kalyan dev
-
విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్‌ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే, పలు విభేదాల కారణంగా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీజ నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది.విడాకుల అంశం గురించి శ్రీజ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. కానీ ఆమె తన భర్తతో విడాకుల గురించి రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియా ద్వారా ఓ అమ్మాయి ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్‌కు ఇలా ప్రశ్న పంపింది. 'నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది. కానీ, నా భర్తే ఈ విషయంలో అడ్డు పడుతున్నాడు. తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వద్దని కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలి..?' అని అడిగింది. ఇందుకు సమాధానంగా వాళ్లు.. ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ అంశంలో ఇతరుల ప్రమేయం లేకుండా మీరే నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.ఈ క్రమంలో విడాకుల విషయంపై ఆ అమ్మాయికి వారు ఇలా సూచించారు. 'బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్లడం, నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవడం, చక్కగా రెడీ కావడం, మీకు నచ్చిన గిఫ్టులు మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్. ఈ విషయంలో మళ్లీ ఒక్కసారి ఆలోచించండి. సెల్ప్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ అనే పోరాటంలో మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకుందా..?' అని ఆ యువతితో వారు చెప్పుకొచ్చారు. ఈ మెసేజ్‌లను శ్రీజ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గతంలో కూడా శ్రీజ సెల్ఫ్ లవ్ అంటూ పలు పోస్టులు పెడుతుండేది. దీనినిబట్టి చూస్తే భవిష్యత్‌లో ఎవరితోనూ ప్రేమలో పడేది ఉండదని ఆపై పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా లేదన్నట్లుగా ఆమె మెసేజ్‌లు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.వ్యాపారంలో శ్రీజ తొలి అడుగుకొద్దిరోజుల క్రితం శ్రీజ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. స్టూడియో అనంత పేరుతో హైదరాబాద్‌లో ఓ ఫిట్నెస్ సెంటర్‌ను ఆమె ప్రారంభించింది. తాను ఇలా వ్యాపార రంగంలోకి రావడం, ఫిట్నెస్ సెంటర్లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ గతంలో శ్రీజ తెలిపింది. ఈ ఫిట్నెస్ సెంటర్లో జిమ్, యోగా కూడా ఉంటాయని ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
ఫ్యాన్స్‌కు కల్యాణ్ దేవ్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. విజేత సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలతో మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజను.. కల్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం శ్రీజ, కల్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కల్యాణ్ దేవ్ తన ఫ్యాన్స్‌కు విషెస్ తెలిపారు. తన కూతురు నవిష్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. మమ్మల్ని అదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ఇటీవలే నవిష్క ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. నవిష్క బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
కూతురితో కలిసి వేడుకలో పాల్గొన్న కల్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ తెలుగువారికి సుపరిచితమే. మెగా అల్లుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. అయితే ప్రస్తుతం కల్యాణ్ దేవ్ ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించడం లేదు. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ నవిష్క అనే కూతురు ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే కల్యాణ్ దేవ్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఉంటున్న కల్యాణ్ దేవ్ గతంలో తన తల్లి బర్త్‌డే జరుపుకున్న ఫోటోలను పంచుకున్నారు. అలాగే తాజాగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా తన చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకలో పాల్గొన్న ఫోటోలను కల్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వేడుకలో తన కూతురు నవిష్కతో కలిసి పాల్గొన్నారు. మీ అందరి ప్రేమ, అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతోంది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి కల్యాణ్ దేవ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
జీవితంలో కష్టాలు వచ్చినా.. గుండె బద్దలైనా అంటూ శ్రీజ కామెంట్స్
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. ఆ పెళ్లి వేడుకలో మెగా- అల్లు కుటుంబాలు సందడి చేశాయి. ఈ వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. తాజాగా వారందరూ ఇటలీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వరుణ్ వివాహ వేడుకలో తన పిల్లలతో సందడి చేసిన మెగాస్టార్ కూతురు శ్రీజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. (ఇదీ చదవండి: గుంటూరు కారం ఫస్ట్ సాంగ్.. మహేశ్ ఫ్యాన్స్‌కు మసాల బిర్యానీ రెడీ) 'విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినప్పుడు హృదయం గాయపడటంతో పాటు విరిగిపోతుంది, మనస్సు కలత చెంది ఆపై క్షీణిస్తుంది. ఆ సమయంలో శరీరం అలసిపోయి బలహీనం అవుతుంది. జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనసులో బాధగా ఉన్నా... గుండె బద్దలైనా, పరిస్థితి చేజారినా కూడా ఒక్కసారి కళ్లు మూసుకుని మనలోపలికి మనం వెళ్తే అన్నీ సెట్ అవుతాయ్. అని శ్రీజ తెలిపింది. కష్టాల సమయంలో మనందరి ముందు ఉన్న ఏకైక దారి కూడా అదే అంటూ చెప్పుకొచ్చిన శ్రీజ.. ఈ పోస్ట్‌కు మాత్రం కామెంట్లను డిజబుల్ చేసింది. 2016లో కల్యాణ్ దేవ్‌తో శ్రీజ వివాహం జరిగిన విషయం తెలిసిందే.. వరుణ్ పెళ్లిలో శ్రీజ, నవిష్కలు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్న సమయంలో.. తన కూతురిని మిస్ అవుతున్నట్టుగా కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు స్టోరీలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రీజ పోస్ట్ చేసిన విషయాన్ని పలువురు షేర్ చేస్తూ ఎంతో పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారు. జీవితంలో అన్నీ ఉంటాయి.. కానీ వాటినీ స్వీకరించక తప్పదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది: కళ్యాణ్ దేవ్
-
మా ఇంట్లో నాకు అలాంటి ఆంక్షలు ఏమీ పెట్టలేదు..!
-
మా పరిచయం ఎలా మొదలైందంటే..!
-
నా కూతురికి మా నాన్న అంటే చాలా ఇష్టం
-
నాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు
-
ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!
మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ప్రస్తుతం కూతురితో కలిసి ఉంటోంది. భర్త కల్యాణ్ దేవ్.. శ్రీజ దగ్గర కాకుండా తన ఇంట్లో ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అధికారికంగా బయటకు చెప్పలేదు గానీ విడాకులు తీసుకున్నారనే టాక్ చాలారోజుల నుంచి వినిపిస్తోంది. గతంలో వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే దీనికి ఉదాహరణ. సరే అది పక్కనబెడితే కల్యాణ్ దేవ్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ మాత్రం అతడి బాధని చెబుతోంది. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) కారణం ఏంటో మరి చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్దమ్మాయి సుస్మిత ఓవైపు స్టైలిష్ట్, మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంది. రెండో కూతురు శ్రీజ గతంలో ఓసారి పెళ్లి చేసుకుని అతడి నుంచి విడిపోయింది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన సంబంధంగా కల్యాణ్ దేవ్‌ని వివాహం చేసుకుంది. వీళ్లకు కూడా ఓ పాప పుట్టింది. కారణమేంటో తెలియదు గానీ భార్యభర్తలు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. వారంలో ఒక్కసారే పాప నవిష్క.. ప్రస్తుతం తల్లి శ్రీజ దగ్గరే ఉంటోంది. వారంలో ఓసారి అది కూడా నాలుగు గంటలు తండ్రి దగ్గరకి వస్తోంది. ఈ మధ్యే కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. తాజాగా కల్యాణ్ తన తల్లి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆమెకు విషెస్ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో కూతురి గురించి చెప్పుకొచ్చాడు. 'మిస్ యూ మై బేబీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూస్తుంటే.. ప్రతివారం నవిష్కని కలుస్తున్నాసరే కల్యాణ్ దేవ్ ఆమెని మర్చిపోలేకపోతున్నాడని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) (ఇదీ చదవండి: 'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!) -
'మన జీవితంలో అప్పుడే మధురమైన క్షణాలు'.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో కల్యాణ్ దేవ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. విజేత సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజను.. కల్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నవిష్క అనే పాప కూడా ఉంది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇటీవలే తన బిడ్డతో ఆడుకుంటున్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు కల్యాణ్. తాజాగా ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!) తాజగా ఇన్‌స్టాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చారు. 'మన జీవితంలో మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే.. మనకు అత్యంత మధురక్షణాలు. దీనితో మీరు ఏకీభవిస్తారా?' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ శ్రీజను ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచే సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఏడాదిన్నర కిందంటే ప్రచారం మొదలైంది. కానీ ఇంతవరకు దీనిపై అటు శ్రీజ, ఇటు కల్యాణ్ దేవ్ స్పందించనేలేదు. కాగా.. ఇటీవలే తన కూతురు నవిష్కతో కలిసి ఆడుకున్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్.. 'వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే' పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
శ్రీజతో విడాకులు.. కల్యాణ్ దేవ్ కన్ఫర్మ్ చేసినట్లేనా?
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ- కల్యాణ్ దేవ్ దంపతులు కలిసి కనిపించక చాలాకాలమే అవుతోంది. పండగలు, పార్టీల్లోనూ వీళ్లు విడివిడిగానే దర్శనమిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఏడాదిన్నర కిందంటే ప్రచారం మొదలైంది. కానీ ఇంతవరకు దీనిపై అటు శ్రీజ, ఇటు కల్యాణ్ దేవ్ స్పందించనేలేదు. ఎప్పటికైనా శ్రీజ- కల్యాణ్ మళ్లీ కలుస్తారేమోనని ఎదురుచూస్తున్న అభిమానులకు కూడా నిరాశే ఎదురైంది. తాజాగా కల్యాణ్ దేవ్ చేసిన పోస్ట్‌తో ఈ విడాకులపై క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. కూతురు నవిష్కతో కలిసి ఆడుకున్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్.. 'వారంలో ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే' అని క్యాప్షన్ జోడించాడు. సాధారణంగా దంపతులు విడాకులు తీసుకుంటున్నప్పుడు కోర్టు పిల్లల బాధ్యత ఎవరికి అప్పజెప్పాలి? తల్లి లేదా తండ్రి దగ్గర ఎంత సమయం ఉండవచ్చు అనేది నిర్ణయిస్తుంది. అందులో భాగంగానే కల్యాణ్ దేవ్ వారంలో నాలుగు గంటలు మాత్రమే తన పిల్లలతో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కల్యాణ్‌కు వచ్చిన పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. 'నీ బిడ్డలతో నువ్వు ఉండేది కేవలం నాలుగు గంటలేనా? వినడానికే ఎంతో బాధగా ఉంది', 'అంటే మీరు మళ్లీ కలిసే అవకాశమే లేదా? విడాకులు మంజూరయినట్లేనా?' అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) చదవండి: ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు దిల్ రాజు ముందే ఊహించాడా? -
శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్‌దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ల పెళ్లి జరగ్గా కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో ఈ రూమర్స్ నిజమనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ఈ పుకార్లపై నేరుగా స్పందించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఇన్‌డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ పోస్ట్ చూస్తే వీరిద్దరి మధ్య ఎంత అగాధం ఉందన్నది స్పష్టమవుతుంది. ఈ వీడియోలో ఓ స్కూల్ పాప కల్చరల్ ఈవెంట్లో పాల్గొంటుంది. తన పేరెంట్స్ ఎక్కడున్నారా అని స్టేజ్‌పై ఉండి వెతుక్కుంటుంది. వాళ్ల తల్లిదండ్రులను చూడగానే సంతోషంతో చాలా ఎగ్జయిట్ అవుతుంది. ఈ వీడియోను కల్యాణ్‌దేవ్ షేర్ చేస్తూ.. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మిస్సింగ్ నవిష్క, నివిత్రి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.దీంతో భార్యభర్తలు విడిపోయినా పిల్లలకు ఇద్దరి ప్రేమ దక్కాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలోనూ కూతుళ్లను తలుచుకుంటూ కల్యాణ్ దేవ్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. -
హాట్‌టాపిక్‌గా మారిన చిరంజీవి చిన్నల్లుడి పోస్టులు.. నెట్టింట వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ల పెళ్లి జరగ్గా మనస్పర్థల కారణంగా వీరు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలు డిలీట్ చేసేయడం సహా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ పార్టీలోనూ కల్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో రూమర్స్ మొదలయ్యాయి. కొన్నాళ్లుగా వీరిద్దరి పర్సనల్ లైఫ్‌పై ఇప్పుడు రకరకాల పుకార్లు వస్తున్నా మెగా ఫ్యామిలీ కానీ, ఇటు కల్యాణ్ దేవ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తమ రిలేషన్‌షిప్‌పై ఇన్‌డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా కల్యాణ్ దేవ్ షేర్చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. 'ఇతరులు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధల గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియనది కొండంత. అందుకే ఎదుటి వారి పట్ల మనం దయ, జాలితో ఉండాలి అంటూ' ఓ కొట్ను షేర్చేశారు. ఇక మరొక పోస్ట్‌లో.. క్రమశిక్షణ వల్లే వచ్చే బాధ, విచారం వల్ల కలిగే బాధ ఇలా రెండుంటాయి. వాటిలో మీరు ఏది కోరుకుంటారు అంటూ కల్యాణ దేవ్ చేస్తున్న వరుస పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. -
ప్రేమంటే ఏమిటంటే.. కల్యాణ్ దేవ్ ఇలా.. శ్రీజ అలా..
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పర్సనల్ లైఫ్‌పై ఇప్పుడు రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వీరిద్దరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అటు కల్యాణ్ దేవ్ కానీ, ఇటు శ్రీజ కానీ.. ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెట్టిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14) పురస్కరించుకొని ప్రేమపై ఈ జంట విడి విడిగా పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాలెంటైన్స్ డే విషెస్ తెలుపుతూ కల్యాణ్ దేవ్ ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం’ అని అందులో రాసుకొచ్చాడు. మరోవైపు శ్రీజ కొణిదెల ప్రేమ గురించి చెబుతూ.. ‘లవ్ అంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు’ అని చెప్పుకొచ్చింది. ఈ రెండు పోస్టులు చూస్తుంటే ఒకరిపై ఒకరు కౌంటర్‌గా ఇలా చేశారనే విషయం అర్థమవుతుంది. అసలు వీరిద్దరు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై ఇప్పటికీ ఈ జంట స్పందించకపోవడం గమనార్హం. -
చాలా మిస్ అవుతున్నాను.. కూతుర్ని తలచుకుంటూ కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దానికి కారణం అతని పర్సనల్ లైఫ్‌లో విభేదాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. తాజాగా కూతురు నవిష్కను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కల్యాణ్ దేవ్. ఫిబ్రవరి 11న కల్యాణ్ దేవ్ బర్త్‌డే. ఈ సందర్భంగా గతంలో కూతురితో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇది నాలుగోసారి. నా బర్త్‌డేను ఇంతకంటే గొప్పగా స్టార్ట్ చేయలేను. ప్రతిరోజూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్నా’అంటూ కల్యాణ్ దేవ్ రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కల్యాణ్ దేవ్ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
14 ఏళ్లప్పుడు పరిచయం అయ్యావ్.. థాంక్యూ మై డియర్, శ్రీజ పోస్ట్వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా.. క్షణాల్లో వైరల్ అవుతోంది. దానికి కారణం ఆమె పర్సనల్ లైఫ్‌లో విబేధాలు వచ్చేయనే పుకార్లు రావడమే. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడిపోయి కల్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులు కూడా పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ‘ ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా’ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. చివరకు ఆమె 'ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ప్' అంటూ సెల్ఫ్ లవ్ కంటే గొప్పది ఏదీ లేదన్నట్టుగా రాసుకొచ్చి అందరికి షాకిచ్చింది. తాజాగా తన కాఫీ అలవాటు గురించి శ్రీజ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘నా అల్లరికి ప్రశాంతతను నువ్వే ఇస్తావ్.. జీవితంలో చీకటికి నువ్వే వెలుగులు నింపుతావ్.. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే.. నా 14 ఏళ్ల వయసులో నువ్వు(కాఫీ) పరిచయం అయ్యావ్. అప్పటి నుంచీ నాతోనే ఉంటున్నావ్.. థాంక్యూ మై డియర్ కాఫీ’ అంటూ తాను కాఫీ లవర్ని అని శ్రీజ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
'చాలా మిస్ అవుతున్నా'.. కూతుర్ని తలుచుకొని కల్యాణ్ దేవ్ ఎమోషనల్
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ఇక శ్రీజతో విబేధాల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నా ఇప్పటివరకు దీనిపై ఈ జంట స్పందించలేదు. ఇక ఇప్పటికే శ్రీజ తన ఇన్‌స్టా హ్యాండిల్లో శ్రీజ కొణిదెలగా పేరు మార్చుకోవడం, భర్త కల్యాణ్ దేవ్‌ను అన్‌ఫాలో చేయడంతో మరిన్ని రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇదిలా ఉంటే శ్రీజ-కల్యాణ్‌దేవ్‌ల చిన్నకూతురు నవిష్క ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంది. తాజాగా నవిష్క లేటెస్ట్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన కల్యాణ్ దేవ్.. 'మిస్ యూ సో మచ్' అంటూ కామెంట్ చేశాడు. గతంలోనూ కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ కల్యాణ్ దేవ్ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ తెగ బాధపడిపోయిన కల్యాణ్ దేవ్ 'నువ్వే నా ప్రపంచం'.. అంటూ స్పెషల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూతుర్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. View this post on Instagram A post shared by Navishka (@navishka_k) -
ఆ వ్యక్తిని కలవడం అద్భుతం.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా : శ్రీజ
మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ కొణిదెల కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె పర్సనల్ లైఫ్‌లో రకరకాల రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. భర్త కల్యాణ్ దేవ్‌తో ఆమె వైవాహిక జీవితంపై పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా శ్రీజ షేర్ చేసిన పోస్ట్ మరింత అనుమానాలకు తావిస్తుంది. న్యూఇయర్ సందర్భంగా గతేడాది జరిగిన మూమెంట్స్‌ని షేర్చేస్తూ.. ''డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిశేలా చేశావ్. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమిస్తూ, కేరింగ్‌గా చూసుకుంటూ, కష్టసుఖాల్లో నాకు తోడుంటే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడే వ్యక్తి.. తనను కలుసుకోవడం అద్భుతం. కొత్త ప్రయాణం మొదలవుతుంది'' అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇక ఈమధ్యకాలంలో శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. రీసెంట్గాకూతురి బర్త్‌డేను సైతం శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేసింది. ఈ క్రమంలో 'కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నా' అంటూ శ్రీజ వెల్లడించడం అటు మెగా అభిమానులతో పాటు నెటిజన్లలోనూ ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా.. కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఆయన ఏ పోస్ట్ పెట్టినా.. నెటిజన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల ఆయన ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా కళ్యాణ్ ఎందుకు అలా పెట్టాడు? ఈ పోస్ట్ వెనక అంతర్యం ఏంటి? పర్సనల్ లైఫ్‌లో విభేదాలు వచ్చాయా?’అని ఆరా తీశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఆయన పెట్టిన మరో పోస్ట్ కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘2022లొ చాలా నేర్చుకున్నాను. సహనంగా ఎలా ఉండాలో తెలిసివచ్చింది. ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది.. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయపడ్డ ప్రతీ ఒక్కరికీ ధన్యావాదలు. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రయత్నించడం… ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దూ.. మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం, మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ ఈకొత్త సంవత్సరం శుభాకాంక్షలు ’అని కల్యాణ్ దేవ్ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ-కల్యాణ్ దేవ్‌లు 2016లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం కల్యాణ్ దేవ్ విజేత మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. రీసెంట్గా ఆయన నటించిన సూపర్ మచ్చి చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో కల్యాన్ సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. చదవండి: సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్? తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కల్యాణ్ దేవ్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అతడు తన గురించి వస్తున్న పుకార్లపై ఎప్పుడు నేరుగా స్పందించ లేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్స్ షేర్ చేస్తూ పరోక్షంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. తన లేటెస్ట్ ఫొటో షేర్ చేస్తూ ఈ పోస్ట్‌కి ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్‌బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దీని ఉద్దేశం ఏంటని? ఈ పోస్ట్ వెనక అంతర్యం ఏంటి? అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అదేవిధంగా త్వరలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిమ ఎదైనా కీలక ప్రకటన రానుందా? అంటూ కొందరు ఈ పోస్ట్‌పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్‌బై చెప్పుబోతున్నాడంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
శ్రీజ బర్త్‌డే.. ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసిన కల్యాణ్ దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ రొటీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ మధ్య కాలంలో శ్రీజ వ్యక్తిగత జీవితంపై నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంది.ఇదిలా ఉండగా శ్రీజ బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న(నవంబర్9)న శ్రీజ బర్త్‌డే సందర్భంగా ప్రతిసారి ఆమెకు విషెస్ చెప్పే కల్యాణ్ దేవ్ ఈసారి మాత్రం ఎలాంటి పోస్ట్ చేయలేదు. కానీ తన వెకేషన్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..లైఫ్ అంత ఈజీగా సాగదు.. మనమే స్ట్రాంగ్ అవ్వాలి అంటూ ఓ ఆసక్తికర పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
హీరోయిన్‌తో మెగా అల్లుడు కల్యాణ్ ఫోటో వైరల్
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి చిన్నకూతురు శ్రీజను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కల్యాణ్ దేవ్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ హీరోయిన్‌తో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వర్ణిక రాథోర్ అనే హీరోయిన్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి నా లైఫ్‌ను మార్చేసిన కళల రాణి అంటూ క్యాప్షన్‌తో ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో కల్యాణ్ దేవ్ మాటల వెనకున్న అర్థమేంటని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఆయన మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చిన నేఫథ్యంలో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె కల్యాణ్ దేవ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యిందని, ఈ క్రమంలోనే ఫోటో బయటికొచ్చిందని తెలుస్తుంది. -
బన్నీ భార్య స్నేహారెడ్డి ఫోటోపై కల్యాణ్ దేవ్ కామెంట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ డిజైనింగ్ శారీలో స్నేహారెడ్డి స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ స్నేహకు స్టైలింగ్ చేశారు. స్నేహారెడ్డి పోస్ట్ చేసిన ఫోటోపై చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ రియాక్ట్ అవుతూ హాట్ ఎమోజీతో స్నేహా.. అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం స్నేహా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
నీ ప్రేమతో ఆ కష్టాలను ఎదురీదుతా: కల్యాణ్‌దేవ్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం కిన్నెరసాని. రమణతేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మునుపటి సినిమాల కంటే కిన్నెరసానిలో కల్యాణ్ బాగా నటించాడని ప్రశంసలు దక్కాయి అతడికి. ఇక సోలో ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడీ హీరో. అంతేకాకుండా ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడు తన వర్కవుట్స్ వీడియోలను, ఫొటోలను కూడా షేర్ చేస్తుంటాడు. తాజాగా కల్యాణ్ దేవ్ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. హ్యాపీ బర్త్‌డే మామ్, కొన్నిసార్లు జీవితం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ నీ ప్రేమతో ఆ కష్టాలను సైతం ఎదురీదగలనన్న నమ్మకం నాకుంది. ఎల్లప్పుడూ నావెంటే ఉన్నందుకు థ్యాంక్స్.. లవ్ యూ సో మచ్ మా.. అని రాసుకొచ్చాడు. దీనికి తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో కల్యాణ్ దేవ్ తన తల్లికి కేక్ కట్ చేయించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) చదవండి: రన్నింగ్ సీన్లో హీరోకు గాయాలు, అయినా పరుగు ఆపని బాలీవుడ్ స్టార్ అక్కడింకా మొదటి సినిమానే, అయినా రెమ్యునరేషన్ మాత్రం డబుల్.. -
కల్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' మూవీ రివ్యూ
టైటిల్: కిన్నెరసాని జానర్: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నటీనటులు: కల్యాణ్ దేవ్, అన్ షీతల్, రవీంద్ర విజయ్, సత్య ప్రకాష్, మహతి దర్శకుడు: రమణ తేజ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రవి చింతల సంగీతం: మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ: దినేశ్ కె.బాబు విడుదల తేది: జూన్ 10, 2022 (జీ5) మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ నటించిన తాజా సినిమా కిన్నెరసాని. మొదట ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గత చిత్రం సూపర్‌మచ్చి థియేటర్లో పెద్దగా ఆడకపోవడంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణతేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(జూన్ 10) జీ 5లో రిలీజైంది. మరి కిన్నెరసాని చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.. కథ: వెంకట్(కల్యాణ్ దేవ్) తెలివైన లాయర్. ఎంతో ఈజీగా కేసులను పరిష్కరిస్తాడు. కాలేజీ టైంలోనే ఓ అమ్మాయి(కాశిష్ ఖాన్)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో ఆమె చనిపోతుంది. వేద(అన్ షీతల్) లైబ్రరీ నడుపుతుంది. లైబ్రరీలో తనకు దొరికిన కిన్నెరసాని పుస్తకం తన జీవితమే అని తెలుసుకుంటుంది. అందులో తన తండ్రి జయదేవ్(రవీంద్ర విజయ్) చిన్నప్పుడే తనను చంపాలనుకున్నాడని రాసి ఉంటుంది. అయితే అసలు తనను ఎందుకు చంపాలనుకున్నాడో తండ్రినే అడిగి తెలుసుకోవాలనుకుంటుంది వేద. అతడి జాడ కోసం అన్వేషిస్తుంది. ఆమెకు వెంకట్ సాయం చేస్తుంటాడు. అసలు వేదకు, వెంకట్‌కు ఉన్న సంబంధం ఏంటి? వెంకట్ ప్రేయసిని ఎవరు చంపారు? వేదను తండ్రి ఎందుకు చంపాలనుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ మర్డర్ సీన్‌తో మొదలైన సినిమా మర్డర్ సన్నివేశంతోనే ముగుస్తుంది. ఫస్టాఫ్‌లో కథను సస్పెన్స్, ట్విస్టులతో నడిపించారు. సెకండాఫ్‌లో ఫ్లాష్బ్యాక్లతో కొంత థ్రిల్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. రొటీన్ స్టోరీ కావడంతో సినిమా ఫ్రెష్‌గా ఏమీ అనిపించదు. చివర్లో క్లైమాక్స్ పెద్దగా వర్కవుట్ అవలేదనిపిస్తుంది. క్లైమాక్స్ మీద కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. సాయి తేజ దేశరాజు అందించిన కథ కథనం మాటలు సరికొత్తగా ఉన్నాయి. కథనం ప్రేక్షకుడ్ని చివరిదాకా కట్టిపడేస్తుంది. ఉత్కంఠగా సాగిన కథనం సినిమాకి మేజర్ హైలైట్. రైటర్‌కు మంచి మార్కులు పడ్డాయి. మర్డర్ మిస్టరీ జానర్ కాబట్టి కామెడీ, కమర్షియల్ హంగులకి జోలికి పోలేదు. ఎదుటివారి కళ్లలోకి కొన్ని క్షణాలు చూసి వారి మనసులో ఏముందో చెప్పగలిగే అరుదైన లక్షణం ఉన్న వేద పాత్రను మరింత అద్భుతంగా మలచడంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. ఆ లక్షణం కారణంగానే బాల్యం ఛిద్రమైందని చూపించిన దర్శకుడు ఆ రేర్ క్వాలిటీని ఎక్కువగా హైలైట్ చేయకపోవడం, దాన్ని లైట్ తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నటన పరంగా కల్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. గత సినిమాలతో పోలిస్తే కల్యాణ్ కొంచెం కొత్తగా కనిపించాడు. అతడి ప్రేయసిగా నటించిన కాశీష్ ఖాన్ నిడివి తక్కువే అయినా ఆమె పాత్ర ఎంతో కీలకం. స్క్రీన్‌పై కనిపించే కొద్ది నిమిషాలు కూడా మోడ్రన్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అన్ షీతల్ తన పాత్రకు తగ్గట్లుగా నటించింది. రవీంద్ర విజయ్ కళ్లతోనే విలనిజం పండించాడు. చివరగా.. నిదానంగా ముందుకు సాగిన ఈ మూవీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రమే నచ్చుతుంది. చదవండి: తమన్నా-సత్యదేవ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే! అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు -
నేరుగా ఓటీటీలో వస్తున్న మెగా అల్లుడి సినిమా
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం కిన్నెరసాని. సాయి రిషిక సమర్పణలో రమణతేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించారు. ఈ సినిమాను తొలుత ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాడు డైరెక్టర్. కానీ జీ5 వారు సినిమా చూసి అగ్రిమెంట్ చేసుకునే సమయంలో బిగ్ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని అనడంతో థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. జనవరి 26న థియేటర్లలో రిలీజ్ చేస్తామన్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేశారు. అయితే కల్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి పెద్దగా ఆడకపోవడంతో థియేటర్లో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. థ్రిల్లర్ మూవీ కిన్నెరసాని జూన్ 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. #Kinnerasani a mystery thriller that follows the journey of Veda who is in search of her father.#Premieres10thJune only on #ZEE5#KinnerasaniOnZEE5 @kalyaan_dhev @RamanaTeja9 @annsheetal1 @RavindraVijay1 @Kashishkhannn @mahathibhikshu @mahathi_sagar @itsRamTalluri @LahariMusic pic.twitter.com/TVxvDJ4V7S — ZEE5 Telugu (@ZEE5Telugu) June 4, 2022 చదవండి: ఓటీటీలోకి విక్రమ్, రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే? Namita: గ్రాండ్‌గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్ -
పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందిరిలాగే శ్రీజకు కూడా సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్లే శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన డైలీ రొటీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా తన ఇద్దరు పిల్లలు నవిష్క, నివృతిలను తీసుకొని తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెకేషన్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నా ప్రపంచం, నా జీవితం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Navishka (@navishka_k) -
ఎదుటివాళ్లకు ఏం ఇస్తామో అదే తిరిగొస్తుంది.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీజ కుటుంబసభ్యులతో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 'మనం అవతలి వ్యక్తికి మనస్పూర్తిగా ఏదైతే ఇస్తామో.. అదే 100రెట్లు మనకు తిరిగి వస్తుంది' అంటూ ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. దీంతో శ్రీజ ఎవరి గురించి ఈ కామెంట్స్ చేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లెటేస్ట్ పోస్ట్ వైరల్, ఏం అంటున్నాడంటే
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్గా సూపర్ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్ తరచూ వెకేషన్స్‌కు వెళ్తున్నాడు. అంతేగాక ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్యే తన మేకోవర్ లుక్‌ని షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి ‘నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అంటూ కొటేషన్‌ను యాడ్ చేశాడు. చదవండి: Pooja Hegde: పూజ నోట అసభ్య పదం, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు ఇక తాజాగా వీకెండ్ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. ‘శనివారం నుంచి సోమవారం మధ్యలో’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కల్యాణ్ వీకెండ్లో ఎలా ఉంటాం.. వీకెండ్ అయిపోయాక మండే రోజు ఎలా ఉంటాం.. మూడ్ ఎలా మారుతుంది అంటూ డిఫరెంట్ మూడ్‌తో ఉన్న ఫొటోలను పంచుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే నెట్టింట రకారకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో కల్యాణ్ దేవ్ పెట్టే ప్రతి పోస్ట్ ఆసక్తిని సంతరించుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం కల్యాణ్ తన మూడవ సినిమా ‘కిన్నెర సాని’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ బర్త్‌డే: విషెస్ చెప్పిన కూతురు
Kalyan Dev Birthday,Daughter Navishka Sweet Wishes: చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే మరింత పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కల్యాణ్ దేవ్ రీసెంట్‌గానే తన మేకోవర్ లుక్‌తో షాకిచ్చాడు. ఎవరేం చెప్పినా పెద్దగా పట్టించుకోకు.. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్స్‌తో చర్చకు దారితీసిన కల్యాణ్ దేవ్ రీసెంట్‌గానే తన 32వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్న కూతురు నవిష్క తండ్రికి బర్త్‌డే విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్‌డే డాడా అంటూ క్యూట్‌గా విషెస్ చెప్పింది. దీనికి థ్యాంక్యూ బంగారు అంటూ కల్యాణ్ దేవ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎంతో క్యూట్‌గా విషెస్ చెప్పిందో.. తండ్రీ-కూతుళ్ల ప్రేమ నెవర్ ఎండింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navishka (@navishka_k) -
ఎన్నో ఆశలతో, సంతోషంగా ఉన్నా : శ్రీజ భర్త కల్యాణ్ దేవ్
Sreeja Konidela Husband Kalyan Dev Cryptic Post : చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్గా సూపర్ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఈ మధ్యే తన మేకోవర్ లుక్‌ని షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్‌ను యాడ్ చేశాడు. తాజాగా మరో ఫోటోను షేర్ చేసి దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు. సముద్రపు అలల మధ్య ఉదయించిన సూర్యుడి ఫోటోను షేర్చేస్తూ.. ఎన్నో ఆశలతో ప్రేమగా, సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
‘సూపర్ మచ్చి’మూవీ రివ్యూ
టైటిల్ : సూపర్ మచ్చి నటీ,నటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు నిర్మాత : రిజ్వాన్ దర్శకత్వం : పులి వాసు సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ విడుదల తేది: జనవరి 7, 2022 మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ‘విజేత’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్‌దేవ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ ఉత్సాహంతోనే ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. లుక్స్, ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్ మచ్చి’సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే మీనాక్షి (రచిత రామ్).. బార్లో పాటలు పాడుతూ.. ఆవారాగా తిరిగే (రాజు)ని అమితంగా ప్రేమిస్తుంది. అతను ఇష్టం లేదని చెప్పినా అతని వెంటే పడుతుంది. దీంతో ఆమెను వదిలించుకోవడానికి ఒక నైట్ తనతో గడిపితే నీ ప్రేమని అంగీకరిస్తానని కండీషన్ పెడతాడు. దానికి కూడా ఆమె ఒప్పుకుంటుంది. నెలకు లక్షన్నర సంపాదించినే మీనాక్షి.. చదువు సంధ్య లేని రాజుని ఎందుకు ప్రేమించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్) చివరి కోరిక కోసం ఏంటి? చివరకు మినాక్షి , రాజులు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడు రాజు పాత్రలో కల్యాణ్ దేవ్ మంచి నటనను కనబరిచాడు. డ్యాన్స్‌తో పాటు ఫైట్స్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించారు. తెరపై చాలా జోష్‌గా కనిపిస్తాడు. ఇక మీనాక్షిగా రచిత రామ్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్ సినిమాలో కూడా అద్భుతంగా నటించింది. హీరో తల్లిదండ్రులుగా నరేశ్, ప్రగతి మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. మీనాక్షి తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒదిగిపోయారు. పొసాని కృష్ణమురళి, మహేష్ ఆచంట, భద్రంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ప్రేమ, ఎమోషన్స్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రమే సూపర్ మచ్చి. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. కానీ చూడకుండా ప్రేమించుకోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్లో కథను ముందుకు నడిపాడు దర్శకుడు పులి వాసు. ఆయన ఎంచుకొన్న పాయింట్ బాగున్నప్పటీకీ.. తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. ఫస్టాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించాడు. బాధ్యతలేని రాజుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీనాక్షి ఎందుకు ప్రేమిస్తుందనే విషయాన్ని ఇంటర్వెల్ వరకు ఆపి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ కాస్త రోటీన్‌గా సాగుతుంది. తండ్రి, కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఎలాంటి అశ్లీలత, బూతులు లేకుండా సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక సాంకెతిక విషయానికొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌ని ఇంకాస్త క్రిస్పీగా కట్ చేస్తే మరింత బాగుండేది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి కథను, దానికి తగిన నటీనటుల ఎంపిక విధానం చూస్తే.. సినిమాపై రిజ్వాన్‌కు ఉన్న అభిరుచి ఏంటో అర్థమవుతుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. -
చిరంజీవి అల్లుడి 'సూపర్ మచ్చి' ట్రైలర్ రిలీజ్..
Kalyan Dev Super Machi Movie Trailer Out: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరో ఎంట్రీ ఆకట్టుకుంటుంది. 'వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సీతవు అవుతావో లేదో నాకు తెలియదు గానీ, వాడు మాత్రం రాముడు అవుతాడమ్మా' అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహించగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ దేవ్‌కు జోడీగా కన్నడ నటి రచితా రామ్ నటించింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
సూపర్ మచ్చి మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
Dinchaku Dinchaku Song From Super Machi Released: పులివాసు దర్శకత్వంలో మెగా హీరో కల్యాణ్ దేవ్ నటించిన చిత్రం సూపర్ మచ్చి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకుగా ఈనెల 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ చిత్రం నుంచి డించక్ డించక్ అనే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ని సాకేత్ ఆలపించాడు. తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో కల్యాణ్ దేవ్‌కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, నరేశ్, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
మెగా అల్లుడి సినిమా.. స్టోరీ లైన్ ఇదే!
కల్యాణ్ దేవ్ హీరోగా, మహతి భిక్షు, కశిష్ ఖాన్, శీతల్ ఇతర ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కిన్నెరసాని’. సాయి రిషిక సమర్పణలో రమణతేజ దర్శకత్వంలో రజినీ తాళ్లూరి, రవి చింతల నిర్మించిన ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘కిన్నెరసాని’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మిస్టరీ అంశాలతో సాగే బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఇది. ట్రైలర్లో ప్రేక్షకులకు కనిపించినది ఐదు శాతం మాత్రమే. సినిమాలో చాలా కథ ఉంది. ఈ కథను, నన్ను నమ్మి నాకు చాన్స్ ఇచ్చిన నిర్మాత రామ్ తాళ్లూరి గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఇందులో ఐదు కథలు ఉంటాయి. ఐదు కథల్లోని ఐదు పాత్రలూ ముఖ్యమైనవే. హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు అని చెప్పలేం. కథే హీరో. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాం కానీ జీ5 వారు చూసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. బిగ్ స్క్రీన్‌పై కూడా ఈ సినిమా బాగుంటుందని వారు అనడంతో థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. కొత్త దర్శకులతో నేను చేయనున్న సినిమాలను సంక్రాంతికి ప్రకటిస్తా’’ అని రామ్ తాళ్లూరి అన్నారు. కశిష్ ఖాన్, మహతి భిక్షు, శీతల్ పాల్గొన్నారు. -
విడాకుల రూమర్స్‌కి ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు
Kalyan Dev Sreeja Divorce Rumors: సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడిపోనున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-హీరో కల్యాణ్‌దేవ్‌లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు దీపావళి సెలబ్రేషన్స్‌లో సైతం వీరు కనిపించలేదు. అంతేకాకుండా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో పాటు మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫొటోలోనూ కళ్యాణ్ దేవ్ మిస్ అయ్యాడు. సాధారంగా మెగా ఫ్యామిలీలో జరిగే దాదాపు అన్ని వేడుకల్లో కల్యాణ్ దేవ్ హాజరవుతుంటారు. అలాంటిది ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అన్న అనుమానం కొందరిలో మొదలైంది. తాజాగా కల్యాణ్‌దేవ్ ఒక్క ఫోటోతో రూమర్స్‌కి చెక్ పెట్టారు. భార్య శ్రీజ బర్త్‌డే సందర్భంగా..హ్యాపీ బర్త్‌డే స్వీటూ అంటూ లవ్ సింబల్‌ను జతచేస్తూ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనికి శ్రీజ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ట్యాగ్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విడాకుల రూమర్స్‌కి బ్రేక్ పడినట్లయ్యింది. 2016లో శ్రీజ-కల్యాణ్‌ల వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కాగా విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ ఇటీవలె సూపర్ మచ్చి, కిన్నెరసాని షూటింగ్స్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
ఆకట్టుకుంటున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ టీజర్
‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్.. చాలా గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సూపర్ మచ్చి , కిన్నెరసాని అనే సినిమాలను చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా కల్యాన్ దేవ్ ‘సూపర్ మచ్చి’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. పులివాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు బలం కానున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్‌కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, నరేశ్, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా అజయ్, ‘జబర్దస్త్’ మహేశ్‌తో పాటు తదితర నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. -
‘కిన్నెరసాని’ నుంచి లిరికల్ సాంగ్, ఆకట్టుకుంటున్న లిరిక్స్
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, యంగ్ హీరో కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కిన్నెరసాని’. రమణతేజ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో కల్యాణ్ దేవ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. ఇదిలా ఉండగదా తాజాగా 2కిన్నెరసాని’ నుంచి పార్వతీపురం అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘దారి కాని దారిలోన ఊధు పొదలనా..పెద్దకొడుకు మర్రిచెట్టు నాకు చివరనా.. సిచ్చు కంట చెరువు గట్టు తూరుపున్నది.. దాసెకొండ బిడ్డ నేను పార్వతీపురం’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. చదవండి: Pushpa Movie: రేపు హీరోయిన్ ఫస్ట్‌లుక్‌కు ముహుర్తం ఖారారు ఇక సాంగ్‌లో కనిపించే కొన్ని సన్నివేశాలు సస్పెన్స్‌తో పాటు ఆసక్తిని పెంచుతున్నాయి. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను ఉమా నేహా, రేవంత్, ధనుంజయ్ సీపానా ఆలపించారు. కిట్టు విస్సా ప్రగడ రాసిన పాట లిరిక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో హీరోయిన్గా అన్ శీతల్ నటిస్తోంది. రవీంద్ర విజయ్, మహతి బిక్షు, కశిష్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చదవండి: మొత్తానికి మేము ఏడాది పూర్తి చేశాం: సామ్ వీడియో వైరల్ -
కొత్త సినిమా షురూ చేసిన మెగా అల్లుడు కల్యాణ్ దేవ్
‘విజేత’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఎం. కుమారస్వామి నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కథ కంచికి మనం ఇంటికి’ చిత్రనిర్మాత మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: దత్తి సురేష్ బాబు, నిర్మాణ నిర్వహణ: గౌతి హరినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుభాష్ దేవబత్తిని, కెమెరా: వైఎస్ కృష్ణ. -
ఆకట్టుకుంటున్న కల్యాణ్‌దేవ్ ‘కిన్నెరసాని’ టీజర్
'విజేత' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈ మెగా హీరో ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాలో నటిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది క్యాప్షన్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను హీరో నితిన్ విడుదల చేశారు. ‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి, ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా..ప్రేమకైనా'.. అనే డైలాగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా టీజర్ ఆద్యంతం సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ శీతల్ ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తుంది. మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. Happy to launch the interesting #KinnerasaniTeaser💥 Wishing the director @RamanaTeja9, dear @IamKalyaanDhev, producer @itsRamTalluri and the entire team all the luck🤗 👉 https://t.co/hRBIGpIP87#Kinnerasani@SRTmovies @annsheetal1 @RavindraVijay1 @Desharaj12 @mahathi_sagar — nithiin (@actor_nithiin) August 27, 2021 చదవండి :మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు! -
ఓటీటీలో విడుదల కానున్న మరో టాలీవుడ్ మూవీ!
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీల హవా మరింత పెరిగింది. థియేటర్లు ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాలతో పాటు పెద్ద మూవీస్ కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ విడుదలై అలరించాయి. నాని లాంటి హీరోలు కూడా ఓటీటీవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో టాలీవుడ్ సినిమా ఓటీటీ వేదికగా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా మరెదో కాదు మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలమే అయింది. గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ షూటింగ్: అడ్డుకున్న పోలీసులు డబ్బున్నోడికే సాయం: కౌంటరిచ్చిన రేణు దేశాయ్ -
కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి చిన్నల్లుడు
సాక్షి, హైదరాబాద్ : చిరంజీవి చిన్న అల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కరోనా నుంచి బయట పడ్డారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ కళ్యాణ్ దేవ్‌కు తాజాగా కోవిడ్ నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపిన ఆయన అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఇక విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం అవికా గోర్ సరసన సూపర్ మచ్చి సినిమాలో నటిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) చదవండి : వ్యాక్సిన్ వేయించుకున్న పాయల్.. ఈసారి ఏం చేసిందంటే.. కరోనాతో 'చిచోరే' నటి మృతి -
ఆసుపత్రిలో చేరిన చిరంజీవి అల్లుడు
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సామాన్యులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాన్నట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటానని, ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగబాబు సైతం కల్యాణ్‌దేవ్ పోస్ట్‌పై స్పందించారు. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్ వెల్ సూన్ మై బాయ్ అంటూ కామెంట్ చేశారు. ఇక హీరోయిన్ అవికా గౌర్ సహా పలువురు సన్నిహితులు, అభిమానులు కల్యాణ్ దేవ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) చదవండి : ఎంత ఆస్తి ఉందో లైవ్‌లో చెప్పేసిన నాగబాబు గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్ -
అదిరిపోయే కొత్త లుక్‌లో కల్యాణ్ దేవ్..
పుట్టినరోజు సందర్భంగా కల్యాణ్ దేవ్ రెండు చిత్రాల విశేషాలను చెప్పారు. రమణతేజ దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కిన్నెరసాని’. రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం కల్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ‘కిన్నెరసాని’ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కల్యాణ్ దేవ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను కూడా కల్యాణ్ దేవ్ బర్త్‌డే సందర్భంగానే రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. కాగా, రెండు చిత్రాల్లోనూ కల్యాణ్ దేవ్ లుక్ వ్యత్యాసంగా ఉంటుందని విడుదల చేసిన లుక్స్ చెబుతున్నాయి. -
బావకు రామ్ చరణ్ సాయం..
విజేత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ప్రస్తుతం ఆయన కిన్నెరసాని అనే సినిమా చేస్తున్నాడు. వైవిధ్యమైన టైటిల్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని 'కిన్నెరసాని' టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు ఫిబ్రవరి 11న కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి థీమ్ వీడియోను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఇందులో కాలిపోతున్న కాగితం గాలిలో ఎగురుతూ వచ్చిరోడ్డు మీద పడుతోంది. అందులో నుంచి అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. అయితే ఆ ఫోటోలో అమ్మాయి ఎవరనే విషయం మాత్రం తెలియదు. అదే సమయంలో వర్షం పడటం.. చివరలో కళ్యాణ్ దేవ్ ఫొటో చూపించడం ఆకట్టుకునేలా ఉంది. Here's the Mysterious #ThemeOfKinnerasani https://t.co/qUOvIQVtY2 Happy Birthday @IamKalyaanDhev ! My best wishes to @RamanaTeja9 and the entire team of #Kinnerasani@itsRamTalluri @Desharaj12 #RajaniTalluri #RaviChintala @Mahathi_Sagar @SRTmovies pic.twitter.com/c5TsjbCpmo — Ram Charan (@AlwaysRamCharan) February 11, 2021 థీమ్ వీడియో చూస్తుంటే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. చివర్లో కళ్యాణ్ దేవ్ లుక్ భయం కలిగించేలా ఉంది. మొత్తానికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో కళ్యాణ్ దేవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. చదవండి: అరుదైన గౌరవం: అనసూయ ఫోటోతో పోస్టల్ స్టాంప్ పుష్ప: హాలీవుడ్ తరహాలో భారీ యాక్షన్ సీక్వెన్స్.. -
శ్రీజ-కల్యాణ్ స్కూల్లో బెంచ్‌మెట్స్
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి పండుగ రోజు ఇంకో పండుగ కూడా. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పుట్టినరోజుని కూడా అదే రోజు జరుపుతారు. రెండు పండుగల సందడి నడుమ భర్త కల్యాణ్ దేవ్‌తో కలిసి శ్రీజ ‘సాక్షి’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రీజ-కల్యాణ్ స్కూల్లో బెంచ్‌మెట్స్, చిన్ననాటి స్నేహితులు జీవితాన్ని పంచుకున్నారు. విజేతతో హీరో కాకముందు కల్యాణ్ నటుడు కావడానికి చాలా ప్రయత్నాలు చేశారు.. అప్పుడేమైంది? కల్యాణ్ సినిమాలో మామయ్య చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఎంత? నిహారిక పెళ్లిలో మెగా సందడి ఎలా ఉండబోతుంది? శ్రీజను రామ్ చరణ్ ఎలా ఆటపట్టించేవాడు? కల్యాణ్ ఇంట్లో ఎలా ఉంటాడు? ఇలాంటి బోలెడు మచ్చట్లను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవేంటో చూసేయండి మరి -
పండగవేళ చిరుదివ్వెలు
-
పండగకి టైటిల్
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, ‘విజేత’ ఫేమ్ కళ్యాణ్ దేవ్ హీరోగా నటించనున్న కొత్త చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహించనున్నారు. రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రజనీ తళ్లూరి, రవి చింతల నిర్మిస్తున్నారు. రామ్ తళ్లూరి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్న కళ్యాణ్ దేవ్ నటించనున్న మూడో చిత్రమిది. ‘కల్కి’ చిత్రానికి స్టోరీ అందించిన దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. ‘ఛలో, భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహతి సాగర్ మా చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకొని సెట్స్ మీదకు వెళతాం. దీపావళి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నాం’’ అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో దర్శకులు వెంకీ కుడుముల, ప్రణీత్, వేణు ఊడుగుల పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రఘుతు. -
సూపర్ స్టెప్
కల్యాణ్‌దేవ్, రచితారామ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రిజ్వాన్, ఖుషీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కల్యాణ్ దేవ్‌తో పాటు నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఈ పాటలో నటిస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టెప్పులేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. తమన్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటతో పాటు మరో పాట చిత్రీకరిస్తే సినిమా పూర్తయినట్లే. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్‌స్టోరీ మిక్స్ చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా ‘సూపర్‌మచ్చి’. కల్యాణ్‌దేవ్ నటన, రచితారామ్ సినిమాకు ప్లస్సవుతుంది. తమన్ సంగీతం మా సినిమాకు హైలెట్ అవుతుంది’’ అన్నారు. -
కరోనా జపం చేశాం
‘విజేత’ (2018) సినిమాతో హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గకపోయినప్పటికీ కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చీ’ షూటింగ్లో పాల్గొన్నారు. సెట్లో తీసుకున్న కరోనా జాగ్రత్తలు, ‘సూపర్ మచ్చీ’ గురించిన విశేషాలను కల్యాణ్ దేవ్ ఈ విధంగా చెప్పారు. ► షూటింగ్ అంటేనే అందరం దగ్గర దగ్గరగా ఉంటూ మాట్లాడుకుంటూ చేసుకునే పని. అలా కాకుండా దూరం దూరంగా ఉంటూ మాస్క్‌లు ధరించి షూటింగ్ చేయడం కొత్తగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పనిలో లీనమైనప్పుడు కరోనా నియమాలను మర్చిపోయే అవకాశం ఉంది. అలా మర్చిపోతున్నాం అనుకున్నప్పుడల్లా సెట్లో ‘కరోనా కరోనా’ అనుకున్నాం. ఫన్నీగా ఉన్నా.. ఇలా ‘కరోనా జపం’ చేయడం వల్ల అందరూ అలర్ట్‌గా ఉండేవాళ్లం. వాసుగారు కూడా ‘ఇప్పుడు సెట్లోకి పోలీసులు వస్తారు. చెక్ చేస్తారు. అందరూ కరోనా జాగ్రత్తలను పాటించండి’ అని అలర్ట్ చేసేవారు. భౌతిక దూరం పాటించాలి కాబట్టి ఏవైనా సీన్స్‌లో సందేహాలు ఉంటే గట్టిగా మాట్లాడుకుని నివృత్తి చేసుకున్నాం. ► ‘సూపర్ మచ్చి’లో బయటకు రఫ్‌గా ఉంటూ లోపల సెన్సిటివ్‌గా ఉండి ఓ చిన్న బార్లో పని చేసే మాస్ సింగర్ పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఒక పాట, రెండు రోజుల టాకీపార్టు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు లాక్డౌన్ అంటున్నారు. లొకేషన్ల పర్మిషన్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. పైగా షూటింగ్లో జాయిన్ కావడానికి అందరూ ధైర్యం చేయడం లేదు. అందుకే మిగిలిన ఆర్టిస్టులు, వారి కాల్షీట్లు వంటి వాటిని పరిశీలించుకుని ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నాం. నిర్మాతల ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంత ధైర్యంగా షూటింగ్లో పాల్గొనడానికి మా సినిమా నిర్మాతలు ముఖ్య కారణం. వారికి ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని భావించాను. ► నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడంవల్లే కరోనా ప్రభావం ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా నేను షూటింగ్లో పాల్గొనగలిగాను. నేను షూటింగ్లో జాయిన్ అవ్వడం గురించి మామయ్యగారి (నటుడు చిరంజీవి)తో మాట్లాడాను. ‘ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేయాలి కదా. నీకు ఓకే అనుకుంటే షూటింగ్‌కి వెళ్లు’ అన్నారు. అలాగే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మామయ్య చెప్పారు. షూటింగ్ అంటే హెయిర్ స్టయిలిస్ట్‌లు, మేకప్‌మేన్ మన దగ్గరకు వస్తూనే ఉంటారు. వాళ్లు పీపీఈ సూట్స్ ధరించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ► సాధారణంగానే నేను ఆరోగ్య నియమాలను క్రమశిక్షణగా పాటిస్తుంటాను. నిజానికి షూటింగ్ ఆరంభం కాకముందే నా అంతట నేనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. బయటికి వెళ్లి షూటింగ్ చేస్తాం కాబట్టి మనంతట మనమే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని డిసైడ్ అయ్యాను. ఒక ప్రత్యేక గదిలో ఉంటూ ప్రస్తుతం నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. టైమ్‌పాస్ కోసం బుక్స్, ఇంటర్నెట్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాను. షూటింగ్‌కి వెళ్లడం మొదలుపెట్టాక నా పిల్లలకు దూరంగా ఉంటున్నాను. నాకది నిజమైన సవాల్. ఆదివారం మా ఫస్ట్ డాటర్ బర్త్‌డే. నేను ఇంట్లోనే ఉంటూ ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోవడం బాధగా ఉంది. ► శ్రీధర్ శ్రీపానగారితో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో ఆ వివరాలు చెబుతాను. ► సాధారణంగా నా సినిమాల గురించి మామయ్యతో చర్చిస్తుంటాను. మామయ్యకు తీరిక ఉన్నప్పుడు నా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఆయనకు ఉన్న అనుభవంతో కొన్ని సలహాలు చెబుతారు. అయితే ‘సూపర్ మచ్చి’ స్క్రిప్ట్‌ను మామయ్యగారు వినలేదు. -
సెట్లోకి సూపర్ మచ్చి
‘విజేత’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ (చిరంజీవి చిన్నల్లుడు) హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకుడు. రచితా రామ్ కథానాయికగా నటిస్తున్నారు. రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రిజ్వాన్, ఖుషి మాట్లాడుతూ– ‘‘లవ్ స్టోరీ మిక్స్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. అటు మాస్ ఇటు కుటుంబ ప్రేక్షకులకి కల్యాణ్ దేవ్ పాత్ర నచ్చుతుంది. తమన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. ‘సూపర్ మచ్చి’ టైటిల్ సాంగ్ బాగా వచ్చింది. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతించడంతో మా షూటింగ్ మొదలుపెట్టాం. కల్యాణ్‌దేవ్, రచితా రామ్‌తో పాటు అజయ్‌పై కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ కుమార్ మావిళ్ల. -
గోవాకు సూపర్ మచ్చి
నటుడు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న చిత్రం ‘సూపర్ మచ్చి’. ఈ చిత్రంలో హీరోయిన్గా కన్నడ భామ రచితా రామ్ నటిస్తున్నారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా టాకీ పార్టు ముగిసింది. ‘‘లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇందులోని ఐదు పాటల్లో ఆల్రెడీ రెండు పాటలు పూర్తయ్యాయి. వచ్చేనెలలో గోవాలో మరో రెండు పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ కుమార్ మావిళ్ల. -
ప్రేమ.. వినోదం
‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమయిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా తన మూడో చిత్రం కూడా ఖరారైంది. ‘దూకుడు, నమోః వెంకటేశాయ, పూలరంగడు, లౌక్యం’ వంటి సినిమాలకు కథ, మాటలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ–‘‘రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను నేను దర్శకుడిగా పరిచయం కావడానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కథకు కళ్యాణ్ దేవ్ సరైన కథానాయకుడనిపించింది. ప్రేమతో కూడిన వినోదభరితమైన చిత్రం ఇది. నాపై నమ్మకం ఉంచి, దర్శకునిగా అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతల గౌరవాన్ని పెంచగలననే నమ్మకం ఉంది’’ అన్నారు. -
మరో మూవీకి సై అన్న మెగాస్టార్ అల్లుడు
విజేత సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా స్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మరో చిత్రం రాబోతుంది. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. విక్టరీ వెంకటేష్ నమో వెంకటేశ, మహేష్ బాబు దూకుడు వంటి చిత్రాలకు రచనా సహకారం అందించిన శ్రీధర్ సీపాన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. (నవిష్క..వేడుక) ఇటీవలే వెంకీ మామ వంటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫాక్టరీ, మరో చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలసి ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీధర్ ఇప్పటికే అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం,సౌఖ్యం, డిక్టేటర్ వంటి పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన విషయం తెలిసిందే. (‘సూపర్ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు ) ఈ సందర్భంగా శ్రీధర్ సీపాన మాట్లాడుతూ..‘రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను దర్శకునిగా పరిచయం కావటానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కధకు హీరో కళ్యాణ్ దేవ్ సరైన నాయకుడని అనిపించింది. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కధా చిత్రంగా దీనికి రూపకల్పన చేయటం జరిగింది. హీరో పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకునిగా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు కృజ్ఞతలు. వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని నమ్మకంగా చెప్పగలను’ అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటులను, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. -
నవిష్క..వేడుక
చిరంజీవి కుటుంబంలో డిసెంబర్ 25న రెండు పండగలు జరిగాయి. ఒకటి క్రిస్మస్ సెలబ్రేషన్ కాగా మరోటి చిరంజీవి మనవరాలు నవిష్క పుట్టినరోజు వేడుక. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ల కూతురు నవిష్క. ఈ చిన్నారికి మొదటి పుట్టినరోజు ఇది. ఈ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది చిరంజీవి ఫ్యామిలీ. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. ‘‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ నవిష్క. మీ అత్తామామ (ఉపాసన, రామ్‌చరణ్)కు నువ్వంటే చాలా ప్రేమ’’ అని ఈ ఫొటోలను షేర్ చేశారు. కల్యాణ్ దేవ్, నవిష్క, శ్రీజ, రామ్‌చరణ్, ఉపాసన -
జోడీ కుదిరింది
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులివాసు దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కన్నడ బ్యూటీ రచితారామ్ను ఎంపిక చేసుకున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 22న ప్రారంభం కానుంది. రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సహ–నిర్మాత ఖుషి. -
దీపావళి ఎఫెక్ట్: హల్చల్ చేస్తున్న సినిమాలు
సినీ అభిమానులకు దీపావళి రెట్టింపు పండగ వాతావరణం తెచ్చింది. దీపావళి కానుకగా తమ అభిమాన హీరోహీరోయిన్ల కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలు, విశేషాలను చిత్ర బృందాలు విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానులు దీపావళికి డబుల్ ధమాకా అందుకున్నారు. ఇప్పటికే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్‌ను అనౌన్స్ చేయడంతో పాటు.. మరికొన్ని చిత్రాల్లోని హీరోహీరోయిన్లతో పాటు ముఖ్య తారాగణం లుక్‌లను విడుదల చేశారు. అంతేకాకుండా ఆయా చిత్రాల టీజర్, ప్రి టీజర్, మోషన్ పోస్టర్లను కూడా అభిమానులపై వదులుతూ సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలతో మొదలెడితే.. తిప్పరామీసం, అక్షర వంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. భయపెడుత్నున సాయిపల్లవి సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అధిరన్’. తెలుగులో ‘అనుకోని అతిధి’. ఈ మూవీలో సాయిపల్లవి ఇప్పటివరకు పోషించనట్టువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్, సాయి పల్లవి లుక్ తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకంక్షలు తెలుపుతూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. టీజర్‌ను పరిశీలిస్తే సాయి పల్లవి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నవంబర్ 15న విడుదల కానుంది. సరిలేరు నీకెవ్వరు.. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.దీపావళి సందర్భంగా దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి లుక్‌తో పాటు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అల వైకుంఠపురంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అల వైకుంఠపురములో’ . వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, బన్నీ డైలాగ్‌తో పాటు ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసింది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర బృందం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న సభ్యులందరూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. డిస్కో రాజా మాస్ మహారాజ్ రవితేజ తెరపై కనిపించి చాలా కాలమే అయింది. వరుస ఫెయిల్యూర్‌తో ఢీలా పడిన రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న చిత్రం ‘డిస్కో రాజా’ . పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. తాజాగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిస్కో రాజా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ నభా నటేష్‌తో జంటగా కనిపించాడు. దీంతో ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్‌లు కొదువే లేదని స్పష్టం అవుతోంది. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తిప్పరా మీసం.. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తిప్పరామీసం. ఎల్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ తంబోలి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రీవిష్ణు ఫస్ట్ లుక్, టీజర్ విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలపుతూ మరో పోస్టర్‌ను విడుదలు చేసింది. శ్రీ విష్ణు రఫ్ లుక్‌లో కనిపిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘సూపర్ మచ్చి’అంటున్న చిరు అల్లుడు ‘విజేత’ఫలితం తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ . రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో, హీరోయిన్ల పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఎలాగైనా ఈ చిత్రంతో విజయం సాధించాలని కళ్యాణ్ దేవ్‌తో పాటు మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ‘అశ్వథ్థామ’గా నాగశౌర్య అంతేకాకుండా నాగశౌర్య, మెహరీన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపావళి కానుకగా చిత్ర టైటిల్‌ను ‘అశ్వథ్థామ’గా ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లోగో అండ్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ‘వెంకీ మామ’, నందమూరి బాలకృష్ణ ‘రూలర్’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’,సత్యదేవ్, ఇషారెబ్బ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న‘రాగల 24 గంటల్లో’ చిత్రాలు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి, . అంతేకాకుండా నిఖిల్ ‘అర్జున్ సురవరం’సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా దీపావళి కానుకగా విడుదల చేసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మాణంలో టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 29న విడుదల కానుంది. ఇక దీపావళి కానుకగా సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. -
‘సూపర్ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు
సినీ అభిమానులకు దీపావళి పండుగు ఒక రోజు ముందే వచ్చేసింది. దీపావళి కానుకగా పలు చిత్రాలు, క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో విజయశాంతికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి దీపావళి పండుగ వేడుకలను ప్రారంభించారు. టెన్ థౌసెండ్ వాలా పేల్చితే కుర్రకారు ఏ రేంజ్లో ఎగ్జైట్మెంట్కు గురవుతారో.. శనివారం ‘సరిలేరు నీకెవ్వరు’లో భారతిగా కనిపించనున్న విజయశాంతి ఫస్ట్‌లుక్ చూసి అంతకుమించి ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఇక విజేత ఫలితం తర్వాత మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ ఇంట్రస్టెంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ ‘సూపర్ మచ్చి’నే టైటిల్‌గా ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, మూవీ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. జోరు వానలో చిరునవ్వులు చిందిస్తూ నయా లుక్‌లో మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ‘తూనీగ తూనీగ’ఫేమ్ రియా చక్రవర్తి హీరోయిన్గా నటిస్తోంది. Machis.... it is #SuperMachi Title & First look! pic.twitter.com/W3Uml0TKM9 — Kalyaan Dhev (@IamKalyaanDhev) October 26, 2019 ఆది పినిశెట్టి కథానాయకుడిగా కొత్త డైరెక్టర్ పృథ్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించనున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా దీపావళి కానుకగా చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. నో కట్.. రిలీజ్ డేట్ ఫిక్స్ రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్ ఖాన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్లు చెప్పకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా దీపావళి కానుకగా చిత్ర రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 1న థియోటర్లో కలుద్దామంటూ చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్ర టైటిల్, టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు మెచ్చుకోవడంతో ‘ఆవిరి’ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ కిరాక్ పార్టీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నిఖిల్.. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘కనితన్’ సినిమాను ‘అర్జున్ సురవరం’ గా రిమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, కావ్య వేణుగోపాల్‌లు నిర్మిస్తున్నారు. నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. అయితే తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు ‘అర్జున్ సురవరం’రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. -
చిరంజీవి చిన్నల్లుడి కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను సోషల్ మీడియా ద్వారా దుండగులు వేధింపులకు గురిచేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా 10 మంది అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం వీరిని అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారని కళ్యాణ్ దేవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉందని, మరో ఖాతాను ఉపయోగిస్తూ కొందరు పోకిరీలు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తమపై పోకిరీలు చేస్తున్న కామెంట్లను డిలీట్ చేయడం, ఆయా ఖాతాలను బ్లాక్ చేసినా.. కొత్త ఖాతాల ద్వారా వేధిస్తున్నారంటూ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వేధింపులకు పాల్పడిన వారి ఖాతాల వివరాలను ఇన్స్టాగ్రామ్ సంస్థ నుంచి తెప్పించుకుని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చిరంజీవి అల్లుడికి సైబర్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు ప్రముఖులను సైతం వదలడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్ దేవ్‌కు సైబర్ వేధింపులు మొదలయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆయనను వేధిస్తున్నారు. కొంతమంది ఆగాంతకులు ఇన్‌స్టాగ్రామ్‌లో తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కల్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. హీరో కల్యాణ్ దేవ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కల్యాణ్ దేవ్‌ను వేధిస్తున్న 10 మందిని గుర్తించామని, వారి వివరాల కోసం ఇన్స్టాగ్రామ్ వారికి లేఖ రాశామని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే వారి పట్టుకొని చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపారు. ( చదవండి : రెండో పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్) -
మంచి నిర్ణయం
‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. సోమవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్యాణ్ దేవ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రంలోని లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా మంచి పని చేయాలనుకున్న కల్యాణ్ దేవ్ అవయవ దానం చేయడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ‘‘ఈ భూమిని వదిలి వెళ్లేటపుడు ఏం తీసుకెళ్తామని? అందుకే ఈ స్పెషల్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నారు కల్యాణ్ దేవ్. -
నిత్య నూతనం
చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. ఆయన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్, శ్రీజ దంపతుల ముద్దుల తనయకు నవిష్క అని నామకరణం చేశారు. శుక్రవారం ఈ నామకరణ వేడుక జరిగింది. ‘మా చిన్నారికి నవిష్క అని పేరు పెట్టాం’ అంటూ కల్యాణ్‌దేవ్ సోషల్ మీడియాలోన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘నవిష్క’ అంటే నిత్య నూతనం అని అర్థం అట. -
హీరోయిన్ దొరికింది
మొదటి చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా రెండో సినిమా పనుల స్పీడ్ పెంచారు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. పులి వాసు దర్శకత్వంలో ఆయనో సినిమాలో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పలు పేర్లు వినిపించినప్పటికీ బాలీవుడ్ భామ రియా చక్రవర్తిని హీరోయిన్గా ఫైనలైజ్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘జలేబి’లో తన పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు సంపాదించారు రియా. ఆ సినిమానే ఈ చాన్స్‌కు కారణం అని టాక్. గతంలో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు రియా. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘ఈ క్రిస్మస్ జీవితాంతం గుర్తుండి పోతుంది’
క్రిస్మస్ పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మంగళవారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కూతురి పాద ముద్ర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. ‘ 2018 క్రిస్మస్ మాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆడపిల్ల పుట్టింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. కాగా విజేత సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా పులి వాసు దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. View this post on Instagram 2018 Christmas to remember for life! We have been blessed with a #BabyGirl 👶🏻 this morning. Super Merry Christmas to all of you!🎄 #SreejaKalyanBaby2Arrived #SoMuchOfLove #Nivrithi ‘s #Sister #Arrived @sreeja_kalyan A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on Dec 24, 2018 at 10:42pm PST -
రెండో సినిమా షురూ
చిరు ఇంటి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. మామ చిరంజీవి సక్సెస్ఫుల్ టైటిల్‌తో సిల్వర్ స్క్రీన్‌కి ఎంటరైన కల్యాణ్ ఇప్పుడు రెండో సినిమాకి సైన్ చేశారు. ఈ సినిమా కోసం కాస్త గడ్డం పెంచి కొత్త లుక్‌లోకి వచ్చేశారీ యువహీరో. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా పులి వాసు దర్శకునిగా పరిచయం అవ్వనున్నారు. ఖుర్షీద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. ‘‘త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం. రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి కీలక పాత్రల్లో నటిస్తారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాత రిజ్వాన్ తెలిపారు. -
మెగా పార్టీ.. భయానక రూపాల్లో స్టార్స్
పాశ్చాత్య సంస్కృతిలో ప్రముఖంగా కనిపించే హాలోవీన్ పార్టీల సందడి ఇటీవల కాలంలో మనదేశంలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఇలాంటి పార్టీలలో పాల్గొంటుండటంతో సామాన్యుల్లోనూ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా హాలోవీన్ వీక్ సందర్భంగా మెగాఫ్యామిలీ అంతా పార్టీ చేసుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌తో సహా కొణిదెల, అల్లు కుటుంబాలు ఈ పార్టీలో పాల్గొన్నాయి. ముఖ్యంగా కల్యాణ్ దేవ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు మెగా డాటర్స్ సుస్మిత, శ్రీజ వింత మేకప్‌లతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఫస్ట్‌లుక్ 17th July 2018
-
మేకింగ్ ఆఫ్ మూవీ - విజేత
-
నటనతో కంటతడి పెట్టించాడు
‘‘ఓ వైపు పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు తీస్తున్న సాయి కొర్రపాటిగారికి కంగ్రాట్స్. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ మంచి కంటెంట్‌తో చిత్రాలు తీస్తున్న ఆయనంటే నాకు చాలా గౌరవం. మంచి కథతో వస్తే వారాహి బ్యానర్లో సినిమా చేస్తాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. కల్యాణ్ దేవ్, మాళవికా నాయర్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా ‘విజయోత్సవం’ నిర్వహించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడా అనుకున్నా. ఎమోషనల్ సీన్స్‌లో కంట తడి పెట్టించాడు. మురళీశర్మగారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాకేష్ శశి చాలా బాగా తీసాడు. బ్యూటీతో పాటు నటన కనబరచే కథానాయికలంటే నాకు ఇష్టం. మాళవిక వండ్రఫుల్‌గా చేశారు. సినిమా నచ్చబట్టే విజయోత్సవానికి వచ్చా. నేను, నా భార్య స్నేహ సినిమా చూశాం. క్లైమాక్స్ అయిపోయాక నేను ఐదు నిమిషాలు లేవలేదు. ‘దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ ఇన్ మై లైఫ్’’ అన్నారు. ‘‘విజేత’ సినిమా చూసాక కొన్ని వందల మెసేజ్‌లు పంపించారు. తండ్రీ కొడుకుల కథతో జెన్యూన్ గా మంచి సినిమా చేశారని అభినందించారు’’ అన్నారు రాకేష్ శశి. ‘‘ప్రేక్షకుల స్పందన బాగుంది. ‘చాలా బాగా ఏడ్చా వు’ అన్నది నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్’’ అన్నారు కల్యాణ్ దేవ్. నిర్మాత సాయి కొర్రపాటి, మాళవికా నాయర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్, నటులు మురళీ శర్మ, రాజీవ్ కనకాల, మహేశ్, సుదర్శన్, కిరీటి, భద్రం, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. -
విశ్వనాథ్‌గారి క్లైమాక్స్ గుర్తుకొస్తోంది
‘‘నేను నటించిన ‘విజేత’ టైటిల్‌తో వస్తున్న సినిమా కావడం, కల్యాణ్ నటించడంతో ఈ ‘విజేత’ సినిమాపై నాకు ఉత్సాహం, క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేది. సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యా. సినిమా చూస్తున్నంత సేపు నన్ను నేను మరచిపోయా’’ అని హీరో చిరంజీవి అన్నారు. కల్యాణ్ దేవ్, మాళవికా నాయర్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విజేత’. సాయి శివాని సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని హీరో చిరంజీవి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ‘విజేత’ టీమ్‌ని అభినందించి, విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా ఇమేజ్‌ని మార్చి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సినిమా ‘విజేత’. ఇప్పుడు ఈ ‘విజేత’ కూడా కుటుంబ విలువలు, తల్లిదండ్రులు–పిల్లల మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత, వాళ్ల బాధ్యతలు ఎలా ఉండాలో చెప్పింది. నేటి యువత వేరే ఆకర్షణలతో ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయడం.. తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకపోవడం.. పిల్లల భవిష్యత్తుపై పేరెంట్స్ వర్రీ అవుతుండటం మనం చూస్తుంటాం. అలాంటి వారందరికీ ఈ సినిమా ఓ కనువిప్పు. కచ్చితంగా ఈ సినిమా చూడాలి. రాకేశ్ ‘విజేత’ని అద్భుతంగా తెరకెక్కించి నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. మురళీశర్మ ప్రతి సీన్లో అత్యద్భుతంగా నటించి వావ్ అనిపించాడు. క్లైమాక్స్‌లో ఆయన హావభావాలు చూసి తోటి నటుడిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నా. నటుడికి న్యాయం అంటూ జరిగితే ఈ సినిమాకి ఉత్తమ క్యారెక్టర్ అవార్డు మురళీశర్మకి రావాలి, వస్తుందనే నమ్మకం ఉంది. తనకు మంచి భవిష్యత్తు ఉందని కల్యాణ్ ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ‘విజేత’కి కెమెరామెన్ సెంథిల్‌గారు పెద్ద ఎస్సెట్. సాయిగారిని చూస్తే నిర్మాత అంటే ఇలా ఉండాలనిపిస్తోంది. సినిమా చూసి బయటికొచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు. క్లైమాక్స్‌లో హీరో, విలన్ అంటూ ఎవరూ ఉండరు. ఎమోషన్ మాత్రమే ఉంటుంది. విశ్వనాథ్‌గారి చిత్రాల్లోని క్లైమాక్స్ గుర్తొచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేసేటప్పుడు నేను మురళీశర్మని, యాక్టర్‌ని అనే విషయం మరచిపోయా. క్లైమాక్స్‌లో నిజంగానే ఏడ్చేశా. ఈ చిత్రాన్ని మా నాన్నకు అంకితం చేస్తున్నా. ఆయనే నా హీరో’’ అన్నారు మురళీశర్మ. ‘‘చూసిన వారందరూ మంచి సినిమా అని అభినందిస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు రాకేశ్ శశి. ‘‘ఇంత మంచి కథతో నా కెరీర్ స్టార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. వారాహి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కల్యాణ్ దేవ్. నిర్మాత సాయి కొర్రపాటి, కెమెరామెన్ సెంథిల్ కుమార్ పాల్గొన్నారు. -
చిరంజీవి చెప్పిందే జరిగింది!
సాక్షి, హైదరాబాద్ : మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైన హీరో కల్యాణ్ దేవ్. రాకేశ్ శశి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తాజాగా విడుదలై పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘విజేత’.. నగరంలోని ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం సాయంత్రం అల్లుడు కల్యాణ్ దేవ్ తెరంగేట్రం చేసిన విజేత మూవీని చిరంజీవి వీక్షించారు. మూవీ చాలా బాగా తీశారని దర్శకుడిని మెగాస్టార్ ప్రశంసించారని, తొలి సినిమా అయినా కల్యాణ్ దేవ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించారని చిరు కితాబిచ్చినట్లు సమాచారం. చిరుతో పాటు కల్యాణ్ దేవ్, నిర్మాత అల్లు అరవింద్, మురళీ శర్మ, మూవీ యూనిట్ సభ్యులు ‘విజేత’ స్పెషల్ షో చూశారు. యంగ్ హీరో కల్యాణ్ దేవ్ కెరీర్ సజావుగా సాగాలని వారు ఆకాంక్షించారు. కాగా, యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చిన ఒక వారానికే విజేత ఆఫర్ వచ్చిందని, కథను మామయ్యకి చెప్పగానే చాలా బాగా నచ్చిందన్నారని కల్యాణ్ దేవ్ ఇటీవల తన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీలో తండ్రి పాత్రకు మురళీ శర్మ అయితే బావుంటారని కల్యాణ్ దేవ్‌తో మెగాస్టార్ చెప్పిన మాటలు నిజమయ్యాయని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో మురళీ శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీలో కల్యాణ్ దేవ్‌కు జోడీగా మాళవికా నాయర్ నటించారు. సంబంధిత కథనాలు మెగా అల్లుడి ‘విజేత’ మూవీ రివ్యూ కథ విని చిరంజీవిగారు అలా అన్నారు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మామయ్య చేతుల మీదగా సర్టిఫికెట్ తీసుకున్నా
‘‘మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నా అనే టెన్షన్‌ని ప్రెషర్లా భావించకుండా ప్లెజర్లా తీసుకొని ఈ సినిమా చేశాను. చిరంజీవిగారు సినిమా చూడలేదు. రషెస్ మాత్రమే చూశారు. సినిమా ఇవాళ రిలీజ్ అవుతుంది. మొన్నటిదాకా చాలా టెన్షన్‌గా ఉండేది. నిన్నటి నుంచి ఎగై్జట్‌మెంట్‌గా ఉంది’’ అన్నారు కల్యాణ్ దేవ్. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించారు. మాళవికా నాయర్ కథానాయిక. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ► నాకు చిన్నప్పటి నుంచి కళలంటే ఇంట్రెస్ట్. మా పేరెంట్స్ బాగా ప్రోత్సహించేవారు. స్కూల్ డేస్‌లో స్కెచ్చింగ్, డ్యాన్స్, డ్రామాల్లో చురుకుగా పాల్గొనేవాణ్ని. స్కూల్లో ఓసారి చిరంజీవిగారి చేతుల మీదగా సర్టిఫికెట్ కూడా తీసుకున్నాను. ఇంజినీరింగ్ కంప్లీట్ అవ్వగానే బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే అది కుదర్లేదు. ► ‘విజేత’ సినిమా చేసే ముందు ఇండస్ట్రీలో నిలబడాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనే లాంగ్ టెర్మ్ గోల్స్ ఏం ఆలోచించలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చిన ఒక వారానికే ఈ ఆఫర్ వచ్చింది. విన్న వెంటనే నచ్చింది. ఒక కథ ఉంది అని మామయ్యగారికి చెప్పగానే ఆయన కూడా విన్నారు. ఆయనకూ చాలా బాగా నచ్చింది. ఆయన చెప్పిన ఒకే ఒక్క సజెషన్.. ఇందులో తండ్రి పాత్రకు మురళీ శర్మ అయితే బావుంటారని. అంతకు మించి ఏమీ చెప్పలేదు. ► చిరంజీవిగారికి ఉన్న ఎక్స్పీరియన్స్ మనందరికీ తెలిసిందే. నాకు కథ నచ్చింది, ఆయన కూడా కాన్ఫిడెంట్‌గా ఉండటంతో కళ్లు మూసుకొని ఈ సినిమా చేసేశాను. మన పక్కింటి కుర్రాడిలా ఉంటుంది నా పాత్ర. ఆకతాయిగా ఏ లక్ష్యం లేకుండా తిరిగే పాత్ర నాది. రొటీన్ లైన్ అయినప్పటికీ చాలా ఫ్రెష్‌గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ రాకేశ్. ► సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్‌డే ఏమీ అనిపించలేదు కానీసెకండ్ డే చాలా నెర్వస్‌గా అనిపించింది. రెండు పేజీల డైలాగ్ చెప్పాలి. మెల్లి మెల్లిగా వారానికి సెట్ అయిపోయాను. ► సత్యానంద్‌గారి దగ్గర ట్రైన్ అవుతున్నప్పుడు మా బ్యాచ్ ఫొటోలు పంపించారు. దాంట్లో సాయి కొర్రపాటిగారు నన్ను సెలెక్ట్ చేశారు. ‘ఈ కుర్రాడివి ఇంకొన్ని ఫొటోలు పంపించండి’ అంటే సత్యానంద్‌గారు చిరంజీవిగారి అల్లుడు అని చెబితే మామయ్యని అప్రోచ్ అయ్యారు. బిజినెస్, సినిమా ఏది ఈజీ అంటే ప్రస్తుతానికి సినిమాలు అంటానేమో. ► నెక్ట్స్ సినిమా ఏంటని ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకే జానర్‌కి స్టిక్ అయిపోవాలని లేదు. -
కథ విని చిరంజీవిగారు అలా అన్నారు
‘‘విజేత’ కథ కొత్తవారికైనా, ఎస్టాబ్లిష్డ్ హీరోలకైనా సరిపోతుంది. ఏ హీరో అంటే ఆ హీరో అని మా నిర్మాత నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పుడు నేను వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గరకు వెళ్లి ‘ఈ బ్యాచ్‌లో ఎవరైనా కొత్తవారు ఉన్నారా?’ అని అడిగా. ఆయన నాకు కల్యాణ్‌గారి గురించి చెప్పారు. కల్యాణ్‌గారు చిరంజీవిగారి అల్లుడని అప్పుడే మాకు తెలిసింది’’ అని దర్శకుడు రాకేష్ శశి అన్నారు. కల్యాణ్ దేవ్, మాళవికా నాయర్ జంటగా సాయి శివాని సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించిన ‘విజేత’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాకేష్ శశి పంచుకున్న విశేషాలు... ∙నేను ఎమ్మెస్సీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ చేశా. 2006లో హైదరాబాద్ వచ్చాను. 2007లో రాఘవేంద్రరావుగారి టీవీ షో ‘రేపటి దర్శకులు’లో టాప్ టెన్‌లో ఉన్నా. ‘రక్తచరిత్ర’లో డైలాగ్ వెర్షన్ రాశాను. పరుచూరి బ్రదర్స్, చిన్నికష్ణగారి వద్ద పనిచేశాను. ‘రుద్రమదేవి’ చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, బయటికి వచ్చాను. ∙తండ్రీ కొడుకుల మధ్య సాగే కథే ‘విజేత’. మనలో ఉన్న 90 శాతం మంది కథ ఇది. మన దేశంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. ఆ జర్నీలోని బాధలు, సంతోషాలు, అవమానాలన్నింటినీ ప్రతిబింబిస్తుంది. శ్రీనివాసరావు అనే ఫ్యాక్టరీ ఉద్యోగి, అతని కొడుకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్ పాత్రలు హైలైట్. వాళ్ల ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను దాటుకుని ముందడుగేసింది అనేది సినిమా. ∙చిరంజీవిగారి ‘విజేత’ చిత్రానికీ, మా ‘విజేత’కు ఎక్కడా పోలికలు ఉండవు. చాలా టైటిల్స్ అనుకున్నాం. ఒక మనిషి విజయం మీదనే కథ సాగుతుంది కాబట్టి ‘విజేత’ అని ఫిక్స్ చేశాం. చిరంజీవిగారి పర్మిషన్ తీసుకునే ఈ టైటిల్ పెట్టాం. ∙‘విజేత’ కథను ముందు కల్యాణ్‌గారికి చెప్పా. రెండు రోజుల దాకా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో నచ్చలేదేమో అనుకున్నా. ఒక రోజు ఫోన్ చేసి చిరంజీవిగారికి కథ చెప్పమన్నారు. సరేనని వెళ్లా. చిరంజీవిగారు కథ మొత్తం విని ‘నువ్వు నాకు ఏం చెప్పావో అది తియ్ చాలు’ అన్నారు. డీఐ కాకముందు ఓసారి సినిమా చూశారు. ఆయనకు చాలా బాగా నచ్చింది. ∙కల్యాణ్‌గారు చాలా హోమ్ వర్క్ చేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తత్వం ఉంది. మాళవిక ఇందులో ఇండిపెండెంట్ విమెన్‌గా నటించారు. ఈ చిత్రకథ కల్పన కాదు. నేను పుట్టిందే మిడిల్ క్లాస్‌లో. నా ఫ్రెండ్స్ చాలామంది మిడిల్ క్లాస్‌కి చెందినవాళ్లే. నా 12 ఏళ్లప్పుడు మా నాన్న చనిపోయారు. నేను చూసిన జీవితం ఈ సినిమాలో ఉంటుంది. -
కథకు ప్లస్ అయ్యే క్యారెక్టర్సే ఇష్టం
‘‘నేను ఇప్పటి వరకు చేసిన ప్రతీ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే, మహానటి’ ఇలా సినిమా సినిమాకు డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. సినిమాలో నా పాత్ర వల్ల కథకు ప్లస్ అవ్వాలని కోరుకుంటాను. అందుకే క్యారెక్టర్స్ ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అని మాళవికా నాయర్ అన్నారు. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి రూపొందించిన చిత్రం ‘విజేత’. ఇందులో మాళవికా నాయర్ కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ– ‘‘విజేత’ సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. చేసే పనిలో కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉన్న క్యారెక్టర్. నా పాత్రకు కంప్లీట్ అపోజిట్‌గా కల్యాణ్ పాత్ర ఉంటుంది. జులాయిగా, ఏ లక్ష్యం లేకుండా తిరుగుతుంటాడు. కల్యాణ్ దేవ్ చాలా హానెస్ట్. సింపుల్‌గా ఉంటాడు. శ్రీజ సెట్స్‌కి వచ్చేవారు. జనరల్‌గా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. కానీ ఈ సినిమాలో చెప్పుకోవడం కుదరలేదు. ఫ్యూచర్లో నా గొంతే వినపించడానికి ట్రై చేస్తాను. నా పదో తరగతి నుంచే యాక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. మూవీస్‌ను, స్టడీస్‌ను బాలెన్స్ చేస్తున్నాను. స్విమ్మింగ్ బాగా చేస్తాను. మా కాలేజ్ తరఫున స్విమ్మింగ్ ప్లేయర్‌ని. ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ మొదటి భార్య అలమేలుగా నటించాను. పాత్ర చాలా చిన్నది, డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అయినా సావిత్రి గారి బయోపిక్కు నో అని ఎవరు చెప్తారు? ఆల్రెడీ నాగ్ అశ్విన్‌తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చేయడం కూడా ఓ కారణం. హీరోయిన్స్‌లో నేను రోల్ మోడల్‌గా ఫీల్ అయ్యేది మలయాళ నటి పార్వతిని. క్యారెక్టర్ క్యారెక్టర్‌కి తను భలే మారిపోతుంది. చేసే ప్రతి పాత్రను చాలెంజింగ్‌గా తీసుకుని, రీసెర్చ్ చేసి చేస్తుంది. ‘మహానటి’ సినిమాలో ‘అలమేలు’ పాత్రకు నేను కూడా బాగా రీసెర్చ్ చేశాను. విజయ్ దేవరకొండతో యాక్ట్ చేసిన ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ఏదో రోజు డైరెక్టర్ అవుతా
‘‘ప్రతి సినిమాకు చాలెంజెస్ ఉంటాయి. ‘బాహుబలి’ సినిమాకు ఆ రేంజ్ చాలెంజ్‌లు ఉంటాయి. చిన్న సినిమాలకు ఆ సినిమా స్థాయిలోనే కష్టాలుంటాయి. అది దర్శకుడి విజన్ కావొచ్చు, నిర్మాతవైపు నుంచి కావచ్చు. ‘విజేత’ సినిమా చేస్తున్నప్పుడు నా కెరీర్ బిగినింగ్‌లో చేసిన ‘ఐతే’ సినిమా రోజులు గుర్తుకు వచ్చాయి. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా నాకు మరో గ్రేట్ ఎక్స్ పీరియన్స్’’ అన్నారు ఛాయాగ్రాహకుడు కె. సెంథిల్‌కుమార్. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రఛాయాగ్రాహకుడు కె.సెంథిల్ కుమార్ చెప్పిన విశేషాలు. ► సంక్రాంతికి రాజమౌళిగారిని కలిసినప్పుడు సాయి కొర్రపాటిగారు ‘ఓ మంచి కథ ఉంది వినండి’ అన్నారు. రాకేశ్ శశి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.అందులో చాలా ఎమోషన్స్‌తో పాటు కనెక్ట్ అయ్యే సన్నివేశాలున్నాయి. తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఓ మిడిల్ క్లాస్ స్టోరీ ఇది. ► అన్ని సినిమాలు పేరు కోసమే చేయలేం. క్రికెట్ అంటే ఇష్టంతో ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు పేరొస్తుందని చేయలేదు. అలాగే ఈ సినిమా నచ్చడంతో చేశా. ► కల్యాణ్ దేవ్లో నటుడిగా చాలా పరిణితి చూశాను. ఫస్ట్ డే షూట్లో కంఫర్ట్‌గా ఫీల్ అయినట్టు కనిపించలేదు. సినిమా పూర్తయ్యేసరికి కాన్ఫిడెన్స్ లెవల్ బాగా పెరిగింది. కల్యాణ్ హార్డ్ వర్కింగ్ పర్శన్. ఏదైనా త్వరగా నేర్చుకుంటాడు. ప్యూచర్లో పెద్ద నటుడు అవుతాడు. నటనలో తను తీసుకునే జాగ్రత్తలు అలాంటివి. ► రాకేశ్‌కి తనేం చేస్తున్నాడనే విషయం మీద క్లారిటీ ఉంది. దాని వల్లే సినిమాను ఈజీగా హ్యాండిల్ చేయగలిగాడు. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని తెర మీదకు తీసుకురావడానికే నేను ప్రయత్నిస్తాను. ► ‘బాహుబలి’ తర్వాత తెలుగులోనే కాదు బాలీవుడ్ నుంచీ చాలా అవకాశాలొచ్చాయి. కానీ నేను ఎదురుచూస్తున్న కథ రాకపోవడంతో హిందీ వైపు వెళ్లలేదు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మనమే సినిమాలు చేస్తున్నాం. అలా అని హిందీ సినిమాలు చేయనని కాదు, నచ్చితే చేస్తా. ► తెలుగులో ప్రస్తుతం గోల్డెన్ íపీరియడ్ నడుస్తోంది. ‘బాహుబలి, ఘాజీ, అర్జున్ రెడ్డి, గరుడవేగ, మహానటి’ లాంటి వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరించడంతో దర్శకులు కొత్త కథలు చెప్పడానికి చూస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే రోజు తప్పకుండా వస్తుంది. ► ప్రతి టెక్నీషియన్‌కు డైరెక్టర్ కావాలనుంటుంది. ఏ టెక్నీషియన్ అయినా డైరెక్టర్ కథని స్క్రీన్ మీద చెప్పడానికి సహకారం మాత్రమే అందిస్తారు. అందుకే డైరెక్టర్ కావాలని అందరూ అనుకుంటారు. నేను డైరెక్టర్ అవుతాను. కానీ ఎప్పుడవుతానో కచ్చితంగా చెప్పలేను. కల్యాణ్ దేవ్, మాళవిక -
హిట్ గ్యారంటీ... గో ఎహెడ్ అన్నాను
‘‘చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని నాతో కల్యాణ్ దేవ్ ఓసారి చెప్పాడు. ‘సినిమా అన్నది మహా సముద్రం లాంటిది. ఎంత మందినైనా తనలో చేర్చుకుంటుంది. సినిమాకు మనం ఏం ఇస్తున్నాం? అన్నదాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గ్లామర్ ఉంది. నీలో ఆ జోష్ ఉందా? లేదా? తపన ఉందా? లేదా? ఎంత స్థాయిలో ఉంది? అన్నదాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని చెప్పాను’’ అన్నారు చిరంజీవి. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘విజేత’ టైటిల్ పెట్టిన వెంటనే నేను చేసిన ‘విజేత’ గుర్తుకు వచ్చింది. ఆ కథకు, ఈ కథకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఫస్ట్ హియరింగ్‌లోనే చాలా నచ్చింది. ‘చక్కటి కుటుంబ కథా చిత్రం. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్షిప్ మనసుకు హత్తుకునేలా ఉంది. కచ్చితంగా సక్సెస్ అవుతుంది. గో ఎహెడ్’ అన్నాను. అప్పట్లో మాస్ యాక్షన్ సినిమాలు చేసేప్పుడు అరవింద్‌గారు నాకు ‘విజేత’ కథ వినిపించినప్పుడు కొంచెం బెరుకుగా అనిపించింది. అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంటుంది అనుకున్నాను. ఆ సినిమా కొత్త ఆడియన్స్ కోసం, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేశాం. అంతకంత ఆదరణ లభించింది. ఎలాంటి ఇమేజ్ లేని కల్యాణ్‌కు కొత్త ఆడి యన్స్, అభిమానం లభిస్తుందని నమ్ముతున్నాను. కంట తడి పెట్టించే సీన్స్ రాకేశ్ అద్భుతంగా తెరకెక్కించాడు. తన మార్క్‌తో ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు. దర్శక–నిర్మాతలు అమ్మ, నాన్నలు లాంటి వాళ్లు అంటారు. రాను రాను నిర్మాత పాత్ర క్యాషియర్లాగా అయిపోయింది. డబ్బులు పెట్టడం తప్ప తను ఇన్వాల్వ్ అవ్వడం కానీ, తనని ఇన్వాల్వ్ చేయడం కానీ లేదు. ఇలాంటి రోజుల్లో సాయిగారు కథల్లో మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఈ కథను ఎంతమందికి అందించగలం? ఆడియన్స్‌ని ఎలా అలరించాలి? మన బ్యానర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచించే నిర్మాత కొర్రపాటి సాయిగారు. ఆయన తీసిన ‘ఈగ’, జో అచ్యుతానంద, లెజెండ్’ చాలా బావుంటాయి. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి. సెంథిల్ కెమెరా అంటే విజువల్స్ పరంగా చూసుకునే పని ఉండదు. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ‘కొ కొ కోడి...’ నా ఫేవరేట్ సాంగ్. సినిమాల్లోకి ఎవరూ వెల్కమ్ చేయరు. ట్రైనింగ్ తీసుకుని ప్రయత్నించు అని కల్యాణ్‌తో అన్నాను. సత్యానంద్ దగ్గర తీసుకున్నాడు. ట్రైనింగ్‌లో ప్లస్‌లు మైనస్‌లు తెలుసుకున్నాడు. ఎంతో పరిణితితో చేశాడు. డ్యాన్స్ బాగా చేశాడు. రొమాంటిక్ సీన్స్ చెప్పనక్కర్లేదు. రాకేశ్ తనకు కావల్సింది రాబట్టాడు. మాళవికా కొంటెగా, ఇంటెన్స్‌గా చేసింది. ఇందాక రాజమౌళి చెప్పినట్టు ఆ ‘విజేత’ ఎంత సక్సెస్ ఆయ్యిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవ్వాలి. ఈ సినిమాను జూలై 12న విడుదల చేస్తున్నాం. తేజ్ సినిమా 6న ఉంది. అభిమానులు ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు. వాడికీ ఆశీస్సులు లభిస్తాయి. కల్యాణ్‌కీ ఆశీస్సులు లభిస్తాయి’’ అన్నారు. కల్యాణ్ దేవ్ మాట్లాడుతూ – ‘‘సాయిగారు చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నేను వాళ్ల లాగే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. రాకేశ్‌కి క్లారిటీ ఉంది. ప్రతీ ఫ్రేమ్ బాగా తీశారు. సెంథిల్‌గారు చాలా కూల్. మ్యూజిక్ హర్షవర్థన్ రామేశ్వర్ అమేజింగ్ ఆల్బమ్ ఇచ్చారు. మీ (ప్రేక్షకులు) బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని అనుకుంటున్నాను’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు మంచి యాక్టర్, డ్యాన్సర్, ఫైటర్. అది అందరికీ తెలిసిందే. ఆయన స్టోరీని బాగా జడ్జ్ చేయగలుగుతారు. స్టోరీ విన్న వెంటనే ఏది తగ్గించాలి? పెంచాలి అని చెబుతారు. ‘మగధీర’ కథ ఫస్ట్ చిరంజీవిగారికే చెప్పాను. ఆయన అప్రూవ్ తీసుకొనే చేశాం. ఈ సినిమా కూడా ఆయనకు నచ్చాకే చేశారు. అదే బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్. చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో సాయిగారు ఎక్కడా తగ్గలేదు. సాంగ్స్ చాలా బావున్నాయి. అప్పుడు ‘విజేత’ చిరంజీవిగారికి ఎంత సక్సెస్ తెచ్చిందో, ఈ సినిమా కూడా కల్యాణ్‌కి అంతే సక్సెస్ తేవాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి వరుసగా యాక్షన్ పిక్చర్స్ చేస్తున్నపుడు ‘విజేత’ సినిమా కథ విన్నాను. నచ్చింది చేయాలనుకున్నాను. చిరంజీవిని అడిగితే ‘నీ మనసుకు నచ్చింది చెయ్’ అన్నారు. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. నిర్మాత సాయిగారు కొత్త టాలెంట్ ఎక్కడున్నా వెతికి సినిమా నిర్మిస్తుంటారు. అటువంటి నిర్మాతలు మనకి ఉండాలి. మెగా కుటుంబం నుంచి ఎవరు సినిమా ఇండస్ట్రీ రావాలనుకున్నా ఒక ధైర్యం చిరంజీవిగారి అభిమానులు. దానికి హీరోలు టాలెంట్‌ని యాడ్ చేసుకుని సక్సెస్ అవుతున్నారు. కల్యాణ్ కూడా అలాంటి టాలెంట్‌తో సక్సెస్ అందుకుంటాడని ఆశీస్తూ, ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. రాకేశ్ శశి మాట్లాడుతూ– ‘‘కథ మొదలుపెట్టక ముందు ‘మన కథే హీరోని తీసుకురావాలి’ అని సాయిగారు నాతో అన్నారు. ఆ కథే మమ్మల్ని చిరంజీవిగారి ఇంటికి తీసుకువెళ్ళింది. చిరంజీవి అల్లుణ్ణి సినిమాలో హీరోని చేసింది. చిరంజీవిగారి ముందు కూర్చుని కథ చెప్పినప్పుడు నాలో ఉన్న ఎమోషన్ జీవితాంతం గుర్తుంటుంది. గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోని ఎంత బాగా ప్రజెంట్ చేయాలో అంత బాగా ట్రై చేశాం. ఈ చిత్రంలో కల్యాణ్ చేసిన క్యారెక్టర్‌కి, రియల్ లైఫ్ పర్శనాలిటీకి చాలా తేడా ఉంది. తనని తాను మలుచుకున్న తీరు అద్భుతం’’ అన్నారు.కీరవాణి మాట్లాడుతూ – ‘‘మన హృదయాల్ని గెలుచుకుని శాశ్వత విజేతగా నిలిచిపోయిన చిరంజీవిలా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు అలానే నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. సాయిగారు మా ఫ్యామిలీ మెంబర్‌లాగా. ఈ సినిమాతో కల్యాణ్ దేవ్‌కి మంచి బ్రేక్ వస్తుందనుకుంటున్నాను. రామేశ్వర్ మంచి కంపోజర్’’ అన్నారు.