కాపులకు గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చింది కేవలం రూ.1,874 కోట్లు మాత్రమే. అంటే ఏటా రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గొప్ప మార్పుతో రాష్ట్రంలో 13 నెలల పాలన కొనసాగిందని.. ఎక్కడా వివక్ష, అవినీతికి ఏ మాత్రం తావు లేని విధంగా పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గుండెల మీద చేయి వేసుకుని గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చూడాలని కోరారు. తమకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డామని.. పథకాలు, కార్యక్రమాల అమలులో కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదన్నారు. దాదాపు 23 లక్షల మంది కాపు కులస్తులకు ఈ 13 నెలల్లో వివిధ పథకాల కింద రూ.4,770 కోట్ల లబ్ధి చేకూర్చామని తెలిపారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ కింద దాదాపు 2.36 లక్షల మంది కాపు మహిళలకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేల చొప్పున సుమారు రూ.354 కోట్లు కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
13 నెలల కాలంలో..
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అందరికీ మేలు చేయగలిగాం. ఈ 13 నెలల కాలంలో పలు పథకాల కింద 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశాం. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది.
► కాపు అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది కాలంలో అన్ని విధాలా తోడుగా ఉన్నాం. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర, చేదోడు, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, చేయూత, కాపు నేస్తం వంటి అనేక పథకాల ద్వారా దాదాపు 23 లక్షల మందికి అక్షరాలా రూ.4,770 కోట్లు లబ్ధి చేకూర్చాము.
► ఇప్పుడు కూడా బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి రూ.15 వేల చొ ప్పున సహాయం చేస్తున్నాం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించబోతున్నాం. ఈ నగ దును పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసు కోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేస్తున్నాం.
ఒంగోలులో వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.15 వేలు పొందిన ఆనందంలో అక్కచెల్లెమ్మలు
అర్హులెవరైనా మిగిలిపోతే ఆందోళనొద్దు
► వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద లబ్ధి పొందని వారు ఇంకా ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం ఇది. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం.
► ఈ పథకం అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఇంకా మంచి చేయాలని ఆశిస్తున్నాను.
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూశారు
సీఎంగా మీరు ఏడాది కాలంలోనే పేదలకు ఇంత చేశారంటే.. జీవితాంతం మీరే సీఎంగా ఉంటే మేము ఇంకా అభివృద్ధి చెందుతాం. ఓట్ల సమయంలో ప్రతి నాయకుడు కాపులకు అదిచేస్తాం.. ఇది చేస్తామని చెప్పి తర్వాత కనిపించకుండా పోయేవారు. కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. కానీ మీరు మాత్రం అన్ని విధాలా ఆదుకుంటున్నారు. నేను టైలరింగ్ చేస్తుంటాను. వైఎస్సార్ కాపు నేస్తం కింద మీరు అందించిన రూ.15 వేల సాయంతో మరికొందరికి జీవనోపాధి కల్పించాలని అనుకుంటున్నాను.
– సలాటం కాళీప్రియ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
మరికొందరికి టైలరింగ్‌లో శిక్షణ ఇస్తా..
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా మీరు అందిస్తున్న ఈ డబ్బును సద్వినియోగం చేసుకుంటాం. నాకు టైలరింగ్ తెలుసు. కొత్త మిషన్లు కొనుగోలు చేసి, మరికొందరికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను. కాపు, బలిజల్లో కూడా పేదవారు ఉంటారని గుర్తించి మా కోసం ఈ పథకం ప్రవేశపెట్టారు. కాపులకు ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి పథకం ప్రవేశపెట్టలేదు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మేం ఎంతగానో ఆనందపడుతున్నాం. కాపు మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మీరు చరిత్రలో స్థిరంగా నిలిచిపోతారు.
–హైమావతిదేవి కడప, వైఎస్సార్ కడప జిల్లా
ఈ సాయం మాకెంతో ఉపయోగం
నాన్నా.. నువ్వు చేసిన మేలు నేను ఎప్పుడూ మరిచిపోలేను. కాపునేస్తం కింద అందు తున్న రూ.15 వేల సాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా కుటుంబానికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నాన్నా.. మళ్లీ మళ్లీ నువ్వే సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో పేదలందరికీ మేలు జరుగుతోంది.
– నిర్మలమ్మ, పోతేపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా
మీ నిర్ణయం గొప్పది..
నేను ఉన్నాను.. నేను విన్నాను.. అంటూ పాదయాత్రలో అందరి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. అప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. మీ తండ్రి వైఎస్సార్‌కు తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. కాపు నేస్తం ద్వారా మీరు అందిస్తున్న సాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయి దేళ్లలో మాకు రూ.75 వేలు అందించాలన్న మీ నిర్ణయం గొప్పది. ఎప్పటికీ మీరే సీఎంగా వుండాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను.
– లంకలపల్లి శాంతమ్మ, పెద్దిపాలెం, ఆనందపురం మండలం, విశాఖపట్నం
పేదలకు నిజమైన స్వాతంత్య్రం
ఇచ్చిన ప్రతి మా టను నిలబెట్టు కుంటున్న మిమ్మ ల్ని చూసి గర్వపడుతున్నాం. కులాల పేరు చెప్పుకునే వ్యవస్థను మీరు పోగొట్టారు. కుల, మత వ్యవస్థ లేకుం డా పేదవాళ్లకు మేలు చేస్తూ.. వారి హృదయాలను గెలిచారు. కొత్త చరిత్రను సృష్టిస్తు న్నారు. పేద వా రిని ఆర్థికంగా అభివృద్ధి చేయా ల నే మీ తపనతో ఇప్పుడు నిజం గా పేదలకు స్వాతంత్య్రం వస్తోంది.
– నారాయణస్వామి, డిప్యూటీ సీఎం
చెప్పిన దానికన్నా ఎక్కువే..
పాదయాత్ర సం దర్భంగా కాపు లకు అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తానని చెప్పారు. మీరు ఇచ్చిన హామీతో అందరూ ఆశ్చర్యపోయా రు. అధికారంలోకి వచ్చాక మీరు చెప్పిన దానికన్నా ఎక్కువగా కాపు లకు సాయం అందించారు. తొలి ఏడాదిలోనే ఏకంగా నాలుగు వేల కోట్లకు పైగా మీరు కాపు సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చారు.
– కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
మీకు ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నం దుకు కాపు కుటుంబాల తర ఫున మీకు ధన్యవాదాలు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితు ల్లోనూ కాపునేస్తం కింద సాయం అందిస్తున్నారు. మాకు జగనన్న ఉన్నాడనే భరోసాతో ప్రజలు ఉన్నారు. మీకు వైఎస్సార్ ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయి.
– వంగా గీత, కాకినాడ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment