సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విరాళం చెక్కును అందజేస్తున్న సీ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రీజియన్ అధ్యక్షుడు ఇంద్రకుమార్. చిత్రంలో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఆనంద్, పవన్ తదితరులు
కరోనా వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలు సంస్థలు, పలువురు ప్రముఖులు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు.
► సీఎం సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. విరాళం ఇచ్చిన రియలన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రశంసిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.
► సీ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రీజియన్ రూ.8.60 కోట్లు
► ఆదానీ ఫౌండేషన్ రూ. 2 కోట్లు.
► శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ రూ.2 కోట్లు
► అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1.45 కోట్లు
► దేవి ఫిషరీస్ లిమిటెడ్ రూ.కోటి
► మాధవి ఎడిబుల్ బ్రాన్ ఆయిల్స్ లిమిటెడ్ రూ.20 లక్షలు
► గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. సంగం డెయిరీ తరఫున రూ. 50 లక్షలు
► గుంటూరు జిల్లా పెద్ద పలకలూరుకు చెందిన జేఎల్‌ఈ సినిమా మెనేజ్‌మెంట్ తరఫున ఎండీ పోలిశెట్టి రాము రూ.5 లక్షలు.
► గుంటూరు జిల్లాకు చెందిన కొల్లి సాంబిరెడ్డి రూ.లక్ష, మధుబాబు రూ.లక్ష
► గుంటూరు జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన ఈశ్వరరావు రూ.లక్ష
Comments
Please login to add a commentAdd a comment