
కిన్నెర మొగులయ్య ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తం చేస్తూ అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు.
Folk Singer Kinnera Mogulaiah TSRTC Song Video: టీఎస్‌ఆర్టీసీ బలోపేతానికి నడుం బిగించిన ఎండీ వీసి సజ్జనార్ అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ ట్విట్టర్‌లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్ స్పందిస్తూ తనదైన స్టైల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. తాజాగా కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య ఆర్టీసిని ప్రశంసలతో ముంచెత్తాడు. కూతురు వివాహానికి టీఎస్‌ఆర్టీసీ బస్ బుక్ చేసుకున్న మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకున్నాడు.
చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో...
ఆర్టీసీ బస్సులో ప్రయాణం మంచిదంటూ కిన్నెర మొగులయ్యగానం చేస్తున్న వీడియోను ఆర్టీసీ అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తంచేస్తూ అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సు తల్లిలాంటిదని కొనియాడాడు ‘గంటలోనా బస్సు వస్తది.. ఆగవయ్య మొగులయ్యా.. డీఎం సార్‌కు చెప్తనేను.. ఆర్టీసీ బస్సు పంపుతా.. ఒక్క గంటలో బస్సు వచ్చే.. సుట్టాల్ పిల్లలు బస్సు ఎక్కిరి.. ఆర్టీసీ బస్సులోనా చెప్పలేని ఆనందం.. ఆర్టీసీ బస్సు ఎక్కి మంచిగ నేను పోయి వచ్చిన.. బస్సు అంటే బస్సు కాదు తల్లిలాంటి ఆర్టీసీ.. శభాష్ ఆర్టీసీ.. శభాస్ సజ్జనార్’ అంటూ సాగే పాటను ఆయన ఆలపించారు.
కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa
— Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021