unguturu
-
పుప్పాల వాసుబాబు భారీ బైక్ ర్యాలి
-
కృష్ణా: ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసు కొట్టివేత
సాక్షి, కృష్ణా జిల్లా: సంచలనం సృష్టించిన ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆధారాలు లేవంటూ ఈ కేసును ఏడీజే(జిల్లా అదనపు జడ్జి) కోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 24, 2014న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తడంతో హత్య కోసం ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లను మాట్లాడారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను ఢిల్లీలోనే అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి గంధం మారయ్య, పగిడి మారయ్యలు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు ఏలూరు నుంచి వారి తండ్రి గంధం నాగేశ్వరరావు వచ్చారు. అంతకుముందే విమానాశ్రయం వద్ద బాలాజీ, మహేష్, శివలు ఎరుపురంగు కారులో క్యాప్‌లు ధరించి ఉన్నారు. వీరితో పాటు పల్సర్ బైక్‌పై హంతకముఠా సభ్యుడు(షూటర్స్బ్యాచ్ )కూడా అక్కడే ఉన్నట్టు పోలీసులు కేసు రిపోర్టులో పేర్కొన్నారు. చదవండి: ప్రియునితో జీవిస్తోందని భర్త కిరాతకం? విమానం దిగి బయటకు వచ్చి తవేరా కారు ఎక్కగానే ఆ ముగ్గురూ చంపాల్సిన వ్యక్తులని షూటర్‌కు చూపించారు. దీంతో అతను షూటర్స్‌కు సమాచారం అందించాడు. తవేరా కారును ఆ షూటర్స్ మరో కారులో వెంబడించి గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హతమార్చారు. శివ, మహేష్, బాలాజీలు ఘటన అనంతరం గుంటూరు వెళ్లి కారును వదిలి బస్సులో చెన్నై వెళ్లారు. -
ఉంగుటూరులో ముమ్మరంగా శానిటేషన్ పనులు
-
కరోనా: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం
సాక్షి, అమరావతి: కరోనా నివారణ చర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు, వ్యాపార వేత్తలు, వర్తక, వాణిజ్య సంఘాలు సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించాయి. ఈమేరకు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి 1 కోటి 4 లక్షల 7 వేల 838 రూపాయల చెక్కును అందజేశారు. ప్రధానమంత్రి సహాయ నిధికి.. ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వేములపల్లి రవి కిరణ్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.38 లక్షల విరాళం ప్రకటించారు. ఈమేరకు విజయవాడలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.విద్యాసాగర్‌ను కలిసి ముప్పై ఎనిమిది లక్ష రూపాయల చెక్కును అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణరంగ కార్మికుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని రవికిరణ్ అన్నారు. -
గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి
సాక్షి, ఉంగుటూరు : గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురంలో చోటు చేసుకుంది. రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజే కొద్దిగా వర్షం తెరిపి ఇవ్వడంతో పెద్దిరెడ్డి రాఘవమ్మ(60) అనే వృద్ధురాలు అటుగా వెలుతున్న సిరిపురపు శ్రీను(40) ఇంటిపై కవర్ కప్పాల్సిందిగా కోరింది. దీంతో శ్రీను ఇంటిపైకి బరకం వేస్తుండగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో శ్రీను, రాఘవమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. -
‘పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నందుకు..’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన పుప్పాల వాసుబాబు 33 వేల ఓట్ల మెజర్టీతో గెలుపొందారు. ఈ క్రమంలో వాసుబాబును అభినందించడానికి అభిమానులు ఆయన నివాసానికి పోటేత్తారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. అందుకే ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ.. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పంష్టం చేశారు. -
దళిత యువకులను చితకబాదిన టీడీపీ నేతలు
-
దళితులపై ‘దేశం’ దాడి
-
దళితులపై ‘దేశం’ దాడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టీడీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. సమస్యలపై నిలదీశారనే అసహనంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని పెదలింగంపాడు గ్రామంలో దళిత యువకులపై టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు వర్గీయులు దాడికి దిగారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తమ గ్రామాన్ని పట్టించుకోలేదని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించలేదంటూ పెదలింగంపాడు దళితులు వినతిపత్రమిస్తుండగా ఆయన కాన్వాయ్ వెంట వచ్చిన అనుచరులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళిత యువకులపై పిడిగుద్దులు కురిపించారు. వారిని చితకబాదారు. ఈ ఘటనలో పలువురు దళిత యువకులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు తన కాన్వాయ్‌తో దళితగ్రామమైన పెదలింగంపాడుకు చేరుకున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన అనుచరులు జై గన్ని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా.. పలువురు దళిత యువకులు తమ గ్రామ సమస్యలపై విన్నవిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఐదేళ్లకాలంలో తమ సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యేను వారీ సందర్భంగా ప్రశ్నించారు. మరో ఐదేళ్లపాటు అధికారమిస్తే ఏమి చేస్తారంటూ గ్రామంలోని మురుగునీరంతా రోడ్డుపై రావడాన్ని చూపుతూ నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు టి.వెంకటేశ్వరరావు, ఆర్.బుజ్జిగోపాల్ తదితరులు దళిత యువకులపై వీరంగం వేశారు. వారిపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించారు. చితకబాదారు. టీడీపీ వర్గీయుల దాడిలో దళిత యువకులు గంటా జగదీష్, కురమా సువర్ణరాజు, పులిపాటి సునీల్‌కు గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామానికొచ్చి తమవారిని చితకబాదడమేంటంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో గన్ని తన కాన్వాయ్‌తో వెనుతిరిగి వెళ్లిపోయారు. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిని వైఎస్సార్సీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు తదితరులు పరామర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీవారు గ్రామాల్లో అరాచక శక్తులతో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. -
ఉంగుటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబబు ప్రచారం
-
రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ ఫాలన కోరుకుంటూన్నారు
-
ప్రజా సంక్షేమమే అజెండా
సాక్షి, ఉంగుటూరు: ప్రజాభిమానమే పెట్టుబడిగా, నిత్యం ప్రజలలోనే ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ ప్రజాసంక్షేమమే అజెండాగా దూసుకుపోతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు). పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకువెళ్లడంతోపాటు ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించారు. ప్రశ్న: మీ వ్యక్తిగత వివరాలు వాసుబాబు : మాది నిడమర్రు మండలం బువ్వనపల్లి. 1967లో భూస్వామ్య జమీందారి కుటుంబంలో జన్మించా. ఇంటర్ వరకు చదివాను. ఆక్వా చెరువులు, రైస్‌మిల్లులు, సినిమా థియేటర్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నా. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు. మాతాత, తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. 2006లో బువన్నపల్లి సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాను. 2014 ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమిపాలయ్యా. ప్రశ్న : 2014లో ఓటమి ఎలా అనిపించింది వాసుబాబు : 2014 ఎన్నికలల్లో ఓటమి నాకన్నా పార్టీ కార్యకర్తలు, అభిమానులను బాగా నిరుత్సాహానికి గురిచేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లలో ఉంగుటూరు ఒకటని బాగా ప్రచారం జరిగింది. అన్నిరకాల అంచనాలు మా పార్టీకే అనుకూలంగా ఉన్నా చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మిన రైతులు, మహిళలు తెలుగుదేశం వైపు మొగ్గుచూపడంతో స్వల్పతేడాతో ఓడిపోయాను. ప్రశ్న : ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి వాసుబాబు : ఉంగుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం. జగన్ ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు పార్టీ విజయావకాశాలను బాగా పెంచాయి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ అరాచకపాలన, జన్మభూమి కమిటీల దోపిడీ, ఇసుక, మట్టితో సహా సర్వం అవినీతిమయం కావడంతో ప్రజలు జగన్‌కు అధికారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రశ్న : మీరు గెలిస్తే ఏం చేస్తారు వాసుబాబు : నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛ తాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపడతాను. అంతర్గత రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సదుపాయం, అర్హులందరికీ ఇళ్లస్థలాలు, ప్రభుత్వ గృహాలు మంజూరుకు ప్రాధాన్యత ఇస్తాను. చంద్రబాబు కారణంగా కొల్లేరులో జీవనోపాధి కోల్పోయిన మత్య్సకార కుటుంబాలకు జీవనోపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తా. ముఖ్యంగా అవినీతిరహిత పాలన అందిస్తాను. ప్రశ్న : వైఎస్సార్ సీపీలోకి ఎలా వచ్చారు వాసుబాబు : మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన పాలన నన్నెంతో ఆకట్టుకుంది. వైఎస్సార్ అకాల మరణం, రాష్ట్రంలో పాలన గాడితప్పడం, జగన్‌పై కక్ష సాధింపులు, సమైక్యాంధ్ర కోసం జగన్ చేసిన పోరాటంతో జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నా. 2012లో వైఎస్సార్ సీపీలో చేరా. అప్పటినుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తున్నా. ప్రశ్న : ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వాసుబాబు : నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి మంచి సానుకూలత ఉంది. ప్రజలు చంద్రబాబు అబద్ధపు హామీలతో ఎలా నష్టపోయామో గ్రహించారు. అందుకే నిను నమ్మంబాబూ అంటూ చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఎన్నికలకు నెలరోజుల ముందు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకురావడాన్ని అంతా గుర్తించారు. -
బాబును ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-
సొంత భజన.. విమర్శల వాన
ద్వారకాతిరుమల/ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలులో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు జనాదరణ కరువైంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో ఆది వారం రాత్రి జరిగిన సభలో సొంత డబ్బా కొట్టుకోవడానికి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ప్రధాని మోదీ ని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడ్డారు. సీఎం సభకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలబోయింది. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే కష్టం వైఎస్సార్ సీపీ రూలింగ్‌లోకి వస్తే తాము మాట్లాడలేమని, అందుకే ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. తాను ప్రజలకు అన్ని పనులు చేశానని గొప్పలు చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద కేసీఆర్ కక్షగట్టాడని, గుజరాత్ కంటే తాను మించిపోతానన్న భయం ఆయన్ను వెంటాడుతుందన్నారు. బాబు ముందే నిరసన పోలవరం అసెంబ్లీ అభ్యర్ధిగా మొడియం శ్రీనివాసరావు వద్దంటూ కొందరు పార్టీ కార్యకర్తలు చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించారు. నరసాపురం అసెంబ్లీ టికెట్ కొత్తపల్లి సుబ్బారాయుడికి ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని వారించారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ జిల్లాపరిషత్ చైర్మన్ బాపిరాజును సభావేదికపై చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. బాపిరాజు త్యాగమూర్తి అని, పార్టీ అతన్ని గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు, బండారు మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉంగుటూరు.. ఆ దారే వేరు..
సాక్షి, భీమడోలు(ఉంగుటూరు) : నియోజకవర్గం 1967లో ఆవిర్భవించింది. అంతకుముందు తొలుత 1955లో అలంపురం నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పెంటపాడు నియోజకవర్గంలో ఉండేది. 1967లో ఉంగుటూరు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009 పునర్విభజనకి ముందు పూర్తి మెట్టప్రాంతంగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమడోలు, ఉంగుటూరు మండలాలకు డెల్టా మండలాలైన నిడమర్రు, గణపవరం మండలాలను కలపడంతో మెట్ట, డెల్టా మేలుకలయికగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన కొల్లేరు ప్రాంతం నియోజవర్గంలోనూ విస్తరించి ఉంది. భౌగోళిక స్వరూపం గ్రామాలు : 81 సాగు విస్తీర్ణం : 27,064హెక్టార్లు ఆక్వా సాగు విస్తీర్ణం : 14,474 ప్రధాన పంటలు : వరి, మొక్కజొన్న,చెరకు, అపరాలు మెట్ట. ఇదీ ఉంగుటూరు నియోజకవర్గం ముఖచిత్రం. నియోజకవర్గంలో మండలాలు:భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం జనాభా : 2,66,139 పురుషులు:1,19,070 స్త్రీలు:1,47,069 ఓటర్లు : 1,93,475 పురుషులు:96,241 స్త్రీలు:97,221 ఇతరులు:13 రాజకీయ ప్రత్యేకత ఉంగుటూరు నియోజవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందనే భావన బలంగా ఉంది. అలాగే చరిత్రను చూస్తే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజేతలైన దాఖాలాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చింది. దీంతో వరుసగా 2004, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంతకుమార్ గెలుపొందారు. రాజకీయ చైతన్యం ఎక్కువ ఈ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే, విద్యావేత్త, విద్యాదాత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా వాటిలో ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురానికి చెందిన వట్టి వెంకటరంగ పార్థసారథి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. వీవీఆర్ పార్థసారథి తనయుడు వట్టి వసంతకుమార్ దివంగత సీఎం వైఎస్సార్ ప్రధాన అనుచరుడు. ఆయన ఆశీస్సులతో 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రెండో సారి గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. కాంటూరు హామీకి తూట్లు కొల్లేరు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రాంత పరిరక్షణకు గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కొల్లేరులోని అభయారణ్యం పరిధి ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించి తీరుతానని, మిగిలిన భూములు పేదలకు పంచుతానని స్పష్టం చేశారు. కొల్లేరులోని 9 మండలాల్లో ఐదో కాంటూరు దిగువన గల 77138 ఎకరాల్లో చేపల చెరువులను కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వసం చేశారు. అయితే ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తే 14,861 ఎకరాల మిగులు భూములు ఉంటాయి. వాటన్నింటినీ పేదలకు పంచుతానని పేర్కొన్నారు. అయితే ఈ హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు. జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇస్తామని ఇచ్చిన హామీనీ విస్మరించారు. బాబు హయాంలోనే కొల్లేరు కలుషితం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆక్వా బకాసురులు కొల్లేరుపై కన్నేశారు. చేపల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరు కలుషితమైపోయింది. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చే విదేశీ పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో పక్షుల జాతి అంతరించిపోవడాన్ని గమనించిన విదేశాలు తాము ఇచ్చిన నిధులు దుర్వినియోగమవుతున్నాయని ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో చంద్రబాబు కొల్లేరు చెరువుల ధ్వంసానికి జీఓ నంబర్ 120 ఇచ్చారు. ఆ జీఓ కొల్లేరు ప్రజల పాలిట శాపంగా మారింది. 2006లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అప్పటి ప్రభుత్వం చెరువులను ధ్వంసం చేసింది. కొల్లేరు వాసుల జీవనం అధ్వానంగా మారేందుకు చంద్రబాబు కారకుడయ్యారు. ముఖ్య సమస్యలివీ.. ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ హయాంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ హయాంలో పేదల కోసం ఒక్క సెంటు భూమి కొనలేదు. వైఎస్సార్ హయాంలో సేకరించిన భూమిలోనే ఇళ్లస్థలాలు ఇచ్చి జబ్బలు చరుచుకుంది టీడీపీ సర్కార అర్హులైన వారికి ఇళ్లస్థలాలు ఇచ్చిన దాఖలాలే లేవు. ఫలితంగా అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో హర్షాతిరేకం చంద్రబాబు జీఓతో కొల్లేరు వాసులు పొట్టకొట్టిన నేపథ్యంలో ఇక్కడి మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్సీని ఇస్తానని, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కొల్లేరు ప్రాంత ప్రజలు ఆయన అధికారం చేపట్టే క్షణం కోసం నిరీక్షిస్తున్నారు. వలసల పాపం బాబుదే నియోజకవర్గంలోని నిడమర్రు, భీమడోలు మండలాల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ మత్స్యసిరికి కొదవ ఉండేది కాదు. విదేశీ పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదంగా ఉండేది. ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి సంతాన ఉత్పత్తి కోసం పక్షులు ఇక్కడికి వచ్చేవి. దీంతో కొల్లేరు సంరక్షణకు ఆయా దేశాలు ఆర్థిక చేయూతనిచ్చేవి. అయితే స్వచ్ఛ కొల్లేరు ధ్వంసం అయిపోయింది. మత్స్యసంపదపై ఆధారపడి జీవించే వేలాది జీవితాలు నాశనమయ్యాయి. మత్స్యకారులు వలసబాట పట్టారు. పొట్ట చేత పట్టుకుని ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. కొందరు ఇళ్లలో వృద్ధులు, పిల్లలను వదిలేసి మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలకు పనుల కోసం పోయారు. ఈ పాపమంతా ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. భీమడోలు మండలంలోని పాతూరు సహకార చక్కెర కర్మాగారం చంద్రబాబు హయాంలోనే మూతపడింది. ఆ ఫ్యాక్టరీని నమ్ముకున్న వేలాదిమంది రోడ్డున పడ్డారు. జీవనం కోసం వలసపోయారు. -
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం
ఉంగుటూరు: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు కొనసాగతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు టోల్గేట్ వద్ద ఆదివారం తెలల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు టోల్గేట్ వద్ద గల కంటైనర్ రూం ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు టోల్గేట్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు బస్సులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
club closed
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎట్టకేలకు పేకాట క్లబ్ మూతపడింది. ఉంగుటూరు మండలం నారాయణపురంలో టీడీపీ నేతలు పేకాట క్లబ్ నెలకొల్పిన వైనాన్ని ’ఆడుకో పేక.. ఆపేవారు లేరిక’ శీర్షికన ’సాక్షి’ శుక్రవారం సంచికలో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీనిపై స్పందించిన పోలీసులు తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ క్లబ్ నిర్వాహకులను తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో క్లబ్‌కు తాళాలు శుక్రవారం వేశారు. ఈ నిర్ణయం పేకాటరాయుళ్లకు మింగుడు పడలేదు. అధికార పార్టీ నేతల అండదండలు, వారికి నెలవారీ మామూళ్లు ఇవ్వడానికి సిద్ధపడినా ప్రయోజనం లేకుండా పోవడంపై వారు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. క్లబ్‌ను తెరిపించేందుకు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్తు ప్రారంభమైనట్టు సమాచారం. కొత్త క్లబ్‌కు సమీపంలో ఉన్న పాత క్లబ్‌లోనూ ఎటువంటి జూదం నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేయటంతో అసలుకే మోసం వచ్చిందంటూ నిర్వాహకులు నెత్తీనోరు బాదుకుంటున్నట్టు సమాచారం. -
సినీఫక్కీలో చోరీ
ఉంగుటూరు : ఉంగుటూరులోని ఓ ఇంటిని దోచుకున్న దొంగలు సినీఫక్కీలో పరారయ్యారు. ఈ ఉదంతం ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరులో జాతీయ రహదారి పక్కన మోగంటి రామమోహనరావుకు ఆటోమొబైల్ షాపు ఉంది. అక్కడే ఆయన ఇల్లు కూడా. ఆయన కుటుంబ సమేతంగా కారులో ఆదివారం ఉదయం బందరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి వచ్చారు. రామమోహనరావు, ఆయన తండ్రి వేణుగోపాలరావు కారు దిగారు. రామమోహనరావు భార్య లలిత ఇంటి తాళాలు అతనికి ఇచ్చి కారులో నిద్రపోయిన కూతురు శ్రుతిని లేపుతుండగా ఓ ఆగంతకుడు ఆమె మెడలోని మంగళసూత్రాలను లాగేందుకు యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో రామమోహనరావు, వేణుగోపాల్ అతనివెంట పడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత అనుమానం వచ్చి ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా, సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని 8 కాసుల బంగారం, అర కేజీ వెండి, రూ.25వేలు కనిపించలేదు. మొత్తం విలువ రూ.2.50లక్షలుపైనే ఉంటుంది. ఇంటి వెనుక తలుపులను బద్దలుకొట్టి దుండగులు లోపలికి ప్రవేశించినట్టు గుర్తించారు. ఆ ప్రాతంలో ఇనుపరాడ్ పడేసి ఉంది. చోరీకి వచ్చిన దుండగులు ఓ వ్యక్తిని బయట కాపలా ఉంచి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి లోపలున్న వ్యక్తులకు సిగ్నల్ ఇవ్వడానికే మంగళసూత్రం లాగేందుకు యత్నించాడని, బయట కేకలు విని లోపల ఉన్న దుండగులు పారిపోయి ఉంటారని రామమోహనరావు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అనంతరం రామమోహనరావు 108కి సమాచారం ఇవ్వగా అక్కడి నుంచి చేబ్రోలు స్టేషన్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ సీఐ నరసింహమూర్తి వేలిముద్రలు సేకరించారు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీతిల్లిపోయా ‘నా మెడలో మంగళ సూత్రం లాగేందుకు ఓ వ్యక్తి యత్నించడంతో భీతిల్లిపోయా’ అని మోగంటి లలిత ఆవేదనతో చెప్పారు. దొంగ ఎర్రగా, పొట్టిగా ఉన్నాడని, 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని పేర్కొన్నారు. తాము వచ్చే సమయానికే ఇంటిలో దొంగలు ఉన్నారని, వారిని అక్కడి నుంచి పంపించడానికే బయట ఉన్న దొంగ తన మంగళసూత్రం లాగాడని, తాను కేకలు వేయడంతో లోపలున్న దొంగలు పరారయ్యారని వివరించారు. -
నగదు అందక రోడ్డెక్కిన జనం
జాతీయ రహదారిపై రాస్తారోకో ఉంగుటూరు : సొమ్ములు లేవని బ్యాంకు అధికారులు బోర్డు పెట్టడంతో ఆగ్రహించిన ఖాతాదారులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఎస్బీఐ శాఖలో డబ్బులు లేవని బోర్డు పెట్టడంతో జనం ఆందోళనకు దిగారు. డబ్బు కోసం ప్రతి రోజు బ్యాంకు వద్ద క్యూలో నిలబడినా సక్రమంగా అందటం లేదని, ఇప్పుడు అసలు నగదు లేదనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు మూడు రోజుల సెలవుల నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. తమ ఖాతాల్లోని డబ్బు చేతికిరాక కుటుంబ పోషణ భారంగా మారిందని నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ వచ్చి వాహనాలను పంపించే ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. చివరకు అందరికీ నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. -
చీటీల కేసులో తండ్రీకొడుకులు అరెస్ట్
ఉంగుటూరు : చీటీల పేరుతో మోసగించిన తండ్రీకొడుకులను బుధవారం అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ చావా సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉంగుటూరుకు చెందిన అడపాప్రసాద్, రాంబాబు తండ్రీకొడుకులు. వీరు చీటీలు నిర్వహించి పాడుకున్నవారికి డబ్బులు చెల్లించలేదు. వీరి బారిన పడిన బాధితులు సుమారు 200 మంది ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు ప్రసాద్, రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారని ఎస్ఐ వెల్లడించారు. -
మహిళ గొంతులో దిగిన రాడ్
– రోడ్డు ప్రమాదంలో దుర్ఘటన ఉంగుటూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం ఫత్తేపురం గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గొంతులోకి ఆటో మిర్రర్ రాడ్ దిగింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. నిడమర్రుకు చెందిన 10మంది మహిళా కూలీలు చేబ్రోలులోని కోళ్లఫారంలో పనిచేయడానికి ఆటోలో బయలుదేరారు. ఆ ఆటోను ఫత్తేపురం వద్ద ఎదురుగా వస్తున్న ఖాళీ ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. బైనేపల్లి గ్రామానికి చెందిన పెనుమాక లక్ష్మీకాంతం గొంతులోకి అదే ఆటో మిర్రర్ రాడ్డు దిగింది. వీరిని 108 వాహనంలో తాడేపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు చికిత్స చేశారు. లక్ష్మీకాంతం గొంతులోని రాడ్‌ను చాకచక్యంగా తొలగించారు. -
120 సినిమాలు.. 60 సీరియళ్లలో నటించా
ఉంగుటూరు : ప్రేక్షకుల ఆదరాభిమానాలే మాకు కొండంత గుర్తింపు అని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాజ్‌పేయి అన్నారు. స్వగ్రామైన ఉంగుటూరు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నా అసలు పేరు వాజŒ పేయాజుల వెంకట సత్య శ్రీనివాస్( వాసు). ఇంటిపేరులోని వాజ్‌పేయితోనే సినీరంగంలో స్థిరపడిపోయానని చెప్పారు. స్వతహాగా నేను యోగా గురువును. సినీ పరిశ్రమలో చాలామందికి యోగా నేర్పుతుంటాను. దీంతో నాకు సినిమాలలో డాక్టర్, లాయర్, ప్రిన్సిల్ పాత్రలే ఎక్కువ ఇస్తున్నారు. 20 ఏళ్ల నుంచి సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నాను. ఇప్పటికి 120 సినిమాలు, 60 సీరియళ్లలో నటించాను. మంచి పాత్రలు ధరించాలన్నదే నా ధ్యేయం. రెబల్ సినిమాలో దొంగ పూజారి పాత్ర నాకు మంచి గుర్తింపునిచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీనెం.150లో కూడా నాకు అవకాశం వచ్చింది. -
డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా
ఉంగుటూరు/ తాడేపల్లిగూడెం రూరల్ : ఉంగుటూరు మండలం బాదంపూడి- ఉప్పాకపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన మేఘనా ట్రావెల్స్ వోల్వో బస్సు హైదరాబాద్ వెళుతోంది. బాదంపూడి సమీపంలోకి రాగానే కాలినడకన ద్వారకాతిరుమలకు వెళ్తున్న భక్తులను తప్పించబోయి అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నల్లమిల్లి బావిరెడ్డి (నర్సిపూడి), దొంగ దేవి (సందిపాడు), ఆమె కుమార్తె దొంగ తేజస్వి (10), కంటిపూడి సాయి సమిత్ (కాకినాడ), అమర్తుల తంబి (కాకినాడ)కు తీవ్ర గాయాలయ్యాయి. నల్లమిల్లి సత్యవతి (నర్సిపూడి), సమిళ్ళ సాయిరెడ్డి (నర్సిపూడి), నల్లా లక్ష్మిలతోపాటు మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత నల్లమిల్లి బావిరెడ్డి, కంటిపూడి సాయిసమిత్ను మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మిగిలిన వారు తమ ప్రాంతాలకు తరలివెళ్ళినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు వైద్యసేవలందించడంలో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయ సిబ్బంది సహకరించారు. ప్రమాద సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్ సంస్థ జేకే సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
కుక్కునూరు వీఆర్వోను బలిగొన్న సీఎం సెక్యూరిటీ వాహనం
♦ మరో వ్యక్తికి తీవ్రగాయాలు ♦ రెండు మోటార్ సైకిళ్లు ధ్వంసం ♦ బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో ఉంగుటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి భద్రత కల్పించే విభాగానికి చెందిన వాహనం ఢీకొని ఒక గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) మృత్యువాత పడగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కునూరు వీఆర్వో నేదూరి షణ్ముఖరావు (రాంబాబు) అక్కడికక్కడే మృతి చెందగా, ఉంగుటూరుకు చెందిన కొడవళ్ల రాజా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో రెండు మోటార్ సైకిళ్లు ధ్వంసమయ్యాయి. సీఎం చంద్రబాబు సోమవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం సీఎం పేషీలోని సెక్యూరిటీ విభాగం డీఎస్పీ జోషి ఏలూరు నుంచి వాహనంలో ఆదివారం బయలుదేరారు. ఉంగుటూరు సెంటర్‌కు వచ్చేసరికి వాహనం అదుపుతప్పి రెండు మోటార్ సైకిళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మోటార్ సైకిల్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందికి దూసుకెళ్లింది. దానిపై ప్రయాణిస్తున్న కుక్కునూరు వీఆర్వో నేదూరి షణ్ముఖరావు అక్కడిక్కడే మృతి చెందారు. మరో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న కొడవళ్ల రాజా కాలు విరిగింది. వీఆర్వో షణ్ముఖరావు స్వగ్రామం ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు. విషయం తెలుసుకున్న ఆయన బంధువులు, ఉప్పాకపాడు, కాకర్లమూడి ప్రజలు ఘటనా స్థలానికి పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా సుమారు రెండు గంటలపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీఎం భద్రతా విభాగం వాహనం డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా, స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. వీఆర్వో కుటుంబానికి తగిన పరిహారం అందిస్తామని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
గో మూత్రంతో తిరిగే గడియారం
ఉంగుటూరు : గడియారం తిరగడానికి బ్యాటరీ అవసరం లేదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని గోపాలకృష్ణ గోశాల నిర్వాహకులు. రెండు లీటర్ల గోమూత్రంతో గడియారం తిరిగేలా చేయవచ్చని నిరూపించారు. గోశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ విధానాన్ని ప్రదర్శించారు. గడియారాన్ని పనిచేయించే విధానం ఇలా.. రెండు ప్లాస్టిక్ డబ్బాల్లో లీటరు చొప్పున గోమూత్రం నింపాలి. రెండు జింక్ ప్లేట్లు, రెండు కాపర్ ప్లేట్లను తీసుకోవాలి. రెండు జింక్ ప్లేట్లకు విద్యుత్ వైరు అమర్చి గో మూత్రం ఉన్న ఒక డబ్బాలో వేయాలి. ఇది మైనస్‌గా పనిచేస్తుంది. గో మూత్రం ఉన్న మరో డబ్బాలో వైరు అమర్చిన రెండు కాపర్ ప్లేట్లు ఉంచాలి. ఇది ప్లస్‌గా పనిచేస్తుంది. ఈ రెండు వైర్లను బ్యాటరీ పరిమాణంలో ఉండే పుల్లముక్కకు రెండు వైపులా అమర్చి, ఆ పుల్లముక్కను గడియారంలో ఉండే బ్యాటరీ స్థానంలో అమర్చితే గడియారం పనిచేస్తుంది. డబ్బాల్లో ఒకసారి పోసిన ఆవు మూత్రంతో గడియారం 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేస్తుంది. ఆ తరువాత ప్రతి 14 రోజులకు ఒకసారి డబ్బాల్లోని గో మూత్రం మారిస్తే సరిపోతుంది. వివరాలకు 99487 96638 నంబర్లో సంప్రదించవచ్చు.