక వరం
కాపు నేస్తం మాకు వరం. ఇంతవరకు వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. జగనన్న ఇచ్చిన ఈ భరోసాతో మాకు కొంత ఊరట కలిగింది. చిరువ్యాపారం చేసుకున్న వారికి ఇటువంటి ఆర్థిక సాయం ఎంతో ఉపకరిస్తుంది. ఎటువంటి రాజకీయాలు లేకుండా అర్హులందరికీ పథకం వర్తింపచేయడం గొప్ప విశేషం.
– జి.మణి, బలిజిపేట
Comments
Please login to add a commentAdd a comment