కరోనా: సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి విరాళం | Unguturu People Donates Rs 1 Crore To AP CM Relief Fund | Sakshi
Sakshi News home page

కరోనా: ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి విరాళం

Published Mon, Apr 6 2020 2:47 PM | Last Updated on Mon, Apr 6 2020 3:02 PM

Unguturu People Donates Rs 1 Crore To AP CM Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నివారణ చర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు, వ్యాపార వేత్తలు, వర్తక, వాణిజ్య సంఘాలు సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించాయి. ఈమేరకు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి 1 కోటి 4 లక్షల 7 వేల 838 రూపాయల చెక్కును అందజేశారు. 

ప్రధానమంత్రి సహాయ నిధికి..
ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వేములపల్లి రవి కిరణ్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.38 లక్షల విరాళం ప్రకటించారు. ఈమేరకు విజయవాడలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.విద్యాసాగర్‌ను కలిసి ముప్పై ఎనిమిది లక్ష రూపాయల చెక్కును అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణరంగ కార్మికుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని రవికిరణ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement