‘కిన్నెరసాని’ నుంచి లిరికల్‌ సాంగ్‌, ఆకట్టుకుంటున్న లిరిక్స్‌ | Parvathipuram Lyrical Video Song released From Kalyan Dev Kinnerasani Movie | Sakshi
Sakshi News home page

Kinnerasani Movie: ఆకట్టుకుంటున్న ‘పార్వతీపురం’ లిరికల్‌ సాంగ్‌

Published Tue, Sep 28 2021 9:22 PM | Last Updated on Tue, Sep 28 2021 9:22 PM

Parvathipuram Lyrical Video Song released From Kalyan Dev Kinnerasani Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు, యంగ్‌ హీరో క‌ల్యాణ్ దేవ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘కిన్నెర‌సాని’. ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వం తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌లో క‌ల్యాణ్ దేవ్ రెండు డిఫ‌రెంట్ షేడ్స్ లో క‌నిపించాడు. ఇదిలా ఉండగదా తాజాగా 2కిన్నెరసాని’ నుంచి పార్వతీపురం అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ‘దారి కాని దారిలోన ఊధు పొద‌ల‌నా..పెద్ద‌కొడుకు మ‌ర్రిచెట్టు నాకు చివ‌ర‌నా.. సిచ్చు కంట చెరువు గ‌ట్టు తూరుపున్న‌ది.. దాసెకొండ బిడ్డ నేను పార్వ‌తీపురం’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.

చదవండి: Pushpa Movie: రేపు హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌కు ముహుర్తం ఖారారు

ఇక సాంగ్‌లో కనిపించే కొన్ని సన్నివేశాలు స‌స్పెన్స్‌తో పాటు ఆసక్తిని పెంచుతున్నాయి. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ కంపోజ్ చేసిన ఈ పాటను ఉమా నేహా, రేవంత్‌, ధ‌నుంజ‌య్ సీపానా ఆలపించారు. కిట్టు విస్సా ప్ర‌గ‌డ రాసిన పాట‌ లిరిక్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా అన్ శీత‌ల్ న‌టిస్తోంది. ర‌వీంద్ర విజ‌య్‌, మ‌హ‌తి బిక్షు, క‌శిష్ ఖాన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్ఆర్‌టీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. 

చదవండి: మొత్తానికి మేము ఏడాది పూర్తి చేశాం: సామ్‌ వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement