benficiary
-
‘కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం’
గొల్లప్రోలు(కాకినాడ జిల్లా): వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను జమ చేశారు సీఎం వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఫలితంగా అర్హులైన 3,38, 792 మందికి రూ. 508 కోట్ల ఆర్థికసాయం చేకూరనుంది. కాగా, వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంపై ప్రశంసలు కురిపించారు. కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగనే అంటూ వారు కొనియాడారు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలి ‘నేను ప్రతీసారి కాపు నేస్తం అందుకున్నాను. ఇప్పుడు కూడా అందుకుంటున్నాను. మా భర్త ఆదాయం సరిపోక, టీ షాపు పెట్టుకున్నాను. దానికి వైఎస్సార్ కాపు నేస్తం మరింత ఆసరా అయ్యింది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అసలు మా కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదు. మీరొచ్చాక కాపు నేస్త అనే పథకాన్ని పెట్టి ఎంతోమందిని ఆదుకున్నారు. ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు. మళ్లీ మళ్లీ మీరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఒక ఇంటికి అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మనవడిగా అన్నీ చేస్తున్నారు. మా కాపుల్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరే. ఒక పెద్ద కొడుకుగా మీరు చాలా సాయం చేశారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా మిమ్మల్నే చూడాలనుకుంటున్నాను. -బండారు సుజాత, కాపు నేస్తం లబ్ధిదారు కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం ఈ ప్రభుత్వ హయాంలో కాపు మహిళలం ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆడపడుచులం అందరి తరపున మీకు(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) కృతజ్ఞతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మా లాంటి కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరింది. నేను, నా భర్త, పిల్లలు, పెద్దలు.. అందరం ప్రభుత్వ సహకారంతో పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అంటూ రాణి అనే మరో లబ్ధిదారు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని, సీఎంగా కొనసాగాలని కోరుకున్నారు ఆమె. ఆమె ప్రసంగానికి సీఎం జగన్ స్పందించి.. ఆమెను పలకరించారు కూడా. -
AP: ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు
తాడేపల్లి: అందరికీ సంక్షేమంలో భాగంగా.. ఏపీలో మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కల్గింది. సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి అందని వారికి తాజాగా రూ. 137 కోట్ల నిధులను విడుదుల చేసింది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా తమకు అందుతున్న సంక్షేమ పథకాలు, సీఎం జగన్ పాలనపై పలువురి లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది లబ్ధిదారులు తాము పొందుతున్న లబ్ధిని సీఎం జగన్‌కు వివరించారు. ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు మాలాంటి వాళ్ల కోసం ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు ఇలాంటి ఆలోచన చేయలేదు. మొదటిసారిగా మీరు చేశారు. మీరు ఈబీసీ పథకం కోసం డిసెంబర్లో అప్లై చేశాను. కానీ నా ఆధార్ కార్డు లింక్ అప్ కాలేదు. ఆధార్ కార్డు లింక్ అప్ చేసుకుని ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరడం ఆనందంగా ఉంది. మా పెద్ద అమ్మాయికి విద్యా దీవెన, వసతి దీవెన అందుతోంది. మా చిన్నమ్మాయికి అమ్మ ఒడి పథకం అందుతోంది. దాంతో నా పిల్లల్ని ఆనందంగా చదివించుకుంటున్నా. నాకు విడో పెన్షన్ అందుతోంది. మీరిచ్చిన భరోసాతో నా కుటుంబం ఆనందంగా బ్రతక గల్గుతోంది.అందరి పేద జీవితాల్లో వెలుగులు నింపుతున్నార్ సార్. మామిడిపాటి లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా ఓసీలకు కూడా పథకాల్ని వర్తింపచేసిన ఏకైక సీఎం మీరే అన్నా జగనన్న తోడు ద్వారా రెండు విడతలుగా 10 వేల చొప్పున పొందాను. డ్వాక్రా మహిళా సంఘంలో కూడా ఉన్నాను.దాని ద్వారా లబ్ది పొందుతున్నాను.మా అత్త గారికి వితంతు పించన్ వస్తుందన్నా. మీ నాన్నగారు వైఎస్సార్ ఉన్నప్పుడు ఇంటి పట్టాను పొందాము. వైఎస్సార్ ఆసరా కూడా మా కుటుంబానికి అందుతుందన్నా. పార్టీలకతీతంగా పథకాల్ని వర్తింపు చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్నా. ఓసీలకు కూడా పథకాల్ని వర్తింప చేసిన ఏకైక సీఎం మీరే అన్నా. జ్యోతి, అనంతపురం జిల్లా మీలాంటి నాయకుడ్ని ఇంతకముందు చూడలేదు మీరు పాదయాత్రలో మత్యకారులు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా కింద రూ. 10 వేలు సాయం అందిస్తానన్నారు. ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా బాధలు గుర్తించి వేట నిషేధ కాలంలో మాకు సాయం అందిస్తున్నారు. మత్యకార భరసా, అమ్మ ఒడి, జగనన్న చేయూత ఇలా నాకు రూ. 70 వేల భరోసా అందుతుందన్నా. నా ఒక్కడికే 70 వేల రూపాయలు అందితే కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని ఇంకా ఎంతమందిని ఆదుకున్నారో అన్నా మీరు. మీలాంటి నాయకుడ్ని ఇంతకుమందు చూడలేదన్నా. మీరు మా పట్ల చూపించిన అభిమానం గొప్పగా అనిపిస్తుందన్నా ఉడిపి సైమన్, కాకినాడ జిల్లా -
అమ్మఒడి అర్హుల జాబితా నేడు ప్రదర్శన
-
సెల్ఫీ చాలు
సాక్షి, హైదరాబాద్: ‘పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే, మీరు బతికే ఉన్నారంటూ సర్టిఫికెట్‌తీసుకుని రండి. అప్పుడు మీ దరఖాస్తు పరిశీలిస్తాం’ – ఇదీ ఇప్పటివరకు పింఛనుదారులు లేదా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చాలా సందర్భాల్లో ఎదురైన అనుభవం. కళ్ల ముందే మనిషి కనిపిస్తున్నా.. మీరు బతికే ఉన్నారని, ఫలానా రామారావు మీరే అని కాగితాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇందుకోసం కాళ్లరిగేలా ఆ కార్యాలయం, ఈ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం ఒక్క సెల్ఫీతో ఈ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి. మీరు ఇంట్లోనే ఉండి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు.. మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? ఆధునిక సాంకేతికతతో దూసుకెళ్తున్న మన రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమ్మిళితం చేసి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. మూడు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి దానిని మొబైల్ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ఈ వినూత్న సాంకేతికతకు రూపునిచ్చారు. ఇప్పటివరకు దేశంలో రెండు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి ఫలితాలు సాధించగా.. మన దగ్గర మూడురకాల సాంకేతికతలను ఉపయోగించేలా సిద్ధం చేసిన యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించింది. ఒక్క సెల్ఫీతోనే దీని కచ్చితత్వం ప్రస్ఫుటమవుతుంది. ఈ మొబైల్ అప్లికేషన్‌ను టీ యాప్ ఫోలియోలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దీనిని కొంత మేరకు ట్రెజరీ విభాగంలో రిటైరైన ఉద్యోగుల పెన్షన్ పంపిణీ కోసం వినియోగిస్తున్నారు. రెండు మూడు నెలల్లో దీనిని ఈ విభాగంలో మరింతగా విస్తరించనున్నారు. ఆసరాలో ప్రయోగాత్మకంగా.. ఈ కొత్త యాప్‌ను ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు. పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమిబసు చొరవతో ఇటీవల సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఈ మొబైల్‌యాప్‌ను పైలెట్ ప్రాజెక్టుగా పరిశీలించి చూశారు. ఈ గ్రామంలో 60 మంది వృద్దాప్య పింఛన్లు పొందుతున్న వారిని మొబైల్ యాప్ ద్వారా పరిశీలించగా 59 మంది వివరాలు సరైనవేనని తేలింది. ఒక్కరి విషయంలోనూ వివరాలు సరిగా లేకపోవడంతో డేటాబేస్‌లోని సమాచారంతో మ్యాచ్ కాలేదు. ప్రయోజనాలేంటి? పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛనుతో సహా ఆసరా పింఛనుదారులు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లబ్దిదారులు జీవించి ఉన్నారా లేదా నిజమైన లబ్దిదారులకే ఇవి అందుతున్నాయా అని కచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈ మొబైల్ యాప్ ఉపయోగపడనుంది. అలాగే లెర్నింగ్ లైసెన్స్ రెన్యువల్, ఇతర సర్వీసుల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద నుంచే సెల్ఫీ తీసుకుని ఆయా సేవలను పొందే వెసులుబాటు కలగనుంది. ఇక పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పింఛను పొందాలంటే ప్రతి ఏడాది ‘వార్షిక పెన్షనర్ లైవ్ సర్టిఫికెట్’ను సమర్పించాల్సి ఉండేది. ఇందుకోసం వారు ట్రెజరీ, పెన్షన్ కార్యాలయాలకు వెళ్లి తాము జీవించి ఉన్నట్టుగా స్వయంగా సర్టిఫికెట్లు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. సొంత లేదా అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో పెన్షనర్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని సెల్ఫీ తీసుకుని, అవసరమైన వివరాలను పొందుపరిచి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వెంటనే ట్రెజరీ డేటాబేస్‌లో ఉన్న వివరాల ఆధారంగా లైవ్ అథెంటికేషన్ పూర్తయి ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అదే సమయంలో ట్రెజరీ డిపార్ట్మెంట్కు అథెంటికేషన్ వెళుతుంది. పెన్షనర్ స్వయంగా లైవ్ అథెంటికేషన్ కోసం ట్రెజరీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.మాన్యువల్ ప్రక్రియలో ఎదురయ్యే చాలా ఇబ్బందులు ఈ యాప్‌తో తీరనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండానే.. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు వీలుగా యాప్‌ను రూపొందించాం. లబ్దిదారుడిని సెల్ఫీ తీయడం ద్వారా లైవ్ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్ వివరాలతో డేటాబేస్‌లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోతో మ్యాచ్ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి.. సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అన్న అథెంటికేషన్ వస్తుంది. ఇందులో మొదటిది ఓకే కాకపోతే రెండో అంశానికి వెళ్లే అవకాశముండదు. మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది. డెబిట్ కార్డు వినియోగం కోసం ‘టు ఫాక్టర్ టెక్నాలజీ’ని ఉపయోగిస్తుండగా మేము వినూత్నంగా ‘త్రీ ఫాక్టర్ అథెంటికేషన్’ను ఉపయోగించాం. – జీటీ వెంకటేశ్వరరావు, ఎండీ టీఎస్టీఎస్, కమిషనర్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కచ్చితత్వం సాధించాం ఎద్దుమైలారంలో ఆసరా పింఛన్ల లబ్దిదారులను ఈ యాప్ ద్వారా పరిశీలించాం. ప్రధానంగా వృద్ధాప్య పింఛను పొందుతున్న వారిని 60 మందిని ఎంపిక చేసి, మా డేటాబేస్‌లో ఉన్న ఫోటో, ఇతర వివరాలను లబ్దిదారుల సెల్ఫీతో మ్యాచ్ చేసి చూశాం. 59 మంది సమాచారం మ్యాచ్ అయ్యింది. ఒక వ్యక్తి వివరాలు సరిగా లేకపోవడంతో మ్యాచ్ కాలేదు. – సూర్యారావు, సంగారెడ్డి జిల్లా అడిషనల్ డీఆర్‌డీఒ -
ఇళ్ల ముసుగులో.. దోపిడీ
- డబ్బులిచ్చుకో... ఇల్లు పుచ్చుకో...! - కాకినాడలో ఓ నేత కనుసన్నల్లో అడ్డగోలు బాగోతం - లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షం - ప్రహసనంగా మారిన ప్రధాని ఆవాజ్ యోజన పథకం కాకినాడ: ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం ప్రహసనంగా మారింది. పేదలకు దక్కాల్సిన ఇళ్లు అధికార పార్టీల నేతల సిఫార్సుల మేరకు వారి అనుచరులకే దక్కుతుండడంతో అర్హత కలిగిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఏక పక్షంగా ఎంపిక చేసి రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన కాకినాడలో కీలక నేత కనుసన్నల్లో అవినీతి బాగోతమంతా నడుస్తోంది. జిల్లాల వ్యాప్తంగా 19,240 ఇళ్లు... ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకంలో జిల్లాకు 19 వేల240 ఇళ్లను మంజూరు చేశారు. కాకినాడ నగర పాలక సంస్థలో 4,608, రాజమహేంద్రవరంలో 4200, మండపేటలో 4,064, పెద్దాపురంలో 1724, అమలాపురంలో 1636, పిఠాపురంలో 874, సామర్లకోటలో 1048, రామచంద్రపురం 1068 లబ్ధిదారులను ఎంపిక చేశారు. 300,365,403 ఎస్ఎఫ్టీ కేటగిరీల్లో ప్లాట్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అర్బన్ ప్రాంతాలైన జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అపార్ట్మెంట్ తరహాలో నిర్మాణం చేపట్టేందుకు గడచిన ఆరు నెలలుగా భూసేకరణ ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అంతవరకూ బాగానే ఉన్నా అర్హత కలిగిన పేద వర్గాలకు దక్కాల్సిన ఇళ్లు మాత్రం దళారుల చేతుల్లోకి వెళ్లి పోతుండడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా సొంతింటి కోసం కంటున్న కలలు నెరవేరుతాయనుకునే సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు నచ్చిన వారిని ఎంపిక చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుని నుంచి కొన్నిచోట్ల రూ.10 వేలు, మరికొన్ని చోట్ల రూ.20 వేల వరకు ముడుపులు కూడా తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాకినాడలో అవినీతి దందా... కాకినాడలో అవినీతిపరుల దందా ఎక్కువైంది. ఇప్పటికే భూముల కబ్జా, ఇతరత్రా వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్గదర్శకాలు పక్కన పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వాస్తవానికైతే, ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులను పీఎంఏవై వెబ్సైట్లో నమోదు చేస్తూ వచ్చారు. వచ్చిన దరఖాస్తుల్లో సీనియారిటీ, ప్రాధాన్యతా క్రమంలో అర్హత కలిగిన పేద వర్గాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం హౌసింగ్, నగరపాలక సంస్థకు చెందిన సిబ్బందితో సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే జిల్లా కేంద్రం కాకినాడలో అకస్మాతుగా కీలక ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఇళ్లు మంజూరైనట్టుగా కొంతమందికి మెసెజ్ రూపంలో సమాచారం పంపించారు. అసలు ఎవరు ఎంపిక చేశారు.? ఎప్పుడు సర్వే చేశారు? లబ్ధిదారుల జాబితాను ఎవరు, ఎక్కడ ప్రకటించారు? అన్నది వివరాలు వెల్లడించకుండానే సదరు ప్రజాప్రతినిధి నుంచి మెసెజ్‌లు వెళ్లాయి. అందులో క్లారిటీ లేకపోవడంతో మెసెజ్ అందుకున్న లబ్ధిదారులంతా సదరు నేత ఇంటికి క్యూ కట్టారు. అక్కడ స్పష్టత ఇచ్చాక మంజూరైన ఇళ్లకు సంబంధించిన డీడీలు పట్టుకుని కార్పొరేషన్ కార్యాలయానికి ఎగబడ్డారు. తమ్ముళ్ల చేతివాటం ... ఇళ్ల మంజూరులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఇంటికి రూ.20 వేలు చొప్పున వసూళ్లు చేసినట్టు కొందరు లబ్ధిదారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ముడుపులిచ్చాకే ఇళ్లు అన్నట్టుగా సంకేతాలివ్వడంతో తప్పని పరిస్థితుల్లో చెల్లించుకుంటున్న పరిస్థితి నెలకుంది. మిగతా మున్సిపాల్టీల్లో కూడా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాకినాడలో కొందరి తమ్ముళ్ల తిరుగుబాటు కాకినాడలో తెలుగు తమ్ముళ్లందర్నీ సదరు నేత సంతృప్తి పరచలేదు. కొందరికే ప్రాధాన్యత ఇచ్చి మిగతా కొందర్ని విస్మరించారు. దీంతో లబ్ధి చేకూరని తెలుగు తమ్ముళ్లంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వీరంతా శనివారం ఆందోళనకు దిగేందుకు సన్నద్ధమవ్వగా విషయం తెలిసి సదరు కీలక నేత హుటాహుటిన వారందర్నీ బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. వారిని సంతృప్తి పరిచేందుకు జాబితాలో స్వల్ప మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అడ్డగోలుగా లబ్ధిదారుల ఎంపిక ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని ఏ శాఖ పర్యవేక్షిస్తుందనే అంశంపై కూడా స్పష్టత లేకపోయింది. గతంలో ఇళ్ల కోసం అర్హులైన వారినుంచి డీడీలు తీసుకున్నారు. వారి జాబితాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న వారికి మొదట ప్రాధాన్యం కల్పించి, మిగతా వారిని ఎంపిక చేయాలి. ఒక్క కాకినాడ విషయానికొస్తే గతంలో వచ్చిన వాటిలో 1200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా సుమారు 39 వేల దరఖాస్తులొచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వాటికి ప్రాధాన్యతనిచ్చి, తాజాగా వచ్చిన వాటిలో ప్రాధాన్యత మేరకు ఎంపిక చేయాలి. అదికూడా గృహ నిర్మాణశాఖ ఆధీనంలో ఎంపిక జరగాల్సి ఉండగా ప్రస్తుతం నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. లబ్ధిదారుల ఎంపికపై గృహనిర్మాణ సంస్థ అధికారులను వివరణ కోరితే అంతా కార్పొరేషన్ చూసుకుంటుందని చెబుతున్నారు. కార్పొరేషన్ అధికారులను అడిగితే కేవలం దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ మాత్రమే చేస్తున్నామని, ఉన్నతాధికారుల సూచన మేరకు డీడీలు మాత్రమే తీసుకుంటున్నామని చెబుతున్నారు. మరి లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేశారంటే మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. దరఖాస్తులు ఆన్లైన్ మాత్రమే చేశాం... గృహ నిర్మాణ లబ్ధిదారులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేశాం. ఎంపికైన లబ్ధిదారుల నుంచి డీడీలు తీసుకున్నాం. ఎంపిక ప్రక్రియపై టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధం లేదు. – కాలేషా, సిటీప్లానర్, కాకినాడ