neha bhasin
-
Neha Bhasin: ఇదీ నా వేదన..!
‘నేను ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్, తీవ్రమైన కండరాల నొప్పితో బాధించే ఫైబ్రోమయాల్జియా రుగ్మతలతో బాధ పడుతున్నాను. నా వేదన మీకు చైతన్యం కలిగించాలి’ అంది నేహా భాసిన్. బాలీవుడ్లో ఎన్నో ఎన్నో హిట్ ట్రాక్స్ పాడిన గాయని నేహా ఇటీవల ఇన్‌స్టాలో రాసుకున్న పోస్ట్ స్త్రీల ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది. ఆమె ఏం రాసింది?‘‘నేను చెప్పాల్సింది చాలా ఉంది. అయితే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టి, ఎక్కడ ముగించాలో తెలియడం లేదు. నేను అనుభవిస్తున్న నరకాన్ని ఎలా ఏకరువు పెట్టాలో అర్థం కావడం లేదు. నా హెల్త్ రిపోర్టుల మీద రెండేళ్ల నుంచి అని రాసి ఉన్నప్పటికీ ఈ వేదనాపర్వం నా 20వ ఏటి నుంచి కొనసాగుతోంది. ఒంటరిగా ఉండకుండా నలుగురితో... అందునా నాకిష్టమైన, నేను ప్రేమించే వ్యక్తులను కలుస్తూ, పత్రికలకు వ్యాసాలు రాస్తూ నా ఇబ్బందులను ఎంతోకొంత అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నెలనెలా వేధించే నా ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ నన్ను కొత్త చీకట్లలోకి విసిరేస్తోంది. ‘ఇది నీ వైఫల్యమేనా?’ అంటూ నా అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ నన్ను వెక్కిరిస్తూ ప్రశ్నిస్తోంది. ఫైబ్రోమయాల్జియా అంటూ డాక్టర్లు చెబుతున్న ఆ సమస్య నాలో వేదనాగ్ని జ్వాలల్ని రగిలిస్తోంది. ఏళ్ల తరబడి నేను వాటిని లెక్కచేయకుండా నిన్నమొన్నటివరకూ ప్రదర్శనలిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు నా డాక్టర్ ‘ఇంక మీరేమీ చేయకుండి. హాయిగా విశ్రాంతి తీసుకోండి’ అంటున్నాడు.నేనిలా విశ్రాంతి తీసుకోవడం నాకే నచ్చడం లేదు. దశాబ్దాల తరబడి లెక్కచేయకుండా నెట్టుకొస్తున్న నా వేదనలు నన్ను బాధిస్తున్నప్పటికీ... నా కలలను శ్వాసిస్తూ, నా కలలకు రూపం కల్పించే సంకల్పంతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను. ఇవ్వాళ నేనో వృద్ధుణ్ణి చూశాను. ఒక చేత్తో ఓ పెద్ద బరువైన పెట్టెను మోస్తూ, మరో చేతిలో గొడుగుతో కుస్తీపడుతూ ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని లెక్కచేయకుండా అతికష్టమ్మీద నా వ్యాయామశాల సోపానాల చివరి మెట్టును అధిగమించాక నన్ను చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. అతడి ఆ నవ్వు ఎలా ఉందంటే... ‘ఈ వయసుకు తీవ్రమైన నొప్పులతో నేనూ బాధపడుతున్నా. వేదనా తరంగాల దొంతరల్లో ఈదులాడుతున్నా. నేనే ఇలా ఉన్నానంటే... నీకింకా ఏమీ ముగిసిపోలేదు. జీవితానికి కృతజ్ఞురాలివై ధైర్యంగా ఉండు. నీకంటే ఎక్కువ బాధపడుతున్నవారు ఇంకా ఎందరో ఉన్నారు’ అంటూ ఉద్బోధిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.అందుకే... నా బాధలూ, నా వెతలూ, నా ఆవేదనలన్నీ నా జీవితాన్ని సవాల్ చేస్తున్నప్పుడు మీ ప్రేమతో పాటు నేను రాసుకుంటున్న ఈ కొన్ని మాటల్ని సాంత్వననిచ్చే ఓ మలాముగా పులుముకుంటున్నా’’ అంటూ ముగించింది నేహా.ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్..కొందరు యువతుల్లో నెలసరి ముందుగా తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) అంటారు. అందులోని అత్యంత బాధకరమైన ఒక రకం ‘ప్రీ–మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్’. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలతో డాక్టర్లు దీనికి చికిత్స అందిస్తుంటారు.అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్..పూర్తి పర్ఫెక్షన్ రాలేదంటూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ, ఎంతకీ సంతృప్తి లేక దాన్నే కొనసాగిస్తూ విసుగు కలిగించే మానసిక వ్యాధి ఇది. దీని బారిన పడితే ఆలోచనలూ, పనులూ అలా అనియంత్రితంగా సాగుతూ ఎంతకీ పని పూర్తి చేయనివ్వక బాధిస్తుంటాయి. దీనికి మానసిక చికిత్స అవసరం.ఫైబ్రోమయాల్జియా..కండరాల, ఎముకల నొప్పితో తీవ్రమైన ఒళ్లు నొప్పులతో, స్పర్శ సున్నితంగా మారి ఒంటిని ముట్టుకోనివ్వనంతగా తీవ్రమైన వేదన కలిగిస్తుందిది. మానసిక ఆందోళనలు, యాంగై్జటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ వంటి సమస్యల కారణంగా మరింత పెచ్చరిల్లే ఈ నొప్పులకు సరైన చికిత్స అవసరం. -
నా జీవితంలో 20 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా: ప్రముఖ సింగర్
బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. టాప్-5లో నిలవాలని ఆశించినప్పటికీ ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. సింగర్‌గా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న నేహా భాసిన్.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర పోస్ట్ చేసింది. తన ఆరోగ్యానికి సంబంధించి తాను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంది. నేహా భాసిన్ మల్టీపుల్ డిజార్డర్స్‌తో బాధపడినట్లు వెల్లడించింది. ఆమెకు ప్రీమెన్స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (PMDD), అబ్సెసివ్-కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ (OCPD) ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా రెండేళ్ల క్రితమే ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది.భాసిన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను మీకు చాలా చెప్పాలనుకుంటున్నా. కానీ నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని చెప్పేందుకు ఎలా ప్రారంభించాలో తెలియలేదు. కొన్నేళ్ల తర్వాత నా జీవితంలో ఏదో ఆగిపోయిందని తెలిసింది. చివరకు వైద్యపరంగా మరింత అవగాహనతో ఈ రోజు వ్యాధి నిర్ధారణతో మీ ముందుకు వచ్చా. ఇది మానసిక, హార్మోన్ల వ్యాధులకు సరైన చికిత్సలను పొందడంలో సహాయపడుతుంది. వీటన్నింటిలో ప్రధానంగా అవగాహన చాలా ముఖ్యం. ప్రస్తుతానికి నా నాడీ వ్యవస్థ పూర్తిగా విరిగిపోయినట్లు అనిపిస్తోంది' అని రాసుకొచ్చింది.శారీరక, మానసిక బాధ, ఆందోళన, డిప్రెషన్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి లాంటి వాటితో ఎక్కువగా బాధపడ్డానని తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితంలో వెనకడుగు వేయలేదని పేర్కొంది. అన్నింటిని భరిస్తూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ తాను బాధితురాలిని కాదని.. విజేతను అంటూ నేహా భాసిన్ చెప్పుకొచ్చింది. నాలాంటి వారిలో చాలామందికి ఓదార్పునివ్వాలనే ఆశతో తన అనుభవాన్ని పంచుకుంటున్నట్లు పోస్ట్ చేస్తున్నట్లు రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u) -
నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారు: బిగ్‌బాస్ కంటెస్టెంట్
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ముగింపుకు చేరుకుంటోంది. ఇటీవలే హౌస్‌లో నుంచి సింగర్ నేహా భాసిన్ ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ షోలోని సహ కంటెస్టెంట్లతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూనే టాప్ 5లో చోటు దక్కనందుకు బాధపడింది. 'నేను టాప్ 5లో లేకపోవడం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే ఎలిమినేట్ అవుతానన్న ఆలోచనే నాకు లేదు. బిగ్‌బాస్ ట్రోఫీ చాలా ముఖ్యం. అలాగే నా ఫ్రెండ్స్‌తో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకున్నా, కానీ ఇలా జరిగింది. ప్రేక్షకులు నా జర్నీ ఇక్కడివరకు మాత్రమే అని నిర్దేశించారు. వాళ్ల నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాను. ఇన్నిరోజుల బిగ్‌బాస్ ప్రయాణానికి నా భర్త ఎంతగానో సపోర్ట్ ఇచ్చాడు. కేవలం నా కోసమే ఈ షో చూసేవాడు. అదే సమయంలో ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి మా అమ్మ భయపడిపోయింది. కొన్నిసార్లు నా తల్లి, సోదరుడు, భర్తను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అది వాళ్లను ఎంతగానో కుంగదీసింది. కానీ ఇలా కావాలని టార్గెట్ చేయడం కరెక్ట్ కానే కాదు' 'ఇక ఈ సీజన్లో ప్రతీక్ గెలిస్తే బాగుంటుందనుకుంటున్నాను. అతడు కాకపోతే ఆ తర్వాత షమిత శెట్టి విజేతగా అవతరించాలని ఆశిస్తున్నాను. హౌస్‌లో దివ్య అగర్వాల్‌తో విపరీతమైన గొడవలు జరిగాయి. నన్ను ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. నా కెరీర్ మొదట్లోనూ దివ్య లాంటి ఎంతో మంది నా మైండ్‌తో గేమ్స్ ఆడారు, నన్ను డిప్రెషన్లోకి నెట్టేశారు, ఆత్మహత్యకు ప్రేరేపించారు. ఇలా అంటున్నందుకు దివ్య కుటుంబాన్ని నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ ఆమె చేస్తోంది అదే. నన్ను మాత్రమే కాదు, హౌస్‌లో చాలామందితో ఆమె ఆడుకుంటోంది' అని నేహా భాసిన్ చెప్పుకొచ్చింది. -
మార్పు కోసం పాట
సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువ అయిపోతున్నాయి. వీటన్నింటి గురించి ప్రస్తావించాలనుకున్నారు గాయని నేహా బాసిన్. ఓ పాట ద్వారా ఈ విషయాలను ప్రస్తావించారు. ‘జనతా గ్యారేజ్’లో ‘యాపిల్ బ్యూటీ...’, ‘జై లవకుశ’ లో ‘స్వింగ్ జరా స్వింగ్ జరా..’ పాటలతో తెలుగులోనూ పాపులర్ అయ్యారు నేహా. తాజాగా ‘కేందే రేందే’ అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్‌ను రికార్డ్ చేశారామె. ఆన్లైన్ ట్రోల్స్, లింగ వివక్ష, బంధుప్రీతి, శరీరాకృతిని విమర్శించడం వంటి అంశాలతో ఈ పాట ఉంటుంది. ‘‘ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా ఈ అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా సరే... మగవాళ్లు ఇలా ఉండొచ్చు, ఆడవాళ్లు ఇలానే ఉండాలి అనే మనస్తత్వం మారాలి. ఆ మార్పు కోసం నా పాట ఉపయోగపడాలనుకున్నాను. అందుకే ఈ పాట చేశాను’’ అన్నారు నేహా బాసిన్. -
అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా
దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రకంపనలు సృష్టించిన ‘మీటూ ఉద్యమం’ మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్... పాటల కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా రావడమే ఇందుకు కారణం. పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి బట్టబయలు చేస్తూ హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమం.. భారత్‌లోనూ క్రమంగా వ్యాపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా.. విలక్షణ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలతో ఉధృతమైన ఈ ఉద్యమం సినిమా, క్రీడలు, జర్నలిజం ఇలా ప్రతీ రంగంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న ఎంతో మంది మృగాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ గాయనీమణులు శ్వేతా పండిట్, సోనా మహాపాత్ర అను మాలిక్ తమ పట్ల ప్రవర్తించిన తీరును ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అను మాలిక్‌ను ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం నుంచి నిర్వాహకులు తొలగించారు. అయితే సెప్టెంబరులో మళ్లీ అతడిని న్యాయ నిర్ణేతగా తీసుకురావడం పట్ల ప్రముఖ గాయని నేహా బాసిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్పీ రేట్ల కోసం అతడిని మళ్లీ తీసుకువచ్చామంటూ నిర్వాహకులు తనతో చెప్పారని.. ఇది సరికాదంటూ మరోసారి గళమెత్తిన సోనాకు ఆమె అండగా నిలిచారు. ‘నేను నీతో ఏకీభవిస్తున్నాను. లింగవివక్ష కలిగిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అందులో అను మాలిక్ ఒక దిగజారుడు వ్యక్తి. 21 ఏళ్ల వయస్సులో నేను కూడా అతడి అసహజ చర్యల నుంచి తప్పించుకుని పారిపోయాను. ఓ రోజు స్టూడియోకు వెళ్లిన సమయంలో సోఫా మీద పడుకుని ఎదురుగా నన్ను కూర్చోమంటూ నా కళ్ల గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. అయితే నేను మాత్రం వెంటనే విషయాన్ని పసిగట్టి కింద అమ్మ ఎదురుచూస్తోంది అని అబద్ధం చెప్పి అతడి నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత కూడా అతడు నాకు మెసేజ్‌లు, కాల్స్ చేసి విసిగించేవాడు. కానీ నేను మాత్రం వాటికి స్పందించకుండా మిన్నకుండిపోయాను. అతడు ఒక క్రూర జంతువు’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా నేహా చేసిన వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. అను మాలిక్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా జాగ్ ఘూమియా వంటి హిట్‌సాంగ్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేహా.. తెలుగులోనూ అటు నువ్వే ఇటు నువ్వే(కరెంట్), నిహారికా నిహారికా(ఊసరవెళ్లి), స్వింగ్ జరా(జై లవ కుశ) తదితర పాటలు పాడి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. I agee with you. We do live in a very sexist world. Anu Malik is a predetor, i too have run away from his strange moves when i was 21. I didn't let myself get into a sticky situation beyond him lying on a sofa in front of me talking about my eyes in a studio. I fleed lying https://t.co/tQgStLrYyT — Neha Bhasin (@nehabhasin4u) October 30, 2019 -
ప్రముఖ గాయని పెళ్లి చేసుకుంది!
'హల్లో రాక్‌స్టార్' అంటూ మహేశ్‌బాబు సినిమా 'వన్'లో పాటతో దుమ్మురేపిన ప్రముఖ సింగర్ నేహా భాసిన్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. తన ప్రేమికుడైన సంగీత దర్శకుడు సమీర్ ఉద్దిన్‌ను ఇటలీలోని టస్కేనీలో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లుగా పరిచయమున్న ఈ ఇద్దరు బంధుమిత్రుల సమక్షంలో గత నెల 23న వివాహం చేసుకున్నారు. ‘సమీర్ నాకు టీనేజర్‌గా ఉన్పప్పటి నుంచి తెలుసు కానీ, అప్పట్లో మేం కనెక్ట్ కాలేదు. సంగీతం మా ఇద్దరిని ఒక్కటి చేసింది. గత నాలుగేళ్లుగా మా మధ్య స్నేహం కొనసాగుతోంది’ అని నేహా భాసిన్ తెలిపింది. ’తేరా మేరా’ రొమాంటిక్ పాట రికార్డింగ్ సందర్భంగా తొలిసారి నేహా, సమీర్ కలుసుకున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్టుల్లో అతను తనకెంతో అండగా నిలిచాడని, అలా తమ మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని నేహా తెలిపింది. అమ్మాయిలతో కూడిన మ్యూజిక్ బ్యాండ్ వీవాలో భాగస్వామి అయిన నేహా ఇటీవల వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’లోనూ ’యాపిల్ బ్యూటీ’ పాటతో అదరగొట్టింది.