‘కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం’ | YSR Kapu Nestham Beneficiaries In AP Praises CM YS Jagan | Sakshi
Sakshi News home page

‘కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం’

Published Fri, Jul 29 2022 1:05 PM | Last Updated on Fri, Jul 29 2022 1:36 PM

YSR Kapu Nestham Beneficiaries In AP Praises CM YS Jagan - Sakshi

గొల్లప్రోలు(కాకినాడ జిల్లా): వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను జమ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన  కార్యక్రమంలో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులను సీఎం జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఫలితంగా అర్హులైన 3,38, 792 మందికి రూ. 508 కోట్ల ఆర్థికసాయం చేకూరనుంది.

కాగా, వైఎస్సార్‌ కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించారు. కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగనే అంటూ వారు కొనియాడారు.

మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలి
‘నేను ప్రతీసారి కాపు నేస్తం అందుకున్నాను. ఇప్పుడు కూడా అందుకుంటున్నాను. మా భర్త ఆదాయం సరిపోక, టీ షాపు పెట్టుకున్నాను. దానికి వైఎస్సార్‌ కాపు నేస్తం మరింత ఆసరా అయ్యింది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అసలు మా కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీరొచ్చాక కాపు నేస్త అనే పథకాన్ని పెట్టి ఎంతోమందిని ఆదుకున్నారు. ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఒక ఇంటికి అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మనవడిగా అన్నీ చేస్తున్నారు. మా కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరే. ఒక పెద్ద కొడుకుగా మీరు చాలా సాయం చేశారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా మిమ్మల్నే చూడాలనుకుంటున్నాను. 
-బండారు సుజాత, కాపు నేస్తం లబ్ధిదారు

కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం
ఈ ప్రభుత్వ హయాంలో కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆడపడుచులం అందరి తరపున మీకు(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) కృతజ్ఞతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మా లాంటి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరింది. నేను, నా భర్త, పిల్లలు, పెద్దలు.. అందరం ప్రభుత్వ సహకారంతో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అంటూ రాణి అనే మరో లబ్ధిదారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు ఆమె. ఆమె ప్రసంగానికి సీఎం జగన్‌ స్పందించి.. ఆమెను పలకరించారు కూడా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement