
సీఎం జగన్‌కు విరాళం చెక్కు అందిస్తున్న మంత్రి బాలినేని, విజయ్‌కుమార్, ప్రమోద్‌కుమార్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,05,50,000 చెక్‌ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం రీజినల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు అందజేశాయి. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఏపీపీసీబీ విశాఖపట్నం రీజినల్ ఆఫీసర్ ప్రమోద్‌కుమార్ రెడ్డి చెక్‌ను అందజేశారు.