Balagam singer Mogilaiah is seriously ill due to health issues - Sakshi
Sakshi News home page

Mogilaiah: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం!

Published Tue, Apr 11 2023 4:41 PM | Last Updated on Tue, Apr 11 2023 5:02 PM

Balagam Movie Artist Mogilaiah Serious Health Issue - Sakshi

ఇటీవల విడుదలైన బలగం చిత్రంలో ఫేమస్‌ అయిన మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య వరంగల్ జ్లిలా వాసి. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. కాగా.. తన భర్తకు వైద్య సాయం అందించి.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇటీవల విడుదలైన బలగం మూవీ క్లైమాక్స్‌లో మానవ సంబంధాను వివరిస్తూ ఆయన చేసిన గానం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. మొగిలయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement