మొగులయ్యను సత్కరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి బహుమతిగా ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో నివాసస్థలం, ఇంటి నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. దర్శనం మొగుల య్య శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మొగులయ్య కుశాలువా కప్పి సత్కరించారు.
గొప్ప కళారూపాన్ని మొగులయ్య కాపాడుతున్నారని ప్రశంసించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. మొగులయ్యకు గౌరవ వేతనాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నివాస స్థలం, ఇంటి నిర్మాణం విషయంగా మొగులయ్య తో సమన్వయం చేసుకుని, కావాల్సిన ఏర్పాట్లు చూసు కోవాల ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. తెలంగాణ కళలను పునరుజ్జీవం చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ ఆదుకునే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#Telangana CM KCR announced 1CR cash,a site in Hyderabad with construction expenses to built a house to the padma recipient #Mogilaiah pic.twitter.com/mh0uEsUWSM
— Agasthya kantu (@kantuagasthya) January 28, 2022
Comments
Please login to add a commentAdd a comment