ప్రశ్నిస్తా అన్నవాడు బాబును ఎందుకు ప్రశ్నించడు: సీఎం జగన్‌ | CM YS Jagan Strong Comments On Chandrababu Arrest And Pawan Kalyan At Nidadavolu Meeting - Sakshi
Sakshi News home page

ఆధారాలతో అడ్డంగా దొరికినా.. నిస్సిగ్గుగా బాబుకు సపోర్టు చేస్తారు: సీఎం జగన్‌

Published Sat, Sep 16 2023 12:24 PM | Last Updated on Sat, Sep 16 2023 6:57 PM

CM Jagan Strong Comments On Chandrababu Arrest At Nidadavolu Meeting - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా బాబు మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగా చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

చట్టం ఎవరికైనా ఒక్కటే
ఈ మేరకు సీఎం జగన్‌ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని అందిచే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవలే అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్టయ్యారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇన్ని అక్రమాలు, దోపిడీలు చేసిన బాబును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని అన్నారు. 

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన బాబు
45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. కేసులో ఆడియో టేపుల్లో బ్లాక్‌మనీ పంచుతూ పట్టుబడ్డారని ప్రస్తావించారు.  ఆ ఆడియో బాబుదే అని ఫోరెన్సిక్‌ కూడా నిర్ధారించిందని.. కానీ బాబు మాత్రం అది తనది కాదని బుకాయించారని గుర్తుచేశారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు. 

‘ఫేక్‌ అగ్రిమెంట్‌తో లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించి బాబు స్కాం చేశారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు. స్కిల్‌ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సీఐడీ నిర్ధారించింది. డబ్బును డొల్ల కెంపీలకు ఎలా మళ్లీంచారన్నది ఈడీనే బయటపెట్టింది. చంద్రబాబు పీఏ చాటింగ్‌లను ఐటీశాఖ బయటపెట్టింది. ఫేక్‌ అగ్రిమెంట్‌ దొంగలను ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్‌కు పంపింది. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని బాబు అంటున్నారు. 
చదవండి: కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్‌

ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు
ఈడీ అరెస్ట్‌ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు. కోర్టు రిమాండ్‌కు పంపితే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న పవన్‌ ప్రశ్నించడు. ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు. వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు, ములాఖత్‌లో మిలాఖత్‌ చేసుకొని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు. 

371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎటుపోయింది?
చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకా ఎవరిని అరెస్ట్‌ చేయాలి?. 371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎక్కడికిపోయింది. ఎవరి జేబుల్లోకి ఈ సొమ్మంతా పోయింది.  ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి’ అని సీఎం జగన్‌ నిడదవోలు సభలో వ్యాఖ్యానించారు.
చదవండి: స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement