Kinnerasani
-
కల్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' మూవీ రివ్యూ
టైటిల్: కిన్నెరసాని జానర్: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నటీనటులు: కల్యాణ్ దేవ్, అన్ షీతల్, రవీంద్ర విజయ్, సత్య ప్రకాష్, మహతి దర్శకుడు: రమణ తేజ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రవి చింతల సంగీతం: మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ: దినేశ్ కె.బాబు విడుదల తేది: జూన్ 10, 2022 (జీ5) మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ నటించిన తాజా సినిమా కిన్నెరసాని. మొదట ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గత చిత్రం సూపర్‌మచ్చి థియేటర్లో పెద్దగా ఆడకపోవడంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణతేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(జూన్ 10) జీ 5లో రిలీజైంది. మరి కిన్నెరసాని చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.. కథ: వెంకట్(కల్యాణ్ దేవ్) తెలివైన లాయర్. ఎంతో ఈజీగా కేసులను పరిష్కరిస్తాడు. కాలేజీ టైంలోనే ఓ అమ్మాయి(కాశిష్ ఖాన్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో ఆమె చనిపోతుంది. వేద(అన్ షీతల్) లైబ్రరీ నడుపుతుంది. లైబ్రరీలో తనకు దొరికిన కిన్నెరసాని పుస్తకం తన జీవితమే అని తెలుసుకుంటుంది. అందులో తన తండ్రి జయదేవ్(రవీంద్ర విజయ్) చిన్నప్పుడే తనను చంపాలనుకున్నాడని రాసి ఉంటుంది. అయితే అసలు తనను ఎందుకు చంపాలనుకున్నాడో తండ్రినే అడిగి తెలుసుకోవాలనుకుంటుంది వేద. అతడి జాడ కోసం అన్వేషిస్తుంది. ఆమెకు వెంకట్ సాయం చేస్తుంటాడు. అసలు వేదకు, వెంకట్‌కు ఉన్న సంబంధం ఏంటి? వెంకట్ ప్రేయసిని ఎవరు చంపారు? వేదను తండ్రి ఎందుకు చంపాలనుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ మర్డర్ సీన్‌తో మొదలైన సినిమా మర్డర్ సన్నివేశంతోనే ముగుస్తుంది. ఫస్టాఫ్‌లో కథను సస్పెన్స్, ట్విస్టులతో నడిపించారు. సెకండాఫ్‌లో ఫ్లాష్బ్యాక్లతో కొంత థ్రిల్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. రొటీన్ స్టోరీ కావడంతో సినిమా ఫ్రెష్‌గా ఏమీ అనిపించదు. చివర్లో క్లైమాక్స్ పెద్దగా వర్కవుట్ అవలేదనిపిస్తుంది. క్లైమాక్స్ మీద కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. సాయి తేజ దేశరాజు అందించిన కథ కథనం మాటలు సరికొత్తగా ఉన్నాయి. కథనం ప్రేక్షకుడ్ని చివరిదాకా కట్టిపడేస్తుంది. ఉత్కంఠగా సాగిన కథనం సినిమాకి మేజర్ హైలైట్. రైటర్‌కు మంచి మార్కులు పడ్డాయి. మర్డర్ మిస్టరీ జానర్ కాబట్టి కామెడీ, కమర్షియల్ హంగులకి జోలికి పోలేదు. ఎదుటివారి కళ్లలోకి కొన్ని క్షణాలు చూసి వారి మనసులో ఏముందో చెప్పగలిగే అరుదైన లక్షణం ఉన్న వేద పాత్రను మరింత అద్భుతంగా మలచడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. ఆ లక్షణం కారణంగానే బాల్యం ఛిద్రమైందని చూపించిన దర్శకుడు ఆ రేర్ క్వాలిటీని ఎక్కువగా హైలైట్ చేయకపోవడం, దాన్ని లైట్ తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నటన పరంగా కల్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. గత సినిమాలతో పోలిస్తే కల్యాణ్ కొంచెం కొత్తగా కనిపించాడు. అతడి ప్రేయసిగా నటించిన కాశీష్ ఖాన్ నిడివి తక్కువే అయినా ఆమె పాత్ర ఎంతో కీలకం. స్క్రీన్‌పై కనిపించే కొద్ది నిమిషాలు కూడా మోడ్రన్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అన్ షీతల్ తన పాత్రకు తగ్గట్లుగా నటించింది. రవీంద్ర విజయ్ కళ్లతోనే విలనిజం పండించాడు. చివరగా.. నిదానంగా ముందుకు సాగిన ఈ మూవీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రమే నచ్చుతుంది. చదవండి: తమన్నా-సత్యదేవ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే! అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు -
నేరుగా ఓటీటీలో వస్తున్న మెగా అల్లుడి సినిమా
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం కిన్నెరసాని. సాయి రిషిక సమర్పణలో రమణతేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించారు. ఈ సినిమాను తొలుత ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాడు డైరెక్టర్. కానీ జీ5 వారు సినిమా చూసి అగ్రిమెంట్ చేసుకునే సమయంలో బిగ్ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని అనడంతో థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. జనవరి 26న థియేటర్లలో రిలీజ్ చేస్తామన్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే కల్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి పెద్దగా ఆడకపోవడంతో థియేటర్లో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. థ్రిల్లర్ మూవీ కిన్నెరసాని జూన్ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. #Kinnerasani a mystery thriller that follows the journey of Veda who is in search of her father.#Premieres10thJune only on #ZEE5#KinnerasaniOnZEE5 @kalyaan_dhev @RamanaTeja9 @annsheetal1 @RavindraVijay1 @Kashishkhannn @mahathibhikshu @mahathi_sagar @itsRamTalluri @LahariMusic pic.twitter.com/TVxvDJ4V7S — ZEE5 Telugu (@ZEE5Telugu) June 4, 2022 చదవండి: ఓటీటీలోకి విక్రమ్, రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే? Namita: గ్రాండ్‌గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్ -
మెగా అల్లుడి సినిమా.. స్టోరీ లైన్ ఇదే!
కల్యాణ్ దేవ్ హీరోగా, మహతి భిక్షు, కశిష్ ఖాన్, శీతల్ ఇతర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కిన్నెరసాని’. సాయి రిషిక సమర్పణలో రమణతేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించిన ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘కిన్నెరసాని’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మిస్టరీ అంశాలతో సాగే బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఇది. ట్రైలర్లో ప్రేక్షకులకు కనిపించినది ఐదు శాతం మాత్రమే. సినిమాలో చాలా కథ ఉంది. ఈ కథను, నన్ను నమ్మి నాకు చాన్స్ ఇచ్చిన నిర్మాత రామ్ తాళ్లూరి గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఇందులో ఐదు కథలు ఉంటాయి. ఐదు కథల్లోని ఐదు పాత్రలూ ముఖ్యమైనవే. హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు అని చెప్పలేం. కథే హీరో. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాం కానీ జీ5 వారు చూసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. బిగ్ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని వారు అనడంతో థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. కొత్త దర్శకులతో నేను చేయనున్న సినిమాలను సంక్రాంతికి ప్రకటిస్తా’’ అని రామ్ తాళ్లూరి అన్నారు. కశిష్ ఖాన్, మహతి భిక్షు, శీతల్ పాల్గొన్నారు. -
శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్
Folk Singer Kinnera Mogulaiah TSRTC Song Video: టీఎస్ఆర్టీసీ బలోపేతానికి నడుం బిగించిన ఎండీ వీసి సజ్జనార్ అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్ స్పందిస్తూ తనదైన స్టైల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. తాజాగా కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య ఆర్టీసిని ప్రశంసలతో ముంచెత్తాడు. కూతురు వివాహానికి టీఎస్ఆర్టీసీ బస్ బుక్ చేసుకున్న మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకున్నాడు. చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో... ఆర్టీసీ బస్సులో ప్రయాణం మంచిదంటూ కిన్నెర మొగులయ్యగానం చేస్తున్న వీడియోను ఆర్టీసీ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు. ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తంచేస్తూ అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సు తల్లిలాంటిదని కొనియాడాడు ‘గంటలోనా బస్సు వస్తది.. ఆగవయ్య మొగులయ్యా.. డీఎం సార్‌కు చెప్తనేను.. ఆర్టీసీ బస్సు పంపుతా.. ఒక్క గంటలో బస్సు వచ్చే.. సుట్టాల్ పిల్లలు బస్సు ఎక్కిరి.. ఆర్టీసీ బస్సులోనా చెప్పలేని ఆనందం.. ఆర్టీసీ బస్సు ఎక్కి మంచిగ నేను పోయి వచ్చిన.. బస్సు అంటే బస్సు కాదు తల్లిలాంటి ఆర్టీసీ.. శభాష్ ఆర్టీసీ.. శభాస్ సజ్జనార్’ అంటూ సాగే పాటను ఆయన ఆలపించారు. కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa — Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021 -
‘కిన్నెరసాని’ నుంచి లిరికల్ సాంగ్, ఆకట్టుకుంటున్న లిరిక్స్
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, యంగ్ హీరో కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కిన్నెరసాని’. రమణతేజ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో కల్యాణ్ దేవ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. ఇదిలా ఉండగదా తాజాగా 2కిన్నెరసాని’ నుంచి పార్వతీపురం అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘దారి కాని దారిలోన ఊధు పొదలనా..పెద్దకొడుకు మర్రిచెట్టు నాకు చివరనా.. సిచ్చు కంట చెరువు గట్టు తూరుపున్నది.. దాసెకొండ బిడ్డ నేను పార్వతీపురం’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. చదవండి: Pushpa Movie: రేపు హీరోయిన్ ఫస్ట్‌లుక్‌కు ముహుర్తం ఖారారు ఇక సాంగ్‌లో కనిపించే కొన్ని సన్నివేశాలు సస్పెన్స్‌తో పాటు ఆసక్తిని పెంచుతున్నాయి. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను ఉమా నేహా, రేవంత్, ధనుంజయ్ సీపానా ఆలపించారు. కిట్టు విస్సా ప్రగడ రాసిన పాట లిరిక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో హీరోయిన్గా అన్ శీతల్ నటిస్తోంది. రవీంద్ర విజయ్, మహతి బిక్షు, కశిష్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చదవండి: మొత్తానికి మేము ఏడాది పూర్తి చేశాం: సామ్ వీడియో వైరల్ -
ఆకట్టుకుంటున్న కల్యాణ్‌దేవ్ ‘కిన్నెరసాని’ టీజర్
'విజేత' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈ మెగా హీరో ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాలో నటిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది క్యాప్షన్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను హీరో నితిన్ విడుదల చేశారు. ‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి, ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా..ప్రేమకైనా'.. అనే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా టీజర్ ఆద్యంతం సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ శీతల్ ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తుంది. మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. Happy to launch the interesting #KinnerasaniTeaser💥 Wishing the director @RamanaTeja9, dear @IamKalyaanDhev, producer @itsRamTalluri and the entire team all the luck🤗 👉 https://t.co/hRBIGpIP87#Kinnerasani@SRTmovies @annsheetal1 @RavindraVijay1 @Desharaj12 @mahathi_sagar — nithiin (@actor_nithiin) August 27, 2021 చదవండి :మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు! -
సాక్షి ఎఫెక్ట్: ‘కిన్నెరసాని’పై ఇనుప వంతెన ఏర్పాటు
గుండాల: శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కిన్నెరసాని నదిపై తాత్కాలిక ఇనుప వంతెన ఏర్పాటైంది. దీంతో వర్షం వచ్చినప్పుడు నది ఉధృతంగా ప్రవహించినా రాకపోకలు సులభతరం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం–నడిమిగూడెం గ్రామాల నడుమ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వర్షాలతో నదీ వ్రాహం పెరగగా, గిరిజనులు కట్టెలతో నిచ్చెన మాదిరి ఏర్పాటుచేసుకుని దాటిన విషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాలతో గుండాల సీఐ శ్రీనివాస్, ఎస్సై ముత్యం రమేశ్ సిబ్బందితో కలసి బుధవారం ఇనుప పైపులు, స్లాబ్ రేకులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించారు. చదవండి: ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ -
ప్రమాదకరంగా కిన్నెరసాని వాగు: కట్టెల సాయంతో..
సాక్షి, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, అళ్ళపల్లి మండలాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మండలాల్లో ఉన్న కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలంలో మోదుగుల గూడెం, సజ్జల బోడు గ్రామాల మధ్య కిన్నెరసాని వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆదివాసీలు కర్రల సహాయంతో వంతెన తయారు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరుతారు. దీంతో చేసేదేం లేక కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని వాగు ప్రవాహాన్ని అతికష్టం మీద దాటారు. చాలా ప్రమాదకరంగా ఇబ్బందులు పడుతూ వాగు దాటిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గుండాల మండల కేంద్రంలో కూలి పనులు, వ్యవసాయ పనిముట్లు, విత్తనాల కొనుగోలుకు రైతులు కూలీలు నిత్యం గుండాల మండలానికి రాకపోకలు సాగిస్తుంటారు. వాగు దాటడం ప్రమాదమని తెలిసినా సాహసం చేయక తప్పట్లేదు అంటున్నారు. గతంలో వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకొని పోయి ఇద్దరు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయని ఏళ్లు గడిచినా బ్రిడ్జి పనులు పనులు పూర్తిచేయడం లేదన్నారు. దీంతో ఏజెన్సీలో ఉన్న ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాగు దాటే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి పనులను పూర్తి చేసి ఏజెన్సీ వాసుల కష్టాలను తీర్చాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. -
Photo Story: భగీరథ.. ఏమిటీ వ్యథ!
కోడేర్ (కొల్లాపూర్): నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఖానాపూర్ శివారులో మిషన్ భగీరథ గేటు వాల్వ్‌కు లీకేజీ ఏర్పడింది. సోమవారం అది పెద్దదై మూడు గంటల పాటు నీళ్లు వృథాగా పోయాయి. పొలాల్లో ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు ప్రారంభించారు. మంగళవారంలోగా మరమ్మతు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇల్లెందు: పనికెళ్లాలంటే వాగు దాటాల్సిందే. సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరేది.. చేసేదేం లేక ఇలా కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని ప్రవాహాన్ని దాటడానికి సాహసం చేశారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం గిరిజనుల పరిస్థితి. మొదుగులగూడెం – నడిమిగూడెం మధ్య కిన్నెరసానిపై ఎలాంటి వారధి లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో ఇలాంటి కష్టాలు షరామామూలయ్యాయి. ఉడుము.. పట్టు మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాలైన కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, రేగులగూడెం, సింగారం తదితర గ్రామాల్లోని గిరిజనులు అడవుల్లో దొరికే ఉడుములను అమ్మడం ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. దీని మాంసం నడుము, కీళ్లనొప్పుల్లాంటి వ్యాధులకు బాగా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. ఈ క్రమంలో కేజీ మాంసం రూ.800 వరకు పలుకుతోంది. దీనిపై పెగడపల్లి ఫారెస్ట్ రేంజర్ సుష్మారావు మాట్లాడుతూ ఉడుములను పట్టడం నేరమని, అటువంటి వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. -
అదిరిపోయే కొత్త లుక్‌లో కల్యాణ్ దేవ్..
పుట్టినరోజు సందర్భంగా కల్యాణ్ దేవ్ రెండు చిత్రాల విశేషాలను చెప్పారు. రమణతేజ దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కిన్నెరసాని’. రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం కల్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ‘కిన్నెరసాని’ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కల్యాణ్ దేవ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను కూడా కల్యాణ్ దేవ్ బర్త్‌డే సందర్భంగానే రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. కాగా, రెండు చిత్రాల్లోనూ కల్యాణ్ దేవ్ లుక్ వ్యత్యాసంగా ఉంటుందని విడుదల చేసిన లుక్స్ చెబుతున్నాయి. -
బావకు రామ్ చరణ్ సాయం..
విజేత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ప్రస్తుతం ఆయన కిన్నెరసాని అనే సినిమా చేస్తున్నాడు. వైవిధ్యమైన టైటిల్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'కిన్నెరసాని' టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు ఫిబ్రవరి 11న కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి థీమ్ వీడియోను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఇందులో కాలిపోతున్న కాగితం గాలిలో ఎగురుతూ వచ్చిరోడ్డు మీద పడుతోంది. అందులో నుంచి అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. అయితే ఆ ఫోటోలో అమ్మాయి ఎవరనే విషయం మాత్రం తెలియదు. అదే సమయంలో వర్షం పడటం.. చివరలో కళ్యాణ్ దేవ్ ఫొటో చూపించడం ఆకట్టుకునేలా ఉంది. Here's the Mysterious #ThemeOfKinnerasani https://t.co/qUOvIQVtY2 Happy Birthday @IamKalyaanDhev ! My best wishes to @RamanaTeja9 and the entire team of #Kinnerasani@itsRamTalluri @Desharaj12 #RajaniTalluri #RaviChintala @Mahathi_Sagar @SRTmovies pic.twitter.com/c5TsjbCpmo — Ram Charan (@AlwaysRamCharan) February 11, 2021 థీమ్ వీడియో చూస్తుంటే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చివర్లో కళ్యాణ్ దేవ్ లుక్ భయం కలిగించేలా ఉంది. మొత్తానికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో కళ్యాణ్ దేవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. చదవండి: అరుదైన గౌరవం: అనసూయ ఫోటోతో పోస్టల్ స్టాంప్ పుష్ప: హాలీవుడ్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్.. -
బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు
సాక్షి, పాల్వంచ: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) నుంచి వెలువడే వృథా బూడిద నిల్వలు ఉండే..యాష్‌పాండ్ చుట్టు పక్కల ప్రాంతాల వారు బెంబేలెత్తుతున్నారు. ఈ బూడిద కాలుష్యంతో యాష్‌పాండ్‌కు సమీపంలో పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం గ్రామాల ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బూడిద గాలిలోకి లేవకుండా కేటీపీఎస్ యాజమాన్యం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటెటర్ (ఈఎస్పీ)లను ఉపయోగిస్తున్నా..పనితీరు సక్రమంగా లేకపోవడంతో కాలుష్యం వెదజల్లుతోంది. నీటిద్వారా యాష్‌పాండ్‌కు తరలిస్తున్నారు. సమీపంలోని కాల్వలు, కిన్నెరసాని ప్రాంతం బూడిదతో నిండి కాలుష్యభరితంగా మారుతున్నాయి. పీల్చుతున్న కార్మికులు, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. జెన్కో టన్ను రూ.10చొప్పున విక్రయిస్తుండగా.. ప్లైయాష్ను సిమెంట్, ఇటుకల కంపెనీలు ప్రతిరోజూ వెయ్యి టన్నుల బూడిదను తీసుకెళ్తుంటాయి. మిలిగిన నిల్వలు అలా పేరుకుపోతుంటాయి. నిత్యం వందలాది లారీల లోడ్లను హైదరాబాద్, మిర్యాలయగూడెం, జగ్గయ్యపేట, కట్టగూడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధిక లోడ్‌తో ఊరి రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. గాలికి బూడిద రోడ్లపై, నివాసాలపైకి చేరి ఇబ్బంది పడుతున్నారు. బూడిదతో కూడిన గాలి పీల్చడం వల్ల స్థానికులు ఆయాసం, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నారుల ఒంటిపై దురదలు వస్తున్నాయి. ఇటీవల కేటీపీఏస్ యాజమాన్యం కిన్నెరసాని ప్రధాన రహదారినుంచి యాష్‌పాండ్ వరకు తారురోడ్డు నిర్మించగా..25టన్నుల లోడుకు బదులు 30 నుంచి 40 టన్నుల బూడిద లోడు ఒక్కో లారీలో తరలిస్తుండడంతో అది కూడా అధ్వానంగా మారింది. యాష్‌పాండ్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మేతకు వెళ్లి పశువులు, మేకలు, గొర్రెలు బూడిద గుంతల్లో ఇరుక్కుపోయి మరణిస్తున్నాయి. అనేకమార్లు నోటీసులు.. యాష్‌పాండ్‌లో పడి మృతి చెందిన పశువులు కేటీపీఎస్ కర్మాగారం ద్వారా బూడిద చెరువులోకి పంపిస్తున్న బూడిద సమీపంలోని కిన్నెరసాని వాగులో కలవడం ద్వారా పశువులు, పంటల దెబ్బతింటున్నాయి. బూడిద కాలుష్యాన్ని కిన్నెరసానివాగులో కలవకుండా చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. కర్మగారంలో సెడ్మెంటేషన్ ట్యాంక్‌ను నిర్మించాలని, బూడిద నియంత్రణ యంత్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ఆచరణకు నోచట్లేదు. పొలం, జలం.. బూడిదమయం యాష్‌పాండ్ పరిసరాలన్నీ బూడిదతో నిండి కనిపిస్తుంటాయి. సమీపంలోని కిన్నెరసాని వాగు జలం రంగు మారి ప్రవహిస్తుంటుంది. పొలాలన్నీ సారం కోల్పోతున్నాయి. ఈ నీళ్లను తాగిన పశువులు చనిపోతున్నాయి. జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. -
ఏళ్లుగా.. ఎదురుచూపులే
సాక్షి, ఖమ్మం(పాల్వంచరూరల్) : పర్యాటకులను అలరించే ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెరసాని గురించి ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. అందుకు తగ్గట్టుగానే దీన్ని దర్శించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది యాత్రీకులు తరలివస్తుంటారు. ఇక్కడి డీర్‌పార్కులో దుప్పులు, నెమళ్లు, డక్‌పార్కులో బాతులు, కోతులు, కొండముచ్చులు పర్యాటకులను ఆకట్టకుంటాయి. రిజర్వాయర్‌లో బోటుషికారు మరింతగా ఆకర్షిస్తుంది. దీన్ని మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని ప్రకటించాయి. తదనుగుణంగా నిధులు కూడా మంజూరు చేశాయి. అయితే మూడేళ్లు దాటినా అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో కిన్నెరసాని కళావిహీనంగా మారింది. పర్యాటకులకు నిరాశే.. ప్రకృతి అందాలు, పర్యాటక సొగసులను తిలకించేందుకు వచ్చేవారికి కిన్నెరసాని పర్యాటక ప్రాంతం నిరాశనే మిగిలిస్తోంది. మూడేళ్ల క్రితం ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. కిన్నెరసాని, కొత్తగూడెంలోని పర్యాటక అభివృద్ధి పనులు ఏడు నెలలుగా ఆగిపోయాయి. 2015లో నీతి ఆయోగ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.3.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకో టూరిజం అభివృద్ధి కింద రూ.7.53 కోట్లు కేటాయించాయి. ఈ నిధులతో కొత్తగూడెంలో టూరిజం హోటల్, కిన్నెరసానిలో అద్దాలమేడ, తొమ్మిది కాటేజీల పునర్నిర్మాణం, ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన చాప్రాస్ అసోసియేట్ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ తొమ్మిది కాటేజీలు, రెండంతస్తుల్లో నిర్మిస్తున్న అద్దాలమేడ, ఫుడ్‌కోర్టుకు స్లాబ్ వేసి వదిలేశారు. ఆ తర్వాత కూలీల సమస్య వస్తోందని చెపుతూ గత డిసెంబర్ నుంచి పనులు చేయడం ఆపేశారు. ఆయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి పనులు పడకేశాయి. గతంలో శిథిలమైన కాటేజీలు, అద్దాలమేడ స్థానంలో కొత్తగా పనులు ప్రారంభించడంతో వాటి కోసం పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాణ పనులు మాత్రం నత్తను మరిపిస్తున్నాయి. పనులు శరవేగంగా పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో జాప్యం జరుగుతోంది. దీంతో పర్యాటకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. పనులు ఎప్పుటికి పూర్తయ్యేనో... రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌తోపాటు అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు కిన్నెరసానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవేం పనులంటూ సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. 2017 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. దీంతో 2018 డిసెంబర్ వరకు సమయం కావాలని కాంట్రాక్టర్ కోరారు. అయితే ఆ గడువు దాటి ఏడు నెలలైనా ఇప్పటికీ పనులు పూర్తికాకపోగా.. కమిషనర్ ఆదేశాలను సైతం భేఖాతర్ చేస్తూ పనులు మధ్యలోనే వదిలి కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. దీంతో వి«విధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నిరాశ, నిరుత్సాహాలతో వెనుదిరుగుతున్నారు. కాగా, కొంతవరకు చేపట్టిన అద్దాలమేడ, కాటేజీలు, ఫుడ్‌కోర్టు నిర్మాణ పనుల్లోనూ నాణ్యత ప్రమాణాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా దొడ్డు ఇసుకను వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రతిపాదనలు పంపాం కిన్నెరసాని, కొత్తగూడెంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనుల్లో జాప్యం చేయడంతో పాటు చెప్పకుండా మధ్యలోనే వెళ్లిపోయిన కాంట్రాక్టర్‌కు పనులను రద్దు చేయాలని పర్యాటక శాఖ ఎస్ఈకి ప్రతిపాదనలు పంపాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. కొంత మేర పనులు చేసినప్పటికీ మధ్యలోనే వెళ్లిపోయాడు. మళ్లీ కొత్తగా టెండర్లు పలిచి పనులను కొనసాగించే అవకాశం ఉంది. –రాంబాబు, పంచాయతీరాజ్ ఏఈ -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో సెలవు రోజు కావడంతో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కిన్నెరసానికి ఒక్కరోజు రూ40,360 ఆదాయం లభించింది. పర్యాటకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కిన్నెరసాని పరిసరాల్లో ఆనందోత్సహాల నడుమ గడిపారు. డీర్ పార్కులోని దుప్పులను, నెమళ్లను, బాతులను, డ్యాం పైనుంచి జలశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 808 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించిడం ద్వారా వైల్డ్‌లైఫ్ చెక్‌పోస్టుకు రూ.22,240 ఆదాయం, 220 మంది పర్యాటకులు బోటు షికారు చేయడం ద్వారా రూ.18,120 ఆదాయం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఇదేం దారి ద్య్రం!
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో మంజూరైన ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్ శాఖ ద్వారా అనుమతులు రాక ఏడాది కాలంగా స్తంభించాయి. మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు, చండ్రాలగూడెం మీదుగా కొత్తగూడెం మండలం మైలారం నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్డు వరకు రహదారి నిర్మాణానికి రూ.62 కోట్లు గత ఏడాది మంజూరయ్యాయి. అయితే ఇందులో 51 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్ అనుమతి తప్పనిసరి. కాగా, అభయారణ్యంలో రోడ్డు విస్తరణకు ఆ శాఖ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్.. రాజాపురం నుంచి రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా గత మే నెలలో వైల్డ్‌లైఫ్ శాఖఅధికారులు నిలిపివేశారు. రోడ్డు పొడవునా కల్వర్టులు కూడా నిర్మించారు. అయితే అవి రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో వర్షాకాలంలో రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని వాహనచోదకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉల్వనూరు గ్రామ సమీపంలో, మల్లారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ప్రతిపాదనలు పంపినా పర్మిషన్ రాలే.. రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోవడంతో అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్అండ్బీ శాఖ ఈఈ ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి ప్రతిపాదనలు పంపించారు. స్వయంగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చించారు. అయినా రోడ్డు విస్తరణకు అనుమతి ఇచ్చేందుకు వైల్డ్‌లైఫ్ అధికారులు నిరాకరించారు. దీంతో చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు వైల్డ్‌లైఫ్ పరిధిలో లేని 8 కిలోమీటర్ల మేర మాత్రమే రోడ్డు నిర్మించారు. అయితే పాత రోడ్డుపైనే కొత్తగా నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని వైల్డ్‌లైఫ్ అధికారులు అంటున్నారు. అంతకుమించి విస్తరిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేగాక.. గతంలో నిర్మించిన రోడ్డుకు సైతం వైల్డ్‌లైఫ్ అనుమతులు లేవని చెపుతున్నారు. అయితే ఆ శాఖ పర్మిషన్ లేకుండా పాత రోడ్డు కూడా ఎలా నిర్మించారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. వైల్డ్‌లైఫ్ అనుమతి ఇవ్వడం లేదు మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు వైల్డ్‌లైఫ్ శాఖ పరిధిలో నిర్మించాల్సిన తారు రోడ్డు పనులకు ఆ శాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఏడాది కాలంగా పనులు నిలిచిన మాట వాస్తవమే. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వైల్డ్‌లైఫ్ శాఖ అధికారులతో మాట్లాడినా, ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపినా అనుమతికి నిరాకరించారు. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం. చివరికి పాత రోడ్డునే పునరుద్ధరించాలనే ఆలోచన కూడా ఉంది. మరోసారి వైల్డ్‌లైఫ్ ఉన్నతాధికారులతో చర్చిస్తాం. – రాజేశ్వరరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ -
మూడేళ్లయినా ముందుకు సాగట్లే !
పర్యాటకులను అలరించే ప్రకృతి అందాలకు నిలయం కిన్నెరసాని. నెమళ్లు, దుప్పులు, బాతులు.. ఇలా పలు రకాల పక్షులు, వన్యప్రాణులతో పాటు రిజర్వాయర్‌లో బోటు షికారు చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే దీన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దాలని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆహ్లాదం పెంచాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కూడా మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం పర్యాటకులకు శాపంగా మారింది. పాల్వంచరూరల్: కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు నిత్యం వందలాది మంది ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు, వివిధ రకాల పక్షులు వారిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశాయి. కానీ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అభివృద్ధికి ఆటంకంగా మారింది. మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే కేటాయింపు.. కిన్నెరసాని పర్యాటక అభివృద్ధికి 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకో టూరిజం అభివృద్ధి కింద రూ.7.53 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కొత్తగూడెంలో టూరిజం హోటల్, కిన్నెరసానిలో అద్దాలమేడ, పది కాటేజీల పునర్నిర్మాణం, ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. పనులను దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ 9 కాటేజీలకు స్లాబ్‌లు వేశారు. రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న అద్దాల మేడకు ఇంకా స్లాబ్ వేయలేదు. ఈ పనులన్నీ గత మూడేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. నిర్దేశిత గడువు పూర్తయి కూడా ఏడాది దాటింది. ఇంకా ఎంత కాలానికి నిర్మాణ పనులు పూర్తిచేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో శిథిలమైన కాటేజీలు, అద్దాలమేడ స్థానంలో కొత్తగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయా అని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫుడ్‌కోర్టు సైతం అసంపూర్తిగానే మిగిలింది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.. గత ఏడాది రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌తోపాటు అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కిన్నెరసానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అంసతృప్తి, ఆశ్చర్యానికి లోనయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అయితే ఆ ఆదేశాలను కాంట్రాక్టర్ పట్టించుకున్న పాపాన పోలేదు. 2018 డిసెంబర్ వస్తున్నా పనులు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆదేశిస్తే పనుల్లో వేగం పెంచకపోగా.. దీపావళి పండగ తర్వాత ఇప్పటివరకు పూర్తిగా నిలిపివేశారు. ఇక అద్దాలమేడ, తొమ్మిది కాటేజీలు, ఫుడ్‌కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి దొడ్డు ఇసుకను వినియోగిస్తున్నారని పర్యాటకులు అంటున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి గడువు విధించాం కిన్నెరసాని, కొత్తగూడెంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. కిన్నెరసానిలో అద్దాలమేడ రెండు అంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేయాల్సి ఉంది. పది కాటేజీలకు స్లాబ్‌ల నిర్మాణం పూర్తయింది. కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్ నిర్మాణం పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రెండోసారి విధించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – శంకర్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ -
నేను పెద్ద రౌడీనైనప్పటికీ...
కిన్నెరసాని పాటలు రాశాక వాటిని ఇతరులకు చేర్చడానికి ఉబలాటపడేవారు విశ్వనాథ సత్యనారాయణ. ఒకసారి బందరులో ప్రత్యేకంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శిష్యుల కవితాగానం ఏర్పాటు చేశారు. చాలామంది కవులు వచ్చి తమ ఛందోబద్ధ పద్యాలు చదివారు. చెళ్లపిళ్ల ఎంతో సంబరపడ్డారు. తర్వాత విశ్వనాథ వంతు రాగానే, కిన్నెరసాని పాటలు పాడి వినిపించారు. అయితే, అవి ఎందుకో చెళ్లపిళ్లకు అంతగా నచ్చలేదు. అదే సమయంలో టేబుల్ మీద పెట్టిన గ్లాసు ఒలికిపోయింది. దాన్నే ఆశువుగా చెళ్లపిళ్ల– ఒలికింది ఒలికింది కలికి కిన్నెరసాని తడిసింది తడిసింది పొడిది మేజాగుడ్డ – అని చదివారు. దీనికి ఉడుక్కున్న విశ్వనాథ, ఒక రౌడీ కథ చెప్పారు. ‘ఒక ఊరికి అతడు ఎంత పెద్ద రౌడీ అయినా కావొచ్చు. ఆ రౌడీకి గురువు ఆ ఊరు వచ్చాడంటే తన మొత్తం రౌడీతనాన్ని ప్రదర్శించలేడు; ఏదో రెండు కుప్పిగంతులు, ఒక లంఘనం ప్రదర్శిస్తాడు. నేనూ అంతే’ అని కూర్చున్నారు తనదైన గడుసుతనంతో. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
జింకళభరితం
పాల్వంచరూరల్: చుక్కల జింకలతో ఆహ్లాదాన్ని పంచే కిన్నెరసాని డీర్ పార్కు..ఇప్పుడు మరింత కళకళలాడబోతోంది. ప్రస్తుతం చుక్కల జింకలు(దుప్పులు) మాత్రమే ఉండగా..వివిధ ప్రాంతాలనుంచి మూడు రకాల జింకలతోపాటు హైదరాబాద్ జూ పార్కునుంచి కృష్ణజింకలు, కణుజులు, మూసిక జింకలు, కొండగొర్రెలను తీసుకురానున్నారు. కడుపుకింద తెల్లగా, వీపు మీద నల్లగా కొమ్ములు ఉండే కృష్ణ జింకలు, ఎలుక మూతిని పోలిఉండే మూసిక జింకలతోపాటు కణుజులు, కొండగొర్రెలు రానున్నాయి. వీటిని పర్యాటకులు సఫారీ ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇక్కడి సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులను వీక్షించడం కోసం సఫారీ ఏర్పాటుకు వైల్డ్‌లైఫ్ శాఖ దృష్టి సారించింది. ఇనుపకంచె (ఫెన్సింగ్)బయటి నుంచి కాకుండా అటవీ ప్రాంతంలోకి ఓపెన్‌జీప్ లాంటి వాహనాల్లో వెళ్లి..కనులారా వీక్షించేందుకు సఫారీ సౌకర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రూ.5.8 కోట్ల అంచనాల వ్యయం అవసరమని సీసీఎఫ్‌కు ఇటీవల ప్రతిపాధనలు కూడా పంపారు. ఆమోద ముద్ర పడితే రెండు, మూడు నెలలోనే సఫారీ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. -
404.50 అడుగులకు ‘కిన్నెరసాని’ నీటిమట్టం
ఎగువ నుంచి వస్తున్న వరదలకు కిన్నెరసాని రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో బుధవారం సాయంత్రానికి 404.50 అడుగులకు నీటిమట్టం చేరిందని డ్యామ్‌సైడ్ కేటీపీఎస్ ఏడీఈ రామకృష్ణ తెలిపారు. మంగళవారం నాటికి 404.30 అడుగులున్న నీటిమట్టం క్రమేణా పెరుగుతోందన్నారు. వెయ్యి క్యూసెక్కుల లోపు వరద ప్రాజెక్టులోకి వస్తున్నందున బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తుతామన్నారు. 17వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టులో 403 అడుగుల నీరు నిల్వ ఉంచుతామని తెలిపారు. – పాల్వంచ రూరల్ -
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..
దొరకునా ఇటువంటి సేవా... ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి రాయాలి. వేటూరి రాశారు. నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ... ఆత్రేయ అంతటివాడే భయపడిపోయాడు- కొండ వీటి చాంతాడంత ఉంది.. ఇది అనుపల్లవా అని. కాని అనుపల్లవే. అంత పొడవైనదే. దర్శకుడు ఓకే అన్నాడు. నిర్మాత డబుల్ ఓకే అన్నాడు. ఈ అనుపల్లవి రాసిన వేటూరే అంతకు కొంత కాలం ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్నాడు. జనం దానికి వెర్రెక్కిపోయారు. ఇండస్ట్రీ కోటి రూపాయల పాట అంది. మూడ్ ఇలా ఉన్నప్పుడు ఏ నిర్మాత అయినా చిలక కొట్టుడు కొడితే అనాలి. లేదంటే చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు అని ప్రేక్షకుల కోసం హీరోయిన్ అందచందాలు ఆరబోయాలి. కాని ఈ నిర్మాత అలా అనుకోలేదు. పాటను పాన్‌లా చేసి నమిలి ఊసే ఒక పదార్థం అనుకోలేదు. పల్లవి అనేది పరులకు కన్నుగీటే దురదృష్టవంతురాలైన వెలయాలు అనుకోలేదు. అది ఒక స్త్రీ. చక్కటి కన్నెపిల్ల. లేదంటే సజీవ అనుభూతులు ఉన్న ఒక ప్రాణం. స్నేహం చేయ బుద్ధేసే సాటి స్పందన. తనువూగింది ఈ వేళ.... అని ఉంటుంది ‘సిరిసిరి మువ్వ’లో. సుశీల పాడుతుంటే తనువు ఊగుతుంది. ఝమ్మంది నాదం... అని అంటుంటే పాదం సై అంటుంది. అది పాట. అదీ పూర్ణోదయా సంస్థ. అదీ ఒక నిర్మాతకుండాల్సిన అభిరుచి. ఆ అభిరుచి పేరే ఏడిద నాగేశ్వరరావు. హిందీలో ఆర్.కె. స్టూడియోస్ అంటే కేవలం గొప్ప సినిమాలు మాత్రమే కాదు. గొప్ప పాటలు కూడా. దేవ్ ఆనంద్ సొంత బేనర్ నవకేతన్ బేనర్ అంటే ఎస్.డి.బర్మన్- రఫీ- కిశోర్- లతా కలిసి చేసే గళ సమ్మోహనం. కె.ఆసిఫ్, నాసిర్ హుసేన్ ఇలాంటి వాళ్లంతా సినిమాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో పాటకూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగులో బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, దుక్కిపాటి, ఆదుర్తి వంటి వారు తొలి తరంలో నిలిస్తే మలి తరంలో పూర్ణోదయా సంస్థ, మురారి, యువచిత్ర ఈ పరంపరను సగౌరవంగా నిలబెట్టాయి. పూర్ణోదయాకు గాని, యువచిత్రకు గాని నోటి నిండా తాంబూలం పండి కనిపించే మామా - కె.వి. మహదేవనే రాగం... తానం... పల్లవి. ‘శంకరాభరణం’ ముఖ్యతారాగణంలో ‘పాట’ కూడా ఒకటి. సినిమా మొదలెడుతూ వేటూరిని, మహదేవన్‌ని ఉద్దేశించి నమస్కరిస్తూ మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నారట విశ్వనాథ్. కాని అంత కంటే ఎక్కువ నమ్ముకున్నది ఏడిద నాగేశ్వరరావే. సినిమా ఫ్లాప్ అయితే విశ్వనాథ్‌కు ఇంకో సినిమా దర్శకత్వానికి అవకాశం దొరుకుతుంది. కాని పెట్టిన పెట్టుబడి తుడిచిపెట్టుకుని పోతే పైకి లేవడానికి నిర్మాతకు ఒక జీవిత కాలం పడుతుంది. కాని ఏడిద పెట్టుకున్న నమ్మకం ఒమ్ముకాలేదు. బ్రోచేవారెవరురా... అని దప్పికతో నోళ్లు తెరుచుకుని ప్రేక్షకుల మీద ఈ పాటలు కుంభవృష్టిలా కురిశాయి. మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు... అనంటే అవును కాబోలు అనుకుంటూ తడిశారు. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు... అనంటే అవును కాబోలు అంటూ తడిసి ముద్దయ్యారు. ఇప్పటికీ ఏ డిస్కషన్లో కూచున్నా ఏ పాట చేస్తున్నా అబ్బే రిక్షావాడికి ఎక్కదండీ అని కొట్టిపారేస్తుంటాడు. ఆంధ్రదేశంలో ప్రతి రిక్షావాడు ఈ పాట పాడాడు... శంకరా... నాదశరీరా పరా... తెలుగువారికి ఒక తమిళుడి బాకీ తాత్కాలికంగా తీరింది. ఇంకో తమిళవాడి బాకీ మిగిలి ఉంది. ఏడిద నాగేశ్వరరావు ఆ బాకీ చెల్లింప చేశారు. ‘సీతాకోకచిలుక’ పాటలను ఇచ్చి ఆలిండియా రేడియో మోగే ఇళ్లల్లో ఆడవాళ్ల తీరిక వేళలను సఫలం చేశారు. మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా.... పాట చుక్కలాగా నవ్వడం వేకువ చుక్కానిలా దారి చూపడం ఈ పాటలతో చూశారు. మాటే మంత్రము... మనసే బంధము.... జనం విని తలలను పడగల్లా ఆడిస్తూ ‘పాటే మంత్రము’ అని అంగీకరించి పూర్ణోదయాకే తమ ఓటు అని కలెక్షన్ బాక్సుల్లో నోట్ల కాగితాలను జార విడిచారు. సాగరసంగమానికి మొదటి హీరో స్క్రిప్ట్. రెండో హీరో కమలహాసన్. మూడో హీరో ఇళయరాజా చేసిన పాట. 1983 అంటే చక్రవర్తి మంచి ఊపు మీద ఉన్నారు. పాట రగులుతున్న మొగలిపొదలా ఉంది. ఆ సమయంలోనే నిశ్శబ్దంగా ఒంటి మీద చప్పుడు చేయకుండా జారే స్నానపు ధారగా లేతగా నాసికను తాకే నురగ సువాసనగా మౌనమేలనోయి ఈ మరపురాని రేయి... వచ్చింది. ప్రేక్షకులు స్పెల్‌బౌండ్ అయ్యారు. తకిట తథిమి తకిట తథిమి తందానా... అనంటే టెన్షన్‌తో అట్టుడికి బావికి వలలు పట్టారు. గొడుగు మర్చిపోయి గట్టు దాకా పరిగెత్తి ఆ తాగుబోతు కళాకారుడి చేయి పట్టుకున్నారు. ఇక ‘సితార’ వచ్చింది కిన్నెరసానిని తెచ్చింది. పచ్చని చేల పావడగట్టి కొండమల్లెలె కొప్పున గట్టి వచ్చే పాట ఎంత రూపసిగా, ఎంత లావణ్యంతో, ఎంత దేశీయ సౌందర్యంతో ఉంటుందో చూసి విచ్చుకున్న పెదవులతో మెచ్చుకున్నారు. ‘స్వాతిముత్యం’లో సినారె సువ్వి సువ్వి సువ్వాలమ్మాఅన్నారు. వటపత్ర శాయికి వరహాలలాలి పాడితే ఎలా ఉంటుందో చూపి ఇంటింటి తల్లులకు ఓ లాలిపాట అరువిచ్చారు. ఇవన్నీ ఒకెత్తు పూర్ణోదయాకు రమేశ్ నాయుడు చేయడం ఒకెత్తు. చిరంజీవి చెప్పులు కుట్టేవాడట. వీపున బిడ్డను కట్టుకుని పాట పాడతాడట. తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్ పారాహుషార్... ఇంకేం పారాహుషార్. విన్న ప్రతివాడూ దాని వెంట నడుస్తూ ఆ కొండల్లో కోనల్లో తప్పిపోయాడు. మంచి గడపను చూస్తే మంచి ముగ్గేయబుద్ధవుతుంది... మంచి నిర్మాణ సంస్థ దొరికితే ఎవరికైనా సరే మంచి పాటే చేయబుద్ధవు తుంది. సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి... ఎంత జానపద సౌందర్యం. సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... ఇంత మంచి పాట ఇచ్చాక ప్రేక్షకులు ఏమడిగినా ఇవ్వకుండా ఉంటారా? చివరి సినిమా ‘ఆపద్బాంధవుడు’. స్వర సేనాపతి కీరవాణి. హార్మోనియం మీద కత్తులు కాదు దూయాల్సింది. మల్లెల గుత్తులు. విరజాజుల పొత్తులు. మీటాడు. ఔరా అవ్ముక చెల్లా ఆలకించి నవ్ముడమెల్లా అంత వింత గాథల్లో ఆనంద లాల... హిట్ పడిపోయింది. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి... మరోసారి మంచి సిరివెన్నెల పాటకు దారి దొరికింది. ఆ తర్వాత పూర్ణోదయా సంస్థ సినిమాలు తీయలేదు. చాలా సినిమాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు మంచి పాటలు మెరుస్తున్నాయి. కాని దండలోని ప్రతి పువ్వునూ సువాసన కలిగినదిగా చూడటం... ముంచిన ప్రతి కడవనూ పాలతో నింపడం... పట్టిన ప్రతి దోసిలినీ తేనెతో తొర్లేలా చేయడం పూర్ణోదయాకే చెల్లింది. ఆ సంస్థ సినిమాలకే దక్కింది. ఏడిద నాగేశ్వరరావుకు సెలవు. - ఖదీర్ -
కిన్నెరసాని డీర్ పార్క్‌కు 40 ఏళ్లు
పాల్వంచ రూరల్: పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలో జింకల పార్క్ ఏర్పాటుచేసి నేటికి 40సంవత్సరాలు పూర్తైది. పాల్వం చ మండలంలోని యానంబైల్ గ్రామ పంచాయతీ కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలో 30 జింకలతో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ను 1974 సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళవారం ప్రారంభించారు. అప్పటినుంచి సింగరేణి యాజమాన్యం దీనిని పర్యవేక్షించింది. పర్యాటకులకోసం కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద సింగరేణి ఏర్పాటు చేసిన అద్దాల మేడను 2000 సంవత్సరంలో మావోయిస్టులు డిటోనేటర్ల ద్వారా పేల్చి వేయడంతో అద్దాల మేడ, పది కాటేజీలు, జింకల పార్కు నిర్వహణ బాధ్యతలను వన్యమృగ సంరక్షణ అధికారులకు అప్పగించారు. అప్పటి నుంచి వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి జింకల పార్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో 30 జింకలు ఉండగా క్రమక్రమం గా అధికారులు పార్క్ విస్తీర్ణం పెంచి 110 జింకలకు పెంచారు. రాష్ట్రంలోనే అరుదుగా కనిపించే కృష్ణ జింకలు కిన్నెరసాని రిజర్వాయర్‌కు వచ్చే పర్యాటకులకు ముందుగా కనువిందు చేస్తాయి. పార్క్‌లో ఉండే జింకలకు గ్రాస్‌తోపాటు తాటి చెట్టు కర్ర తొట్లను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పిచేవారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సిబ్బందితో జింకలకు గడ్డి, 120 కేజీల ఫీడ్‌ను పోషకాహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీర్ పార్క్ 40 జింకలు మాత్రమే సరిపోతుంది. కానీ స్థాయికి మించి జింకలు ఉన్నాయి. -
ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు
ఖమ్మం: అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు రిజర్వాయర్ లోని పెద్దఎత్తున నీరు రావడంతో 18 గేట్లు ఎత్తేసి 90 వేల క్యూసెక్కుల నీటికి దిగువకు వదిలారు. కిన్నెరసాని, పెదవాగు, బయ్యారం చెరువు, వైరా రిజర్వాయర్ జలకళ సంతరించుకున్నాయి. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో వాజేడు-వెంకటాపురం మండలాల మధ్య ఉన్న చీకుపల్లి వాగు పొంగి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, ముర్రేడు, ఏయ, ఆకేయ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.