
సాక్షి, పశ్చిమగోదావరి: ఎన్నికల వేళ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతే ఉంది. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఉంగుటూరు నియోజకవర్గానికి టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు బళ్ళ త్రిమూర్తులు నియోజకవర్గ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పుప్పాల వాసుబాబు ఉంగుటూరు మండలం సీతారాంపురం గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ నినాదంతో గడపగడపకు నవరత్నాలు గురించి వివరిస్తు ప్రచారం నిర్వహించారు.
నారాయణపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బళ్ళ త్రిమూర్తులు పాటు 80 మంది అనుచరులతో వచ్చి వైసీపీలో చేరారు. పాతూరు గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ర్యాలీలోతో వచ్చిన మండల కన్వీనర్ మరడా వెంకట మంగారావు, కేంద్రపాలక సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు, దండు రాము, రావిపాటి సత్యశ్రీనివాస్, సంకు సత్యకుమార్, బళ్ళ త్రిమూర్తులతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment