సాక్షి, అమరావతి: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లోకి నగదు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారులు.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కాపులు బీసీలా? ఓసీలా? అన్న అయోమయానికి గురిచేసిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టించిందని తెలిపారు. దాని వల్ల అగ్రవర్ణ పేదలకు ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడిందని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని, విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment