బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. టాప్-5లో నిలవాలని ఆశించినప్పటికీ ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. సింగర్‌గా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న నేహా భాసిన్.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర పోస్ట్ చేసింది. తన ఆరోగ్యానికి సంబంధించి తాను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంది. నేహా భాసిన్ మల్టీపుల్ డిజార్డర్స్‌తో బాధపడినట్లు వెల్లడించింది. ఆమెకు ప్రీమెన్‌స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (PMDD), అబ్సెసివ్-కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ (OCPD) ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా రెండేళ్ల క్రితమే ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది.
భాసిన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను మీకు చాలా చెప్పాలనుకుంటున్నా. కానీ నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని చెప్పేందుకు ఎలా ప్రారంభించాలో తెలియలేదు. కొన్నేళ్ల తర్వాత నా జీవితంలో ఏదో ఆగిపోయిందని తెలిసింది. చివరకు వైద్యపరంగా మరింత అవగాహనతో ఈ రోజు వ్యాధి నిర్ధారణతో మీ ముందుకు వచ్చా. ఇది మానసిక, హార్మోన్ల వ్యాధులకు సరైన చికిత్సలను పొందడంలో సహాయపడుతుంది. వీటన్నింటిలో ప్రధానంగా అవగాహన చాలా ముఖ్యం. ప్రస్తుతానికి నా నాడీ వ్యవస్థ పూర్తిగా విరిగిపోయినట్లు అనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.
శారీరక, మానసిక బాధ, ఆందోళన, డిప్రెషన్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి లాంటి వాటితో ఎక్కువగా బాధపడ్డానని తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితంలో వెనకడుగు వేయలేదని పేర్కొంది. అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ తాను బాధితురాలిని కాదని.. విజేతను అంటూ నేహా భాసిన్ చెప్పుకొచ్చింది. నాలాంటి వారిలో చాలామందికి ఓదార్పునివ్వాలనే ఆశతో తన అనుభవాన్ని పంచుకుంటున్నట్లు పోస్ట్ చేస్తున్నట్లు రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment