సాక్షి, పశ్చిమ గోదావరి : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఎక్కడా వెనుకాడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, అబ్బాయ చౌదరి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గ మహిళలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏలూరులో మాట్లాడుతూ.. పాదయాత్రలో కాపు కార్పొరేషన్‌కు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కంటే ఎక్కువ ఇచ్చారని పేర్కొన్నారు. మాట ఇస్తే మడం తిప్పం అనే మాటను మరోసారి ముఖ్యమంత్రి నిరూపించారని ప్రశంసించారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం )
ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సృజన చౌదరి, కామినేని శ్రీ నివాసరావు భేటి పై ఉంగుటూరు, దెందులూరు ఎమ్మెల్యేలు వాసుబాబు,అబ్బాయ చౌదరి స్పందింస్తూ.. ఈ కలయిక వెనక టీడీపీ హస్తం ఉదని తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాలో తాము చేసిన ఆరోపణలపై ప్రచారం చేశాయని, నేడు ఆ ఎల్లో మీడియా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కలకయికలో ముగ్గురే కనిపించారని, కనిపించని నాలుగో వ్యక్తి ‘జూమ్ యాప్’ఎటువంటి సూచనలు చేశారో అని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌న ఎంతో గౌరవిస్తామని, నేడు ఇలాంటి కలయికను ఏమని చెప్పాలో తెలియడం లేదన్నారు. వారి కలయికలో ఎటువంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నారో, రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా భారతదేశ ఎలక్షన్ కమిషన్ స్పందించి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వాసుబాబు, అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?)
Comments
Please login to add a commentAdd a comment