Vasu babu
-
నాడు తండ్రి.. నేడు తనయుడు: దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో..
సాక్షి, ఏలూరు(గణపవరం): నాడు తండ్రి వైఎస్సార్, నేడు తనయుడు వైఎస్ జగన్ అడిగిందే తడవుగా ఉంగుటూరు నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపించారు. ఇద్దరూ గణపవరం పర్యటనకు వచ్చి సభాముఖంగా వరాలు ఇచ్చారు. పైగా ఇద్దరి సభా వేదిక ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం విశేషం. 2007లో తొలిసారి గణపవరం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గణవపరం ప్రభుత్వ డిగ్రీ కాలేజి ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గణపవరం డిగ్రీ కాలేజి అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేశారు. గణపవరం మండలంతోపాటు నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, అత్తిలి మండలాలకు ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రకాల్వ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాల్వలో పూడిక తీత, ఇరువైపులా గట్లు పటిష్టం చేసి ఒకవైపు బీటీ రోడ్డు, మరోవైపు కంకర రోడ్డు నిర్మించడం, ఆయా గ్రామాల వద్ద ఐదేసి కోట్ల రూపాయలతో వంతెనల నిర్మాణం చేపట్టారు. గణపవరంలో దాదాపు వెయ్యి ఇళ్లతో వైఎస్సార్ ఇందిరమ్మ కాలనీ నిర్మాణం ప్రారంభించి, వాటిని మరోసారి వచ్చి ప్రారంభోత్సవం చేశారు. చదవండి: (జనాన్ని బాదింది మీరు కాదా..బాబూ!) దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో సభ ఈనెల 16న గణపవరం వచ్చిన వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే ప్రదేశంలో ఏర్పాటుచేసిన సభావేదిక నుంచి ఉంగుటూరు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఈప్రాంతంలో ఆక్వా రైతాంగానికి మేలు చేసేలా యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే పదెకరాల రైతులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించి ఆక్వా రంగానికి ఊపిరి పోశారు. ఎమ్మెల్యే వాసుబాబు ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సబ్సిడీ విద్యుత్ పరిమితి ఐదెకరాల నుంచి పదెకరాలకు విస్తరించి ఎక్కువ మంది ఆక్వా రైతులకు మేలు చేయాలని కోరగా తక్షణమే ఆమోదిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న గణపవరం బొబ్బిలి వంతెనతోపాటు ఏలూ రు కాల్వపై మరో మూడు వంతెనల నిర్మాణానికి అనుమతించారు. గణపవరం మండలాన్ని భీమవరం డివిజన్‌లోకి మార్చడం, నియోజకవర్గంలో ఆరు 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, కొల్లేరు రీసర్వే, కొల్లేరులో కాంటూర్ నిర్మాణం, కొల్లేరుకు చెందిన 4 గ్రామాల్లో ఏటా తలెత్తే వేసవి దాహార్తిని తీర్చడానికి సమ్మర్‌స్టోరేజి ట్యాంకుల ఏర్పాటు తదితర వాసుబాబు కోరినవన్నీ మంజూరు చేస్తున్నట్లు సభాముఖంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. వరాల జల్లుతో ఈ ప్రాంతంపై వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అభినాన్ని చాటుకున్నారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ కె శ్రీధర్, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేడు భీమవరం రానున్న సీఎం వైఎస్ జగన్
భీమవరం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు రానున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం హాజరవుతారు. ఉదయం 11.15 గంటలకు వివాహ వేదిక కె–కన్వెన్షన్‌కు సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.20 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 11.25 గంటలకు కల్యాణ మండపానికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా హెలిప్యాడ్ వద్దకు ప్రధానమైన వారిని మినహా ఇతరులను అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. -
కనిపించని నాలుగో వ్యక్తి ‘జూమ్ యాప్’ ఏం చేశాడో..
సాక్షి, పశ్చిమ గోదావరి : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఎక్కడా వెనుకాడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, అబ్బాయ చౌదరి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గ మహిళలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏలూరులో మాట్లాడుతూ.. పాదయాత్రలో కాపు కార్పొరేషన్‌కు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కంటే ఎక్కువ ఇచ్చారని పేర్కొన్నారు. మాట ఇస్తే మడం తిప్పం అనే మాటను మరోసారి ముఖ్యమంత్రి నిరూపించారని ప్రశంసించారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం ) ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సృజన చౌదరి, కామినేని శ్రీ నివాసరావు భేటి పై ఉంగుటూరు, దెందులూరు ఎమ్మెల్యేలు వాసుబాబు,అబ్బాయ చౌదరి స్పందింస్తూ.. ఈ కలయిక వెనక టీడీపీ హస్తం ఉదని తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాలో తాము చేసిన ఆరోపణలపై ప్రచారం చేశాయని, నేడు ఆ ఎల్లో మీడియా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కలకయికలో ముగ్గురే కనిపించారని, కనిపించని నాలుగో వ్యక్తి ‘జూమ్ యాప్’ఎటువంటి సూచనలు చేశారో అని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌న ఎంతో గౌరవిస్తామని, నేడు ఇలాంటి కలయికను ఏమని చెప్పాలో తెలియడం లేదన్నారు. వారి కలయికలో ఎటువంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నారో, రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా భారతదేశ ఎలక్షన్ కమిషన్ స్పందించి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వాసుబాబు, అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?) -
వందకు వంద శాతం గెలుచుకుంటాం
సాక్షి, పశ్చిమ గోదావరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం స్థానాలు గెలుచుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు అన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ల ద్వారా గడప వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వెయ్యి రూపాయలు దాటిన చికిత్సకు ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఏలూరు పార్లమెంటరీ జిల్లా స్థానిక ఎన్నికల పరిశీలకులు పాతపాటి సర్రాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ప్రజాసంకల్పయాత్ర చేసి చరిత్ర సృష్టించారన్నారు. చెప్పిన మాట చేస్తారని ఆయన నిరూపించారని కొనియాడారు. ప్రజలకు హామీ ఇచ్చిన నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రజాబలం కలిగిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని నొక్కి చెప్పారు. ఈ ఎన్నికల్లో వందకు వంద శాతం తమ పార్టీనే గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. -
‘కిషోర్ హత్యకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’
సాక్షి, భీమడోలు(పశ్చిమగోదావరి జిల్లా) : టీడీపీ నేతలు దాడులు ఆపకపోతే చట్టపరమైన చర్యలతోపాటు ప్రజలే ఎదురు తిరిగి దాడులకు పాల్పడతారని డిప్యూటీ సీఎం ఆళ్లనాని హెచ్చరించారు. భీమడోలు మండలం అంబరుపేట గ్రామంలో శుక్రవారం టీడీపీ కార్యకర్తల దాడిలో మృతిచెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పసుమర్తి వెంకట కిషోర్ కుటుంబ సభ్యులను ఆళ్లనాని, ఉంగుంటూరు ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి మాట్లాడుతూ.. వెంకట కిషోర్ సాగు చేసుకుంటున్న భూమికి మాజీ శాసనసభ్యుడు గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలానికి ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ భూమిని కాజేయడం కోసం ఇలాంటి హత్య రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గత అయిదేళ్లలో టీడీపీ నేతలు ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో అందరికీ తెలుసని, ప్రస్తుతం అధికారం కోల్పోయినా దాడులు మాత్రం ఆపడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారని, తొమ్మిదో వ్యక్తి గన్ని గోపాలం పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. మృతుడు కిషోర్ కుటుంబానికి న్యాయం చేస్తామని, ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ హత్యకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని మంత్రి ఆళ్ల నాని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఉప్పల వాసుబాబు మాట్లాడుతూ.. ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. దోషులకు చట్టరీత్యా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుడు కిషోర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో కావాలనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయినా టీడీపీ నేతలు దాడులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (సంబంధిత వార్త: వైఎస్సార్సీపీ నేత దారుణహత్య) -
‘పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నందుకు..’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన పుప్పాల వాసుబాబు 33 వేల ఓట్ల మెజర్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో వాసుబాబును అభినందించడానికి అభిమానులు ఆయన నివాసానికి పోటేత్తారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. అందుకే ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పంష్టం చేశారు. -
ఉంగుటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబబు ప్రచారం
-
రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ ఫాలన కోరుకుంటూన్నారు
-
ప్రజా సంక్షేమమే అజెండా
సాక్షి, ఉంగుటూరు: ప్రజాభిమానమే పెట్టుబడిగా, నిత్యం ప్రజలలోనే ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ ప్రజాసంక్షేమమే అజెండాగా దూసుకుపోతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు). పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకువెళ్లడంతోపాటు ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించారు. ప్రశ్న: మీ వ్యక్తిగత వివరాలు వాసుబాబు : మాది నిడమర్రు మండలం బువ్వనపల్లి. 1967లో భూస్వామ్య జమీందారి కుటుంబంలో జన్మించా. ఇంటర్ వరకు చదివాను. ఆక్వా చెరువులు, రైస్‌మిల్లులు, సినిమా థియేటర్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నా. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు. మాతాత, తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. 2006లో బువన్నపల్లి సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాను. 2014 ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమిపాలయ్యా. ప్రశ్న : 2014లో ఓటమి ఎలా అనిపించింది వాసుబాబు : 2014 ఎన్నికలల్లో ఓటమి నాకన్నా పార్టీ కార్యకర్తలు, అభిమానులను బాగా నిరుత్సాహానికి గురిచేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లలో ఉంగుటూరు ఒకటని బాగా ప్రచారం జరిగింది. అన్నిరకాల అంచనాలు మా పార్టీకే అనుకూలంగా ఉన్నా చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మిన రైతులు, మహిళలు తెలుగుదేశం వైపు మొగ్గుచూపడంతో స్వల్పతేడాతో ఓడిపోయాను. ప్రశ్న : ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి వాసుబాబు : ఉంగుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం. జగన్ ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు పార్టీ విజయావకాశాలను బాగా పెంచాయి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ అరాచకపాలన, జన్మభూమి కమిటీల దోపిడీ, ఇసుక, మట్టితో సహా సర్వం అవినీతిమయం కావడంతో ప్రజలు జగన్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రశ్న : మీరు గెలిస్తే ఏం చేస్తారు వాసుబాబు : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛ తాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపడతాను. అంతర్గత రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సదుపాయం, అర్హులందరికీ ఇళ్లస్థలాలు, ప్రభుత్వ గృహాలు మంజూరుకు ప్రాధాన్యత ఇస్తాను. చంద్రబాబు కారణంగా కొల్లేరులో జీవనోపాధి కోల్పోయిన మత్య్సకార కుటుంబాలకు జీవనోపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తా. ముఖ్యంగా అవినీతిరహిత పాలన అందిస్తాను. ప్రశ్న : వైఎస్సార్ సీపీలోకి ఎలా వచ్చారు వాసుబాబు : మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన పాలన నన్నెంతో ఆకట్టుకుంది. వైఎస్సార్ అకాల మరణం, రాష్ట్రంలో పాలన గాడితప్పడం, జగన్‌పై కక్ష సాధింపులు, సమైక్యాంధ్ర కోసం జగన్ చేసిన పోరాటంతో జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నా. 2012లో వైఎస్సార్ సీపీలో చేరా. అప్పటినుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నా. ప్రశ్న : ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వాసుబాబు : నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మంచి సానుకూలత ఉంది. ప్రజలు చంద్రబాబు అబద్ధపు హామీలతో ఎలా నష్టపోయామో గ్రహించారు. అందుకే నిను నమ్మంబాబూ అంటూ చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఎన్నికలకు నెలరోజుల ముందు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకురావడాన్ని అంతా గుర్తించారు. -
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్
సాక్షి, పశ్చిమగోదావరి: ఎన్నికల వేళ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతే ఉంది. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఉంగుటూరు నియోజకవర్గానికి టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు బళ్ళ త్రిమూర్తులు నియోజకవర్గ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పుప్పాల వాసుబాబు ఉంగుటూరు మండలం సీతారాంపురం గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ నినాదంతో గడపగడపకు నవరత్నాలు గురించి వివరిస్తు ప్రచారం నిర్వహించారు. నారాయణపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బళ్ళ త్రిమూర్తులు పాటు 80 మంది అనుచరులతో వచ్చి వైసీపీలో చేరారు. పాతూరు గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ర్యాలీలోతో వచ్చిన మండల కన్వీనర్ మరడా వెంకట మంగారావు, కేంద్రపాలక సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, దండు రాము, రావిపాటి సత్యశ్రీనివాస్, సంకు సత్యకుమార్, బళ్ళ త్రిమూర్తులతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
బాబును ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-
అలా... ‘పేరు’ గాంచారు
సాక్షి, కొవ్వూరు : జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన నేతలకు, పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులుగా చలామణిలో ఉన్న వారికి అసలు పేరు కంటే నిక్ నేమ్స్, ముద్దుపేర్లే బాగా ప్రాచూర్యం పొందాయి. నాని.. బాబు.. బుజ్జి వంటి పేర్లు కలిగిన నాయకులు ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్నారు. కొందరు పొడవాటి పేర్లు కలిగిన నాయకులను చిన్నపేర్లు పెట్టి పిలవడం పరిపాటి. ఇలా ఆ పేర్లే ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. కొందరికైతే అసలు పేరు కంటే ముద్దుపేర్లు చెబితే గాని తెలియని పరిస్ధితి ఉంది. ఏలూరుకి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పూర్తి పేరు కాళీకృష్ణ శ్రీనివాస్. అయినా జిల్లా వాసులకు ఆయన నానిగానే సుపరిచితులు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు వెంకటేశ్వరరావు. జిల్లా నాయకులతోపాటు రాష్ట్ర పార్టీ నాయకులంతా ఆయన్ను బాబుగానే పిలుస్తుంటారు. పూర్తి పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు. నాని అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉంది. మాజీ రాజ్యసభ సభ్యుడు యర్రా నారాయణస్వామి జిల్లావాసులకు సుపరితులు. ఆయన్ను బెనర్జీగా పిలుస్తుంటారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆచంట వైఎస్సాఆర్ సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగరాజు పూర్తిపేరు శ్రీరంగనాథరాజు. సన్నిహితులు రంగరాజుగా పిలుస్తుంటారు. ఉండి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును ఎక్కువ మంది అబ్బాయిరాజుగా పిలుస్తుంటారు. వైఎస్సార్ సీపీ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును ఈ ప్రాంత వాసులు కృష్ణబాబుగా పిలుస్తుంటారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన పూర్తి పేరు మాత్రం గెడ్డం సూర్యారావు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును సన్నిహితులంతా రామంగా పిలుస్తుంటారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజును సన్నిహితులు మీసాల బాపిరాజుగా పిలుస్తారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు. ఉంగుటూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వుప్పాల శ్రీనివాసరావుని వాసుబాబుగా పిలుస్తారు. జిల్లా వాసులందరికీ వాసుబాబుగానే సుపరిచితులు. -
‘ఎంసెట్’ నిందితులు సీఐడీ కస్టడీకి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో అరెస్టయి న శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను ఆరు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కార్పొరేట్ కాలేజీల గుట్టు విప్పేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. లీకైన ప్రశ్నపత్రంపై క్యాంపులో శిక్షణ పొందిన 136 మంది విద్యార్థుల వాంగ్మూలాలను సీఐడీ ఇప్పటివరకు సేకరించింది. వారిలో 80 శాతం మంది ఈ రెండు కాలేజీలకు చెంది న వారే ఉండటంతో వాసుబాబు, శివనారాయణ కస్టడీ విచారణ కీలకం కానుందని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడ్డారు. కమీషన్ల కోసమే విద్యార్థులను క్యాంపులకు పంపించామంటూ వాసుబాబు, శివనారాయణ చెబుతుండగా కమీషన్ల కోసమే అయితే ఇంత మంది ఒకే గ్యాంగుతో ఎలా క్యాంపులకు వెళ్తారని సీఐడీ అనుమానిస్తోంది. రెండు కార్పొరేట్ కాలేజీల్లో చదివి, ప్రస్తుతం మెడికోలుగా ఉన్న ఆరుగురు బ్రోకర్లు సైతం మాఫియా తో చేతులు కలపడం వెనుకున్న రహ స్యాన్ని బయటపెట్టేందుకు వాసుబాబు, శివనారాయణ కస్టడీ కీలకమని అధికారులు తెలిపారు. శ్రీచైతన్యలోనే చదివిన బ్రోకర్, మెడికో గణేష్‌ప్రసాద్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు వాసుబాబు, శివనారాయణ మెడకు ఉచ్చు బిగేంచేలా ఉన్నట్లు తెలిసింది. ఏటా ఎంసెట్ సమయంలో వీరిద్దరూ గణేష్, ఇతర నిందితులైన డాకర్లు ధనుంజయ్, సందీప్‌లతోనూ వ్యవహారం నడిపినట్లు తేలింది. దీంతో కేవలం ఆరుగురు విద్యార్థులనే కాకుండా వాసుబాబు, శివనారాయణ ఈ రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరికొందరిని క్యాంపులకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ లింకు ఛేదించేందుకు శుక్రవారం నుంచి ఆరురోజులపాటు ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. -
ఎంసెట్ స్కాం కేసు సీఐడీ కస్టడీకి డీన్ వాసుబాబు
-
ఎంసెట్ లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల హస్తం