120 సినిమాలు.. 60 సీరియళ్లలో నటించా
120 సినిమాలు.. 60 సీరియళ్లలో నటించా
Published Wed, Sep 14 2016 12:21 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM
ఉంగుటూరు : ప్రేక్షకుల ఆదరాభిమానాలే మాకు కొండంత గుర్తింపు అని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాజ్‌పేయి అన్నారు. స్వగ్రామైన ఉంగుటూరు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నా అసలు పేరు వాజŒ పేయాజుల వెంకట సత్య శ్రీనివాస్( వాసు). ఇంటిపేరులోని వాజ్‌పేయితోనే సినీరంగంలో స్థిరపడిపోయానని చెప్పారు. స్వతహాగా నేను యోగా గురువును. సినీ పరిశ్రమలో చాలామందికి యోగా నేర్పుతుంటాను. దీంతో నాకు సినిమాలలో డాక్టర్, లాయర్, ప్రిన్సిల్ పాత్రలే ఎక్కువ ఇస్తున్నారు. 20 ఏళ్ల నుంచి సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నాను. ఇప్పటికి 120 సినిమాలు, 60 సీరియళ్లలో నటించాను. మంచి పాత్రలు ధరించాలన్నదే నా ధ్యేయం. రెబల్ సినిమాలో దొంగ పూజారి పాత్ర నాకు మంచి గుర్తింపునిచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీనెం.150లో కూడా నాకు అవకాశం వచ్చింది.
Advertisement
Advertisement