
సాక్షి, అమరావతి: ఇచ్చిన ప్రతిమాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి పేర్నినాని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా 59 లక్షల మందికిపైగా కాపులకు లబ్ధి పొందారని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా గురువారం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సుమారు 12వేల కోట్ల మేర కాపులకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. కరోనా కష్టకాలంనూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చెప్పిన ప్రతిమాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని పేర్నినాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment