మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం | private travels bus rams into container room at unguturu toll gate | Sakshi
Sakshi News home page

మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం

Published Sun, Mar 12 2017 7:06 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

private travels bus rams into container room at unguturu toll gate

ఉంగుటూరు: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు కొనసాగతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు టోల్‌గేట్‌ వద్ద ఆదివారం తెలల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు టోల్‌గేట్‌ వద్ద గల కంటైనర్‌ రూం ను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు టోల్‌గేట్‌ సిబ్బంది గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు బస్సులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement