ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే? | 69th Sobha Filmfare 2024 South Telugu Awards Full List, Check Out The Winners Details | Sakshi
Sakshi News home page

Filmfare South 2024: ఆ మూడు సినిమాలకే దాదాపు అవార్డులన్నీ..

Published Sun, Aug 4 2024 7:52 AM | Last Updated on Sun, Aug 4 2024 12:44 PM

Filmfare 2024 South Telugu Awards Full List

69వ ఫిల్మ్ ఫేర్ -2024 సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే తెలుగులో దసరా, బలగం, బేబి చిత్రాల్నే దాదాపు అవార్డులన్నీ వరించడం విశేషం. ఇంతకీ ఎవరెవరికీ ఏయే అవార్డు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)

69వ ఫిల్మ్ ఫేర్ తెలుగు-2024 అవార్డ్ విజేతల జాబితా

  • ఉత్తమ సినిమా - బలగం

  • ఉత్తమ నటుడు - నాని (దసరా)

  • ఉత్తమ నటి - కీర్తి సురేశ్ (దసరా)

  • ఉత్తమ దర్శకుడు - వేణు (బలగం)

  • ఉత్తమ పరిచయ దర్శకుడు - శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)

  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సాయి రాజేశ్ (బేబి)

  • ఉత్తమ నటి (క్రిటిక్స్) - వైష్ణవి చైతన్య (బేబి)

  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - నవీని పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)

  • ఉత్తమ సహాయ నటుడు - రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)

  • ఉత్తమ సహాయ నటి - రూపలక్ష‍్మి (బలగం)

  • ఉ‍త్తమ గాయకుడు - శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబి)

  • ఉత్తమ గాయని - శ్వేత మోహన్ (మాస్టారూ మాస్టారూ- సార్)

  • ఉత్తమ సాహిత్య - అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)

  • ఉత్తమ సంగీతం - విజయ్ బుల్గానిన్ (బేబి)

  • ఉత్తమ సినిమాటోగ్రాఫీ - సత్యన్ సూరన్ (దసరా)

  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - కొల్లా అవినాష్ (దసరా)

  • ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా- దసరా)
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement