YSR Kapu Nestham
-
అక్కచెల్లెమ్మలకు మరింత స్థిర ఆదాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మల సంక్షేమమే లక్ష్యంగా, వారు ప్రతి నెలా మరింత స్థిర ఆదాయం పొందడానికి గత ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాలను అమలు చేసింది. వచ్చే ఐదేళ్లు కూడా ఈ పథకాలను అమలు చేస్తామని తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ ప్రకటించింది.ఈ మూడు పథకాల ద్వారానే రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అన్ని సామాజికవర్గాలకు చెందిన దాదాపు 43 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ప్రయోజనం పొందారు. వీరిలో 18.37 లక్షల మంది ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకుంటూ కొత్తగా వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటుకు ముందుకొచ్చారు.మరికొంతమంది తమకు వచ్చిన శాశ్వత జీవనోపాధులను ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇప్పటికే ప్రతి నెలా రూ. 10 వేల దాకా స్థిర ఆదాయం పొందుతున్నారు. ఆయా పథకాలను మరో ఐదేళ్ల పాటు కొనసాగించడం ద్వారా ఇంకా లక్షలాది పేద కుటుంబాలు ప్రతి నెలా స్థిర ఆదాయం పొందుతాయని అధికార వర్గాలు, ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు.వైఎస్సార్ చేయూత (తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూ.1.50 లక్షల వరకు) ఈ ఐదేళ్లు 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.75 వేలు ఇచ్చింది. ఇలా ఇప్పటికే రూ.19,189 కోట్లు అందజేసింది. వచ్చే ఐదేళ్లూ ఇలా.. 45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా చేయూత కావచ్చు.. ఇలా ఉండేలా చేయూత పథకాన్ని కొనసాగిస్తారు. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.18,750 చొప్పన మరో రూ.75 వేలు ప్రభుత్వం అందిస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.50 లక్షల లబ్ధి చేకూరినట్టవుతుంది. ♦ అలాగే బ్యాంకులతో, ప్రఖ్యాత సంస్థలతో టై అప్ కోసం సూచనలు, సలహాలు ఇస్తూ లేదా వారి సొంత వ్యాపారం ద్వారా వారు నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. వైఎస్సార్ కాపు నేస్తం(కాపు అక్కచెల్లెమ్మలకు భరోసా.. ఇకపై రూ.1.20 లక్షల వరకు)♦ 4.63 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం అందజేసింది. ఇలా ఇప్పటికే రూ.2,030 కోట్లు ఇచ్చింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ. 60 వేలు అందజేస్తుంది. మొత్తంగా 8 విడతల్లో రూ.1.20 లక్షల లబ్ధి.♦ కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా కాపు నేస్తం కావొచ్చు.. ఇలా ఉండేలా వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో రూ.60 వేలు అందజేస్తారు.వైఎస్సార్ ఈబీసీ నేస్తం(అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు చేదోడు.. ఇకపై రూ.1.05 లక్షల వరకు)♦ ఈ ఐదేళ్లలో ఇప్పటికే 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,877 కోట్లు ప్రభుత్వం అందజేసింది. ♦ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.15,000 చొప్పున మరో రూ.60 వేలు అందిస్తుంది. మొత్తం ఏడు విడతల్లో రూ.1.05 లక్షల లబ్ధి♦రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజికవర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. అది పెన్షన్ లేదా ఈబీసీ నేస్తం కావొచ్చు. ఇలా ఉండేలా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 45 నుంచి 60 ఏళ్ల లోపు ఆ వర్గాల నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో వచ్చే ఐదేళ్లలో మరో రూ. 60 వేలు అందిస్తారు.ఆర్థిక తోడ్పాటుకు అదనంగా..♦ కేవలం ఆర్థికసాయం అందజేయడానికే ప్రభుత్వం పరిమితం కాలేదు. వైఎస్సార్ చేయూత తదితర పథకాల ద్వారా అందుకున్న నగదును ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చింది. గత ఐదేళ్లలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలతో ముందుకొచ్చిన లబ్ధిదారులకు అదనపు తోడ్పాటును కూడా అందించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల క్రితమే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ప్రాక్టర్ – గాంబుల్, రిలయన్స్ రిటైల్, అమూల్, అజియో బిజినెస్ వంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ♦ ప్రభుత్వం అందజేసిన లబ్ధితో కొత్తగా శాశ్వత జీవనోపాధిని పొందడానికి ముందుకొచ్చిన వారికి ఆయా వ్యాపార సంస్థల ద్వారా తగిన శిక్షణ అందజేశారు. మిగిలిన రిటైల్ వ్యాపారుల కంటే తక్కువ ధరలకే ఆయా దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. లేదంటే అక్కచెల్లెమ్మలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా ఆయా సంస్థలే కొనుగోలు చేస్తూ తోడ్పాటును అందిస్తున్నాయి. ♦ శాశ్వత జీవనోపాధిని పొందే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయానికి అదనంగా ఇంకా నిధుల అవసరం పడితే.. ఆ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తక్కువ వడ్డీకే అందేలా ప్రభుత్వం సహకారం అందించింది. -
జగనన్న వచ్చాకే మా కాపులను గుర్తించారు
-
‘వైయస్ఆర్ కాపు నేస్తం’తో మా జీవితాల్లో వెలుగులు నింపారు జగనన్న
-
వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా వచ్చిన డబ్బులతోనే నేను ఈ వ్యాపారం చేయగలుగుతున్నాను
-
కాపు నేస్తం 4వ విడత నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
అందరికంటే మిన్నగా ‘కాపు’కాశాం
నిడదవోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే మిన్నగా మన ప్రభుత్వంలో కాపుల సంక్షేమానికి అన్ని విధాలా కాపు కాశాం. కాపు నేస్తంతో పేదలైన కాపు అక్కచెల్లెమ్మలను ఆర్ధికంగా ఆదుకున్నాం. నాతో పాటు కేబినెట్లో కాపులను పక్కన కూర్చోబెట్టుకున్నా. నామినేటెడ్ పదవుల్లోనూ మిగిలిన వర్గాల పక్కనే కూర్చోబెట్టాం. కాపు కుటుంబాల్లోని అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన కోసం మన ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పరితపిస్తోంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం ఆయన కాపు నేస్తం నాలుగో విడత సొమ్ము విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, ఒంటరి, బలిజ, తెలగ కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్ధేశించి మాట్లాడారు. ‘కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేదలకు ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు, మొత్తంగా రూ.75 వేల ఆర్ధిక సాయం అందించే పథకాన్ని అమలు చేస్తున్నాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు రూ.2029 కోట్ల ఆర్ధిక సాయం చేసినట్టయింది. ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపు 4 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున అందజేశాం. అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని, ఆర్ధిక స్వావలంబన సాధించాలని అడుగులు ముందుకు వేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఈ డబ్బు వారికి ఎంతో ఉపయోగం ► నా అక్కచెల్లెమ్మల్లో పేదవాళ్లు ఎక్కడున్నా, వారికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అక్కచెల్లెమ్మల చేతిలో ఈ డబ్బు పెడితే అది వారి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న నమ్మకంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టాం. ► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటిదాకా 26,39,703 మందికి రూ.14,129 కోట్లు అందజేశాం. ► ఓసీల్లో పేదరికంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా అండగా నిలబడాలని 45–60 ఏళ్ల మధ్య ఉన్న వారి కోసం వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున వరసగా మూడేళ్లలో మొత్తం రూ.45 వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు 4,39,068 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 1,257 కోట్లు ఇచ్చాం. నా కాపు అక్కచెల్లెమ్మలకు కూడా అదే తరహాలో మద్దతు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించాం. ఇది రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం ఎప్పుడూ అమలు చేయని కార్యక్రమం. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కాపునేస్తం.. ఈ మూడు పథకాల ద్వారానే 34.37 లక్షల మందికి తోడుగా ఉన్నాం. ► రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక, వివిధ పథకాల ద్వారా 2.06 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. సచివాలయాల్లో మన కళ్లెదుటే దాదాపు 1.30 లక్షల మంది పిల్లలు వైద్య, ఆరోగ్య, ఇతర రంగాల్లోనూ కనిపిస్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటే, ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో మరో 2.06 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 2.06 లక్షల ఉద్యోగాలలో కాపు చెల్లెమ్మలు, తమ్ముళ్లకు లభించిన ఉద్యోగాలు దాదాపు 9.5 శాతం. సామాజిక న్యాయం మన విధానం ► సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చుకున్న ప్రభుత్వం ఇది. కాపు సోదరులకు రెండు కేబినెట్లలో సముచిత స్థానం కల్పించాం. ఒక్కో కేబినెట్లో నలుగురు మంత్రులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి నా పక్కనే కూర్చొబెట్టుకున్నాను. మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఐదుగురు మంత్రులు కనిపిస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీతో పాటు నా కాపుసోదరుడు కనిపిస్తాడు. కారణం ఇది మీ అందరి ప్రభుత్వం కాబట్టి. ► మొత్తంగా నామినేటెడ్ పోస్టుల్లో ఏకంగా 12 శాతం కాపు సోదరులకు, అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. ఇప్పటి వరకు నవరత్నాల్లోని వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసిన రూ.2.31 లక్షల కోట్లలో కాపులకు అందిన మొత్తం రూ.22,333 కోట్లు. ► నాన్ డీబీటీ పథకాలలో జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇలా ఎన్నో చేశాం. ప్రాంతాన్ని బట్టి ఇంటి స్థలం విలువ మారుతుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కో ఇంటి స్థలం విలువ కనీసం రూ.5 లక్షలు ఉంటుంది. ఇలా నాన్ డీబీటీ పథకాల ద్వారా నా కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో రూ.16,914 కోట్లు. 2.46 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇలా డీబీటీ, నాన్ డీబీటీ పథకాలను కలిపి చూస్తే కాపు అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు ఈ నాలుగేళ్లలో రూ.39,247 కోట్లు లబ్ధి కల్పించాం. 10 శాతం కూడా మేలు చేయని చంద్రబాబు ► మనం ఖర్చు చేసిన రూ.39,247 కోట్లలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం 10 శాతం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. గత ప్రభుత్వం కాపుల్ని మంజునాథ కమిషన్ పేరిట చేసింది ఒక మోసమైతే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో భాగాన్ని పంచడం సాధ్యం కాదని తెలిసి కూడా మరో మోసం చేసింది. అలాంటి మోసాలు మన ప్రభుత్వం చేయలేదు. ► మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు ఏటా రూ.2 వేల కోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం. ఇలా ఐదేళ్లలో కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. కానీ, నాలుగేళ్లలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.39,247 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు తన జీవితమంతా సామాజిక వర్గాలన్నింటినీ వంచించారు. ► మీ బిడ్డ ప్రభుత్వం 2019లో ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఉందో మీ బిడ్డ ప్రభుత్వంలో కూడా దాదాపు అదే బడ్జెట్. అప్పుడు ఎంత ఆదాయం ఉందో ఇప్పుడూ కూడా అంతే. పైగా మీ బిడ్డ ప్రభుత్వంలో అనుకోకుండా కోవిడ్ వచ్చి ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగాయి. అయినప్పటికీ మీ బిడ్డ రూ.2.35 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఎలా జమ చేశాడు. ఇలా చంద్రబాబు ఎందుకు చేయలేదు? మీరే గమనించాలి. మా కుటుంబానికి రూ.4,45,000 లబ్ధి అన్నా.. మీలాగ ఏ రాజకీయ నాయకుడు కూడా మా కాపులను గుర్తించలేదు. మీరు వచ్చాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. నేను గత ఏడాది, ఈ ఏడాది సాయం పొందాను. నేను చదువుకోకపోయినా, మీ పథకాల ద్వారా నా పిల్లలు ముగ్గురినీ చదివిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. మా డ్వాక్రా గ్రూప్‌కు రుణమాఫీ జరిగింది. సొంతింటి కల నెరవేరుతోంది. మొత్తంగా మా కుటుంబానికి ఈ ప్రభుత్వంలో రూ.4,45,000 లబ్ధి కలిగింది. నాలాగ లబ్ధి పొందిన వారంతా మీకు రుణపడి ఉంటాం. – సుబ్రమణ్యేశ్వరి, లబ్ధిదారు, వేమగిరి, కడియం మండలం -
కాపునేస్తం నిధులతో వ్యాపారం చేసుకుంటున్నాం: మహిళలు
-
కాపు నేస్తం నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
ప్రశ్నిస్తా అన్నవాడు బాబును ఎందుకు ప్రశ్నించడు: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా బాబు మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగా చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చట్టం ఎవరికైనా ఒక్కటే ఈ మేరకు సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో లబ్ధిదారులకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని అందిచే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవలే అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్టయ్యారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇన్ని అక్రమాలు, దోపిడీలు చేసిన బాబును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన బాబు 45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. కేసులో ఆడియో టేపుల్లో బ్లాక్‌మనీ పంచుతూ పట్టుబడ్డారని ప్రస్తావించారు. ఆ ఆడియో బాబుదే అని ఫోరెన్సిక్ కూడా నిర్ధారించిందని.. కానీ బాబు మాత్రం అది తనది కాదని బుకాయించారని గుర్తుచేశారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు. ‘ఫేక్ అగ్రిమెంట్‌తో లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించి బాబు స్కాం చేశారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు. స్కిల్ స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సీఐడీ నిర్ధారించింది. డబ్బును డొల్ల కెంపీలకు ఎలా మళ్లీంచారన్నది ఈడీనే బయటపెట్టింది. చంద్రబాబు పీఏ చాటింగ్‌లను ఐటీశాఖ బయటపెట్టింది. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్‌కు పంపింది. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని బాబు అంటున్నారు. చదవండి: కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్ ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు. కోర్టు రిమాండ్‌కు పంపితే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న పవన్ ప్రశ్నించడు. ఎల్లో మీడియా నిజాలను చూపించదు, వినిపించదు. చంద్రబాబు అవినీతిపై మాట్లాడదు. వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు, ములాఖత్‌లో మిలాఖత్ చేసుకొని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు. 371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎటుపోయింది? చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి?. 371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎక్కడికిపోయింది. ఎవరి జేబుల్లోకి ఈ సొమ్మంతా పోయింది. ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి’ అని సీఎం జగన్ నిడదవోలు సభలో వ్యాఖ్యానించారు. చదవండి: స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: సీఎం జగన్ -
మహిళ స్పీచ్ కు సీఎం వైఎస్ జగన్ ఫిదా
-
కాపు నేస్తంతో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ‘కాపు నేస్తం’ పథకం ద్వారాం ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందచేసే సాయంతో ఇప్పటివరకు (నాలుగేళ్లలో) ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయం అదించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిడదవోలులో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమని అన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని సీఎం చెప్పారు. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామ్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్.. ఇది ప్రజలందరీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రధాన్యత కల్పించామన్నారు. చదవండి: పొత్తులో సీటు ఫట్!.. జనసేన, టీడీపీ నేతల్లో ఆందోళన -
స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: సీఎం జగన్
Updates.. ములాఖత్‌లో మిలాకత్లా? చంద్రబాబు-పవన్‌లపై సీఎం జగన్ విమర్శలు - 45 ఏళ్ల నుంచి బాబు దోపిడీ నే రాజకీయంగా మార్చుకున్నారు - ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు - ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారు - సాక్ష్యాదారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారు - బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులే - ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా నిజాలను చూపించరు - ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతి పై మాట్లాడదు - నిస్సిగ్గుగా చంద్రబాబుకు వీరంతా సపోర్ట్ చేస్తున్నారు - లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు - స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే - ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారు - ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు - సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది - ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది - ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారు - డొల్ల సూట్ కేసు కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ తేల్చింది - ఈడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారు - కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు - ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు , వినిపించదు - చంద్రబాబు పీఏకు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది - రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ? - ప్రజాధనం దోచుకున్న బాబును కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ? - వాటాలు పంచుతాడు కాబట్టే వీరెవ్వరూ ప్రశ్నించరు - లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకులు రాసేది ఒకడు - ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు - ప్రజలంతా ఆలోచన చేయాలి - మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి - మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడండి - మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తాం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు లో నాలుగో విడత కాపు నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం - మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం - మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతఙ్ఞతలు చెబుతున్నా - కాపు నేస్తంతో ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నాం - వరుసగా ఐదేళ్ల పాటు రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం - 3,57,844 మందికి రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నాం - లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - కాపు నేస్తం తో 4 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరింది - ఒంటరి మహిళలకు ఆర్ధిక స్వాలంబన చేకూర్చడమే లక్ష్యం - 45 నుంచి 60 ఏళ్ల అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం - నాలుగేళ్లలో రూ. 2,029 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం - గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం అమలు చేయలేదు - ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు - కాపు పేద మహిళలకు అండగా ఉండాలనే ఈ పథకం - కేబినెట్ లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - ఇది మీ అందరి ప్రభుత్వం - నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం - కులం, మతం, రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నాం - అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం - రూ. 2.30 లక్షల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా అందించాం - నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ది చేకూరింది - గత ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేదు ? - చంద్రబాబు గతంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చలేదు - చంద్రబాబు కాపులను అడుగడుగునా మోసం చేశారు - రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు - 4 ఏళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి రూ. 39,247 కోట్లు ఇచ్చాం - మేనిఫెస్టో లో చెప్పిన దాని కంటే మిన్నగా చేశాం - గత ప్రభుత్వం మంజునాథ కమిషన్ పేరుతో మోసం చేసింది - అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు - అక్రమాలు చేసిన వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు - చట్టం ఎవరికైనా ఒక్కటే : సీఎం జగన్ ►నాలుగో విడతలో వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ అందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. కాపునేస్తంతో ఒంటిరి మహిళలకు మేలు చేస్తున్నాం. వరుసగా ఐదేళ్ల పాటు రూ.75వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేస్తున్నాం. లంచాలు, అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. కాపు నేస్తంతో 4లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్దిచేకూరింది. 45 నుంచి 60 ఏళ్ల అక్క చెలమ్మలకు అండగా నిలిచాం. ► ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ సారథి. సీఎం జగన్‌కు నిడదవోలు ప్రజల తరఫున స్వాగతం. వైఎస్సార్ కాపునేస్తంతో ఒంటరి మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేసింది. ► ముఖ్యమంత్రి జగన్ నిడదవోలు చేరుకున్నారు. ► నిడదవోలు బయలుదేరిన సీఎం జగన్. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు నిడదవోలులో పర్యటించనున్నారు. ► ఈ సందర్బంగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడతలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ► అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. ► 9:40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం జగన్ ► 10:10 నిడదవోలు టౌన్ సుబ్బరాజుపేటలోని హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ► 10:20 సభా వేదిక వరకూ రోడ్ షో ► 10:35 సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాలలోనీ సభాస్థలి వద్దకు చేరుకుని నిధులు విడుదల చేస్తారు. ► 12:10 ఎలిఫెంట్ ప్రాంగణానికి చేరుకుని స్థానిక నాయకులతో మాట్లాడతారు. ► 12:45 హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరుతారు. -
నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
నేడు ‘కాపు నేస్తం’ నాలుగో విడత
సాక్షి, అమరావతి: పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా.. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరుసగా నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. కాపులను దగా చేసిన టీడీపీ సర్కారు టీడీపీ సర్కారు కాపులను అన్ని రకాలుగా దగా చేసింది. కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా వంచించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ, నాన్–డీబీటీతో రూ.39,247 కోట్ల మేర లబ్ధి చేకూర్చడం గమనార్హం. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా అంతకంటే మిన్నగా మేలు చేయడం గమనార్హం. నేడు నిడదవోలుకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిడదవోలు చేరుకుంటారు. అక్కడ సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైఎస్సార్ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
మా కాపులకు ఇంత మేలు చేసిన జగనన్నను ఎప్పటికీ మర్చిపోము
-
ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కాపు నేస్తం సభలో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ స్పందిస్తారా?లేదా? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూసి ఉంటారు. కానీ ప్రతిపక్షం వైపు నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదంటేనే జగన్ ఈ విషయంలో సఫలం అయ్యారని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తలలో ఉండడానికి ఇష్టపడే చంద్రబాబు నాయుడు ఈ విషయాలపై ఎందుకు మాట్లాడలేదు. ప్రభుత్వం చేసే కార్యక్రమానికి పోటీగా ఏదో ఒకటి చేసే టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? అంటే దాని అర్థం అనవసరంగా కెలుక్కుని నష్టపోవడం ఎందుకు అని అయినా అనుకుని ఉండాలి? లేదా వారి దగ్గర సమాధానం అయినా ఉండి ఉండకపోవాలి. చదవండి: ‘ఈనాడు’ ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతోంది? 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాపు సామాజికవర్గం కూడా బాగానే ఉపయోగపడిందని అంగీకరించాలి. దానికి కారణం జనసేన పార్టీని స్థాపించిన ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఆయనపై ఉన్న ఆ వర్గంలో ఉన్న అభిమానం చంద్రబాబు కాష్ చేసుకోగలిగారు. దీనికి తోడు కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా ఉండనే ఉంది. తీరా అధికారంలోకి వచ్చాక కాపుల పట్ల చంద్రబాబు అనుసరించిన వైఖరి వారిలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల అంశంపై చేసిన ఉద్యమాన్ని ఎలా అణచాలా అన్నదానిపైనే ఆయన దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా , కాపులను బీసీలలో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలో ఆయన విఫలం అయ్యారు. పైగా కేంద్రం తీసుకు వచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు ఇస్తామని కొత్త ఆలోచన చేశారు. అది చెల్లదని తెలిసినా ఆయన ప్రయత్నం చేసి చివరికి భంగపడ్డారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లాలలో కూడా తెలుగుదేశం ఘోరంగా దెబ్బతినిపోయింది. కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. వామపక్షాలతో కలిసి పోటీచేసిన జనసేనకు ఒక సీటు మాత్రమే దక్కింది. మిగిలిన సీట్లన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో జమ అయ్యాయి. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్ ఇష్యూలో తాను హామీ ఇవ్వలేనని చెప్పడం ద్వారా అటు కాపు వర్గాన్ని, ఇటు బీసీ వర్గాన్ని ఆకట్టుకోగలిగారు. కాపులకు ఏటా రెండు వేల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు. అదే ప్రకారం ఆయన అడుగులు వేశారు. చంద్రబాబు మాత్రం తాను అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏటా వెయ్యి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, దానిని నెరవేర్చలేకపోయారు. మూడువేల కోట్ల వరకే ఇవ్వగలిగారు. మరి జగన్ ఆ విషయంలో వివిధ స్కీముల కింద మూడేళ్లలోనే 32 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చానని గొల్లప్రోలులో జరిగిన సభలో ప్రకటించారు. దీనిని పూర్వ పక్షం చేయడానికి టీడీపీ ఎంతవరకు ప్రయత్నించింది తెలియదు. కానీ ఆ సభలో ముఖ్యమంత్రి జగన్‌కు వచ్చిన స్పందన చూస్తే కాపు పేద మహిళలలో కూడా జగన్ నమ్మకం సాధించారన్న అభిప్రాయం కలుగుతుంది. 45 ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి పేద కాపు మహిళకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ద్వారా వారిలో ఒక నమ్మకం పెంచగలిగారు. పలువురు ఈ డబ్బును స్వయం ఉపాధికి కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు టైమ్‌లో ఈ రకంగా నిర్మాణాత్మక ప్రయత్నం జరిగినట్లు అనిపించదు. కాపు కార్పొరేషన్ ద్వారా కొంతమందికి రుణాలు ఇచ్చినట్లు టీడీపీ చెబుతుంది. కానీ జగన్ ఏకంగా ఆ వర్గం మహిళలకు భారీ ఎత్తున ఉచిత ఆర్థిక సాయం చేయడంతో రుణాలకు విలువ లేకుండా పోయింది. ఇంకో పోలిక కూడా గమనించాలి. కాపులకు ఒక భవనం నిర్మిస్తామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. అది ఏ దశలో ఉందో తెలియదు కాని, దానికి చంద్రన్న కాపు భవన్ అని పేరు పెట్టే యోచన చేయడంతో ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆయన వెనక్కి తగ్గవలసి వచ్చింది. అదే కాపు నేస్తం స్కీంకు జగనన్న కాపు నేస్తం అని పేరు పెట్టినా వారెవ్వరూ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇది నేస్తం పథకం కనుక. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వెళితే చంద్రబాబు వ్యూహలోపంతో నష్టపోయారని అనుకోవచ్చు. ఈ జిల్లాలలో తన పరపతి మళ్లీ పెంచుకోవడానికి పవన్ కల్యాణ్ చేస్తున్న కృషికి గండి కొట్టేలా జగన్ తన వంతు ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. చంద్రబాబు ఇప్పటికీ నేరుగా పవన్‌తో రాజకీయ సంబంధాలు పెట్టుకోకపోయినా, పరోక్షంగా వారిద్దరూ కలిసే ఉన్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఎవరూ ఆశ్చర్యపోరు. దానివల్ల కాపుల ఓట్లు గణనీయంగా వచ్చి రాజకీయంగా లబ్ధి పొందవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ వ్యూహానికి ప్రతిగా జగన్ నేరుగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాపు వర్గంలో ఆలోచనకు ఆస్కారం ఇవ్వవచ్చు. కాపుల ఓట్లను కొంతమేర అయినా కూడగట్టి వాటన్నిటిని హోల్ సేల్‌గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం అని జగన్ వ్యాఖ్యానించారు. దీనిని కూడా టీడీపీ, జనసేనలు ఖండించలేకపోతున్నట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో టీడీపీ, జనసేనలు కలిసే అవకాశం ఉండడంతో దానిని తోసిపుచ్చలేకపోతున్నారు. ఈ పాటికే ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే తమ నేత అమ్ముడుపోలేదని, కాపుల పక్షాన పవన్ నిలబడతారని చెప్పుకునేవారేమో! కొద్ది రోజుల క్రితం ఆయా సభలలో పవన్ మాట్లాడుతూ కాపులకు కూడా ఆ భావన లేకుండా పోయిందని, వారు కూడా జగన్‌కే మద్దతు ఇస్తున్నారని బాధపడ్డారు. గతంలో ఆయన అసలు కాపులేమిటి? రిజర్వేషన్ ఏమిటి అని ప్రశ్నించిన సందర్భమూ ఉంది. దీంతో ఆయన నిలకడ లేని వ్యక్తి అన్న భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన హామీలను విశ్వసించిన ఆ వర్గంలో మెజార్టీ మద్దతు లభించింది. ఇప్పటికే పలు బలహీనవర్గాలు జగన్‌కు మద్దతు ఇస్తున్నాయి. కాపులు కూడా అదే ప్రకారం తమ సపోర్టును కొనసాగిస్తే టీడీపీ, జనసేనలకు భవిష్యత్తు ఉండడం కష్టం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాపులను హోల్ సేల్ గా అమ్మేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జగన్ ఆరంభించారు. ఇదే టైమ్‌లో ఆయా అంశాలను ప్రస్తావించి తాను నిజాయితీగా మాట్లాడతానని, చెప్పినవాటిని అమలు చేస్తున్నానని, అలాంటి పాలన కావాలా? చంద్రబాబు చేసే అబద్దాల పాలన కావాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏఏ అబద్దాలు ఆడింది సోదాహరణంగా ప్రజలకు చెబుతున్నారు. కానీ చంద్రబాబు వాటికి ప్రత్యక్షంగా సమాధానాలు చెప్పకుండా జగన్‌పై ఏవేవో ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో కాపులకు తాను కాపు కాస్తానని జగన్ ప్రకటించి వారిని ఆకట్టుకునే యత్నం చేశారు. కాపులలోని పేద వర్గాలవారు కూడా జగన్ తమను కాచుకుంటున్నారనే భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను బట్టి అర్ధం అవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్‌లు ఎలాంటి వ్యూహం అమలు చేసి తామే కాపులను ఉద్దరించగలుగుతామని చెప్పగలుగుతారో చూడాలి. కాకపోతే ఐదేళ్లపాటు చేయలేని వ్యక్తి ఇప్పుడు చేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. జగన్ తాను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నందున ధైర్యంగా కాపు కాస్తానని చెప్పగలుగుతున్నారా! -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
CM YS Jagan: ఇచ్చిన మాటకు మించి మేలు
గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘కాపులకు మేలు చేస్తామని చెప్పినట్టుగానే చేసి చూపించాం. మేనిఫెస్టోలో పెట్టకున్నా మనసున్న ప్రభుత్వం కాబట్టే వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. మూడేళ్లుగా నిరాటంకంగా కాపు మహిళలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు ఏటా రూ.1,000 కోట్ల వంతున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి కాపులను మోసం చేశారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. మనం చెప్పిన మాటకు మించి మేలు చేశామన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 3,38,792 మంది కాపు మహిళల ఖాతాల్లో రూ.508 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇది మనసుతో స్పందించే ప్రభుత్వం అన్నారు. అక్క చెల్లెమ్మలు, రైతులు, పేదల ప్రభుత్వం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలతో పాటు ప్రతి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకూ తోడుగా నిలిచామన్నారు. కాపు నేస్తం పథకం కింద ఈ మూడేళ్లలో రూ.1,492 కోట్లు అందించామని చెప్పారు. అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయిన వారికి ఈ నెల 19న రూ.1.8 కోట్లకు పైగానే జమ చేశామన్నారు. నవరత్న పథకాల ద్వారా ఈ మూడేళ్లలో ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన అక్కచెల్లెమ్మలకు, కుటుంబాలకు డీబీటీ, కాపు కార్పొరేషన్ ద్వారా ఏకంగా రూ.16,256 కోట్లు అందించామని వివరించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టే పథకాలు, నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.16 వేల కోట్ల లబ్ధి కలిగించామని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలు చేసినందుకే మీ ఆశీర్వాదాలు ►2.46 లక్షల మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి పట్టాల విలువే రూ.12 వేల కోట్లు. 1.2 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు రూ.2 వేల కోట్లు ఇస్తామన్నాం. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పాం. మూడేళ్లు కూడా తిరక్క ముందే రూ.32,296 కోట్లు ఇవ్వగలిగాం. ►నవరత్నాల పథకాల ద్వారా అన్ని వర్గాల వారినీ ఆదుకున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. అందువల్లే ఇవాళ ధైర్యంగా గడప గడపకూ వెళుతున్నాం. మీ ఆశీర్వాదం అందుకుంటున్నాం. ►మెట్ట ప్రాంత రైతుల స్వీయ ప్రయోజనాల దృష్ట్యా నాన్న (రాజశేఖరరెడ్డి) గారి హయాంలోనే ఏలేరు ప్రాజెక్టును చేపట్టి మొదటి విడతలో 60 శాతం పనులు చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న వారు లేరు. ఆ అంచనాలు ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి. ►ఎమ్మెల్యే దొరబాబు అన్న అభ్యర్థన మేరకు ఏలేరు ఫేజ్–1 ఆధునికీకరణకు రూ.142 కోట్లు, ఏలేరు ఫేజ్–2కు మరో రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇది కాకుండా పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాల్టీలకు రూ.20 కోట్లు చొప్పున రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. జన స్పందన అనూహ్యం సభకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. సీఎం జగన్ వేదిక వద్దకు రాక మునుపే సభా స్థలి మహిళలతో నిండిపోయింది. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో బయట వాహనాలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కోలకతా–చెన్నై జాతీయ రహదారిలో గొల్లప్రోలు వద్ద అటు, ఇటు నాలుగు కిలోమీటర్లు మేర జన సముద్రాన్ని తలపించింది. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల అంచనాలకు మించి జనం రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించడం కొంత సేపు కష్టతరంగా మారింది. సభలో సీఎం ప్రసంగం సాగిన 30 నిమిషాల పాటు మహిళలు, యువత జై జగన్.. థ్యాంక్యూ సీఎం సార్.. అంటూ నినదించారు. -
CM Jagan: చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు
ఇవాళ సహాయ కార్యక్రమాల్లో మొత్తం అధికార యంత్రాంగాన్నంతటినీ మోహరించాం. మానవత్వంతో సహాయం చేస్తున్నాం. ఆరుగురు జిల్లా కలెక్టర్లు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లు బాధితుల వెన్నంటి ఉన్నారు. రేషన్, రూ.2 వేల సాయం అందలేదని ఏ ఒక్కరూ అనలేదు. ఈ పెద్దమనిషి (చంద్రబాబు) మాత్రం నిన్న (గురువారం) చేతిలో కాగితాలు పట్టుకుని అబద్ధాలు చెప్పారు. ఎలాగైనాసరే ప్రజలను నమ్మించగలమని అనుకుంటున్నారు. ఎందుకంటే పత్రికలు నడిపేది వాళ్లే, టీవీలు వాళ్లవే, చర్చ నడిపించేది, చర్చించేది వాళ్లే కాబట్టి. – సీఎం వైఎస్ జగన్ గొల్లప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి: ‘చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు. ఆ పెద్ద మనిషిది అదో మార్కు రాజకీయం. ఒకటే అహంకారం. ఆయనకు డబ్బా కొట్టే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉన్నాయని, ఏ అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమా. వీటికి తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కనీసం 10 హామీలు కూడా అమలు చేయకుండా చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి, ఇప్పుడేమో సంక్షేమ పథకాలు రద్దు చేయాలంటున్నారు. డీబీటీ అమలుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వెటకారం చేస్తున్నారు. చంద్రబాబుతో కూడిన ఈ దుష్టచతుష్టయం గతంలో అమలు చేసిన డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) కావాలో, మనం అమలు చేస్తోన్న డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) కావాలో ఒకసారి ఆలోచించండి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను కోరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం ఆయన కంప్యూటర్లో బటన్ నొక్కి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. చంద్రబాబు గత పాలన, ప్రతిపక్ష నేతగా అతని తీరును తూర్పారపట్టారు. గడచిన మూడేళ్ల సంక్షేమ పాలనకు, గత ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన సభకు భారీగా హాజరైన మహిళలు. దిగజారిన రాజకీయాలు ►కాపుల ఓట్లను కొంతమేర అయినా కూడగట్టి, వాటన్నింటినీ హోల్‌సేల్‌గా చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ కనిపిస్తున్నాయి. రాజకీయాలు దిగజారిపోయాయి. గతంలో ఒక కులానికి కానీ, ఒక సామాజిక వర్గానికి కానీ.. ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది.. అని అడిగితే లెక్కలు మాత్రమే చూపించేవారు. బడ్జెట్లో వందల కోట్లు చూపించినా, అదే కులానికి చెందిన నాకు ఎందుకు మేలు జరగ లేదని, ఆ లెక్కలన్నీ మాయాజాలమే అనుకునేవారు. ముఖ్యమంత్రి జగన్‌కు సాదర స్వాగతం పలుకుతున్న విద్యార్థినులు ►ఇవాళ మనం ఇంటింటికీ వెళ్లి.. మీకు ఇన్ని పథకాలు అందాయి అని చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. పారదర్శకంగా ఇంత మంచి చేశాం. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా? ఆలోచించండి. ►బాబు పాలనలో అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు చెబితేనే కొద్ది మందికి మాత్రమే అరకొరగా మేలు జరిగేది. అదీ లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. లంచాలు, వివక్ష అనేవి ఇవాళ ఎక్కడా కనిపించవు. ఇవాళ మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, వర్గం, ఇవేమీ చూడకుండా మేలు చేస్తున్నాం. మనకు ఓటు వేసినా, వేయకపోయినా ఇస్తున్నాం. కాపునేస్తం లబ్ధిదారులైన మహిళలతో సీఎం జగన్. చిత్రంలో ఎంపీ వంగా గీత మీరే ఆలోచించండి.. ►వందకుపైగా సామాజిక వర్గాల బాగుకోరే మన పాలన కావాలా? లేక గత ప్రభుత్వం మాదిరి చంద్రబాబు, వారి దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు బాగు మాత్రమే కావాలా.. ఆలోచించండి. మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసిన, నిజాయితీతో కూడిన రాజకీయాలు కావాలా? లేక మోసం, వెన్నుపోటు, వంచనతో కూడిన.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పచ్చి అబద్ధాల మార్కు చంద్రబాబు రాజకీయం కావాలా? ఈ విషయాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ►హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు ప్రతి ఇంటికీ రూ.4 వేలు ఇచ్చానని, ఇవాళ జగన్ రూ.2వేలు ఇచ్చారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో తిరుగుతున్నా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు అప్పట్లో 11 రోజులు తిరిగాను. అప్పుడు వారు ఇచ్చింది పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడకక్కడా 10 కేజీలు బియ్యం మాత్రమే. తిత్లీ తుపాను సమయంలోనూ అంతే. ►గతంలో కూడా ఇదే బడ్జెట్. ఇప్పటి కంటే అప్పుడే అప్పులు ఎక్కువ. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ మీ బిడ్డ ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు? కేవలం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడమే తేడా. నాకు ఉన్నది మీ దీవెనలు. ఆ దేవుడి ఆశీస్సులు. – సీఎం వైఎస్ జగన్ గత పాలకులు బూటు కాళ్లతో తన్నించారు గత చంద్రబాబు పాలనలో కాపులను బూటు కాళ్లతో తన్నించారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాత్రమే మా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతోంది. కాపు నేస్తం, ఇతర పథకాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీ సాయంతో నేను టీ దుకాణం పెట్టుకుని, సొంత కాళ్లపై నిలబడ్డాను. 35 ఏళ్ల క్రితం నాకు పెళ్లయింది. అద్దె ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నాం. మీరు పెద్ద కొడుకుగా మా సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారు. కొమరగిరిలో స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం జరుగుతోంది. పూర్తయ్యాక మీరు (సీఎం) మా గృహ ప్రవేశానికి తప్పకుండా రావాలి. – బండారు సుజాత, కాకినాడ అర్బన్ మళ్లీ మీరే సీఎం కావాలి గత ప్రభుత్వం కాపుల్ని అగ్రవర్ణాలుగా చూసింది తప్ప చేసిందేమీ లేదు. కాపు మహిళలు డబ్బులు లేకపోయినా ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో మీరు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. ఎంతో మంది మహిళలు మీ సాయం అందుకుని సొంత కాళ్లపై నిలబడ్డారు. నేను గేదెలను కొనుక్కుని పాల వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాను. కుటుంబ పోషణకు నా భర్తకు నెలకు రూ.4 వేలు ఇస్తున్నాను. నా భర్త ఆటో డ్రైవర్. వాహనమిత్ర ద్వారా అతనికి రూ.10 వేల సాయం అందింది. ఇటీవల ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ప్రాణ భిక్ష పెట్టారు. నా కుమారుడికి ఫీజు రీయింబర్స్మెంట్, మా అత్తకు పింఛన్ అందుతోంది. ఇంటి స్థలం ఇచ్చారు. ఇంత మేలు చేసిన మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. – చిక్కాల రాణి, కొవ్వాడ, కాకినాడ రూరల్ -
వైఎస్సార్ కాపు నేస్తం: సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటన (ఫొటోలు)
-
వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం: రోజా
-
వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులు విడుదల
-
వరుసగా మూడో ఏడాది కాపు అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం
-
‘కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం’
గొల్లప్రోలు(కాకినాడ జిల్లా): వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను జమ చేశారు సీఎం వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఫలితంగా అర్హులైన 3,38, 792 మందికి రూ. 508 కోట్ల ఆర్థికసాయం చేకూరనుంది. కాగా, వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించారు. కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగనే అంటూ వారు కొనియాడారు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలి ‘నేను ప్రతీసారి కాపు నేస్తం అందుకున్నాను. ఇప్పుడు కూడా అందుకుంటున్నాను. మా భర్త ఆదాయం సరిపోక, టీ షాపు పెట్టుకున్నాను. దానికి వైఎస్సార్ కాపు నేస్తం మరింత ఆసరా అయ్యింది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అసలు మా కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీరొచ్చాక కాపు నేస్త అనే పథకాన్ని పెట్టి ఎంతోమందిని ఆదుకున్నారు. ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఒక ఇంటికి అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మనవడిగా అన్నీ చేస్తున్నారు. మా కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరే. ఒక పెద్ద కొడుకుగా మీరు చాలా సాయం చేశారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా మిమ్మల్నే చూడాలనుకుంటున్నాను. -బండారు సుజాత, కాపు నేస్తం లబ్ధిదారు కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం ఈ ప్రభుత్వ హయాంలో కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆడపడుచులం అందరి తరపున మీకు(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) కృతజ్ఞతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మా లాంటి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరింది. నేను, నా భర్త, పిల్లలు, పెద్దలు.. అందరం ప్రభుత్వ సహకారంతో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అంటూ రాణి అనే మరో లబ్ధిదారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు ఆమె. ఆమె ప్రసంగానికి సీఎం జగన్ స్పందించి.. ఆమెను పలకరించారు కూడా. -
స్టేజ్ మీద ఎమోషనల్ అయిన కాపు మహిళ