‘పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నందుకు..’ | YSRCP Puppala Vasu Babu Thanks To Followers Over Winning Election | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన వాసు బాబు

Published Fri, May 24 2019 2:24 PM | Last Updated on Fri, May 24 2019 2:59 PM

YSRCP Puppala Vasu Babu Thanks To Followers Over Winning Election - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చారిత్రక విజయం సాధించింది. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన పుప్పాల వాసుబాబు 33 వేల ఓట్ల మెజర్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో వాసుబాబును అభినందించడానికి అభిమానులు ఆయన నివాసానికి పోటేత్తారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ..  గత పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. అందుకే ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు.

తమ నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పంష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement