జంట హత్యలపై దర్యాప్తు వేగవంతం | couple murder case investigation speed | Sakshi
Sakshi News home page

జంట హత్యలపై దర్యాప్తు వేగవంతం

Published Mon, May 4 2015 3:26 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

couple murder case investigation speed

ఉంగుటూరు : బాదంపూడి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగాయని భావిస్తున్న జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదివారం గణపవరం సీఐ దుర్గాప్రసాద్, ఏలూరు క్లూస్ టీమ్ కలసి దుర్ఘటన జరిగిన బాదంపూడి వచ్చి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ లభించిన  సిగరెట్టు పెట్టెలో ఉన్న ఒక సిగరెట్టు, పంగల కర్ర, చీర ముక్కలు, పెద్ద రాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు ఎస్సై పైడిబాబు, నిడమర్రు ఎస్సై రవికుమార్ పరిశీలనలో పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్ కూడా ఘటనా స్థలిని పరిశీలించింది.
 
 ఇద్దరూ మగవాళ్లేనని
 నిర్ధారించిన పోస్టుమార్టమ్
 మృతిచెందిన ఇద్దరూ మగవాళ్లని పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. ఒకరికి 50, మరొకరి 25 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. వీరు తండ్రీకొడుకులు కావచ్చని అనుకుంటున్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను సీఐ పరిశీలించారు.
 
 అనేక అనుమానాలు
 ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకువచ్చి ఇద్దరినీ దహనం చేశారని భావిస్తున్న ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణానికి కారణం సెటిల్‌మెంట్‌లో తలెత్తిన విభేదాలా? ఆర్థిక పరమైన లావాదేవీలా? క్రికెట్ బుకీల మధ్య నెలకొన్న వైరమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కడ నుంచి తీసుకువచ్చి ఇక్కడ మృతదేహాలను దహనం చేశారు అన్న విషయం అంతుపట్టడం లేదు. ఘటనా స్థలినిశనివారం రాత్రి ఏలూరు డీఎస్పీ సరిత పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement