mogilayya
-
Mogilaiah: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత..
-
బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత
ఇటీవల విడుదలైన బలగం చిత్రంలో ఫేమస్ అయిన మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య వరంగల్ జ్లిలా వాసి. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. కాగా.. తన భర్తకు వైద్య సాయం అందించి.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల విడుదలైన బలగం మూవీ క్లైమాక్స్‌లో మానవ సంబంధాను వివరిస్తూ ఆయన చేసిన గానం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. మొగిలయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. -
మొగులయ్యకు రూ. కోటి.. ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి బహుమతిగా ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో నివాసస్థలం, ఇంటి నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. దర్శనం మొగుల య్య శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మొగులయ్య కుశాలువా కప్పి సత్కరించారు. గొప్ప కళారూపాన్ని మొగులయ్య కాపాడుతున్నారని ప్రశంసించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. మొగులయ్యకు గౌరవ వేతనాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నివాస స్థలం, ఇంటి నిర్మాణం విషయంగా మొగులయ్య తో సమన్వయం చేసుకుని, కావాల్సిన ఏర్పాట్లు చూసు కోవాల ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. తెలంగాణ కళలను పునరుజ్జీవం చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ ఆదుకునే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. #Telangana CM KCR announced 1CR cash,a site in Hyderabad with construction expenses to built a house to the padma recipient #Mogilaiah pic.twitter.com/mh0uEsUWSM — Agasthya kantu (@kantuagasthya) January 28, 2022 -
శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్
Folk Singer Kinnera Mogulaiah TSRTC Song Video: టీఎస్ఆర్టీసీ బలోపేతానికి నడుం బిగించిన ఎండీ వీసి సజ్జనార్ అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్ స్పందిస్తూ తనదైన స్టైల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. తాజాగా కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య ఆర్టీసిని ప్రశంసలతో ముంచెత్తాడు. కూతురు వివాహానికి టీఎస్ఆర్టీసీ బస్ బుక్ చేసుకున్న మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకున్నాడు. చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో... ఆర్టీసీ బస్సులో ప్రయాణం మంచిదంటూ కిన్నెర మొగులయ్యగానం చేస్తున్న వీడియోను ఆర్టీసీ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు. ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తంచేస్తూ అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సు తల్లిలాంటిదని కొనియాడాడు ‘గంటలోనా బస్సు వస్తది.. ఆగవయ్య మొగులయ్యా.. డీఎం సార్‌కు చెప్తనేను.. ఆర్టీసీ బస్సు పంపుతా.. ఒక్క గంటలో బస్సు వచ్చే.. సుట్టాల్ పిల్లలు బస్సు ఎక్కిరి.. ఆర్టీసీ బస్సులోనా చెప్పలేని ఆనందం.. ఆర్టీసీ బస్సు ఎక్కి మంచిగ నేను పోయి వచ్చిన.. బస్సు అంటే బస్సు కాదు తల్లిలాంటి ఆర్టీసీ.. శభాష్ ఆర్టీసీ.. శభాస్ సజ్జనార్’ అంటూ సాగే పాటను ఆయన ఆలపించారు. కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa — Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021 -
మొగిలయ్యను ఆదుకుంటాం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్యను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వెల్లడించారు. సాక్షిలో ‘కిన్నెర మెట్లు.. బతుకు పాట్లు’ శీర్షికన మంగళ వారం మొగిలయ్య దీనగాథ ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన హరికృష్ణ బుధవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కిన్నెర వాయిద్యం కళను వెలికితీయడంతోపాటు మొగిలయ్యను తెలంగాణ ప్రభుత్వం ఆదరించిందని గుర్తుచేశారు. మొగిలయ్యకు కళాకారుల కోటాలో నెలనెలా పింఛన్ అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కళాకారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్య తాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు -
విధుల్లో చేరిన సూర్యాపేట సీఐ మొగిలయ్య
నల్గొండ: సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సూర్యాపేట సీఐ మొగిలయ్య పూర్తిగా కోలుకున్నారు. బుధవారం నుంచి తిరిగి విధుల్లో చేరారు. నెలరోజుల కిందట రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూర్యాపేట బస్టాండు హత్యాకాండలో గాయపడిన సీఐ కోలుకొని విధుల్లో చేరారు. సూర్యాపేట బస్టాండులో అర్ధరాత్రి సిమీ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు తో పాటు మరో హోంగార్డు మరణించగా సీఐ మొగలయ్య తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. సీఐ ఇంత త్వరగా తిరిగి విధుల్లో చేరడంతో ఆయన ధ్రుడచిత్తాన్ని, సంకల్పశక్తిని పలువురు కొనియాడుతున్నారు.